బయటపడుతున్న శివాజీ అసలు రంగులు, రైతు బిడ్డ పరువు తీసేలా కామెంట్స్!
పల్లవి ప్రశాంత్ కష్టపడి టైటిల్ గెలిచాడు. అయితే అతని పరువు తీశాడు శివాజీ. బిగ్ బాస్ టైటిల్ లాటరీ అని శివాజీ చెప్పడంతో విన్నర్ ని అవమానించినట్లు అయింది.
Pallavi Prashanth
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ నడిచింది. ప్రధానంగా శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ పేర్లు వినిపించాయి. అనుకున్నట్లే ఈ ముగ్గురు టాప్ 3లో నిలిచారు.
Pallavi Prashanth
పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. మూడో స్థానంలో శివాజీ నిలిచాడు. మొదటి నుండి శివాజీ టైటిల్ విన్నర్ గా ప్రచారం అయ్యాడు. చివరి ఎపిసోడ్స్ లో పల్లవి ప్రశాంత్ పుంజుకోగా, శివాజీపై నెగిటివిటీ పెరిగింది.
హౌస్లో పల్లవి ప్రశాంత్ శివాజీ శిష్యుడిగా మెలిగాడు. ఒక సామాన్యుడు టైటిల్ గెలవడం సంతోషంగా ఉందని శివాజీ అన్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం శివాజీ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. శివాజీ బిగ్ బాస్ టైటిల్ ఒక లాటరీ మాత్రమే అన్నాడు.
శివాజీ మాట్లాడుతూ... నేను టాప్ 3 లో ఎలిమినేట్ అయ్యాను. అది నా చిన్న కుమారుడు రిక్కీ జీర్ణించుకోలేకపోయారు. వేదిక మీదే ఏడ్చేశాడు. అయితే అక్కడే ఆ బాధ వదిలేశాడు. నార్మల్ అయిపోయాడు.
Pallavi Prashanth
నా దృష్టిలో బిగ్ బాస్ టైటిల్ ఒక లాటరీ. ఫైనల్ కి వెళ్లిన ఆరుగురు విజేతలే అని భావిస్తున్నాను. ప్రజలు పల్లవి ప్రశాంత్ ని గెలిపించాలి అనుకున్నారు. అందుకే విన్నర్ అయ్యాడని, శివాజీ అన్నాడు. ఇంత కష్టపడి పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిస్తే... దాన్ని జస్ట్ లాటరీగా అభివర్ణించి పరోక్షంగా అవమానించాడు శివాజీ.
కేవలం అదృష్టం వలనే పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడని శివాజీ చెప్పినట్లు అయ్యింది. శివాజీ చెప్పిన దాంట్లో కొంత నిజం లేకపోలేదు. నామినేషన్స్ అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేస్తారు. ఒక్కోసారి టాప్ కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ కావాల్సి వస్తుంది.
shivaji
కాగా నటుడిగా శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. నైంటీస్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశాడు. ఇకపై నటుడిగా కొనసాగుతాను అంటున్నాడు. హీరోగానే కాదు విలన్ రోల్స్ చేయడానికి సిద్ధం అంటున్నాడు.