- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్: నేనే ఈ ఇంటి వారసురాలిని అన్న దీప, నా పగ దీపపైనే అన్నజ్యో..
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్: నేనే ఈ ఇంటి వారసురాలిని అన్న దీప, నా పగ దీపపైనే అన్నజ్యో..
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 2వ తేదీ)లో నాకు ఎవ్వరి సహాయం వద్దు అంటూ శ్రీధర్ కి షాకిస్తాడు కార్తీక్.. నేనే ఈ ఇంటి వారసురాలిని అంటుంది దీప. జ్యోత్స్నను నువ్వు దాసు మామయ్య కూతురివి అంటాడు కార్తీక్. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 గురువారం ఎపిసోడ్ లో నీకోసం రూ. 10 కోట్ల చెక్ ఇచ్చాడు మీ నాన్న అని దశరథ కార్తీక్ తో అంటాడు. అయితే నిర్ణయం నీకే వదిలేశామని జ్యోత్స్న అంటుంది. నీ అగ్రిమెంటుకు ఫుల్ స్టాప్ పెట్టమంటాడు శ్రీధర్. నా మాటే నీ మాట అని చెప్పు కార్తీక్.. ప్రతి దానికి ఆరంభం ఉన్నట్లే ముగింపు కూడా ఉండాలి. నీ అగ్రిమెంటుకు ఇది జడ్జ్ మెంట్ డే అని అంటాడు. ఈ చెక్ తీసుకోండి. నా కొడుకును నేను ఈ జైలు నుంచి తీసుకెళ్లిపోతున్నాను అంటాడు శ్రీధర్.
అప్పటివరకు మౌనంగా ఉన్న కార్తీక్. వద్దు మాస్టారూ నువ్వు ఇక్కడినుంచి వెళ్లిపో అంటాడు. నాకు ఎవ్వరి సాయం అవసరం లేదు. నేను ఇక్కడే ఉంటాను అంటాడు. అందుకు నేను నీ తండ్రిని రా.. ఈమాత్రం కూడా నేను చేయకూడదా.. నువ్వు డ్రైవర్ గా పనిచేయడం నేను చూడలేకపోతున్నా అంటాడు శ్రీధర్. నాకు ఇష్టంలేదు మీరు వెళ్లిపోండి మాస్టారూ అంటాడు కార్తీక్. కారులో పెట్రోల్ కొట్టించాలి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయమని శివన్నారాయణను అడుగుతాడు.
నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నాకు తెలుసు బావ అని జ్యో మనసులో అనుకుంటుంది. నువ్వు అయినా కార్తీక్ కి చెప్పొచ్చు కదా చెల్లెమ్మ అని శ్రీధర్ సుమిత్రతో అంటాడు. వాడి మనసులో ఏం ఉందో మనకు తెలియదు కదా అన్నయ్య అని సుమిత్ర అంటుంది.
దీపను ప్రశ్నించిన శ్రీధర్
కార్తీక్ మనసులో ఏముందో దీపకు కచ్చితంగా తెలిసే ఉంటుంది తననే అడగాలి అనుకుంటాడు శ్రీధర్. దీప నీతో మాట్లాడాలి. నేను బయట వెయిట్ చేస్తా అంటాడు. దీప వెళ్తుంది. కార్తీక్, నువ్వు ఇక్కడ పనివాళ్లుగా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. నేనే అంటుంది దీప. అగ్రిమెంట్ పై సంతకం పెట్టడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. కానీ మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలనుకోవడానికి కారణం ఏంటి అని శ్రీధర్ అడుగుతాడు.
