- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పెళ్లికి ఓకే చెప్పిన జ్యో- తండ్రితో కన్నీళ్లు పెట్టించిన కాంచన
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పెళ్లికి ఓకే చెప్పిన జ్యో- తండ్రితో కన్నీళ్లు పెట్టించిన కాంచన
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 4వ తేదీ)లో కూతురితో ప్రేమగా మాట్లాడుతాడు దశరథ. పెళ్లికి ఓకే చెప్తుంది జ్యోత్స్న. కాంచన మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటాడు శివన్నారాయణ. దీపకు సారె పెడతారు సుమిత్ర, దశరథ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో కారు అంత స్పీడ్ గా డ్రైవ్ చేయడం అవసరమా? కాస్త స్లోగా వెళ్లు జ్యోత్స్న అంటాడు దశరథ. సారీ డాడీ అంటుంది జ్యోత్స్న. నాకు ఆ మనిషి అంటేనే ఇష్టం లేదు. నేను అక్కడికి రావడం అవసరమా అంటుంది. దీప అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అంటాడు దశరథ.
ఇష్టం లేదు అంతే. మన ఇంట్లో పనిమనిషికి ఉన్న విలువ కూడా నాకు లేదు అంటుంది జ్యోత్స్న. కారు పక్కకు ఆపు అంటాడు దశరథ. పక్కకు ఆపి.. నేను క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోతాను అంటుంది జ్యోత్స్న. ఒక్క నిమిషం ఆగు అని వెళ్లి ఐస్ క్రీం తీసుకొస్తాడు దశరథ. తాత ఏమో దీప గురించి ఆలోచిస్తాడు. నువ్వేమో దాని కూతురి గురించి ఆలోచించు అంటుంది జ్యోత్స్న. ఇది శౌర్య కోసం కాదు. నా కూతురి కోసం అని జ్యోత్న్సకు ఇస్తాడు దశరథ. షాక్ అవుతుంది జ్యోత్స్న.
పెళ్లికి ఓకే చెప్పిన జ్యోత్స్న
ఈ కోపాలన్నీ పక్కకు పెట్టి మనం కాసేపు తండ్రి కూతుర్లలా మాట్లాడుకుందాం అంటాడు దశరథ. మనం తండ్రి కూతుర్లమే అంటుంది జ్యోత్న్స. నువ్వు నా కూతురు కాదు. తను వేరే ఉంది అంటాడు దశరథ. దాసు డాడీకి నిజం చెప్పేశాడా? అని కంగారు పడుతుంది జ్యోత్స్న.
ఒకప్పుడు నా కూతురు చాలా బాగుండేది. తనంటే నాకు చాలా ఇష్టం. తనకు కావాల్సినవన్నీ ఇవ్వడంలో మాకు సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు తను చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అందని దానికోసం ఆశపడుతుంది. వద్దు అన్న పనే చేస్తానంటుంది అని చెప్తూ ఉంటాడు దశరథ.
నువ్వు సంతోషంగా ఉండాలని మీ అమ్మ, నేను కోరుకుంటున్నాము. కానీ నువ్వు నీ పిచ్చి ఆలోచనలతో ఏదేదో చేస్తున్నావు అంటాడు దశరథ. మీ సంతోషం నా పెళ్లితోనే ముడిపడి ఉందంటే.. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ డాడీ అంటుంది జ్యోత్స్న. ఆ మాటకు సంతోషిస్తాడు దశరథ.
మీ నాన్న కూడా ఉంటే బాగుండు
మరోవైపు శౌర్య ఏదంటూ కార్తీక్ ని అడుగుతుంది దీప. నేనే దగ్గరుండి బస్సు ఎక్కించి వచ్చాను అని చెప్తుంది పారు. మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకువస్తాను అని చెప్తుంది దీప. నాకు లెమెన్ జ్యూస్ ఇవ్వు దీప. కాస్త అన్ ఈజీగా ఉంది అంటుంది సుమిత్ర.
మీరు రెస్ట్ తీసుకొండి నేను మీకు జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్తుంది దీప. మన వెనుక ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది పారు. శివన్నారాయణకు కాఫీ తెచ్చి ఇస్తుంది దీప. మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు శివన్నారాయణ. అందరం ఇక్కడే ఉన్నాం. మీ నాన్న కూడా ఉంటే బాగుండు అంటాడు కార్తీక్ తో. అవును తాత అంటాడు కార్తీక్.
శ్రీధర్ ని క్షమించు
శ్రీధర్ మారిపోయాడు. చక్కగా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు. నేను ఫోన్ చేసి రమ్మంటే కొందరికి నచ్చకపోవచ్చు అని కాంచనను ఉద్దేశించి అంటాడు శివన్నారాయణ. శ్రీధర్, నువ్వు కలిసి ఉంటే బాగుంటుంది అంటాడు కాంచనతో. శ్రీధర్ ని క్షమించమని అడుగుతాడు. కాంచనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు శివన్నారాయణ.
కన్నీళ్లు పెట్టుకున్న శివన్నారాయణ
ఆయన్ని క్షమించాలి అంటే నాకోసం ఒక పనిచేసి పెట్టు నాన్న అంటుంది కాంచన. ఏంటో చెప్పు అంటాడు శివన్నారాయణ. నా కాళ్ల మీద నన్ను నిలబెట్టు నాన్న అంటుంది కాంచన. ఆ మాటకు కన్నీళ్లు పెట్టుకుంటాడు శివన్నారాయణ. ఎప్పటికీ రాని కాళ్లకు, భర్తకు ముడిపెడతావా అని బాధపడుతాడు. కాళ్లు రావని వాటిలో శక్తి లేదన ఎలా వదిలేశానో.. ఆయన చేసిన మోసానికి తనని కూడా అలాగే వదిలేశాను నాన్న అంటుంది కాంచన. మేము కలిసి ఉండటం ఎప్పటికీ జరగదు అని చెప్పేస్తుంది.
మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు
ఇంతలో పూలు, పండ్లు, సారె పట్టుకొని వస్తారు దశరథ, జ్యోత్స్న. దీపకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేశాము. కూతురు తల్లి అయితే పుట్టింటికి, అత్తింటికి సంతోషమే కదా.. ఆచారం ప్రకారం తన కోసం పుట్టింటి నుంచి సారె తీసుకొచ్చాము అని సంతోషంగా చెప్తాడు దశరథ.
వాటిని దీపకు పెడ్తుంది సుమిత్ర. తర్వాత దీప, కార్తీక్ లు సుమిత్ర, దశరథల ఆశీర్వాదం తీసుకుంటారు. మామయ్య నీతో ఒక మాట చెప్పమన్నాడు దీప అంటుంది సుమిత్ర. ఏంటమ్మా అంటుంది దీప. రేపటి నుంచి నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని చెప్తాడు దశరథ. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

