- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర విషయాన్ని దాచిన దీప, కార్తీక్- ఈ సమస్యలకు దీపే కారణమన్న శ్రీధర్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర విషయాన్ని దాచిన దీప, కార్తీక్- ఈ సమస్యలకు దీపే కారణమన్న శ్రీధర్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 18వ తేదీ)లో అమ్మ మన దగ్గరే ఉందనే విషయం ఎవ్వరితో చెప్పొద్దు అంటుంది దీప. ఈ గొడవలన్నీ దీప వల్లే అంటాడు శ్రీధర్. జ్యోత్న్ననే అత్తయ్యను ఏదో ఒకటి చేసుంటుంది అమ్మ.. అంటుంది స్వప్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 శనివారం ఎపిసోడ్ లో అత్త అంటూ గది లోపలికి వెళ్లిన కార్తీక్ దీప అత్త ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు తీసుకొచ్చావా? అని అడుగుతాడు. అమ్మమ్మ తలకు దెబ్బ తగిలింది నాన్న అని చెబుతుంది శౌర్య. నువ్వు అమ్మమ్మ దగ్గరే ఉండు శౌర్య అని చెప్పి కార్తీక్ ను బయటకు తీసుకెళ్తుంది దీప. అత్తయ్య కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా దీప. అక్కడ తాత మామయ్య ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అని అంటాడు కార్తీక్. ఉండు వాళ్లకు అత్తయ్య కనిపించిందని.. మన దగ్గరే సేఫ్ గా ఉందని చెబుతాను అని ఫోన్ తీయబోతాడు.
వద్దు అంటుంది దీప. అదేంటీ ఎందుకు అని అడుగుతాడు కార్తీక్. సుమిత్ర, దీపల మధ్య జరిగిన విషయాన్ని కార్తీక్ తో చెబుతుంది దీప. తనని ఇంటికి తీసుకెళ్తే ప్రాణాలు తీసుకుంటానని చెప్పింది. ఇప్పుడు తనతో మాట్లాడకుండా మనం వాళ్లందరికీ చెప్తే.. ప్రాణం ఉన్నంతవరకు మా అమ్మ నన్ను క్షమించదు. ఇప్పుడు ఏం మాట్లాడలన్నా తను స్పృహలోకి రావాలి అని చెబుతుంది.
బంధం తెంచుకోవడం అంత ఈజీనా?
మరోవైపు గదిలో నుంచి బయటకు రాబోయి కిందపడబోతాడు శివన్నారాయణ. వెంటనే దశరథ, పారు పట్టుకొని సోఫాలో కూర్చోబెడతారు. రెస్ట్ తీసుకోవచ్చు కదా నాన్న అంటాడు దశరథ. ఎంతసేపు ఆ గదిలోనే పడుకొని ఉండాలి అంటాడు శివన్నారాయణ. కార్తీక్ ఫోన్ చేశాడా? సుమిత్ర కనిపించిందా? అయినా సుమిత్ర కనపడలేదు అనే సమాధానం చెప్పడానికి నువ్వు ఎంత బాధపడుతున్నావో అని అంటాడు శివన్నారాయణ.
కోపంలో ఒక్క మాట అంటే అంత ఈజీగా బంధం వద్దు అనుకొని వెళ్లిపోతుందా? అంత సులభమా బంధాన్ని తెంచుకోవడం? ఆ బంధం వెనుక ఒక గతం ఉంది.. బోలెడు భవిష్యత్తు ఉంది. అలా ఎలా వెళ్లిపోతుంది నాన్న అని బాధపడతాడు దశరథ. తెలివైన వాళ్లే ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అంటాడు శివన్నారాయణ. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వకుండా మనం కూడా తప్పుచేస్తున్నాం తాత అంటుంది జ్యోత్న్స. కార్తీక్, దీప వెతుకుతున్నారు కదా వదిలెయ్ అంటాడు శివన్నారాయణ. బావ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడేమో అని నాకు అనిపిస్తోంది తాత అంటుంది జ్యో. పారు కూడా ఆ మాటకు వత్తాసు పలుకుతుంది.
శ్రీధర్ దగ్గర విషయం దాచిన కార్తీక్, దీప
మరోవైపు సుమిత్ర దగ్గర కూర్చొని బాధపడుతుంటారు దీప, కార్తీక్ లు. ఇంతలో గేటు తీసిన సౌండ్ వినిపించగానే.. ఎవ్వరో వచ్చారు.. అమ్మ గురించి ఎవ్వరికీ తెలియకూడదు బావ అంటుంది దీప. మాస్టారే అయ్యుంటాడు. నువ్వేం కంగారుపడకు అని చెప్తాడు కార్తీక్. ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. కార్తీక్ ను చూసి నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చావురా అని అడుగుతాడు శ్రీధర్. ఇందాకే వచ్చాను అంటాడు కార్తీక్. వదిన కనిపించిందా కార్తీక్ అంటుంది కాంచన. లేదమ్మా అంటాడు కార్తీక్.
మా నాన్నకు ఇచ్చిన మాట ఎలాగైనా నిలబెట్టుకోవాలి అంటుంది కాంచన. అత్త కచ్చితంగా దొరుకుతుంది అంటాడు కార్తీక్. ఇక నువ్వు ఇంటికి బయల్దేరు మాస్టారు అని శ్రీధర్ తో అంటాడు కార్తీక్. నా ఇంట్లోకి నువ్వు ఎందుకు రావాలి.. అని ఇక్కడినుంచే వెళ్లిపోమంటున్నావా అని అంటాడు శ్రీధర్. లేదు ఉదయం ఎప్పుడో వచ్చావు. చెల్లి, పిన్ని కంగారు పడుతుంటారు. వాళ్లకు ఈ విషయం తెలియదు కదా.. నువ్వు వెళ్లు అని కూల్ గా చెప్తాడు కార్తీక్. అర్థం చేసుకున్న శ్రీధర్ ఇంటికి బయల్దేరుతాడు.
కాంచనకు సుమిత్రను చూపించిన దీప, కార్తీక్
నాన్నను అలా చూడటం నా వల్ల కావడంలేదురా.. పైకి బాధను చూపించడం లేదు కానీ అన్నయ్య పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది. వదిన ఎక్కడుందో.. ఏమైపోయిందో.. ఒక తొందరపాటు నిర్ణయం ఎంతమందిని ఏడిపిస్తుందో చూడు.. నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడటం మానేయాలి. నా కోడలు మీద కోపం ఉంటే తనతో మాట్లాడటం మానేయాలి. మన గురించి భార్యాభర్తలు గొడవపడటమేంటి? భర్తమీద కోపంతో బయటకు వెళ్లిపోవడం ఏంటి? అసలు వదినకు వెళ్లిపోయేంత ధైర్యం ఎలా వచ్చిందిరా? అని కార్తీక్ తో అంటుంది కాంచన.
మనసు విరిగిపోతే అలాగే ఉంటుంది అత్తయ్య అంటుంది దీప. అన్నయ్యకు, వదినకు మధ్య ఏం జరిగిందో నీకెలా తెలుసు దీప అంటుంది కాంచన. నాకు తెలుసు అత్తయ్య నేను సుమిత్ర అమ్మతో మాట్లాడాను అంటుంది దీప. వదిన కనిపించిందా? ఎక్కడుంది? ఎలా ఉంది? అని అడుగుతుంది కాంచన. చూపిస్తాను పదా అని సుమిత్ర ఉన్న గదిలోకి తీసుకెళ్తారు. సుమిత్రను చూసి బాధపడుతుంది కాంచన. జరిగిన విషయం అంతా చెబుతుంది దీప.
అత్తయ్య క్షేమంగా తిరిగి వస్తుంది
ఇంతలో కార్తీక్ కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. మమ్మీ కనిపించిందా బావ అని అడుగుతుంది. లేదు అంటాడు కార్తీక్. నా మాటలు తాత, మామయ్య వింటున్నారని నాకు తెలుసు. నేను ఒక్కటే చెప్తున్నాను. అత్తయ్యకు ఏమికాదు. తను క్షేమంగా తిరిగివస్తుంది. మంచి మనుషులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండమని చెబుతాడు కార్తీక్. బావ ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నాడు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ మాటలు విన్న శివన్నారాయణ, దశరథ కాస్త ధైర్యం తెచ్చుకుంటారు. కార్తీక్ అంత బలంగా చెబుతున్నాడంటే సుమిత్రకు ఏం కాదు దశరథ. తను క్షేమంగా తిరిగి వస్తుంది అని సంతోషంగా చెబుతాడు శివన్నారాయణ. పారిజాతం ఆ మందులు ఇలా ఇవ్వు. నా కోడలు తిరిగి వచ్చి నన్ను ఈ పరిస్థితిలో చూస్తే చాలా బాధపడుతుంది. తనని సంతోషంగా పలకరించడానికి నేను ఆరోగ్యంగా ఉండాలి కదా అని చెప్పి మందులు వేసుకుంటాడు శివన్నారాయణ.
జ్యోత్స్ననే ఏదో చేసుంటుంది
మరోవైపు సుమిత్ర కనపడటం లేదనే విషయాన్ని కాశీ వాళ్లతో చెప్తాడు శ్రీధర్. వదిన కనిపించకపోవడం ఏంటి? అని దాసు షాక్ అవుతాడు. భార్యా భర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈయన మాట తూలారు. ఆవిడ గడప దాటారు అని చెబుతాడు శ్రీధర్. ఈ గొడవలకు కారణం దీపే. తను చేసిన తప్పు ఒప్పుకొని ఉంటే అందరం కలిసిపోయేవాళ్లం. సంతోషంగా ఉండేవాళ్లం అంటాడు శ్రీధర్.
మనం పెద్దమ్మను వెతకాలి నాన్న.. వెళ్దాం పదా అంటాడు కాశీ. మేము కూడా వెతకడానికి వెళ్తాము అంటారు కావేరి, స్వప్న. మీరు ఎక్కడని వెతుకుతారు. నిన్నంతా వెతికాము కనిపించలేదు. మీరు ఎక్కడికి వెళ్లొద్దు. సుమిత్ర ఒకవేళ ఇంటికి కూడా రావొచ్చు. మీరు ఇంట్లోనే ఉండండి నేను వెతకడానికి వెళ్తాను అని చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్. అత్తయ్య ఇంట్లోనుంచి వెళ్లిపోవడం ఏంటి? మామయ్య అర్థం చేసుకోకుండా మాట్లాడటం ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉందో మమ్మీ అని బాధపడుతుంది స్వప్న. ఆ జ్యోత్స్ననే ఏదో ఒకటి చేసుంటుంది అని స్వప్న అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.