- Home
- Entertainment
- TV
- సందీప్ రెడ్డి వంగా చేతిలో.. దెబ్బలు తిన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా? కారణం తెలిస్తే షాక్ అవుతారు?
సందీప్ రెడ్డి వంగా చేతిలో.. దెబ్బలు తిన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా? కారణం తెలిస్తే షాక్ అవుతారు?
డైరెక్టర్లు యాక్టర్స్ మీద చేయి చేసుకోవడం.. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో ఇలాంటివి సహజమే. ఈక్రమంలో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి చేతిలో ఓ స్టార్ యాక్టర్ దెబ్బలు తిన్నాడని మీకు తెలుసా?

డైరెక్టర్ల చేతివాటం
ఫిల్మ్ ఇండస్ట్రీలో చేతివాటం ఉన్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. స్టార్ డైక్టర్ల చేతిలో దెబ్బలు తిన్నవారు స్టార్స్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్ తేజా లాంటి వారు షూటింగ్ టైమ్ లో మాట వినని యాక్టర్స్ పై చేయిచేసుకున్నసంఘటనలు ఉన్నాయి. అయితే అలాంటి దర్శకులు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అందులో కొంత మంది మాత్రం సీరియస్ గా కొడితే.. కొంత మంది ఫ్రెండ్లీగా.. వారికి ఉన్న చనువుతో కొడుతుంటారు. ఈక్రమంలో అర్జున్ రెడ్డి , యానిమల్ లాంటి సినిమాలతో సంచలనం సృస్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఇలానే స్టార్ యాక్టర్ ను కొట్టాడట. ఇంతకీ ఎవరా స్టార్ నటుడు.
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం
అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఎంత పెద్ద దర్శకుడు అయ్యాడో అందరికి తెలిసిందే. దర్శకుడిగా స్టార్ డమ్ మాత్రమే కాదు.. మొదటి సినిమాతో సంచలనంగా కూడా మారాడు సందీప్. అంతే కాదు ఈసినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా ఏమాత్రం కేర్ చేయలేదు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదే అని నిలబడ్డాడు. ఇక ఈసినిమాపై ఎంత మంది ఎన్ని మాట్లాడినా.. ఏమాత్రం వెనకడుకు వేయలేదు సందీప్. అందుకే అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడంతో పాటు.. విజయ్ దేవరకొండను కూడా స్టార్ గా నిలబెట్టింది.
రెచ్చిపోయిన సందీప్ రెడ్డి వంగా..
ఈ విజయంతో సందీప్ రెడ్డి వంగా రెచ్చిపోయాడు.. తన మార్క్ సినిమాలతో దుమ్మురేపుతూ.. దూసుకెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అక్కడ కూడా తన మార్క్ తో స్టార్ గా గుర్తింపు సాధించాడు. అంతే కాదు యానిమల్ సినిమాలతో బాలీవుడ్ లో రచ్చ రచ్చ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో అదిరిపోయే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ ను ఎలా వాడతాడో.. ఏం చేస్తాడో అన్న టెన్షన్ అభిమానుల్లో ఉంది. అంతే కాదు ప్రభాస్ స్పిరిట్ కోసం కొరియన్ నటుడిని కూడా రంగంలోకి దింపబోతున్నాడు సందీప్ రెడ్డి.
కమెడియన్ ను కొట్టిన యానిమల్ డైరెక్టర్ ?
ఇక సందీప్ రెడ్డి డైరెక్షన్ వీషయంలో చాలా సీరియస్ గా ఉంటాడు. తను అనకున్న రకంగా షాట్ వచ్చేవరకూ వదిలిపెట్టడు. ఈక్రమంలో అర్జున్ రెడ్డి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు రాహుల్ రామకృష్ణ ఒక సీన్‌లో దర్శకుడు చెప్పిన విధంగా చేయకుండా.. కొత్తగా ట్రై చేయాలని చూశాడట. ఆ సీన్ మరేదో కాదు..ఇంటర్వెల్‌లో హీరోయిన్ పెళ్లి ఆపడానికి హీరో వెళ్లినప్పుడు.. అక్కడ రాహుల్ కు కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. వాటి విషయంలో కాస్త తడబాటుకు గురయ్యాడు. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెనుకనుంచి వచ్చి సరదాగా అతని తలపై ఒక దెబ్బ కొట్టి, “అలా చేయకు, ఈ సీన్‌లోని ఎమోషన్ ఇలా ఉండాలి” అని క్లారిటీగా వివరించాడట.
ఫ్రెడ్షిప్ లో ఇవన్నీ కామన్..
సందీప్ అలా చెప్పిన తరువాత రాహుల్ ఆ సీన్‌ను మరింత భావోద్వేగంగా చేయగలిగాడని తెలుస్తోంది. అయితే ఇక్కడ సందీప్ రెడ్డి వంగా అలా చేయడానికి కారణం వాళ్లిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రమే. సందీప్ రెడ్డి వంగా ఈ సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “అది ఎలాంటి కోపంతో కాదు, మేమంతా షూటింగ్‌కు ముందే మంచి స్నేహితులం. ఫన్నీగా, ఫ్రెండ్లీగా జరిగిన సంఘటన మాత్రమే” అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఇండస్ట్రీ టాక్ మాత్రమే, ఇక ఇలాంటివి సహజంగానే షూటింగ్ టైమ్ లో జరుగుతుంటాయి. అలాగే సందీప్ రెడ్డి విషయంలో జరిగింది. అయితే నిజంగా ఆయన పని విషయంలో మాత్రం చాలా సీరియస్ గానే ఉంటారని తెలుస్తోంది.