MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Guppedantha Manasu 5th February Episode:గుర్తుపట్టని స్థితిలో డెడ్ బాడీ.. రిషి క్యారెక్టర్ క్లోజ్ చేశారా..?

Guppedantha Manasu 5th February Episode:గుర్తుపట్టని స్థితిలో డెడ్ బాడీ.. రిషి క్యారెక్టర్ క్లోజ్ చేశారా..?

ఇప్పుడే కాదని.. ప్రస్తుతం అయితే.. భద్ర తప్పించుకున్నాడనే సంతోషకరమైన వార్తను ఆనందిద్దాం.. అని తల్లిని తీసుకొని వెళతాడు.

4 Min read
Author : ramya Sridhar
| Updated : Feb 05 2024, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Guppedantha Manasu

Guppedantha Manasu


GuppedanthaManasu 5th February Episode:గుప్పెడంత మనసు సీరియల్ కి రిషినే ఆయువుపట్టు. కానీ... చాలా కాలంగా రిషి అనే క్యారెక్టర్ అసలు కనిపించడం లేదు. కిడ్నాప్ అయ్యాడని కొన్నాళ్లు.. దెబ్బలు తగిలాయమని మరి కొంత కాలం క్యారెక్టర్ ని హైడ్ చేశారు. ఈ సారి ఏకంగా ఆ క్యారెక్టర్ ని చంపేసేందుకు ప్లాన్ చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రోజు ఎపిసోడ్ లో అలాంటి సంకేతాలే ఇచ్చారు. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Guppedantha Manasu

Guppedantha Manasu

భద్ర తప్పించుకున్నాడనే వార్త.. శైలేంద్ర చెవిన పడుతుంది. అయితే.. ఈ విషయం తెలియని దేవయాణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ భద్ర గాడు నోరు తెరిస్తే.. మనం చేసిన దుర్మార్గాలన్నీ బయటకు వచ్చేస్తాయని.. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని కంగారుపడుతూ ఉంటుంది. కానీ.. శైలేంద్ర వచ్చి.. టెన్షన్ పడకు మమ్మీ.. ఆ భద్ర  నోరు విప్పడు అని అంటాడు. ఎందుకు..వాడిని చంపేశావా అని దేవయాణి సంబరంగా అడిగితే... కాదు.. ముకుల్ నుంచి తప్పించాను అని చెబుతాడు. అది విని.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది.

313
Guppedantha Manasu

Guppedantha Manasu


సరే.. భద్ర అంటే తప్పించుకున్నాడు.. కానీ ఆ వసుధారను ఏం చేస్తావ్.. ఎంత కాలం అని ఎండీ సీటు కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఆ వసుధార ప్రతి విషక్ష్ంలో మనకు అడ్డుగా ఉంది కదా అని దేవయాణి అడుగుతుంది. ఆ వసుధార గుండె పగిలిపోయే ప్లాన్ ఒకటి వేశాను మామ్ అంటాడు. ఏంటో చెప్పమని దేవయాణి అంటే.. ఇప్పుడే కాదని.. ప్రస్తుతం అయితే.. భద్ర తప్పించుకున్నాడనే సంతోషకరమైన వార్తను ఆనందిద్దాం.. అని తల్లిని తీసుకొని వెళతాడు.

413
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇదంతా దూరం నుంచి ధరణి వింటుంది. భద్ర దొరికాడని సంబరపడేలోగా ఇలా జరిగిందేంటి అని అనుకుంటుంది. భద్ర దొరికితే.. వీళ్ల పాపలన్నీ బయటపడతాయని అనుకున్నాను.. కానీ వెంటనే తప్పించుకున్నాడు అని అనుకుంటుంది. అయినా ఆ దేవుడు ఉన్నాడని.. ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నా.. ఏదో ఒక రోజు మీ పాపాలకు తగిన శిక్షలు పడటం ఖాయం అని శాపాలు పెడుతుంది.

513
Guppedantha Manasu

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. భద్ర తప్పించుకున్నాడనే విషయం తెలిసి మహేంద్ర, వసుధార, అనుపమలు షాకౌతారు. ఎలా తప్పించుకున్నాడు అని అనుపమ అడిగితే... కానిస్టేబుల్ ని కాపలా కూడా పెట్టానని..కానీ ఎలా తప్పించుకున్నాడో అర్థం కావడం లేదు అని ముకుల్ చెబుతాడు. భద్ర దొరికాడని.. రిషి గురించి సమాచారం తెలుస్తుందని మేమంతా ఆనందపడుతుంటే.. ఇలా జరిగిందేంటి అని అనుపమ అంటుంది.

613
Guppedantha Manasu

Guppedantha Manasu

ఈ లోగా.. ముకుల్.. ఇంతకన్నా మరో ముఖ్యమైన విషయం ఉందని చెబుతాడు. ఎంటది అని వీళ్లు అడిగితే..హాస్పిటల్ లో ఓ బాడీని గుర్తుపట్టాలి అని అంటాడు. ఆ మాట విని.. వసుధార, మహేంద్రలు షాకౌతాడు. డెడీ బాడీ ఏంటి..? గుర్తుపట్టడం ఏంటి..? అంతకముందు కూడా ఒకసారి ఇలానే చేశారు అని వసుధార ఆవేశపడుతుంది. మహేంద్ర కూడా.. తన కొడుకు రిషికి ఏమీ కాదు అని.. అది ఇంకెవరిదో అని అంటాడు. వసుధార కూడా.. తనకు రిషి సర్ అంటే ప్రాణం అని..  తన గుండె ఇంకా కొట్టుకుంటోంది అంటే.. రిషి సర్ క్షేమంగా ఉన్నారనే అర్థం అని ఏడుస్తుంది. 

713
Guppedantha Manasu

Guppedantha Manasu

చక్రపాణి కూడా ముకుల్ ని ప్రాధేయపడతాడు. తన అల్లుడు బంగారం అని చెబుతాడు. రాక్షసుడిలాంటి తనను మార్చింది.. తన కూతురి ప్రేమేనని.. వాళ్ల ప్రేమ మీద తనకు దేవుడి మీద ఉన్నంత నమ్మకం ఉందని అంటాడు. తన అల్లుడిగారికి ఏమీ కాదు అని అంటాడు.

813
Guppedantha Manasu

Guppedantha Manasu

అయితే.. అప్పుడే ముకుల్ తన కానిస్టేబుల్  చేత ఓ టీషర్ట్ తెప్పిస్తాడు. అది.. రిషి సర్ ఫంక్షన్ వచ్చేటప్పుడు వేసుకున్నదేనని చక్రపాణి చెబుతాడు. డెడ్ బాడీ దగ్గర దొరికిందని ముకుల్ అంటాడు. అయితే.. అలాంటి టీషర్ట్స్ వేరే వాళ్లకి కూడా ఉండొచ్చు కదా అని వసుధార అంటుంది.. అయితే.. రిషి సర్ కి ఏమీ కాకూడదని తనకి కూడా ఉందని.. జస్ట్ వచ్చి చూడమని ముకుల్ అంటాడు. వీళ్లంతా ఒప్పుకోకపోవడంతో.. అనుపమ సర్ది చెప్పి.. మహేంద్రను మాత్రం పంపిస్తుంది. వసుధార నువ్వు ఇక్కడే ఉండు అని చెబుతుంది.

913
Guppedantha Manasu

Guppedantha Manasu

మరోవైపు ఫనీంద్ర.. ఇంట్లో కూర్చొని మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటాడు. రిషి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందో లేదో అని మనసులో అనుకుంటాడు. ఈ లోగా దేవయాణి వచ్చి పక్కన కూర్చుంటుంది. ధరణి వచ్చి కాఫీ ఇస్తుంది. మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఫణీంద్ర అంటే... ఇప్పుడు కాకపోతే కాసేపు ఆగి లిఫ్ట్ చేస్తాడులే దానికి ఎందుకు అంత కంగారు అని దేవయాణి అంటుంది.

1013
Guppedantha Manasu

Guppedantha Manasu

దీంతో.. ఫణీంద్ర తిడతాడు.. నీకు అసలు రిషి కనిపించడం లేదని కంగారు ఉందా..? హాయిగా తింటున్నావ్.. పడుకుంటున్నావ్ అని సీరియస్ అవుతాడు. దీంతో.. తన నటన మొత్తం బయటపెడుతుంది. శైలేంద్ర కంటే ఎక్కువ ప్రేమగా నేను రిషి పెంచాను అని భారీ డైలాగులు కొడుతుంది.

1113
Guppedantha Manasu

Guppedantha Manasu


తర్వాత.. ఫణీంద్ర.. అనుపమకు ఫోన్ చేస్తాడు. అనుపమ లిఫ్ట్ చేస్తుంది. రిషి గురించి ఏమైనా తెలిసిందా అంటే.. రిషి గురించి తెలుసుకోవడానికి మహేంద్ర హాస్పిటల్ కి వెళ్లాడని చెబుతుంది. ఆ మాట విని ఫణీంద్ర కంగారుపడతాడు. దీంతో.. డెడ్ బాడీ ఐడెంటిఫికేుషన్ కి వెళ్లాడని.. జరిగిందని చెబుతుంది. మహేంద్ర తోడుగా ఎవరు వెళ్లారు.. అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే అని ఫణీంద్ర అడుగుతాడు.

1213
Guppedantha Manasu

Guppedantha Manasu

కానీ అనుపమ.. రిషికి ఏమీ కాదని, ఆ టీషర్ట్ ఎలా వచ్చిందో తమకు తెలీదని.. అందుకే తామంతా వెళ్లలేదని చెబుతుంది. కానీ.. ఆ మాటలకు ఫణీంద్ర కుప్పకూలిపోతాడు. ధరణి వాటర్ తెచ్చి ఇస్తుంది. ఏమైందని దేవయాణి అడిగితే.. డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కోసం మహేంద్ర హాస్పిటల్ కి వెళ్లాడు అని చెబుతాడు. ఆ మాటలకు శైలేంద్ర, దేవయాణి సంబరపడతే..  ధరణి మాత్రం బయపడుతుంది.

1313
Guppedantha Manasu

Guppedantha Manasu


కానీ శైలేంద్ర బయటకు మాత్రం.. రిషికి ఏమీ కాదని.. తన తమ్ముడు రిషికి ఏమీ కాదు అని.. ఫణీంద్రకు ధైర్యం చెబుతాడు. ఆనవాలు లేకుండా.. ముకుల్ వచ్చి బాబాయ్ ని ఎలా తీసుకువెళతాడు అని శైలేంద్ర అడుగుతాడు.. అయితే.. ఆనవాలు దొరికిందని ఫణీంద్ర అంటాడు. రిషికి ఏమీ కాకూడదని ధరణి మనసులో అనుకుంటూ ఉంటే.. అది రిషి బాడీ అవ్వాలని శైలేంద్ర దేవుడిని కోరుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved