MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:జ్యోకు దాసు వార్నింగ్-దీపను అవమానించిన జ్యో-చెంప పగలకొట్టిన సుమిత్ర

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:జ్యోకు దాసు వార్నింగ్-దీపను అవమానించిన జ్యో-చెంప పగలకొట్టిన సుమిత్ర

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 26వ తేదీ)లో జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు దాసు. కార్తీక్ ని హగ్ చేసుకుంటుంది దీప. అందరిముందు దీపను అవమానిస్తుంది జ్యోత్స్న. కోపంతో జ్యో చెంప పగలకొడుతుంది సుమిత్ర. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

3 Min read
Author : Kavitha G
Published : Nov 26 2025, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : jiohotstar

కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు దాసు. నేను ఇప్పుడు ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నాను. కానీ దీపకు, దీప కడుపులో బిడ్డకు నువ్వు ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం... నిన్ను వదిలిపెట్టను. ఎక్కడున్నా ఇక్కడికి వస్తాను. నిజం అందరితో చెప్తాను. నువ్వు అన్నింటికి సిద్ధంగా ఉండు. త్వరలోనే నువ్వు నా కూతురివి అనే నిజం బయటపడనుంది అని జ్యోత్స్నతో చెప్పి వెళ్లిపోతాడు దాసు.

25
కార్తీక్ ని హగ్ చేసుకున్న దీప
Image Credit : jiohotstar

కార్తీక్ ని హగ్ చేసుకున్న దీప

డాక్టర్ తో ఫోన్ లో మాట్లాడుతుంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి వస్తుంది దీప. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దీపకు ప్రేమగా చెప్తాడు కార్తీక్. భర్తను హగ్ చేసుకుంటుంది దీప. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటారు. నాన్న అని పిలవడానికి శౌర్య ఉన్నా.. ఇంకో పిలుపు కోసం నేను సంతోషంగా వెయిట్ చేస్తున్నా.. ఆ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పలేను అంటాడు కార్తీక్. 9 నెలలు సంతోషంగా గడవాలి. ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉండి నీకు సేవలు చేయాలి. నిన్ను జాగ్రత్తగా, సంతోషంగా చూసుకోవాలి అంటాడు కార్తీక్. రేపటి నుంచి నువ్వు తాత వాళ్ల ఇంటికి రావద్దు అని చెప్తాడు. అక్కడికి వస్తే అమ్మానాన్న పక్కనే ఉంటారు. నాకు అదో సంతోషం అంటుంది దీప.

Related Articles

Related image1
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఒక్కటైన స్వప్న, కాశీ- తల్లి కాబోతున్న దీప- షాక్ లో జ్యో, పారు
Related image2
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ దక్కడని కంగారుపడ్డ జ్యోత్స్న- నిజం చెప్పేస్తానన్న దాసు
35
కాశీపై ఫైర్ అయిన శ్రీధర్
Image Credit : jiohotstar

కాశీపై ఫైర్ అయిన శ్రీధర్

మరోవైపు కాశీ, స్వప్నకు ఎదురుగా వస్తూ చూడకుండా డ్యాష్ ఇస్తాడు. సారీ చెప్తే.. స్వప్న పట్టించుకోదు. మీ అన్నయ్య మన ఇద్దరినీ కలిపాడు కదా.. ఇంకా అలాగే ఉన్నావెందుకు అని స్వప్నను అడుగుతాడు కాశీ. మా అన్నయ్య కలిపినంత మాత్రానా.. నేను అన్ని మర్చిపోయి నవ్వుకుంటూ మాట్లాడలేను అంటుంది స్వప్న. ముందు జాబ్ తెచ్చుకో అంటుంది. జాబ్ లేకపోతే నాకు ఏ విలువ లేదా అంటాడు కాశీ. 

భర్తంటే ఎలా ఉండాలో మా అన్నయ్యను చూసి నేర్చుకో అంటుంది స్వప్న. కార్తీక్ గురించి తక్కువ చేసి మాట్లాడుతాడు కాశీ. నా కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటూ కాశీపై ఫైర్ అవుతాడు శ్రీధర్. కార్తీక్ చేసిన త్యాగాలను గుర్తుచేసి.. వాడితో నీకు ఏ రకంగా పోలిక లేదు అని చెప్పి వెళ్లిపోతాడు. అనవసరంగా బావ గురించి మాట్లాడాను. నా టైం బాగోలేదు అని మనసులో అనుకుంటాడు కాశీ.

45
జ్యో చెంప పగలకొట్టిన సుమిత్ర
Image Credit : jiohotstar

జ్యో చెంప పగలకొట్టిన సుమిత్ర

ఒంటరిగా కూర్చొని గురువు గారు చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటాడు శివన్నారాయణ. ఈ ప్రమాదం నుంచి నా కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు అని ఆలోచిస్తుండగా.. కార్తీక్, దీప ఎంట్రీ ఇస్తారు. నువ్వు ఎందుకు వచ్చావమ్మా.. ఈ టైంలో నువ్వు మంచిగా రెస్ట్ తీసుకోవాలి కదా అంటాడు దశరథ. అదేంటి డాడీ.. ఈ విషయాలు దీపకు ముందే తెలుసు కదా.. ఇది తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏం కాదు కదా.. అని ఎగతాళిగా నవ్వుతుంది జ్యోత్స్న. 

దీప, బావతో పిల్లల్ని కనడం మొదటిసారి అని ఈ జాగ్రత్తలు చెప్తున్నారా? అంటుంది జ్యోత్స్న. అవమానంతో తలదించుకుంటుంది దీప. జ్యో పైకి చేయి ఎత్తుతాడు దశరథ. ఈలోపు జ్యోత్స్న చెంప పగలకొడుతుంది సుమిత్ర. నువ్వు అవమానించింది దీపను కాదు.. అమ్మతనాన్ని. కడుపులో బిడ్డను మోయడం గురించి నీకెం తెలుసు. నేను కూడా నిన్ను అలాగే కన్నాను. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు, అర్హత నీకు లేవు. మరోసారి ఇలా మాట్లాడితే క్షమించను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర.

55
కాంచన గుర్తొచ్చింది
Image Credit : jiohotstar

కాంచన గుర్తొచ్చింది

నీతో మాట్లాడాలి అని కార్తీక్ ని బయటకు తీసుకెళ్తాడు శివన్నారాయణ. గురువు గారు చెప్పిన విషయాలు కార్తీక్ తో చెప్తాడు. ఎవరికి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది రా. నా గురించి నాకు బాధలేదు. కానీ ఎవరికైనా ఏమైనా అయితే తట్టుకునే వయసు కాదురా నాది అంటాడు కార్తీక్ తో. ఎవరి మొహం చూసినా భయంగా ఉంది. అప్పుడే కాంచన గుర్తొచ్చింది అంటాడు శివన్నారాయణ. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: ఒట్టుతో తండ్రిని ఆపిన దీప- జ్యో టెన్షన్-జ్యోని ఇల్లు దాటనివ్వని తాత
Recommended image2
Illu Illalu Pillalu: సాగర్ ని ఇరికించేసిన వల్లీ, ఆ ప్లాన్ తిప్పి కొట్టేలా నర్మద మాష్టర్ ప్లాన్
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి శాపం పెట్టిన మీనా, భార్య అంటే శ్రుతిలా ఉండాలి, పుట్టింటికి మౌనిక
Related Stories
Recommended image1
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఒక్కటైన స్వప్న, కాశీ- తల్లి కాబోతున్న దీప- షాక్ లో జ్యో, పారు
Recommended image2
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ దక్కడని కంగారుపడ్డ జ్యోత్స్న- నిజం చెప్పేస్తానన్న దాసు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved