- Home
- Entertainment
- TV
- బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? టాప్ 5 కంటెస్టెంట్స్ విషయంలో ట్విస్ట్, మారిపోయిన లెక్కలు
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? టాప్ 5 కంటెస్టెంట్స్ విషయంలో ట్విస్ట్, మారిపోయిన లెక్కలు
Bigg Boss Telugu 9 Finale :బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ఎంతో టైమ్ లేదు.. ఇంకా మూడు వారాలే టైమ్ ఉండటంతో.. హౌస్ లో వాతావరణం వేడుక్కుతోంది. ఇక ఈసారి విన్నర్ ఎవరు అన్న విషయంతో పాటు గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది.

చివరిదశకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
బిగ్ బాస్ తెగులుగు సీజన్ 9 చివరిదశకు వచ్చింది. సెప్టెంబర్ 17న స్టార్ట్ అయిన ఈ రియాల్టీషో.. సక్సెస్ ఫుల్ గా సీజన్ 9 ను కంప్లీట్ చేసుకోబోతోంది. ఇప్పటికే 12 వారాలు గడిచాయి.. 13వ వారం అయిపోవస్తుంది.. హౌస్ లో వాతావరణం వేడెక్కిపోతోంది. టికెట్ టు ఫినాలే రేస్ జోరుగా సాగుతోంది.. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అన్న విషయంలో ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. ఈక్రమంలో విన్నర్ కు కప్ అందించడానికి వచ్చే గెస్ట్ విషయంలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. మరి ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిధి ఎవరో తెలుసా?
గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ ?
ఇక బిగ్ బాస్ ఫైనల్స్ కు ఇంకా మూడు వారాలు మాత్రమే టైమ్ ఉంది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 21 న జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కప్ ఇవ్వడానికి వచ్చే గెస్ట్ ఎవరు అన్న విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. గత సీజన్ లో గ్రాండ్ ఫినాలేకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. నిఖిల్ విన్నర్ అవ్వగా.. చరణ్ చేతుల మీదుగా కప్పు అందుకున్నాడు. ఇక ఈసారి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ గ్రీస్ సిగ్నల్ కూడా ఇచ్చేవారట. చిరు రాకకు మరో కారణం కూడా ఉందంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఆయన నటిస్తున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ప్రమోషనల్ కార్యక్రమాలను ఈ నెల రెండవ వారం నుండి మొదలు పెట్టొచ్చు. అందులో భాగంగా బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడని టాక్. గతంలో కూడా మెగాస్టార్ సీజన్ 3 , సీజన్ 4 లకు ముఖ్య అతిథిగా వచ్చి కప్పును అందించారు. ఈ సారి కూడా ఆయనే గెస్ట్ గా రాబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తారట కూడా.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ ఎవరు?
ఇక మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా కన్ ఫార్మ్ అయితే.. ఆయన చేతుల మీదుగా కప్ అందుకునే విన్నర్ ఎవరు? బిగ్ బాస్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతోంది. మొదటి ఫైనలిస్ట్ కోసం రణరంగంలా మరింది హౌస్. డీమాన్ పవన్ తనను తాను నిరూపించుకోవడం కోసం ఎలాగైనా మొదటి ఫైనలిస్ట్ అవుతానని ఛాలెంజ్ చేశాడు. ఇక మరోవైపు బిగ్ బాస్ హౌస్ కు చివరి గెప్టెన్ గా కళ్యాణ్ గెలిచాడు. ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడున్నవారిలో విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నది పవన్ కళ్యాణ్ కే. కొన్ని అంచనాల ప్రకారం టాప్ 5 లో కళ్యాణ్ తో పాటు సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్ ఉండే అవకాశం కనిపిస్తోంది. వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే భరణీకి ఆ ఛాన్స్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. విన్నర్ విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. కానీ టైటిల్ రేస్ లో మాత్రం ఎక్కువగా పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈసారి టాప్ 6 కంటెస్టెంట్స్..?
బిగ్ బాస్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈసారి సీజన్ లో ఫినాలే వీక్ కి టాప్ 5 కంటెస్టెంట్స్ కి బదులుగా టాప్ 6 ను తెరపైకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. టాప్ 6 కంటెస్టెంట్స్ ని ఉంచితే ఎలా ఉంటుంది అని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తున్నారట. ఇప్పుడు ఉన్నవారిలో టాప్ 5 ని ఉంచితే ఒక వారం డబుల్ ఎలిమినేషన్ తప్పదు. టాప్ 6 ని ఉంచితే మాత్రం రెండు వారాలు ఇద్దరు బయటకు వెళ్లిపోతారు. ఈ వారం బిగ్ బాస్ నుంచి సుమన్ శెట్టి వెళ్లిపోవడం ఖాయం అని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సుమన్ ను చాలా కాపాడుకుంటూ వచ్చారు. సుమన్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను ముందుగానే సాగనంపిన బిగ్ బాస్.. ఆయన్ను మాత్రం కాపాడుకుంటూ వచ్చారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. సుమన్ తో పాటు భరణి కూడా బయటకు వెళ్తాడన్న టాక్ వినిపిస్తోంది.

