- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode: కాశీపై అరిచిన శ్రీధర్, తండ్రి ఒట్టుపెట్టినా నిజం చెప్పని కార్తీక్
Karthika Deepam 2 Latest Episode: కాశీపై అరిచిన శ్రీధర్, తండ్రి ఒట్టుపెట్టినా నిజం చెప్పని కార్తీక్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 3వ తేదీ)లో కాశీపై గట్టి గట్టిగా అరుస్తాడు శ్రీధర్. మీ తాత ఇంట్లో డ్రైవర్ గా పనిచేయడానికి కారణం ఏంటో చెప్పమని తనపై ఒట్టు వేయించుకుంటాడు శ్రీధర్. అయినా సరే నిజం చెప్పడు కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…

కార్తీక దీపం టుడే ఎపిసోడ్
కార్తీక దీపం 2 ఈ రోజు శుక్రవారం ఎపిసోడ్ లో నువ్వు, నేను ఒకటి ఎలా ఒకటి కాదు బావ అంటుంది జ్యోత్న్స. మీరు ఓనర్లు, మేం వర్కర్లమంటాడు కార్తీక్. నువ్వు దాసు మామయ్య కూతురివి నీ ఫ్యామిలీ వేరు. నా ఫ్యామిలీ వేరని మనసులో అనుకుంటాడు. నువ్వు నన్ను మాత్రమే వేరుగా చూస్తావని జ్యో అంటే… ఇంట్లో నాపై పగ సాధించేది నువ్వే కదా అని అంటాడు. నా పగ నీ మీద కాదు బావ.. దీప మీద అంటుంది జ్యోత్స్న. పగలు ప్రతీకారాలు మానేసి కంపెనీని నష్టాల్లో నుంచి బయటపడేసే మార్గం చూడమంటాడు కార్తీక్.
జ్యోకు షాకిచ్చిన కార్తీక్
నీకు మైండ్ గేమ్ లు ఆడటం బాగా తెలుసు బావ అంటుంది జ్యో. నాకు ఏ గేమ్ లు రావు అంటాడు కార్తీక్. మైండ్ గేమ్ అంటే తెలియకుండానే శౌర్యను అడ్డుపెట్టుకొని మా మమ్మీని, దీపను అడ్డుపెట్టుకొని మా డాడీని మార్చాలని ట్రై చేస్తున్నావా అంటుంది. ఈ తెలివితేటలతోనేనా నువ్వు వారిద్దరినీ విడదీసింది అని కార్తీక్ అనగానే జ్యో షాక్ అవుతుంది. దీపను ఏం చేయాలన్నా నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అందుకోసం వేలం పాటలో గెలిచి నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంది మనసులో. వేలం పాటలో మీరు విజయం సాధించి.. తాత పరువు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతాడు కార్తీక్.
కాశీకి క్లాస్ ఇచ్చిన శ్రీధర్
భోజన చేస్తూ స్వప్నతో మాట్లాడుతుంటాడు శ్రీధర్. మీ అన్నయ్య ఆత్మాభిమానం గురించి తెలుసు కదా. కన్న తండ్రి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోని కొడుకు నాకే ఉన్నాడేమో అంటాడు. ఆ మాటకు కాశీ కుర్చీల్లో నుంచి పైకి లేస్తాడు. అల్లుడు కూర్చోమని గట్టిగా అరుస్తాడు శ్రీధర్. అసలు నీ ప్రాబ్లం ఏంటీ? ఎందుకు ఇంత ఇన్ఫిరియారీటి కాంప్లెక్స్ తో చచ్చిపోతున్నావు. ఇప్పుడు నా కొడుకు గురించి చెప్తుంటే నువ్వు కనెక్ట్ చేసుకొని లోపల బాధపడుతున్నావు ఎందుకు అని అడుగుతాడు శ్రీధర్.
ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావని నేను అడిగానా? నీకు నచ్చినట్లు ఉండు. మంచిగా రెస్ట్ తీసుకో, టైమ్ తీసుకో. మంచి ఉద్యోగం చూసుకో. ఎంతకాలం అయినా పట్టని. ఫ్రీగా ఉండూ, ఫ్రెండ్లీగా ఉండు. ఇంతకుముందులా ఉండు. నీలో నువ్వు ఎందుకు కుమిలిపోతావు? ఉన్నది ఒక్కటే జీవితం. ప్రశాంతంగా బతకమని హితబోధ చేస్తాడు శ్రీధర్. స్వప్న, కావేరి అలాగే చూస్తూ ఉండిపోతారు. నాకే ఇలా ఉంది అంటే.. కాశీ పరిస్థితి ఏంటో అని మనసులో అనకుంటుంది స్వప్న.
నిజం చెప్పు కార్తీక్
నేను ఒకటి అడిగితే.. నిజం చెప్తావా కార్తీక్ అంటుంది కాంచన. నువ్వు మీ నాన్నను మీకు నచ్చినట్లుగా మార్చే ప్రయత్నంలో ఉన్నావా? అని అడుగుతుంది. అవును అంటాడు కార్తీక్. మరి డబ్బులు ఎందుకు తీసుకోలేదు అంటుంది. సరుకులు తేస్తేనే వద్దన్న వాడిని డబ్బులు ఎలా తీసుకుంటాను అంటాడు కార్తీక్. డబ్బులు కట్టకుండా అగ్రిమెంట్ దాటి బావ బయటకు రాలేడు అనుకుంటున్నారా అంటుంది దీప. ఆ ఇంట్లో నుంచి ఎలాగైనా బయటపడాలని చెప్తుంది కాంచన.
అంతలోనే అక్కడకు వస్తాడు శ్రీధర్. నీ భార్య కోసమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు? కానీ బయటపడే ఛాన్స్ వస్తే ఎందుకు వద్దంటున్నావు అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. నా డబ్బులు వద్దు.. బయట ఇప్పిస్తా.. కట్టేసి ఆ ఇంటి నుంచి బయటకు రా అంటాడు. నాకు ఏ డబ్బులు వద్దు అంటాడు కార్తీక్. నీ భార్యకు నిజం తెలిసినా చెప్పదు కాబట్టి నువ్వే చెప్పాలి అంటాడు శ్రీధర్. మాట దాటేస్తాడు కార్తీక్.
నీ పరిస్థితికి కారణం దీపే..
కార్తీక్ ను తీసుకొని బయటకు వెళ్తాడు శ్రీధర్. ఆ రోజు మిమ్మల్ని వదిలేసి నేను చాలా పెద్ద తప్పు చేశానని అంటాడు. గొప్పగా బ్రతికిన నా కొడుకు డ్రైవర్ గా పని చేస్తుంటే చూడలేకపోతున్నానని ఎమోషనల్ అవుతాడు. నేనేమో విలాసవంతంగా ఉంటున్నా కానీ నా కొడుకు పేదరికంలో బతుకుతున్నాడు. ఈ పరిస్థితికి కారణం దీపే. నువ్వు రోడ్డు మీదకు రావడానికి కారణం దీపను పెళ్లి చేసుకోవడమే అంటాడు.
దీపను ఏమనకు మాస్టారూ.. నా ప్రాణాలు కాపాడింది కూడా దీపే అంటాడు కార్తీక్. దీపే నీ ప్రాణాలు కాపాడింది. అలాగని నువ్వు దీప గురించి ఏం చేయలేదా? ఆమెను పెళ్లి చేసుకొని జీవితానికి వెలుగునిచ్చావు. తన కోసమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు. డ్రైవర్ గా మారావు. కానీ అవకాశం వచ్చినా అక్కడి నుంచి ఎందుకు బయట పడటం లేదని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. దీప రుణం తీర్చుకోవడానికి అని బదులిస్తాడు కార్తీక్.
నిజం చెప్పని కార్తీక్
దీప రుణం తీర్చుకోవడానికి, ఆ ఇంటికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. ఇప్పుడు ఏం చెప్పలేనని కార్తీక్ అంటాడు. కార్తీక్ చేయి తీసుకొని తన తలపై పెట్టుకొని.. తన మీద ఒట్టేసి నిజం చెప్పమని అడుగుతాడు శ్రీధర్. అయినా సరే నిజం చెప్పడు కార్తీక్. టైమ్ వచ్చినప్పుడు అన్నీ మీకే తెలుస్తాయి. అప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు అంటాడు. దీపకు, ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏంటో నేనే తెలుసుకుంటానని శ్రీధర్ మనసులో అనుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.