నేను ఈ ఇంటి వారసురాలిని. జ్యోత్న్స, పారిజాతం వంటి శత్రువుల నుంచి నా తల్లిదండ్రులను కాపాడుకోవడానికి మేము ఇక్కడ ఉన్నామని మీతో ఎలా చెప్పను అని దీప మనసులో అనుకుంటుంది. పైకి మీ అబ్బాయినే అడగండి. నాకు ఏం తెలీదు అంటుంది. కొడుకు ఒప్పుకోడు. కోడలు నిజం చెప్పదు. అసలు వీళ్లు ఇక్కడ ఉండడం వెనుక కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ వెళ్లిపోతాడు శ్రీధర్.
జ్యోకు కార్తీక్ సపోర్ట్
నీకు ఇచ్చిన టైం గుర్తింది కదా. రెస్టారెంట్ ని నష్టాల్లో నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తున్నావా జ్యోత్స్న అంటాడు శివన్నారాయణ. మార్కెట్ రోడ్డులో ఒక రెస్టారెంట్ వేలానికి వచ్చింది. దాన్ని తీసుకోవాలి అనుకుంటున్న అంటుంది జ్యోత్స్న. మన రెస్టారెంటే నష్టాల్లో ఉంటే మనకు ఇంకొకటి ఎందుకు అంటారు దశరథ, శివన్నారాయణ. 2,3 సంవత్సరాల్లో దాని వాల్యు బాగా పెరుగుతుంది. మనం దాన్ని ప్రాపర్టీగా కూడా చూడవచ్చు కదా డాడీ.. దానివల్ల మనకు నష్టమేమి ఉండదు అంటుంది.
శివన్నారాయణ, దశరథ రెస్టారెంట్ కొనడం వల్ల కలిగే లాభనష్టాల గురించి మాట్లాడుకుంటూ.. కార్తీక్ ని కూడా ఒపినీయన్ అడుగుతారు. అందుకు కార్తీక్ ఒప్పుకోడు అనుకుంటుంది జ్యోత్న్స. నేను సపోర్ట్ చేస్తున్నాను అంటాడు కార్తీక్. వీడు సపోర్ట్ చేస్తే వెనుక ఏదో కారణం ఉంటుంది అనుకుంటుంది పారు.
నా పగ నీపై కాదు..
నాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం మర్చిపోయావు బావ అంటుంది జ్యో. నువ్వు అనుకున్నది సాధించాక కాంగ్రాట్స్ చెప్తాలే అంటాడు కార్తీక్. నేను సాధించలేక.. రెస్టారెంట్స్ ని నష్టాల్లో నుంచి బయటకు తీసుకురాలేక, వేలంపాటలో కూడా ఓడిపోయి.. సీఈఓ పోస్టుకి రాజీనామా చేస్తానని అనుకుంటున్నా వా బావ అని అడుగుతుంది. నీ మీద నీకు నమ్మకం లేదా అంటాడు కార్తీక్. నా తప్పులు నీకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నావా అంటుంది.
నువ్వు తప్పు చేస్తే పోయేది మాతాత పరువు. మా తాత పరువు కాపాడటం నా బాధ్యత అంటాడు కార్తీక్. అయితే మనం ఇద్దరం ఒక్కటే కదా అంటుంది జ్యోత్న్స. కాదు నీ ఫ్యామిలీ వేరు. నా ఫ్యామిలీ వేరు అంటాడు కార్తీక్. నువ్వు దాసు మామయ్య కూతురివి అనుకుంటాడు మనసులో. ఎలా వేరు బావ అని అడుగుతుంది జ్యో. నీది కొడుకు ఫ్యామిలీ. నాది కూతురి ఫ్యామిలీ అంటాడు కార్తీక్.
నువ్వు నన్ను మాత్రమే వేరుగా చూస్తున్నావు బావ అంటుంది జ్యో. ఈ ఇంట్లో నాపై పగ సాధించేది నువ్వే కదా అంటాడు కార్తీక్. నా పగ నీపై కాదు దీపపై అంటుంది జ్యో. పగలు ప్రతీకారాలు మానేసి కంపెనీని ఎలా పైకి తీసుకురావాలో ఆలోచించు అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.