- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode: దీపను బ్రతిమాలిన శ్రీధర్- స్వప్న, కాశీలను కలిపిన కార్తీక్
Karthika Deepam 2 Latest Episode: దీపను బ్రతిమాలిన శ్రీధర్- స్వప్న, కాశీలను కలిపిన కార్తీక్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 15వ తేదీ)లో కాంచన కోసం టిఫిన్స్ పంపిస్తాడు శ్రీధర్. కార్తీక్, స్వప్నలను ఒక్కటి చేస్తాడు కార్తీక్. దీపను రిక్వెస్ట్ చేస్తాడు శ్రీధర్. పారు, దీపలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో నాకు నచ్చిన జీవితంలోనైనా, నేను తినే భోజనంలో నైనా నీతో సగం పంచుకోవాల్సిందే కాంచన. నువ్వు రావని ఊహించే.. నీకోసం బాక్స్ పంపించాను. తిని ఎలా ఉందో చెప్పు అంటాడు శ్రీధర్. ఎమోషనల్ అవుతుంది కాంచన.
టిఫిన్స్ ప్లేటులో పెట్టుకొని తింటూ భార్యభర్తలిద్దరూ సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకొని బాధపడుతుంది. మీ బాధను మీరు పైకి చెప్పుకుంటున్నాను. నేను చెప్పుకోవట్లేదు. కొన్నింటిని వద్దని వదిలేసుకున్నాక.. తిరిగి వాటికోసం ఆశపడకూడదు అంటూ ఏడుస్తూ టిఫిన్ చేస్తుంది కాంచన.
కాశీ ఎక్కడున్నాడు?
కార్తీక్, దీపలతో శ్రీధర్ ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. మీరు వస్తే ఇంత సంతోషంగా ఉంటుందనుకుంటే వారానికి మూడు రోజులు ఇక్కడే టిఫిన్ చేయాలి అనే కండీషన్ పెట్టేవాడిని అంటాడు శ్రీధర్. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. అంతా మీ కోడలి ఇష్టం.
తనతో పాటు రావడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటాడు కార్తీక్. కాశీ ఎక్కడున్నాడని స్పప్నని అడుగుతాడు కార్తీక్. పైన గదిలో ఉన్నాడు పిలుస్తాను అన్నయ్య అంటుంది స్వప్న. వద్దు నేనే వెళ్తాను అంటూ లోపలికి వెళ్తాడు కార్తీక్.
దీపను రిక్వెస్ట్ చేసిన శ్రీధర్
దీపతో ఆప్యాయంగా మాట్లాడతాడు శ్రీధర్. మీ అత్తా కోడళ్ల బంధం బాగానే ఉంది కదా అంటాడు. చిన్న చిన్న మాటపట్టింపులు వచ్చినా.. అవి అప్పటివరకే మామయ్య గారు అంటుంది దీప. నువ్వు ఎప్పుడైనా మీ అత్త గదిలో నిద్రపోయావా దీప అంటాడు శ్రీధర్. లేదు మామయ్య అంటుంది దీప.
తనెప్పుడు ఏదో కోల్పోయినట్లే ఉంటుంది. దానికి కారణం నేనే అని నాకు తెలుసు. కానీ కాలంతో పాటు కాంచన మారుతుందని అనుకున్నాను. తను ఇంకా అక్కడే ఉంది అంటాడు శ్రీధర్. కాంచనకు యాక్సిడెంట్ అయినప్పుడు తను నన్ను ఓదార్చుతూ... మీ కాళ్లు ఉన్నప్పుడు నేను ఎందుకు అవిటిదాన్ని అవుతానని అంది.
ఇప్పుడు తనని వదిలేసి నేను అవిటిదాన్ని చేశానని ఎమోషనల్ అవుతాడు శ్రీధర్. మీ అత్తయ్యను, నన్ను కలుపుతానని నాకు మాటిస్తావా దీప? అని అడుగుతాడు. శ్రీధర్. నేను ప్రయత్నిస్తాను. కానీ మాటివ్వలేను అంటుంది దీప. మీరు ఇద్దరూ కలవాలంటే ఓ పని చేయాలి అంటుంది. చెప్పమంటాడు శ్రీధర్.
మీరు కొన్నాళ్లు అత్తయ్యతో మాట్లాడటం మానేయండి. కొన్ని రోజులు దూరంగా ఉండండి. ఆవిడ మనసులో మీపై ఎలాంటి అభిప్రాయం ఉందో బయటపడుతుంది అని చెప్తుంది దీప. సరే అంటాడు శ్రీధర్.
స్వప్న, కాశీలను కలిపిన కార్తీక్
కాశీ, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. నీకంటే నేను అన్నింట్లో తక్కువే బావ అంటాడు కాశీ. ఆ మాట ఎవరన్నారు అంటాడు కార్తీక్. తన జాబ్ గురించి తక్కువ చేసుకొని చెప్తాడు కాశీ. చేసే పనిని ఇష్టపడి చేయాలి కానీ తక్కువ చేసి కాదు కాశీ. మనం ఇప్పుడు చేసే పని భవిష్యత్తులో ఉపయోగపడాలి. ప్రాక్టికల్ గా ఆలోచించు. బిజినెస్ ఎలా జరుగుతుందో చూసి నేర్చుకో అని చెప్తాడు కార్తీక్. ఇంతలో స్వప్న వస్తుంది. అలా చెప్పు అన్నయ్య అంటుంది స్వప్న. చెల్లెకు కూడా చిన్నగా వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని కలుపుతాడు కార్తీక్.
అల్లుడు గారు చాలా బిజీ
కిందికి వచ్చి దీపను పలకరిస్తాడు కాశీ. ఇప్పుడా కిందకు వచ్చేది అంటుంది దీప. కాశీ రెస్టారెంట్ పనిలో కొంచెం బిజీగా ఉన్నాడని చెప్తాడు కార్తీక్. అవును అల్లుడు గారు చాలా బిజీ అంటాడు శ్రీధర్. శివన్నారాయణ ఇంటికి దీపను కారులో తీసుకెళ్లమని కాశీతో చెప్తాడు శ్రీధర్. కార్తీక్ నేను కలిసి స్కూటీపై వస్తామని అంటాడు. అంతా బై చెప్పి బయల్దేరుతారు.
షాక్ అయిన పారు, జ్యో
మరోవైపు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు పారు, జ్యో. మీ అమ్మ నిజంగానే చనిపోయింది అనుకున్నావు కదా అంటుంది పారు. మనం ఎన్నో అనుకుంటాం కానీ చావు అంత ఈజీగా రాదు గ్రానీ అంటుంది జ్యోత్స్న. రాసిపెట్టుంటే ఏదైనా జరుగుతుంది. ఎక్కడో పడేసిన దీప తల్లిదండ్రుల దగ్గరికి రావడం ఏంటి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో కాశీ కార్లో వచ్చి.. దీప దిగడానికి డోర్ తీస్తాడు. ఎవరో వీఐపీ వచ్చినట్లు ఉన్నారు అని పారు, జ్యోత్స్న అనుకుంటారు. కారులో నుంచి దీప దిగడంతో షాక్ అవుతారు.
జ్యోను కుక్కతో పోల్చిన దీప
ఒక్క సలహా ఇచ్చి మీ మామయ్యను బాగానే పడేశావు అన్నట్లుగా దీపతో మాట్లాడుతుంది పారు. పని మనుషులకు కూడా డ్రైవర్లు ఉంటారని ఇప్పుడే తెలిసింది అంటుంది పారు. మా అక్కను పని మనిషి అంటావేంటీ పేరు పెట్టి పిలవలేవా అంటాడు కాశీ.
నీకు అక్క కావచ్చు. మాకు పని మనిషే అంటుంది పారు. అయినా రోజూ నీ భర్త, నువ్వు కలిసివస్తారు కదా.. ఈరోజు వీడు వచ్చాడేంటి అంటుంది పారు. మేం మా అత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్లాము అని చెప్తుంది దీప.
ఏ అత్తయ్య చిన్నత్త, పెద్దత్త అని వెటకారంగా అడుగుతుంది జ్యోత్స్న. కోపంగా చూస్తుంది దీప. కోపం వస్తోందా దీప అంటుంది జ్యో. వస్తోంది కానీ.. మా బావ ఓ మాట చెప్పాడు అందుకే ఏం అనకుండా ఆగిపోయాను అంటుంది దీప.
ఏం చెప్పాడో అంటుంది పారు. అడ్డమైన వాళ్లు అడ్డదిడ్డంగా మాట్లాడుతూనే ఉంటారు. మనం చెవిటి వాళ్లలా ముందుకు వెళ్లిపోవాలి అని చెప్పాడు అంటుంది దీప. నేను అరిచేవాళ్ల మీద అరుస్తాను కానీ.. మొరిగేవాళ్ల మీద కాదు అని లోపలికి వెళ్లిపోతుంది దీప. అది నిన్ను ఏం అందో తెలుసా అని జ్యోను అడుగుతుంది పారు. నాకు తెలుసు నువ్వు ఆపు అంటుంది జ్యోత్స్న.
సంతోషంలో శ్రీధర్, కార్తీక్
మరోవైపు కార్తీక్ స్కూటీపై వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు శ్రీధర్. ఏంటి మాస్టారు అంత సంతోషంగా ఉన్నారు అంటాడు కార్తీక్. కొడుకు బండి నడుపుతుంటే వెనకాల కూర్చోవడం ఎంత సంతోషంగా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుందిరా అంటాడు శ్రీధర్.
తండ్రిని బండిపై ఎక్కించుకోవడం కూడా కొడుకుకు అంతే సంతోషాన్ని ఇస్తుంది అంటాడు కార్తీక్. ఇద్దరూ ఒక టీ కొట్టు దగ్గర ఆగుతారు. ఫుడ్ ట్రక్స్ దగ్గరికి జనాలు ఎలా వస్తున్నారనే వీడియోను కార్తీక్ కు చూపిస్తాడు శ్రీధర్. సూపర్ మాస్టారు. మన ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయిందని కార్తీక్ సంతోషిస్తాడు. ఎక్కువ చక్కెర వేసి రెండు టీలు ఇవ్వు. నోరు తీపి చేయాలి అని టీ కొట్టు అతనితో చెప్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

