- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దండలు మార్చుకున్న దశరథ, సుమిత్ర- జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దండలు మార్చుకున్న దశరథ, సుమిత్ర- జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 3వ తేదీ)లో దండలు మార్చుకుంటారు దశరథ, సుమిత్ర. మీ అమ్మ, నాన్నలను ఇప్పటివరకు ఎందుకు కలపలేదు బావ అంటుంది జ్యోత్స్న. నువ్వు ఎంత అమాయకురాలివో నాకు తెలుసు జ్యోత్స్న అంటుంది సుమిత్ర. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో బిడ్డ.. తల్లిని మర్చిపోయేంత ప్రేమను పంచిన అమ్మ లాంటి అత్తకు ఏం చేసినా తక్కువే అంటాడు కార్తీక్. నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు అంటుంది పారు. తాత చెప్పాడు అంటాడు కార్తీక్. ఈ మధ్య తాత అన్నీ నీకే చెప్తున్నాడు అంటుంది పారు. మనుమడికే కాదు.. మనుమరాలికి కూడా చెప్పాను అంటాడు శివన్నారాయణ. అందరూ కలిసి నన్ను జోకర్ ని చేశారని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కేక్ కట్ చెయ్ బావ అంటాడు శ్రీధర్. కట్ చేసే ముందు మీరిద్దరూ దండలు మార్చుకోవాలని దండలు తెస్తారు దీప, కార్తీక్ లు. దండ మెడలో వేసేటప్పుడు ఒకరిగురించి మరొకరు ఒక మంచి మాట, మనసులో ఉన్న మాట చెప్పాలి అంటాడు కార్తీక్.
ఇంకెప్పుడు ఆ తప్పు చేయను
ముందు నువ్వు చెప్పు వదిన అంటుంది కాంచన. భార్యకు, భర్త ఊపిరిలాంటి వాడు. ఒక కఠినమైన మాట ఊపిరి తీస్తుంది. ఇంకెప్పుడు ఆ మాట అనే పరిస్థితి తీసుకురానని మాటిస్తున్నాను అంటూ దశరథ మెడలో దండవేస్తుంది సుమిత్ర. ఇంకెప్పుడు తనని బాధపెట్టను, కన్నీళ్లు పెట్టనివ్వను అని సుమిత్ర మెడలో దండ వేస్తాడు దశరథ. తర్వాత కేక్ కట్ చేస్తారు. మమ్నల్ని ఇద్దరిని కలపడానికి మీ భార్యా భర్తలు ఎంతో కష్టపడ్డారు. ముందుగా మీకే కేక్ తినిపించాలని కార్తీక్, దీపలతో అంటాడు దశరథ. దీప రా అమ్మ అని పిలుస్తాడు. జ్యోత్స్నకు తినిపించండి అంటుంది దీప. కొన్ని బంధాలు.. రక్త సంబంధంతో వస్తాయి. మరికొన్ని బంధాలు ప్రేమతో మొదలవుతాయి. రెండింటికి చాలా తేడా ఉంది. మాకోసం మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు అని దీపకు కేక్ తినిపిస్తాడు దశరథ.
కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న
కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఎమోషనల్ అవుతున్న దీపను చూసి.. ఇదేంటి ఇంతలా ఫీల్ అవుతుంది. అసలు నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటుంది. ఇకపై వీళ్లిద్దరికీ నిజం తెలుసో లేదో అనే టెన్షన్ తోనే నేను భయపడుతూ బ్రతకాలి అనుకుంటుంది. జ్యో దగ్గరకు వచ్చిన పారు.. నువ్వేంటే పరాయి దానిలా దూరం నిలబడుతున్నావు అంటుంది. వెళ్లి శుభాకాంక్షలు చెప్పమని చెప్తుంది. తల్లిదండ్రులకు కేక్ తినిపించి శుభాకాంక్షలు చెప్తుంది జ్యోత్స్న. మీకోసం ఏదైనా చేయాలని ఉంది ఏదో ఒకటి అడుగురా కార్తీక్ అంటాడు దశరథ.
విడగొట్టేది మీరే.. కలిపేది మీరే..
మీకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఏదో ఒకటి అడగండి అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. భార్యా భర్తలను విడగొట్టేది మీరే.. కలిపేది మీరే అంటుంది. మా అమ్మ నాన్నలను కలపాలని బాగానే కష్టపడ్డారు కానీ.. మీ అమ్మ నాన్నలు కలిసి ఉండాలని నువ్వు ఎప్పుడూ కోరుకోలేదా బావ? వాళ్లు విడిపోయినా సరే ఎందుకు అలాగే వదిలేశావు అంటుంది జ్యోత్స్న. అంతా షాక్ అవుతారు. మా మమ్మీని, డాడీని కలపడానికి కష్టపడ్డట్లు.. అత్త, మామయ్యలను ఎందుకు కలపలేదు. వాళ్లు కలిసి ఉండటం నీకు ఇష్టం లేదా అంటుంది జ్యోత్స్న.
వాళ్లు విడిపోయారని నీతో చెప్పారా?
జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. నేను అడిగిన దాంట్లో తప్పుందా తాత అంటుంది జ్యోత్స్న. తప్పు లేదు. కానీ అజ్ఞానం ఉందని అంటాడు శివన్నారాయణ. కాంచన, శ్రీధర్ విడిపోయారని నీతో చెప్పారా? అని అడుగుతాడు. లేదు. కానీ కలిసి ఉండట్లేదు కదా అంటుంది జ్యోత్స్న. శ్రీధర్ తన కొడుకు పెళ్లికి ఒక్కడే వచ్చాడా? జంటగా వచ్చాడా అని అడుగుతాడు శివన్నారాయణ. జంటగానే వచ్చాడు అంటుంది జ్యోత్స్న. సత్యనారాయణ వ్రతంలో కాంచన ఒక్కతే ఉందా? జంటగా ఉందా? అంటాడు శివన్నారాయణ. జంటగానే ఉంది అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు మన ఇంట్లో జరిగే ఈ కార్యక్రమంలో కూడా వాళ్లు జంటగానే ఉన్నారు కదా.. విడిపోయినట్లు నీకు ఎక్కడ అనిపించింది జ్యోత్స్న అని కోపంగా అంటాడు శివన్నారాయణ. మేము ఎప్పుడూ కలిసి ఉన్నాము. ఉంటాము అంటాడు శ్రీధర్. ఇక అందరం కలిసి భోజనం చేద్దాం పదండి అంటాడు శివన్నారాయణ.
జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర
ఒక పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర, జ్యోత్స్న. అందరితో నాకు పనిలేదు. కానీ దీప ఎలాంటిదో నీకు తెలుసు కదా మమ్మీ. నిన్ను డాడీని విడగొట్టింది దీపనే కదా అని సుమిత్రతో అంటుంది జ్యోత్స్న. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను.. ఆ రోజు బోర్డ్ మీటింగ్ అయ్యాక ఇంట్లో గొడవ అయింది. అది చేసింది నువ్వే అంటుంది సుమిత్ర. నేను.. నిన్ను డాడీని కలపడానికి ఒక ప్రయత్నం చేశాను అంటుంది జ్యోత్స్న.
నువ్వు ఉన్న గొడవను పెద్దది చేశావు అంటుంది సుమిత్ర. నువ్వు చాలా అమాయకురాలివి.. ఎంత అమాయకురాలివంటే.. నేను ఇంట్లో నుంచి వెళ్తున్న కూడా చూసి ఆపలేనంత అమాయకురాలివి అంటుంది సుమిత్ర. షాక్ అవుతుంది జ్యోత్స్న. కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. వద్దు జ్యోత్స్న. నేను ఏదైనా నాకు క్లారిటీ రానంత వరకే వేరేవాళ్లు చెప్పేది నమ్ముతాను. నువ్వు ఏం చెప్పకు. నాకంతా తెలుసు. నువ్వు నా ప్రాణం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను వదిలేశావు. దీపను అసహ్యసించుకున్నాను కానీ దీప ఏనాడు నన్ను వదిలిపెట్టలేదు. ఇదే నీకు దీపకు ఉన్న తేడా అంటుంది సుమిత్ర. మమ్మీ అని జ్యోత్స్న ఇంకేదో చెప్పబోతుండగా.. నేను నిన్ను ఏం అనట్లేదు. నీ గురించి నాకు తెలుసు కదా అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుంది.
త్వరలోనే నిజం బయటపడుతుంది
సుమిత్ర మాటలను చాటుగా వింటుంది పారు. జ్యోత్స్న దగ్గరకు వచ్చి.. నువ్వు ఈ ఆస్తికి వారసురాలిగా మహారాణిలా బ్రతుకుతావని అనుకున్నాను. కానీ సుమిత్ర మాటలు విన్నాక.. నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదనే విషయం త్వరలోనే బయట పడుతుందని స్పష్టంగా అర్థమవుతోంది అంటుంది పారు. పిల్లలను మార్చినందుకు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. జైలుకి పంపిస్తారు. నిన్ను ఏం చేస్తారో కూడా తెలియదు అని పారిజాతం అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.