MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • రెమ్యునరేషన్ మేటర్ లీక్ చేసిన శివాజీ... బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కంటే ఎక్కువ ఇచ్చారంటూ!

రెమ్యునరేషన్ మేటర్ లీక్ చేసిన శివాజీ... బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కంటే ఎక్కువ ఇచ్చారంటూ!

బిగ్ బాస్ శివాజీ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా తన రెమ్యునరేషన్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువని చెప్పిన శివాజీ అసలు మేటర్ లీక్ చేశాడు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 02 2024, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
shivaji

shivaji

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కామనర్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. శివాజీ  సెకండ్ రన్నర్ గా ఉన్నాడు. ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రియాంక జైన్ 5వ స్థానం, అర్జున్ ఆరవ స్థానంలో నిలిచారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Shivaji

Shivaji

కాగా శివాజీ టైటిల్ విన్నర్ అంటూ మొదటి నుండి ప్రచారం జరిగింది. అయితే చివరి వారాల్లో శివాజీ ఇమేజ్ ని దెబ్బ తీసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమర్ దీప్ కెప్టెన్సీ విషయంలో శివాజీ ప్రవర్తించిన తీరు విమర్శలపాలైంది. 
 

37

అలాగే తనతో వాగ్వాదానికి దిగిన శోభా శెట్టిని శివాజీ పీక మీద కాలేసి తొక్కుతా అన్నాడు. ఇవ్వన్నీ వెరసి శివాజీకి ఓట్లు పడకుండా చేశాయి. దానికి తోడు పల్లవి ప్రశాంత్ తన గేమ్ తో విపరీతమైన ఫాలోయింగ్ రాబట్టాడు. ఇక వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న శివాజీ పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాడు.

47

తాజాగా ఆయన పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడారు. ఒక కామనర్ టైటిల్ గెలవడం సంతోషం కలిగింది అన్నాడు. పల్లవి ప్రశాంత్ చాలా మంచోడు. అమాయకుడు కూడాను. అతని సోషల్ మీడియా అకౌంట్స్ కి, యూట్యూబ్ ఛానల్ కి లక్షల మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తన అకౌంట్స్ ని మానిటైజ్ చేయించుకుంటే డబ్బులు వస్తాయని కూడా తెలియదు.. 
 

57
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

అలా నెలకు రూ. 10 లక్షల వరకు కోల్పోయాడు. తర్వాత నేను అతని అకౌంట్స్ మానిటైజ్ చేయించాను, అన్నాడు. అలాగే శివాజీ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ కంటే నాకే ఎక్కువ డబ్బులు వచ్చాయి, అన్నాడు. విన్నర్ ప్రైమ్ మనీ కంటే తన రెమ్యూనరేషన్ ఎక్కువని శివాజీ చెప్పకనే చెప్పాడు.

67

శివాజీ అత్యధికంగా వారానికి రూ. 4 లక్షల ఒప్పందంపై హౌసులో అడుగుపెట్టాడట. ఆ లెక్కన 15 వారాలకు రూ. 60 లక్షలు రూపాయలు తీసుకున్నాడు. పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే... రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ, రెండు బహుమతులు వచ్చాయి. పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ వారానికి లక్ష కంటే తక్కువేనట. 
 

77

ప్రైజ్ మనీలో పెద్ద మొత్తంలో టాక్సుల రూపంలో కట్ అవుతుంది. ఏ విధంగా చూసినా శివాజీ చెప్పినమాట వాస్తవమే. ఫిగర్ ఖచ్చితంగా చెప్పుకున్నప్పటికీ... విన్నర్ కంటే తనకే ఎక్కువ డబ్బులు వచ్చాయని శివాజీ ఓపెన్ అయ్యాడు. దీంతో ప్రచారం అయినట్లే... శివాజీ రెమ్యూనరేషన్ వారానికి రూ. 4 లక్షలు అని తెలుస్తుంది..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: యాంకర్‌ రష్మి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే, వామ్మో పెద్దదే.. తాను మాత్రమే దారి తప్పిందట
Recommended image2
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Recommended image3
OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved