- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపపై ప్రేమ కురిపించిన సుమిత్ర, దశరథ- కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపపై ప్రేమ కురిపించిన సుమిత్ర, దశరథ- కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 4వ తేదీ)లో భోజనం చేస్తున్నప్పుడు దీపను వారి మధ్యలో కూర్చోబెట్టుకుంటారు దశరథ, సుమిత్ర. దీపపై ప్రేమ కురిపిస్తుంటే తట్టుకోలేకపోతుంది జ్యోత్స్న. అందరికీ బట్టలు పెడుతాడు శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 మంగళవారం ఎపిసోడ్ లో నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసే రోజు దగ్గర్లోనే ఉంది జ్యోత్స్నఅంటుంది పారు. నిజం తెలిసిన రోజు నిన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. అందుకే దాసును పిలిచి నిన్ను అప్పగించాలి అనుకుంటున్నాను అంటుంది. అప్పుడు ఈ ఆస్తితో నీకు ఎలాంటి సంబంధం ఉండదు. అదేదో సినిమాలో చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు తిరిగివస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుంది చూడు.. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అంటుంది పారు.
దాసు చెప్పినట్లు సుమిత్ర కూతురు బతికే ఉంటే.. నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసిన రోజు.. అసలైన వారసురాలి కోసం వెతకడం మొదలు పెడతారు. ఒకవేళ వారసురాలు దొరికితే నీ పరిస్థితి ఏంటో అని అంటుంది పారు. ఆ మాటలకు వణికిపోతుంది జ్యోత్స్న. దాసు దగ్గర డబ్బులు లేవు. కాబట్టి నువ్వు కొంతలో కొంతైనా సేవ్ కావాలంటే త్వరగా పెళ్లి చేసుకో అంటుంది పారు. ఏం చేయాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్తుంది జ్యోత్స్న.
జ్యోత్స్న ఒంటరిగా మిగిలిపోయింది
అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. పక్కపక్కనే కూర్చున్న దశరథ, సుమిత్రలను చూసి అమ్మనాన్న ఇలా కూర్చొని భోజనం చేసి ఎన్ని రోజులు అయిందో అని సంతోషపడుతుంది దీప. అటు కార్తీక్ కూడా వాళ్ల పేరెంట్స్ ని చూసే అలాగే ఫీల్ అవుతాడు. ఈ రోజు ఆనందంతో ఆకలి రెట్టింపు అయింది. మీరు కూడా మాతో పాటు కూర్చొని భోజనం చేయండని కార్తీక్, దీపలను పిలుస్తాడు శివన్నారాయణ. అన్ని జంటలను ఇలా చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉందంటాడు. కానీ జ్యోత్స్న మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది అంటుంది పారు. దానికి కూడా అని చెప్పబోతుండగా.. నాకు తెలుసు. అది తర్వాత మాట్లాడుకుందాం అంటాడు శివన్నారాయణ
దీపపై ప్రేమ కురిపించిన సుమిత్ర, దశరథ
డైనింగ్ టేబుల్ పై దీపను తమ మధ్యలో కూర్చోమంటాడు దశరథ. నీ కూతురు దీప కాదు జ్యోత్స్న అని అంటుంది పారు. దీప నా కూతురు ఎందుకు కాకూడదు పిన్ని అంటాడు దశరథ. ఆ మాట వినగానే షాక్ అవుతుంది జ్యోత్స్న. ఒకరి మీద ప్రేమ చూపించాలంటే రక్త సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు అంటాడు దశరథ. సుమిత్రను దీప ఎలా చూసుకుందో నా చెల్లి చెప్పింది. నా భార్యకు సేవ చేసి.. నాకు అప్పగించిన వ్యక్తిని నేను ఇంకెంత బాగా చూసుకోవాలి అని అంటాడు దశరథ. గ్రానీ చెప్పినట్లు త్వరలోనే నిజాలు బయటపడేలా ఉన్నాయని కంగారు పడుతుంది జ్యోత్స్న. అంతలోనే దీపకు పొలమారుతుంది. సుమిత్ర, దశరథలు దీప తలపై తట్టి.. వాటర్ ఇస్తారు. ఆ సీన్ చూసిన జ్యో షాక్ అవుతుంది. దీపే మీ కూతురని త్వరలోనే అత్తకు, మామయ్యకు చెప్పాలి అనుకుంటాడు కార్తీక్.
అందరికీ బట్టలు పెట్టిన శివన్నారాయణ
ఇక వెళ్లి వస్తాం మామయ్య గారు అంటాడు శ్రీధర్. అప్పుడేనా అంటాడు శివన్నారాయణ. ఉండొచ్చు కదా బావ అంటాడు దశరథ. నీకు అత్త ఇంట్లో చోటు లేకపోయినా మా ఇంట్లో ఉంది. ఉండిపో మామయ్య అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. మా బావ ఇక్కడ ఉండడానికి నీ పర్మిషన్ అవసరం లేదు జ్యోత్స్న అంటాడు దశరథ. మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపివ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే అందరి కోసం బట్టలు తెచ్చానని చెప్తాడు శివన్నారాయణ. అందరికీ బట్టలు పెట్టి ఆశీర్వదిస్తాడు. అంతా కలిసిపోతున్నారు గ్రానీ అంటుంది జ్యోత్స్న. నాకు నీ పరిస్థితి అర్థమవుతోంది అంటుంది పారు.
పార్టీకి అందరూ రావాలి
మళ్లీ జన్మ అంటూ ఉంటే ఇవే బంధాలతో ఇలాగే పుట్టాలి. నువ్వే నా వదిన కావాలి అంటుంది కాంచన. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయి మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. సారీ వదినా అని చెప్తుంది సుమిత్ర. పాత విషయాలు అన్నీ ఎప్పుడో మర్చిపోయాము. నువ్వు వాటినే గుర్తుచేసుకొని బాధపడకు అత్త అంటాడు కార్తీక్.
త్వరలోనే ఈ ఇంట్లో పెద్ద పార్టీ చేయబోతున్నాను. అందరూ తప్పకుండా రావాలి అంటాడు శివన్నారాయణ. నీ కుటుంబం కూడా రావాలి అంటాడు శ్రీధర్ తో. నా కుటుంబం ఇక్కడే ఉంది కదా అంటాడు శ్రీధర్. పెద్ద కుటుంబం గురించి కాదు.. చిన్న కుటుంబం గురించి చెప్తున్నా అంటాడు శివన్నారాయణ. అంటే దాసు కూడా రావచ్చా అంటుంది పారు. దాసు, కాశీ.. వాడి భార్య స్వప్నను కూడా రమ్మని చెప్పండని శివన్నారాయణ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.