MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:కార్తీక్‍కి ముద్దు పెట్టబోయిన జ్యో-చెంపపై కొట్టిన దీప-షాకిచ్చిన జ్యో

Karthika Deepam 2 Today Episode:కార్తీక్‍కి ముద్దు పెట్టబోయిన జ్యో-చెంపపై కొట్టిన దీప-షాకిచ్చిన జ్యో

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 13వ తేదీ)లో కార్తీక్ మీద చిరాకు పడ్డ కాంచన. జ్యోకు షాక్ ఇచ్చిన దీప. కార్తీక్ కి ముద్దు పెట్టబోయిన జ్యో. చెంప పగలగట్టిన దీప. నువ్వే సుమిత్ర కూతురువని నాకు తెలుసన్న జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Apr 13 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో పెళ్లి రోజు అయినా ఇంట్లో ఉండమంటే ఉండకుండా వెళ్లిపోయారు. ఆశీర్వాదం తీసుకొని వస్తామని చెప్పి దీప వచ్చింది, కార్తీక్ రాలేదు. ఇంత ఆలస్యమవుతున్నా ఎందుకు రాలేదో అని ఆలోచిస్తూ ఉంటుంది కాంచన. దీపను పిలుస్తుంది.. దీప ఇంట్లో ఉండదు. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లిందని కంగారు పడుతుంది కాంచన.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
జ్యో షాక్
Image Credit : Jiohotstar

జ్యో షాక్

మరోవైపు కార్తీక్, జ్యోత్స్నపై చిరాకు పడుతుంటాడు. తిరిగి రావడానికి చీకటి అయ్యేంత దూరం తీసుకెళ్లావు అంటాడు. దానికి దీప నీకోసం వెయిట్ వెయిట్ చేసి ఇంకా రాలేదు అని గుమ్మం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కదా బావ అంటుంది జ్యోత్స్న. అప్పుడే కారు స్టాప్ చేస్తాడు కార్తీక్. 

ఏమైంది ఎందుకు ఆపావు అని అడిగితే ఎదురుగా చూడు అంటాడు కార్తీక్. స్కూటీపై వచ్చి కారుకు అడ్డంగా ఉంటుంది దీప. షాక్ అవుతుంది జ్యోత్స్న. కారు దిగి కిందకు వచ్చి.. లేటు అయిందని నువ్వే వచ్చావా బంగారం నేనంటే ఎంత ప్రేమరా నీకు అంటాడు కార్తీక్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: తాళి కడతావా, గన్‌తో కాల్చుకోమంటావా? కార్తీక్‌కి జ్యో బెదిరింపు
Related image2
Karthika Deepam 2 Today Episode: దీప కోపం- కార్తీక్‍కి బిగ్ షాక్- తాళి చేతిలో పెట్టి కట్టమన్న జ్యో
38
జ్యో చెంప చెల్లుమనిపించిన దీప
Image Credit : Jiohotstar

జ్యో చెంప చెల్లుమనిపించిన దీప

అంత ప్రేమగా వచ్చింది కాబట్టి దీపకు పెళ్లిరోజు సర్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అంటుంది జ్యోత్స్న. ఆ ఇచ్చేదేది ఏదో త్వరగా ఇచ్చేస్తే మేము వెళ్లిపోతాం అంటాడు కార్తీక్. జ్యోత్స్న దగ్గరకు వచ్చి కార్తీక్ కి ముద్దు పెట్టబోతుంది. దీప చూసి జ్యోత్స్న చెంప పగలకొడుతుంది.

48
దీప వార్నింగ్
Image Credit : Jiohotstar

దీప వార్నింగ్

ఆ తర్వాత చూడు దీప పెద్ద మేడం చెంప ఎలా వాచిపోయిందో అంటాడు కార్తీక్. రోడ్డు ఇంటి పంచాయతీ పెట్టడం ఇష్టం లేక ఆఫీసుకు తీసుకొచ్చాను. ఒక భార్య ముందు పరాయి అమ్మాయి భర్తకు ముద్దు పెడితే ఎలా ఉంటుందో తను నాకు చూపించాలి అనుకుంది. ఒక భార్య రియాక్షన్ నేను తనకు చూపించాను అంటుంది దీప. ఇక మీదట ఇలాంటివి మానేస్తే మంచిదని వార్నింగ్ ఇస్తుంది దీప.

58
దీప షాక్
Image Credit : Jiohotstar

దీప షాక్

మానకపోతే ఏం చేస్తావ్ అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. నీకు ఏం తక్కువ జ్యోత్స్న. ఆ దేవుడు నీకు అమితంగా ప్రేమించే అమ్మానాన్నలను ఇచ్చాడు. మూడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని ఇచ్చాడు. అవన్నీ వదిలేసి అందనీ దాని కోసం ఎందుకు నీ ఆరాటం అని అంటుంది దీప. నేను కోరుకున్న జీవితం నాకు దక్కి తీరుతుంది. నిన్ను అడ్డు తప్పించి అయినా సరే నేను నా జీవితాన్ని దక్కించుకుంటాను అంటుంది జ్యోత్స్న. అది నీ వల్ల కాదు అంటుంది దీప. అది నా వల్లే అవుతుందే సుమిత్ర కన్న కూతురా అని దీపకు షాక్ ఇస్తుంది జ్యోత్స్న.

68
నాకు అన్నీ తెలుసు
Image Credit : Jiohotstar

నాకు అన్నీ తెలుసు

ఏంటీ షాక్ అయ్యావా? ఈ నిజం నాకు తెలియదు అనుకున్నావా? నీ కన్నతల్లిని కాపాడడానికి నువ్వు, బావ, మా నాన్న దాసు ఆడిన డ్రామాలన్నీ నాకు తెలుసే. డీఎన్ఏ టెస్ట్ చేయించి మరీ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఈ విషయం నీ భర్తకు మా ఇంట్లో పార్టీ పెట్టిన రోజే తెలుసు. భార్య మీద అతి ప్రేమతో ఆ విషయాన్ని నీ దగ్గర దాచాడు ఈ పెద్దమనిషి అంటుంది జ్యోత్స్న.

ఇప్పుడు చెప్పు బంగారం లాంటి కుటుంబం ఉంది ఎవరికి? రోడ్లు పట్టుకొని తిరిగే తండ్రి, భార్య దగ్గర డ్రైవర్ గా చేసే తమ్ముడు. మతిలేని నానమ్మ. ఇది నా చెత్త ఫ్యామిలీ అంటుంది జ్యోత్స్న. అన్నీ తెలుసుకున్నావు కదా.. మన డ్రామాలు ఇక్కడితో ఆపేద్దాం. నువ్వు ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకొని దూరంగా వెళ్లిపో అంటుంది దీప. అప్పుడు నువ్వు, నీ పిల్లలు, భర్త సంతోషంగా ఆస్తిని అనుభవిస్తారా అంటుంది జ్యోత్స్న.

78
జ్యో ఎమోషనల్ డ్రామా
Image Credit : Jiohotstar

జ్యో ఎమోషనల్ డ్రామా

నా మెడలో పడాల్సిన తాళి, నీ మెడలో కట్టించుకొని నాకు అన్యాయం చేశావు. నా జీవితం నాశనం చేశావు అంటుంది జ్యోత్స్న. నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటాడు కార్తీక్. అది ఎప్పుడు చెప్పాలి.. దీపతో పెళ్లి జరిగాక చెప్తున్నావా అంటుంది జ్యోత్స్న. నువ్వు చేసిన తప్పులన్నీ వేరేవాళ్లు చెప్తేనే చేశావా అని అడుగుతుంది దీప. సగం తప్పులు బావను దక్కించుకోవడానికి చేశాను. సగం తప్పులు నా పుట్టుక గురించి బయటపడొద్దని చేశాను అంటుంది జ్యోత్స్న.

నేను కావాలని మన స్థానాలను మార్చానా.. అప్పుడు నువ్వెంత అమాయకంగా ఉన్నావో నేను అలాగే ఉన్నాను. మా నానమ్మ చేసిన పనికి నువ్వు ఎలా మీ అమ్మకు దూరమయ్యావో నేను అలాగే మా అమ్మకు దూరమయ్యాను. మనకు తెలియకుండానే మన తలరాతలు మారిపోయాయి. నీకు నీ తల్లి మీద ప్రేమ ఉన్నట్లు, నాకు నా కన్నతల్లి మీద ప్రేమ ఉండదా అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది జ్యోత్స్న.

88
నన్ను పెళ్లి చేసుకో
Image Credit : Jiohotstar

నన్ను పెళ్లి చేసుకో

నా చిన్నప్పుడు బావను చూపించి వాడే నీ మొగుడు అన్నారు. నేను అప్పటి నుంచి బావే నా ప్రపంచంగా పెరిగాను. మధ్యలో నువ్వు వచ్చావు. బావ దూరమయ్యాడు. ఇప్పుడు కుటుంబం కూడా నీదే. అసలైన వారసురాలివి నువ్వే అని తెలిసిన రోజు నేను బయటకు వెళ్లిపోవాల్సిందే కదా అంటుంది జ్యోత్స్న. నేను నీకో మంచి జీవితాన్ని ఇస్తాను అంటాడు కార్తీక్.

అయితే నన్ను పెళ్లి చేసుకో అంటుంది జ్యోత్స్న. కోపంగా జ్యోత్స్న అని అరుస్తుంది దీప. నాకు కావాల్సిన జీవితాన్ని నేను కచ్చితంగా దక్కించుకుంటాను. ఇప్పుడు నీ రోజులు నడుస్తున్నాయని కాళ్ల బేరానికి వస్తాను అనుకుంటున్నావా... నేను జ్యోత్స్నని. ఎలా బ్రతికానో అలాగే చస్తాను. బావను, నేను కోరుకున్న జీవితాన్ని దక్కించుకుంటాను అంటుంది జ్యోత్స్న. కోపంగా చూస్తారు దీప, కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్..? ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Recommended image2
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
Recommended image3
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: తాళి కడతావా, గన్‌తో కాల్చుకోమంటావా? కార్తీక్‌కి జ్యో బెదిరింపు
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీప కోపం- కార్తీక్‍కి బిగ్ షాక్- తాళి చేతిలో పెట్టి కట్టమన్న జ్యో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved