- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode:సుమిత్రతో నువ్వు మా అమ్మవని చెప్పిన దీప- సుమిత్ర తల పగలకొట్టిన దొంగ
Karthika Deepam 2 Latest Episode:సుమిత్రతో నువ్వు మా అమ్మవని చెప్పిన దీప- సుమిత్ర తల పగలకొట్టిన దొంగ
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 17వ తేదీ)లో నిజం చెప్తే నేనేం చచ్చిపోనులే అంటాడు శివన్నారాయణ. నీకు నాకు ఏంటి సంబంధం అని దీపను అడుగుతుంది సుమిత్ర. నువ్వు మా అమ్మవి అంటుంది దీప. తలకు గాయమై కింద పడిపోతుంది సుమిత్ర. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో స్పృహలోకి వచ్చిన శివన్నారాయణ సుమిత్ర ఎక్కడా అని అడుగుతాడు. మమ్మీ ఇంకా కనిపించలేదని జ్యోత్న్స చెబుతుంది. వెంటనే కాంచన అందుకొని వదిన ఉంది నాన్న. ఎవ్వరికో కనిపించిందంట. కార్తీక్ వెళ్లి తీసుకొస్తాడు అని చెబుతుంది. నీకు మాట ఇస్తున్నాను నాన్న. నా కొడుకు, కోడలు కలిసి ఈ ఇంటికి పాత పరిస్థితులను తీసుకువస్తారు అని శివన్నారాయణకు ధైర్యం చెబుతుంది. దేవుడా మా వదిన ఎక్కడుందో ఎవ్వరికైనా కనిపించేలా చేయమని వేడుకుంటుంది కాంచన.
దొంగలను చితకబాదిన దీప
మరోవైపు ఒకచోట కూర్చొని దశరథ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది సుమిత్ర. అక్కడికి ఇద్దరు దొంగలు వచ్చి నీ మెడలో ఉన్న బంగారాన్ని నువ్వు తీసిస్తావా.. మమ్మల్ని తీసుకోమంటావా అని కత్తి చూపించి బెదిరిస్తారు. కుటుంబాన్నే వద్దనుకున్నాను. ఈ బంగారం నాకు మట్టితో సమానం అని తీసి ఇస్తుంది సుమిత్ర. అయితే తాళి కూడా తీసివ్వు అంటాడు దొంగ. నేను ఇవ్వను అంటుంది సుమిత్ర. లాగే ప్రయత్నం చేస్తుండగా కర్రతో ఎంట్రీ ఇస్తుంది దీప. వారిని చితకబాది.. బంగారం తీసి సుమిత్ర చేతిలో పెడుతుంది.
నిజం చెప్తే నేను చచ్చిపోనులే
నువ్వు ఉదయం నుంచి ఏమి తినలేదు. కొంచెం అన్నం తిను నాన్న అని పెట్టబోతుంది కాంచన. నాకొద్దు. సుమిత్రను తీసుకొస్తా అని వెళ్లిన కార్తీక్.. ఇంకా రాలేదు ఎందుకు అని అడుగుతాడు శివన్నారాయణ. నిజం చెప్పు సుమిత్ర కనిపించలేదు కదా.. నిజం చెప్తే నేనేం చచ్పిపోనులే అమ్మ అని కన్నీళ్లు పెట్టుకుంటాడు శివన్నారాయణ. ఇప్పుడు కనిపించలేదు. కానీ మొత్తానికే కనిపించకుండా ఉండదు కదా నాన్న. నా కొడుకు ఎలాగైనా వదినను తీసుకువస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కొంచెం తిను నాన్న అని తినిపిస్తుంది. నువ్వు ఎప్పుడు తిన్నావో నువ్వు కూడా తిను అన్నయ్య అని దశరథను పిలిచి తినిపిస్తుంది. దశరథ కాంచనను కూడా తినమంటాడు. అది చూసి ఎమోషనల్ అయిన పారు ఏడ్చుకుంటూ పక్కకు వెళ్తుంది.
