- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode: సుమిత్ర కోసం వెక్కివెక్కి ఏడ్చిన దశరథ.. మంచం పట్టిన శివన్నారాయణ
Karthika Deepam 2 Latest Episode: సుమిత్ర కోసం వెక్కివెక్కి ఏడ్చిన దశరథ.. మంచం పట్టిన శివన్నారాయణ
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 16వ తేదీ)లో సుమిత్ర కోసం వెక్కివెక్కి ఏడుస్తాడు దశరథ. స్ట్రోక్ వచ్చి పడిపోతాడు శివన్నారాయణ. నీ గురించి అందరికి తెలిసే రోజు దగ్గరపడింది అని దీపతో చెబుతాడు జ్యోతిష్య గురువు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో సుమిత్ర కనిపించడం లేదనే విషయాన్ని కాంచనతో చెప్తాడు శ్రీధర్. వదిన ఇంట్లో నుంచి బయటకు వెళ్లడమేంటి?ఎందుకు అని కాంచన బాధపడుతుంది. ఏదో చిన్న గొడవట అని చెప్పి తాను కూడా వెతకడానికి వెళ్తాడు శ్రీధర్. గొడవైతే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటి? వదినా అలా ఎలా చేస్తుందని ఏడుస్తుంటుంది కాంచన.
మరో పక్క కార్తీక్, దశరథ, దీప సుమిత్ర కోసం వెతుకుతుంటారు. కనిపించిన వారికల్లా ఫోటో చూపించి అడుగుతుంటారు. అత్తకు ఏం కాదు అని దశరథకు ధైర్యం చెబుతుంటాడు కార్తీక్. ఎవరినో చూసి సుమిత్ర అనుకొని అమ్మ అని పిలుస్తూ దగ్గరకు పరిగెడుతుంది దీప. సుమిత్ర కాదని తెలియడంతో సారీ చెప్పి ఏడుస్తూ వెనక్కి తిరుగుతుంది.
వెక్కి వెక్కి ఏడ్చిన దశరథ
సుమిత్ర కోసం వెక్కి వెక్కి ఏడుస్తాడు దశరథ. నీ గుండెలో భారం దిగేవరకు ఏడువు మామయ్య అంటాడు కార్తీక్. కానీ ఈ వాటర్ తో ముఖం కడుక్కో నీ కన్నీళ్లు నాకు కనిపించకుండా ఉంటాయి. నేను మిమ్మల్ని ఇలా చూడలేను అంటాడు. నా వల్లే సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. నాకు ఎందుకు ఇంత పట్టుదల. తను మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడవచ్చు కదా అని బాధపడుతాడు. కోపం, ఆవేశం మనుషుల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో చూశావా కార్తీక్ అంటాడు. అత్తకు ఏం కాదులే మామయ్య. ఏదో ఒక గుడిలో కూర్చొని ఉంటుంది అని ధైర్యం చెబుతాడు కార్తీక్.
స్ట్రోక్ తో పడిపోయిన శివన్నారాయణ
ఇంతలో కార్తీక్ కు ఫోన్ చేస్తుంది జ్యోత్న్స. మీరు త్వరగా ఇంటికి రండి అంటుంది. అత్త వచ్చిందా అని కార్తీక్ అడిగితే లేదు.. తాత కింద పడిపోయాడు. ఎన్నిసార్లు లేపినా లేవట్లేదు. నాకు భయంగా ఉంది బావ అని చెబుతుంది. ఎలా పడిపోయాడు? మీరు ఆ మాత్రం చూసుకోలేరా అని జ్యోతో కోపంగా మాట్లాడుతాడు కార్తీక్. డాక్టర్ కి ఫోన్ చేశావా లేదా అని అడుగుతాడు. లేదని జ్యోత్స్న చెప్పడంతో మేము డాక్టర్ ని తీసుకొని వస్తాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
శివన్నారాయణ ఇంటికి కాంచన, శ్రీధర్
కాంచన దగ్గరికి తిరిగి వస్తాడు శ్రీధర్. పదా మీ ఇంటికి వెళ్దాం అంటాడు. ఎందుకు? ఏమైంది? అని ఏడుస్తూనే అడుగుతుంది కాంచన. వదినకు ఏమైనా అయిందా? నిజం చెప్పండి అంటుంది. సుమిత్రకు ఏం కాలేదు. కానీ మీ నాన్నకే… అంటాడు శ్రీధర్. నాన్నకు ఏమైంది?ఎలా ఉన్నాడు అని కంగారు పడుతుంది కాంచన. ఏం కాలేదు మనం ముందు వెళ్దాం పదా అని తీసుకెళ్తాడు శ్రీధర్.
అంతా నావల్లే..
శివన్నారాయణను చెక్ చేస్తాడు డాక్టర్. తను ఏదో ఒత్తిడికి లోనవుతున్నాడు. స్ట్రెస్ ఎక్కువైతే మళ్లీ గుండెపోటు రావచ్చు. జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతాడు. ఆయన దేనికోసం ఆందోళన పడుతున్నాడో తెలుసుకొని దాన్ని పొగొట్టే ప్రయత్నం చేయండని మెడిసిన్ రాసిచ్చి వెళ్లిపోతాడు. నీ గుండె మీద పడుతున్న భారం ఏంటో నాకు తెలుసు నాన్న. ఇవన్నీ నా వల్లే అని బాధపడుతాడు దశరథ.
జ్యోత్న్స నిశ్చితార్థం ఆగిపోయిన దగ్గరినుంచి ఇంటికి దెయ్యం పట్టినట్లు ఎవరో ఒకరికి నష్టం జరుగుతూనే ఉంది అంటుంది పారు. గ్రానీ ఇంత బాధపడుతుందంటే.. డాడీ దగ్గర సింపతి కోసం ట్రై చేస్తోందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. దశరథను ఓదార్చి.. దీప ఏదని జ్యోను అడుగుతాడు కార్తీక్. మీరు వెళ్లాక తను కూడా వెళ్లిపోయిందని చెబుతుంది జ్యో. తల్లి కనిపించడం లేదని దీప ఎంత బాధపడుతుందో అనుకుంటాడు కార్తీక్ మనసులో.
దీపకు గురువు గారి దిశా నిర్దేశం
సుమిత్రను వెతుకుతూ వెళ్లి అమ్మవారి విగ్రహం దగ్గర ఆగుతుంది దీప. ఎందుకమ్మ ఇలా చేశావు. ఒక అమ్మను పురిట్లోనే దూరం చేశావు. ఇంకొక అమ్మను చిన్నప్పుడే దూరం చేశావు. ఆశలు చంపుకొని రాయిలా బతుకుతున్న నాకు సుమిత్ర, దశరథలే అమ్మనాన్నలు అని తెలియజేసి ఇప్పుడు ఎందుకు ఇలా దూరం చేస్తున్నావు అని ఏడుస్తూ అడుగుతుంది. ఇంతలో జ్యోతిష్య గురువు గారు(గతంలో శివన్నారాయణ ఇంట్లో దీప జాతకం చూసిన వ్యక్తి) దీపను చూసి అక్కడకు వస్తారు.
దీపను చూసి.. నిన్ను చూస్తేనే ఎలా ఉన్నావో తెలుస్తోంది అంటాడు గురువు. బాధపడకు నువ్వు వెతికే నీ రక్తపాశం కచ్చితంగా దొరుకుతుంది. సంతోషంగా వెళ్లు. కానీ జాగ్రత్త. ముందున్నవన్నీ చెడ్డ రోజులే. దిన దిన గండాలే. నీ యోగం మారబోతోంది. నువ్వు ఏదైతే ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటున్నావో.. అది అందరికీ తెలిసిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ అపురూపమైన దాన్ని కాపాడుకోవడం కోసం అమూల్యమైన దాన్ని పొగొట్టుకుంటావు. కంగారు పడకు. దైవం నీకు సాయంగా ఉంటుందని చెప్పి వెళ్లిపోతాడు. గురువుగారి మాటలు అర్థం కాకుండా ఉన్నాయి. కానీ అమ్మ దొరుకుతుందని చెప్పాడు కదా వెతుకుతాను అనుకుంటుంది దీప.
ఎవ్వరికోసం బాధపడాలి
శివన్నారాయణ దగ్గర కూర్చొని ఏడుస్తుంది కాంచన. నాన్నకు ఏం కాదమ్మ అంటాడు దశరథ. ఇంతకంటే ఏం జరగాలి అన్నయ్య. ఇంటిపెద్ద ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఇంటి కోడలు ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు ఎవ్వరికోసం బాధపడాలి.. ఎవ్వరికోసం ఏడవాలి అంటుంది కాంచన. నాన్న కళ్లు తెరిస్తే సుమిత్ర వచ్చిందా అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్పాలి అని బాధపడుతుంది. సంసారాన్ని నిలబెట్టాల్సిన నేనే అందరూ బాధపడేలా చేస్తున్నానని ఎమోషనల్ అవుతాడు దశరథ.
స్పృహలోకి శివన్నారాయణ
ఈ చిన్న చిన్న గొడవలు కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయ్యేవి. కానీ ఎవ్వరూ ఆ ప్రయత్నం చేయలేదు అంటాడు కార్తీక్. కొందరు మన కళ్ల ముందుంటే మనసు సరిగ్గా పనిచేయదు బావ అంటుంది జ్యోత్స్న. అందుకు జ్యోత్స్నపై మండిపడుతుంది కాంచన. సిగ్గులేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు. మీ అమ్మ నీ కళ్ల ముందే గేటు దాటిపోతుంటే ఏం చేశావు అంటుంది.
పారు మధ్యలో కలగజేసుకుంటే.. ముందు నిన్ను ఛీ అనాలి అంటుంది. కళ్లు కనపడక చేసిన తప్పే కానీ నేను కావాలని చేయలేదు అంటుంది పారు. ఈయన మీకు తండ్రి అయితే నాకు భర్త. నీ తండ్రిని ఇలా చూడటం మీకు ఎంత బాధో నా భర్తను ఇలా చూడటం నాకు అంతే బాధ అంటుంది. ఇంతలో శివన్నారాయణకు స్పృహ వస్తుంది. లేచి సుమిత్ర ఏదని అడుగుతాడు. మమ్మీ ఇంకా కనిపించలేదని జ్యోత్స్న చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.