- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ ని ప్రేమతో హత్తుకున్న దీప- పారును రెచ్చగొట్టిన జ్యోత్స్న
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ ని ప్రేమతో హత్తుకున్న దీప- పారును రెచ్చగొట్టిన జ్యోత్స్న
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 5వ తేదీ)లో నేను ఒక్క విషయంలో నిన్ను నమ్మలేక పోతున్నాను దీప అంటుంది సుమిత్ర. నిజాలు నిరూపిస్తానంటాడు కార్తీక్. బావను ప్రేమతో హత్తుకుంటుంది దీప. పారును రెచ్చగొడుతుంది జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 బుధవారం ఎపిసోడ్ లో ఏం చేస్తున్నావు దీప అంటూ కిచెన్ లోకి వస్తుంది సుమిత్ర. త్వరగా వెళ్లిపోవాలి కదా.. చపాతీ చేస్తున్నానమ్మ అంటుంది దీప. నిన్ను చూస్తే నటిస్తున్నట్లు ఎక్కడా కనిపించట్లేదు. నిజాయతీగా పని చేస్తున్నట్లే ఉంది అంటుంది సుమిత్ర. నేనెందుకు నటిస్తానమ్మా అంటుంది దీప. కొన్నిసార్లు అవసరం నటించేలా చేస్తుందని అంటుంది సుమిత్ర.
నాకు కావాల్సిన వాళ్లు నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే చూసి ఆపలేదు. ఏ బంధం లేని నువ్వు మాత్రం నాకోసం వెతికావు. నన్ను కాపాడావు. నాకు సేవ చేశావు. మాటలు పడ్డావు. చివరికి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లావు. నాకు ఎక్కడా నీలో నటన కనిపించలేదు. తల్లిదండ్రుల కోసం ఓ బిడ్డ తాపత్రయ పడినట్లు పడ్డావు. నేను ద్వేషించిన కూడా.. నువ్వు ఇంత ప్రేమ ఎలా చూపిస్తున్నావు అంటుంది సుమిత్ర. నువ్వే నా కన్నతల్లివి అని మనసులో అనుకుంటుంది దీప.
నిజం నిరూపిస్తాను
పక్కనే ఉండి సుమిత్ర మాటలు వింటాడు కార్తీక్. సుమిత్ర దగ్గరకు వచ్చి నువ్వు నిజాలు నమ్మలేకపోతున్నావు అత్త అంటాడు. ఒక్క విషయంలో నేను దీపను నమ్మలేకపోతున్నాను అంటుంది సుమిత్ర. అది నాకు తెలుసు అత్త. నువ్వు చూసింది. విన్నదే నిజం అనుకుంటున్నావు. అన్నిటికి ఆధారాలు ఉండవు అంటాడు కార్తీక్. ఆధారాలు లేనప్పుడు దీప పట్టుకున్న గన్ నుంచి బుల్లెట్ రాలేదని నువ్వెలా నిరూపిస్తావు అంటుంది సుమిత్ర. దీప మామయ్యను షూట్ చేయలేదు. దీప ఎప్పుడూ ఒకేలా ఉంది. నేను చూసిన విజువల్ నా కంటి ముందు అలాగే ఉంది. నా మనసులో అదే ఉంది. దీప తప్పు చేయలేదని నిరూపించి.. నా మైండ్ లో నుంచి ఆ విజువల్ ని తీసెయ్ కార్తీక్ అంటుంది సుమిత్ర. తప్పకుండా దీప తప్పులేదని నిరూపిస్తాను అత్త అంటాడు కార్తీక్. తర్వాత నీకో మంచి సర్ ప్రైజ్ కూడా ఇస్తాను అని చెప్తాడు.
కార్తీక్ ని హత్తుకున్న దీప
ఈ రోజు బాగా సంతోషంగా ఉన్నట్లు ఉన్నావ్ అంటాడు కార్తీక్. అమ్మనాన్న కలిసిపోయారు. మీ తాత బట్టలు పెట్టాడు. ఆశీర్వదించాడు. అంతా హ్యాపీ అంటాడు కార్తీక్. అవును బావ.. దీనికి కారణం నువ్వే అంటుంది దీప. అందుకే థాంక్స్ చెప్పావా? అంటాడు కార్తీక్. థాంక్స్ బావ అంటుంది దీప. ఇలాగేనా బావకు మరదలు థాంక్స్ చెప్పేది అంటాడు కార్తీక్. దీప కార్తీక్ ని గట్టిగా హత్తుకొని థాంక్స్ చెప్తుంది. మా అమ్మకు ఏం సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని అడుగుతుంది. నువ్వే మా అత్త కూతురివి అని చెప్తాను. అదే చాలా సర్ ప్రైజ్ అంటాడు కార్తీక్.
జ్యోత్స్నకు పెళ్లి చేస్తే..
నేను అలిగాను. మీతో మాట్లాడను అంటుంది శౌర్య. ఎందుకు అంటాడు కార్తీక్. నన్ను స్కూల్ కి పంపించి.. మీరు మాత్రం అమ్మమ్మ, తాతయ్య పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ కి వెళ్లారు అంటుంది శౌర్య. నీకోసం మీ తాత చాక్లెట్స్ పంపించాడు బెడ్ రూమ్ లో పెట్టాను వెళ్లి తినమని చెప్తుంది కాంచన. మన జీవితాల్లోకి ఓ తుపాను వచ్చి వెళ్లిపోయినట్లు ఉందని అంటుంది కాంచన. జ్యోత్స్నకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చూస్తే ఇకపై ఏ తుపాను రాదు అంటాడు శ్రీధర్. మంచి సంబంధం చూడొచ్చు కదా మాస్టారు అంటాడు కార్తీక్. మనం చూస్తే వాళ్లకు నచ్చుతాయా? అంటాడు శ్రీధర్. మా బావకు నచ్చినా జ్యోత్స్నకు నచ్చరు. జ్యోత్స్నను పెళ్లిచేసుకోవాలంటే తనకంటే ముదురై ఉండాలి అంటాడు శ్రీధర్. ఇప్పుడైతే అందరం కలిసిపోయాము. అది చాలు అని సంతోషపడుతుంది కాంచన.
పారును రెచ్చగొట్టిన జ్యోత్స్న
మరోవైపు నువ్వు మీ అమ్మనాన్నలను కలపాలి అనుకున్నావు.. కార్తీక్ కలిపాడు. ఇక వదిలెయ్ అంటుంది పారు. నువ్వు ఎవరి వైపు ఉన్నావో చెప్పు గ్రానీ అంటుంది జ్యోత్స్న. నేను ఎప్పుడూ నీ సైడేనే అంటుంది పారు. నా ప్రేమను దీప ఎత్తుకుపోయింది. ఆస్తి మొత్తాన్ని తాత.. డాడీ పేరు మీద రాశారు. ఇంట్లో విలువ కూడా లేదు. ఈ సీఈఓ పోస్టు కూడా పోతే మనం ఇక ఏం చేయలేము అంటుంది జ్యోత్స్న. నేను సీఈఓగా ఉంటే ఆస్తి మొత్తం నా పేరు మీద ఎలా రాయించుకోవాలో నాకు తెలుసు. నేను సీఈఓగా ఉండేలా తాతను ఒప్పించమని పారిజాతాన్ని అడుగుతుంది జ్యో. అయితే పాత పారిజాతాన్ని బయటకు తీసుకు రమ్మంటున్నావా అంటుంది పారు. మనం అనుకున్నది జరగాలంటే పాత పారిజాతం రావాలి గ్రానీ అని రెచ్చగొడుతోంది జ్యోత్స్న. నా టాలెంట్ అంతా వాడి మీ తాతను ఎలా ఒప్పిస్తానో చూడు అని అక్కడినుంచి వెళ్లిపోతుంది పారు. గ్రానీ చెప్తే తాత వింటాడా అని ఆలోచిస్తుంది జ్యోత్స్న.
కార్తీక్ తండ్రిగా రావచ్చు
కార్తీక్ నేను నిన్ను ఒక్కటి అడగాలి రా అంటాడు శ్రీధర్. నేను మీతో కలిసి ఉండొచ్చా? అని అడుగుతాడు. మనమంతా కలిసే ఉంటాం. కానీ ఎవరి ఇళ్లు వాళ్లకు ఉన్నాయి అంటాడు కార్తీక్. జ్యోత్స్న అన్నట్లు నువ్వు అమ్మానాన్న గురించి ఆలోచించవా అంటాడు శ్రీధర్. అత్తమామ కథ వేరు మీ కథ వేరు.. ఇది పూర్తిగా నా తల్లి నిర్ణయం మీద ఆధారపడి ఉందంటాడు కార్తీక్.
అంతా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కాంచన. మనం కలిసి ఉందాం అంటాడు శ్రీధర్. నేను ఒక్కసారి నాకు వద్దు అనుకున్నది నాకు ఎప్పటికీ వద్దు అని చెప్తుంది కాంచన. మీరు కార్తీక్ తండ్రిగా ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు అంటుంది. ఎప్పటికైనా నీ మనసు మారుతుందనే చిన్న ఆశతో వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్. బావ వాళ్ల కుటుంబం కూడా కలిసిపోతే బాగుండు అని దీప మనసులో అనుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.