నేను మారను గ్రానీ
పారు దగ్గరికి వెళ్లి.. సింపతి కోసం బాగానే ట్రై చేస్తున్నావు అన్నట్లు మాట్లాడుతుంది జ్యోత్స్న. నువ్వు ఇలా ఉన్నావేంటే.. ఆయన నా భర్త. ఆయనకు అలా అయితే నేనేలా సంతోషంగా ఉంటాను. నేను ఆయన మీద కోపంతో నా కొడుకు కూతురిని ఈ ఇంటికి వారసురాలిని చేయాలి అనుకున్నాను. కానీ ఏ రోజు ఆయన్ని చంపాలి అనుకోలేదు. అసలు నువ్వు మీ అమ్మ వెళ్లేటప్పుడు ఆపుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని జ్యోపై మండిపడుతుంది పారు. నీకు కొంచెం కూడా ఎమోషన్స్ లేవు. అందుకే నీకు బాధ లేదు అంటుంది పారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా నేను మారను గ్రానీ అంటుంది జ్యోత్స్న. దేవుడా సుమిత్ర క్షేమంగా తిరిగిరావాలి అని కోరుకుంటుంది పారు.
నీకు నాకు ఏంటి సంబంధం
మరోవైపు సుమిత్రతో ఇంటికి వెళ్దాం రండి అమ్మగారు అంటుంది దీప. నేను రాను వాళ్లు నన్ను వద్దనుకున్నారు. నేను ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాను. నేను ఇక ఆ ఇంటికి రాను అంటుంది సుమిత్ర. అందరూ నీకోసం చూస్తున్నారు అని చెబుతుంది దీప. కార్తీక్ నా మేనల్లుడు కాబట్టి నాకోసం వెతుకుతున్నాడు. దశరథ నా భర్త కాబట్టి నాకోసం చూస్తున్నాడు. నీకు నాకు ఏంటి సంబంధం అంటుంది సుమిత్ర. ఇంటికి రండి అమ్మగారు అంటుంది దీప. బలవంతంగా నన్ను తీసుకెళ్తే నేను చచ్చినంత ఒట్టే అంటుంది. ఎందుకు నాకోసం నువ్వు అంత బాధపడుతున్నావు? ఆరాటపడుతున్నావు? నీకు సంబంధం ఏంటని అడుగుతుంది సుమిత్ర. పదే పదే మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అంటుంది దీప.
నువ్వు మా అమ్మవి
సమాధానం చెప్పు దీప. నీకు నాకు సంబంధం ఏంటని మళ్లీ అడుగుతుంది సుమిత్ర. నువ్వు మా అమ్మవి అని దీప చెబుతుండగా.. ఇందాక పారిపోయిన దొంగ దీప తలపై కర్రతో కొట్టబోతాడు. అది చూసిన సుమిత్ర..దీపను పక్కకు లాగుతుంది. ఆ దెబ్బ సుమిత్రకు తగలడంతో.. అక్కడిక్కడే కుప్పకూలిపోతుంది. అమ్మ లే అమ్మ అని దీప ఏడుస్తుంటుంది.
మరోవైపు సుమిత్రను వెతకడానికి వెళ్లిన కార్తీక్.. ఆస్తికోసం ఈ మనుషులు ఎంతకైనా తెగిస్తారు అని జ్యోత్స్న, పారుల గురించి అనుకుంటూ ఉంటాడు. జ్యో మా అత్తకు సొంత కూతురు కాకపోవచ్చు. కానీ ప్రేమగానే పెంచింది కదా.. అలాంటి మనిషి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే చూస్తూ ఎలా ఉందని తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ కు ఫోన్ చేస్తుంది దీప. అర్జెంటుగా మన ఇంటికి రా అంటుంది. ఏమైందని అడిగినా చెప్పకుండా ఫోన్ కట్ చేస్తుంది.
సుమిత్రను చూసిన కార్తీక్
ఇంటికి వచ్చిన కార్తీక్.. ఏమైంది నీకు? అడిగినా సమాధానం చెప్పకుండా కట్ చేశావు. నిన్ను ఆ ఇంట్లోనే ఉండమన్నా కదా.. ఇక్కడికి ఎందుకు వచ్చావు.. అక్కడ తాత కిందపడిపోయాడు అని చెబుతాడు. తాతకు ఎలా ఉందని దీప కంగారుపడుతుంది. బాగానే ఉన్నాడని చెబుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శౌర్య అమ్మమ్మ అని ఏదో చెప్పబోతుంది. దానికి ఎందుకు చెప్పావు అంటూ.. ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా సుమిత్రవైపు చూస్తుంది శౌర్య. అటువైపే చూస్తాడు కార్తీక్. గదిలో పడుకొని ఉన్న సుమిత్ర దగ్గరకు అత్త అని పిలుచుకుంటూ వెళ్తాడు. దాంతో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.