- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర, దశరథల మధ్య దూరం పెంచాలనుకున్న జ్యో.. అందరికీ షాక్ ఇచ్చిన శ్రీధర్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర, దశరథల మధ్య దూరం పెంచాలనుకున్న జ్యో.. అందరికీ షాక్ ఇచ్చిన శ్రీధర్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 1వ తేదీ) తండ్రి, కొడుకుల మధ్య నేనేందుకు దూరం పెంచాలనుకుంటుంది కాంచన. మరోసారి తల్లిదండ్రులు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది జ్యో. కార్తీక్ కోసం జ్యోకు బ్లాంక్ చెక్ ఇస్తాడు శ్రీధర్. ఈ రోజు ఏం జరిగిందంటే..

కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 బుధవారం ఎపిసోడ్ లో ఈ సరుకులను తీసుకెళ్లి కారులో పెడ్తా మీ ఇంటికి తీసుకెళ్లు అంటాడు కార్తీక్ శ్రీధర్ తో. ఈ సరుకులు కార్లో పెడితే నేను మరోసారి ఈ ఇంటికి రాను. ఒక తండ్రిగా కుమిలి కుమిలి ఏడుస్తాను అంటాడు శ్రీధర్. నువ్వు మీ తాత ఇంట్లో డ్రైవర్ గా పని చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకోసం ఏం చేయాలో చెప్పు చేస్తానని అంటాడు శ్రీధర్. సరుకులు ఇక్కడే ఉంచి వెళ్లిపోండి మాస్టారూ అంటాడు కార్తీక్. మీ ఆవిడకు ఎలా ఉందని అడుగుతాడు శ్రీధర్. మీరు తననే అడగొచ్చు కదా అంటాడు కార్తీక్. నాకు బాగానే ఉందండి అంటుంది దీప.
ఏం జరిగిందని కాంచన, అనసూయ అడుగుతారు. దీంతో సుమిత్ర, దీపల మధ్య జరిగిన విషయాన్ని వారితో చెబుతాడు కార్తీక్. ఇక్కడితో వదిలేయ్ బావ అంటుంది దీప. నువ్వు డ్రైవర్ గా పనిచేయడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు శ్రీధర్. తనేందుకు శివన్నారాయణ ఇంట్లో పనిచేస్తున్నాడో ఇప్పుడు ఎవ్వరికీ చెప్పలేను అని మనసులో అనుకుంటాడు కార్తీక్. శ్రీధర్ ఇచ్చిన డబ్బుల గురించి చెప్పాలా? వద్దా? అని ఆలోచిస్తుంది కాంచన. చెప్పి వారిమధ్య దూరం ఎందుకు పెంచడం అని అనుకుంటుంది.
తల్లిదండ్రుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం
మరోవైపు భోజనం చేయకుండా కూర్చున్న సుమిత్ర దగ్గరకు వెళ్లి తినడానికి రా మమ్మీ అంటుంది జ్యో. మీ నాన్న తినకుండా మీ మమ్మీ తినదే. మీ నాన్నను పిలవమని చెప్తుంది పారిజాతం. దశరథ దగ్గరకు వెళ్లిన జ్యో.. ఇదే అదనుగా తల్లిదండ్రుల మధ్య దూరాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు దీప కళ్లు తిరిగి పడిపోతే మమ్మీ ఆమెకు సేవలు చేసింది. దీప నిజం ఒప్పుకొంటే క్షమించడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు మమ్మీనే దూరం పెడుతున్నారు అంటుంది జ్యో. తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు మరో తప్పు చేస్తే కోపం రాదా అని దశరథ అంటాడు. జ్యో, దశరథల మాటలు విన్న శివన్నారాయణ జ్యోత్స్నకు గట్టిగానే సమాధానం చెబుతాడు.
కార్తీక్ కోసం ఏమైనా చేయాలి..
మరోవైపు శ్రీధర్, కావేరీ మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు.. కానీ నా కొడుకుని డ్రైవర్ లా చూడలేకపోతున్నా అంటాడు శ్రీధర్. వాడి కోసం ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ నిద్రపోతాడు. ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు శ్రీధర్. అందరినీ పిలిపించండి మాట్లాడాలని అంటాడు. నా కొడుకు డ్రైవర్ గా పనిచేయడం నాకిష్టం లేదు. అగ్రిమెంట్ లో ఎలాంటి కండీషన్లు పెట్టుకున్నారో నాకు తెలియదు. నా కొడుకును అగ్రిమెంట్ నుంచి విడిపించడానికి ఏం చేయాలి అంటాడు శ్రీధర్.
షాక్ ఇచ్చిన శ్రీధర్
అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తే రూ.10 కోట్లు జరిమానా కట్టాలి అంటుంది జ్యో. నేను రూ.10 కోట్లు కడతానని బ్లాంక్ చెక్ ఇస్తాడు శ్రీధర్. ఈ చెక్ తీసుకొని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని చెబుతాడు. బావ కోసం రూ.10 కోట్లు ఇవ్వడం బాగానే ఉంది కానీ.. ఇవ్వాల్సింది నువ్వు కాదు బావ అంటుంది జ్యో. ఇంతలో దీప, కార్తీక్ లు అక్కడికి వస్తారు.
మామయ్య అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించడానికి వచ్చాడని కార్తీక్ తో చెప్తుంది జ్యోత్స్న. కార్తీక్ ఈ సారైనా మంచి నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తున్నా.. నిన్ను విడిపించడానికి మీ నాన్న రూ.10 కోట్ల చెక్ ఇచ్చాడని చెబుతాడు దశరథ. నా నిర్ణయమే నీ నిర్ణయమని చెప్పురా అంటాడు శ్రీధర్. ప్రతీ దానికి ఒక ముగింపు ఉండాలని.. నీ అగ్రిమెంట్ కు ఇదే జడ్జ్ మెంట్ డే అని శ్రీధర్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.