MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • GuppedanthaManasu 18th January Episode: వసు మెడలో తాళి కడతా.. సీన్ లోకి మళ్లీ వసు బావ రాజీవ్ ఎంట్రీ

GuppedanthaManasu 18th January Episode: వసు మెడలో తాళి కడతా.. సీన్ లోకి మళ్లీ వసు బావ రాజీవ్ ఎంట్రీ

చాలా రోజుల తర్వాత.. వసు బావ క్యారెక్టర్  మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తన గదిలో వసు ఫోటో పెట్టుకొని.. దానిని చూస్తూ ఉంటాడు. ఆటలు ఆడటం తనకి కూడా వచ్చు అని వసుధార ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు

4 Min read
Author : ramya Sridhar
Published : Jan 18 2024, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Guppedantha Manasu

Guppedantha Manasu


GuppedanthaManasu 18th January Episode: శైలేంద్ర.. ఎలాగైనా రిషి గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. దానికోసం.. ఏకంగా కాలేజీలో స్టూడెంట్స్ ని రెచ్చగొట్టాడు. మినిస్టర్ ముందు కూడా వసుధారను ఇరికించాలని చూస్తాడు. కానీ,. వసుధార వచ్చి సీన్ రివర్స్ చేస్తుంది. రిషి వాయిస్ మెసేజ్ ఒకటి వినిపిస్తుంది. అయినా, నమ్మకపోతే.. డైరెక్ట్ గా మినిస్టర్ కి రిషి నుంచి ఫోన్ వచ్చేలా చేస్తుంది. దీంతో అందరూ కామ్ డౌన్ అవుతారు. తర్వాత వసుధార వెళ్లిపోతుంటే.. శైలేంద్ర ఆపి.. రిషి ఎక్కడ ఉన్నాడు..? ఏ పని మీద వెళ్లాడు అని అడుగుతూనే ఉంటాడు. వసుధార చెప్పదు. ఈ లోగా మహేంద్ర వచ్చి.. అసలు నీకు ఎందుకు చెప్పాలి అని అడుగుతాడు. నేను కూడా బోర్డు మెంబర్ ని అని శైలేంద్ర అంటే.. నామ మాత్రంగా నువ్వు బోర్డు మెంబర్ వి అని.. నీకు కాలేజీకి అసలు సంబంధం లేదు అని మహేంద్ర అరుస్తాడు. శైలేంద్ర మాత్రం వినకుండా.. రిషి ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పాల్సిందే అని పట్టుపడతాడు. ఏ సీక్రెట్ పనిమీద వెళ్లాడో నాకు తెలియాలి అంటాడు. కానీ.. తెలుసుకొని ఏం చేస్తావ్..? ఇప్పటి వరకు చేసిన పాపాలు సరిపోలేదా అని మహేంద్ర అంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Guppedantha Manasu

Guppedantha Manasu

మినిస్టర్ తో కలిసి రిషి ఏ సీక్రెట్ పనిమీద వెళ్లాడో మీకు తెలిస్తే సరిపోదు.. మాకు కూడా తెలియాలి. ఎందుకంటే.. అది మీ పర్సనల్ విషయం కాదు.. కాలేజీకి సంబంధించినది. కాబట్టి.. కచ్చితంగా అందరికీ చెప్పాలి అని శైలేంద్ర అంటాడు. అంతేకాదు.. ఆ పని గురించి అందరికీ చెప్పి.. ఆమెదం ఉంటేనే ఆ పని చేయాలి.. ఎవరికీ చెప్పడం న్యాయం కాదు అని శైలేంద్రం అంటాడు. దానికి మహేంద్ర.. న్యాయఅన్యాయాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ అని క్లాస్ పీకుతాడు. కానీ.. శైలేంద్ర మాత్రం తాను కాలేజీ గురించి మాట్లాడుతుంటే.. మీరు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారని, దానికీ దీనికీ సంబంధం లేదు బాబాయ్ అని అంటాడు. మీరు.. రిషి చేస్తున్న పని ఏంటో చెప్పకుండా మా డాడ్ ని మోసం చేస్తున్నారని కూడా అంటాడు. కానీ.. వీడితో మాట్లాడుతూ ఉంటే.. ఇలానే వాదిస్తూ ఉంటాడని.. వసుధారతో పదమ్మా వెళదాం అని మహేంద్ర అంటాడు. ఇక.. తాము మా అన్నయ్యను మోసం చేయడం లేదని, మా అన్నయ్య దేవుడు అని, మేం ఏం చేసినా అందులో మంచే ఉంటుందని మా అన్నయ్య నమ్ముతాడు అని మహేంద్ర అంటాడు.

38
Guppedantha Manasu

Guppedantha Manasu

అదే కదా మీ ధైర్యం.. మా డాడ్ ఏమీ అడగడు అనే కదా.. మీకు నచ్చినట్లు చేస్తున్నారు, చెప్పండి బాబాయ్ అని శైలేంద్ర అంటే.. నన్న రెచ్చగొడితే నా నుంచి సమాచారం వస్తుంది అనుకుంటున్నావ్.. నీ పప్పులు నా దగ్గర ఉడకవ్.. చూస్తూ ఉండు.. నువ్వు ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటావో అని వార్నింగ్ ఇచ్చి మహేంద్ర, వసుధార వెళ్లిపోతారు. అయితే మీరు నన్ను ఏమీ చేయలేరు బాబాయ్ అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. మీరు ఏమీ చెప్పకపోయినా.. ఏదో ఒకలాగా నేను తెలుసుకుంటాను.. వసుధార నువ్వు ప్రతిదానికీ నాకు అడ్డు వస్తున్నావ్.. నీ అడ్డు తొలగించుకుంటే.. నేను ఎండీ సీటులో కూర్చుంటాను అని అనుకుంటాడు.

48
Guppedantha Manasu

Guppedantha Manasu

చాలా రోజుల తర్వాత.. వసు బావ క్యారెక్టర్  మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తన గదిలో వసు ఫోటో పెట్టుకొని.. దానిని చూస్తూ ఉంటాడు. ఆటలు ఆడటం తనకి కూడా వచ్చు అని వసుధార ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు. ‘ ఏంటి వసుధార.. ఈ బావను దెబ్బ కొట్టి.. వాడిని పెళ్లి చేసుకుంటే ఎలా చెప్పు ఏమి అందం.. ఏమి అందం.. నీ చూపులు, నీ అందం, నువ్వు నా మీద చూపించిన ప్రేమ.. అన్నీ నా మనసును ఓ పట్టాన వదలడం లేదు. లాస్ట్ జనవరిలోనే నీ మెడలో తాళి కట్టి నీతో సంసారం చేయాల్సిన నేను, సంవత్సరం పాటు.. ఎవరికీ కనపడకుండా తిరగాల్సి వచ్చింది. ఈ కొత్త సంవత్సరంలో నిన్ను నా దానిని చేసుకోవాలని వచ్చాను. కానీ నువ్వు ఆ రిషి గాడిని పెళ్లి చేసుకున్నావని తెలిసింది. వెరీ బ్యాడ.. ఏంటి మరదల్ పిల్లా.. నువ్వు ఈ బావ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నాలో లేనిది ఏంటి..? వాడిలో ఉన్నది ఏంటి? నాతో రమ్మంటే వాడితో వెళ్లిపోతావా? ఇదేం బాలేదు.. అసలు ఈ బావను ఒంటరిని చేసి నవ్వు వెళ్లిపోవడం ఏమైనా బాగుందా? నువ్వు నా ధ్యేయం. నిన్ను పెళ్లి చేసుకోవడమే నా కర్తవ్యం.  అలాంటి నేను నిన్ను ఎలా వదిలేస్తాను మరదలు పిల్లా. అందుకే.. నేను మళ్లీ కథలోకి ఎంట్రీ అయ్యా. నువ్వు ఎవడికోసం అయితే నన్ను దెబ్బ కొట్టావో.. ఇప్పుడు వాడినే చంపేయబోతున్నాను. నీ మెడలో ఉన్న ఆ తాళిని తెంపి... ఈ తాళి కడతా’ అని అనుకుంటాడు. లాస్ట్ టైమ్ నా ప్లాన్ మిస్ అయ్యింది కానీ.. ఈ సారి మాత్రం అలా జరగదు. పక్కా ప్లాన్ ప్రకారం వచ్చాను. ఈ సారి కచ్చితంగా నిన్ను నా సొంతం చేసుకొని తీరతాను అని వసు బావ రాజీవ్ అనుకుంటాడు.

58
Guppedantha Manasu

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. వసుధార వాళ్ల నాన్నకు ఫోన్ చేస్తుంది. చక్రపాణితో... రిషి ఎక్కడ ఉన్నాడు అనే విషయం మహేంద్రతో చెప్పలేదని, ఆయన కంగారుపడుతున్నారని చెబుతుంది. దానికి చక్రపాణి.. అయ్యో బావగారికి అల్లుడు గారంటే ప్రాణం అని.. చెప్పకపోతే బాధపడతారు కదా అని చక్రపాణి అంటాడు. కానీ.. శైలేంద్ర రిషి సర్ గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడని అందుకే అలా చేయాల్సి వచ్చిందని అంటుంది.

68
Guppedantha Manasu

Guppedantha Manasu

కానీ మహేంద్ర బాధపడతారని ఆయనకు మాత్రం చెప్పమని చక్రపాణి అంటాడు. కానీ.. వసు చెప్పనంటే చెప్పనని.. ఎవరికి తెలిసినా శైలేంద్రకు తెలిసిపోతుందని వసు అంటుంది. రిషి సర్ కోలుకునేవరకు ఎవరికీ చెప్పొద్దని తండ్రికి కూడా మరోసారి వసు చెబుతుంది. రిషి సర్ ఆరోగ్యం ఎలా ఉందని వసు అడిగితే.. కోలుకుంటున్నారని చెబుతాడు. తర్వాత కాలేజీ విషయాలు చక్రపాణి అడుగుతాడు. దానికి... వసు ఏం జరిగిందో మొత్తం పూసగుచ్చినట్లు వివరిస్తుంది.

78
Guppedantha Manasu

Guppedantha Manasu

మరోవైపు శైలేంద్ర, తల్లి దేవయాణి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వాళ్ల దగ్గర రిషి ఉన్నాడో లేదో అనే అనుమానం ఉందని.. ఇప్పుడు క్లారిటీ వచ్చిందని శైలేంద్ర అంటాడు. మరి.. రిషి నువ్వు వెళ్లినప్పుడు కనపడలేదు అన్నావ్ కదా అని దేవయాణి అంటే.. వాళ్లు దాచిపెట్టారు అని చెబుతాడు. తర్వాత.. రిషి వాయిస్ తన ఫోన్ కి వచ్చిందని చెబుతాడు. తనకు వినిపించమని దేవయాణి అంటుంది. శైలేంద్ర వినిపిస్తాడు. అయితే.. రిషి అసలు వాయిస్ కాదేమో అని దేవయాణి డౌట్ వస్తుంది. కానీ... రిషి డైరెక్ట్ గా ఫోన్ చేసి మినిస్టర్ తో మాట్లాడాడు అని అప్పుడే కన్ఫామ్ అయ్యిందని అంటాడు.

88
Guppedantha Manasu

Guppedantha Manasu

చక్రపాణి ఇంటికి తాను, భద్ర కూడా  వెళ్లాం కానీ.. రిషి కనపడలేదు అని చెబుతాడు. వాళ్ల నాన్న కూడా ఆ సమయంలో లేడు అని.. రిషిని చక్రపాణి ఎక్కడికి తీసుకువెళ్లాడు అని ఆలోచిస్తాడు. రిషి ఎక్కడున్నావ్ రా.. నీ పీడ ఎలా వదిలించుకోవాలి అని మనసులో అనుకుంటాడు.

ఇక, వసు కాలేజీ వర్క్ చేస్తూ ఉంటుంది. అనుపమ, మహేంద్ర వచ్చి సహాయం చేయమా అని అడుగుతారు. అయితే.. ఆ పని మేం చేయవచ్చా అని అడుగుతారు. తాను మాత్రమే చేయాలి అని వసు అంటుంది. తర్వత.. కాలేజీ పనులు రిషితో కలిసి చేసిన సందర్భాలను తలచుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved