MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • TV
  • BB 7 Title Winner: ఆ దేవుడికి మొక్కితే పుట్టిన ప్రశాంత్... అమ్మాయి పేరు ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా?

BB 7 Title Winner: ఆ దేవుడికి మొక్కితే పుట్టిన ప్రశాంత్... అమ్మాయి పేరు ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 7 ముగిసింది. టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఒక సామాన్యుడు టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. పల్లవి ప్రశాంత్ గురించి ఆసక్తికర విషయాలు చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 18 2023, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్లు. బిగ్ బాస్ షోకి వెళితే చాలు అనుకున్న పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇది అద్భుతమైన విజయం. ఊహించని పరిణామం. తన ఆటతో పల్లవి ప్రశాంత్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పల్లవి ప్రశాంత్ పై ఎలాంటి అంచనాలు లేవు. అతడు రెండు మూడు వారాలు హౌస్లో ఉంటమే ఎక్కువ అనుకున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. పల్లవి ప్రశాంత్ టాస్క్ లలో విజృభించేవాడు. అతడితో పోటీ పడాలంటే ప్రత్యర్ధులు భయపడేవారు. ప్రశాంత్ పవర్ అస్త్ర గెలిచాడు, బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్ అయ్యాడు. అవిక్షన్ పాస్ కూడా గెలిచాడు. 

 

38

ఎన్ని విజయాలు సాధించినా పల్లవి ప్రశాంత్ అణగిమణిగి ఉండేవాడు. నామినేషన్స్ తో తప్పితే తోటి కంటెస్టెంట్స్ పట్ల అగ్రెసివ్ గా ప్రవర్తించేవాడు కాదు. అందరికీ చాలా గౌరవం ఇచ్చేవాడు. సింపథీ గేమ్ ఆడుతున్నాడని విమర్శలు చేసినా భరించాడు. చివరికి తాను అనుకున్నది సాధించాడు. 

48
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

పల్లవి ప్రశాంత్ సక్సెస్ జర్నీ చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టి చూపించాడు. కాగా పల్లవి ప్రశాంత్ గురించి కొని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ప్రశాంత్ పేరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పల్లవి ప్రశాంత్ ఏమిటీ? అమ్మాయి పేరు ఎందుకు పెట్టుకున్నాడు? అని సందేహాలు వస్తాయి. 

58

పల్లవి ప్రశాంత్ అసలు పేరు పల్లవి రాజు. వాళ్ళ ప్రాంతంలో పల్లవి రాజు అనే దేవుడి గుడి ఉంది. అబ్బాయి పుట్టాలని అక్కడ పేరెంట్స్ మొక్కుకున్నారట. కోరుకున్నట్లు అబ్బాయి పుట్టడంతో పల్లవి రాజు అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరును పల్లవి ప్రశాంత్ గా రైతుబిడ్డ మార్చుకున్నాడు. 

 

68

చాలా మంది సోషల్ మీడియా సెలెబ్స్ ని చూసి స్ఫూర్తి పొందిన పల్లవి ప్రశాంత్ తాను కూడా ఫేమస్ కావాలి అనుకున్నాడు. తండ్రి వద్ద డబ్బులు తీసుకుని స్మార్ట్ ఫోన్ కొన్నాడు. అందులో రైతుబిడ్డ ట్యాగ్ తో వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. రైతుల జీవన విధానం, కష్టనష్టాలు, వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. 

78


మెల్లగా పల్లవి ప్రశాంత్ వీడియోలకు ఆదరణ పెరిగింది. అతన్ని వేలల్లో, ఆపై లక్షల్లో ఫాలో అవడం మొదలైంది. అదే సమయంలో బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తాను బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఈ వీడియో హోస్ట్ నాగార్జున వరకు చేరాలని ఒక పోస్ట్ పెట్టాడు. అది వైరల్ అయ్యింది. 

 

88
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఎట్టకేలకు పల్లవి ప్రశాంత్ కోరిక నెరవేరింది. బిగ్ బాస్ సీజన్ 7లో అతడికి అవకాశం వచ్చింది. తనని తాను నిరూపించుకున్న పల్లవి ప్రశాంత్ అన్ని అవరోధాలను ఎదుర్కొని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అమర్-ప్రశాంత్ టైటిల్ రేసులో నిలవగా పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచినట్లు నాగార్జున ప్రకటించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved