MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • GuppedanthaManasu 17th January Episode:మినిస్టర్ కి రిషి ఫోన్.. వాయిస్ విని షేక్ అయిపోయిన శైలేంద్ర..!

GuppedanthaManasu 17th January Episode:మినిస్టర్ కి రిషి ఫోన్.. వాయిస్ విని షేక్ అయిపోయిన శైలేంద్ర..!

వాడి పీనుగును పిచ్చి కుక్కలు పీక్కుతినను అని తనకు వచ్చిన  తిట్లు అన్నీ తిడుతుంది. అవి తమనే కాబట్టి.. వినలేక దేవయాణి  అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దేవయాణి వెళ్లగానే.. ఇది మీరే చేసి ఉంటారని నాకు తెలుసు అత్తయ్య అని అనుకుంటుంది. 

5 Min read
Author : ramya Sridhar
Published : Jan 17 2024, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Guppedantha Manasu

Guppedantha Manasu

GuppedanthaManasu 17th January Episode: రిషిని ఎలాగైనా బయటకు రప్పించాలని  శైలేంద్ర ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.  దాని కోసం కాలేజీలో స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడం, సోషల్ మీడియాలో రిప్ అని రిషి ఫోటో పెట్టి షేర్ చేయడం లాంటివి చేసేశాడు. అది చూసిన దేవయాణి.. కొడుకు చేసిన పనికి సంబరపడిపోతుంది. అదే సమయంలో ధరిణి రిషి ఫోటో పై రిప్ అని పెట్టేసి ఉండటం చూసి కంగారుగా దేవయాణి దగ్గరకు పరుగులు తీస్తుంది.  దేవయాణి కూల్ గా తాను కూడా చూశాను అని, కాలేజీలో స్టూడెంట్స్ కూడా.. రిషిని చూడాలని చాలా గొడవ చేశారని చెబుతుంది. ఆ ఫోటోలో చూసినట్లుగా నిజంగానే జరిగిందేమో అని దేవయాణి అనగానే.. ధరణి కోపంతో అరుస్తుంది. అలాంటి అపశకునం మాటలు ఎలా మాట్లాడాతారు. అది నోరా ఇంకేమైనానా అని తిడుతుంది. ధరణి అలా అనడంతో దేవయాణికి కూడా కోపం వస్తుంది. ధరణి ఏంటి అరుస్తున్నావ్ అని అడుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Guppedantha Manasu

Guppedantha Manasu

అప్పుడు ధరణి ‘ లేకపోతే ఏంటి అత్తయ్య.. రిషిని పెంచి పెద్ద చేసిన మీరే అలా మాట్లాడతారా, ఎవరో గిట్టనివారు ఇలా ఫోటోలు క్రియేట్ చేసి ఉంటారు, ధరిద్రయ ఎదవలు, దొంగ సన్నాుసులు’ అని అంటుంది. ఆ ఫోటో పెట్టింది శైలేంద్ర అనే విషయం దేవయాణికి తెలుసు కాబట్టి.. తిట్టడం ఎందుకులే ధరణి.. వాళ్ల పాపాన వాళ్లు పోతారు అని అంటుంది. కానీ ధరణి ఆపదు. ఇలా రిషి ఫోటో పెట్టిన వాడి ఫోటో, వాళ్ల అమ్మ ఫోటో పెట్టి.. ఇలానే దినం చేస్తే సరిపోతుంది అని అంటుంది. వాడి పిండం పిల్లులు ఎత్తుకుపోను, వాడి కలేబరాలు కాకులు ఎత్తుకుపోను. వాడి పీనుగును పిచ్చి కుక్కలు పీక్కుతినను అని తనకు వచ్చిన  తిట్లు అన్నీ తిడుతుంది. అవి తమనే కాబట్టి.. వినలేక దేవయాణి  అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దేవయాణి వెళ్లగానే.. ఇది మీరే చేసి ఉంటారని నాకు తెలుసు అత్తయ్య అని అనుకుంటుంది.

39
Guppedantha Manasu

Guppedantha Manasu

మరోవైపు మహేంద్ర, అనుపమ, ఫణీంద్ర ఓ చోట కూర్చొని ఉంటారు.  స్టూడెంట్స్ ఏమంటున్నారు శైలేంద్ర అని ఫనీంద్ర అడిగితే... తమకు రిషి సర్ కావాలని డిమాండ్ చేస్తున్నారని చెబుతాడు. అసలే రిషి వాళ్ల ఫేవరేట్ లెక్చరర్ కదా, అందుకే అంత కనెక్ట్ అయ్యారు. కొందరైతే రిషి నిజంగానే చనిపోయాడు అనుకొని ఏడుస్తున్నారని, కాలేజీ మొత్తం గందరగోళంగా ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, కనీసం ఈ సమయంలో వసుధార ఉన్నా.. పరిస్థితి హ్యాండిల్ చేసేది.. కానీ, వసుధార కూడా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు అని శైలేంద్ర అంటాడు.

49
Guppedantha Manasu

Guppedantha Manasu

వెంటనే ఫణీంద్ర... వసుధారకు విషయం చెప్పావా అని అడుగుతాడు. చెప్పాను అని.. వస్తున్నా అని చెప్పింది అని మహేంద్ర చెబుతాడు. వెంటనే శైలేంద్ర... ఈ విషయంలో మనం అలర్ట్ గా ఉండాలని, రిషి చనిపోయాడని పేపర్, టీవీల్లో వస్తే  చాలా కష్టమౌతుందని, స్టూడెంట్స్ తో మీటింగ్ ఏర్పాటు చేద్దాం అని అంటాడు. ఈలోగా.. మినిస్టర్ వస్తాను అన్నారు అని మహేంద్ర అంటాడు. ఇక.. శైలేంద్ర ఓవర్ యాక్షన్ మొదలుపెడతాడు. ‘ఇలాంటి సమయంలో నే పిన్ని గుర్తుకువస్తుంది. పిన్ని ఉన్నప్పుడు ఎంత బాగుండేది. ఇప్పుడు  రిషి కనిపించకపోవడం, వసుధార కాలేజీ పట్టించుకోకపోవడం, నా కళ్ల ముందే కాలేజీ కూలిపోతున్న భ్రమ కలుగుతోంది. నువ్వు, రిషి కలిసి కాలేజీని ఎంత  గొప్పగా చూసుకున్నారు. కాలేజీని వసుధార చేతిలో పెట్టగానే కాలేజీ కుప్పకూలిపోతున్నట్లుగా అనిపిస్తోంది. అసలు ఇలాంటి పరిస్థితిలో కాలేజీని ఎందుకు నడపాలి. రిషి లేనప్పుడు ఈ కాలేజీ మనకు ఎందుకు. రాజులేన రాజ్యం ఎందుకు అన్నారు.. మరి రిషి లేని ఈ కాలేజీ ఎందుకు? మూసేద్దాం’ అని అంటాడు.

59
Guppedantha Manasu

Guppedantha Manasu

శైలేంద్ర మాటలు విని. చాలా ఓవర్ చేస్తున్నాడు అని అనుపమ మనసులో అనుకుంటుంది. ఇక.. కాలేజీ మూసేద్దాం అనగానే.. మహేంద్రకు కోపం వచ్చి శైలేంద్రపై అరుస్తాడు. దానికి శైలేంద్ర.. తన యాక్టింగ్ ఆపకుండా... ఇంకా తనపైనే ఎందుకు సీరియస్ అవుతున్నావ్ బాబాయ్.. మీరే చూశారు కదా.. అందరూ రిషి కావాలని అంటున్నారని, కాసేపు ఆగితే..రోడ్డుపై వెళ్లి దర్నా చేస్తారేమో అంటాడు. దానికి మహేంద్ర.. కాలేజీ మూసివేయడం జరగదని, సమస్యను ఎలా కంట్రోల్ చేయాలో అది ఆలోచించమని, నోటికి వచ్చింది మాట్లాడొద్దు అని చెబుతాడు. ఫణీంద్ర కూడా.. శైలేంద్రను కాసేపు నోరు మూసుకోమని చెబుతాడు.

కాలేజీ మూసివేయడం కరెక్ట్ కాదని, బయటి వాళ్లు ఆలోచించినట్లు ఆలోచించకూడదు శైలేంద్ర అని అనుపమ అంటుంది. నేను కాదు.. నువ్వే బయటిదానివి అని శైలేంద్ర సీరియస్ అవ్వగా, అలా అనొద్దని ఆమె కూడా కాలేజీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారని ఫణీంద్ర అంటాడు. తర్వాత.. అనుుపమ శైలేంద్ర పై సీరియస్ అవుతుంది. స్టూడెంట్స్ గురించి ఆలోచించమని, కాలేజీ మూసివేస్తే వచ్చే సమస్యను వివరిస్తుంది.

69
Guppedantha Manasu

Guppedantha Manasu


శైలేంద్ర మాత్రం.. రిషి విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటాడు. అది విని మహేంద్ర, అనుపమకు తట్టుకోలేకపోతారు. ఏడుస్తున్నట్లు చేస్తాడు. ఫణీంద్ర.. రిషికి ఏమీ కాదని ధైర్యం చెబుతాడు. ఈలోగా.. మినిస్టర్ వచ్చారని ప్యూన్ చెబుతాడు. అందరూ మీటింగ్ పెడతారు. ‘ అసలు దీనిని ఫస్ట్ ఎవరు పెట్టారు..?’ అని  మినిస్టర్ అడుగుతాడు. స్టూడెంట్స్ పెట్టారేమో అని శైలేంద్ర అంటే... ‘ ఎవరో పక్కనే ఉంటూ గోతులు తవ్వేవారు పెట్టి ఉండొచ్చు’ అని మహేంద్ర శైలేంద్రను ఉధ్దేశించి అంటాడు. ఇక.. స్టూడెంట్స్  చేసిన రచ్చ విషయం వివరించిన శైలేంద్ర... అందరూ రిషి చనిపోయాడనే అనుకుంటున్నారు అని చెబుతాడు.

ఆ మాటకు మినిస్టర్ కి కూడా చిరాకు వస్తుంది. ఆపవయ్యా.. రిషి గురించి అలాంటి మాట వినడానికే నచ్చడంలేదు, రిషి లాంటి గొప్ప మనిషికి ఇలా జరగడం ఏంటి? వసుధారకు ఇన్ఫామ్ చేశారా? అని అడుగుతాడు. చెప్పాం.. వస్తోందని అంటారు. అసలు రిషి ఏమైపోయాడో మీరు ఎందుకు కనిపెట్టలేదు..? నాకు ఒక్కమాట చెబితే.. నేను సహాయం చేసేవాడిని కదా అంటాడు. ఆ మాట అనగానే.. వసుధార ఎంట్రీ ఇస్తుంది.

79
Guppedantha Manasu

Guppedantha Manasu


‘ఏంటమ్మా వసుధార.. కాలేజీలో ఏం జరుగుతోందో చూశావా? నువ్వు ఎండీ అయినప్పుడు నేనే ఎక్కువ సంతోషంచాను. నీకు చాలా సపోర్ట్ గా నిలపడాలని అనుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఆ బాధ్యతలు బాగా చేపట్టగలవని. కానీ ఏం చేస్తున్నావమ్మా, నువ్వు ఆ సీటులో కూర్చున్నప్పటి నుంచి అన్నీ పొరపాట్లే జరుగుతున్నాయ్.  వాటిని సరిదిద్దుకోవాలి కదా, ఎండీగా ఉండి.. కాలేజీకి ఎందుకు రావడం లేదు? నువ్వు అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలా చేయడం ఏంటి..? బోర్డు మెంబర్స్  ఎంత అసహనంగా ఉన్నారో తెలుసా?’ అని మినిస్టర్ వసుధారపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు.

బోర్డు మెంబర్స్ కూడా.. వసుధార పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తారు. ఈ దెబ్బతో వసుధార ఎండీ పోస్టు పోవడం ఖాయం అని శైలేంద్ర హ్యాపీగా ఫీలౌతాడు. తర్వాత.. రిషి ఎక్కడ ఉన్నాడు అని మినిస్టర్ వసుధారను అడుగుతాడు. చెప్పు వసుధార.. అని శైలేంద్ర కూడా ఫోర్స్ చేస్తాడు.  దానికి వసుధార.. రిషి క్షేమంగా ఉన్నారని  చెబుతుంది. బోర్డ్ మెంబర్స్ కూడా.. మొన్న కనపడట్లేదు అన్నారు.. ఇప్పుడు సేఫ్ గా ఉన్నారని చెబుతున్నారు.. ఏది నమ్మాలి అంటారు.

89
Guppedantha Manasu

Guppedantha Manasu

ఛాన్స్ దొరికింది అని.. శైలేంద్ర రెచ్చిపోతాడు. వసుధార మాట మార్చిందని అంటాడు. అంతేకాదు.. రిషి క్షేమంగా ఉన్నాడని స్టూడెంట్స్ ని ఎలా నమ్మిస్తారు అని శైలేంద్ర అడుగుతాడు. అందరూ వసుని రిషి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూనే ఉంటారు.  దానికి వసు.. నేను చెబుతానులే కానీ.. మీకు ఓ మెసేజ్ వచ్చింది అది చూడండి అని అంటుంది. అది రిషి పంపిన వాయిస్ మెసేజ్ కావడం విశేషం.‘ తాను బాగానే ఉన్నానని, అత్యవసర పరిస్థితుల్లో రాలేకపోతున్నాను అని, తన కారణంగానే వసు కాలేజీకి రాలేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో వసుధార పర్ఫెక్ట్ గా ఎండీ బాధ్యతలు నిర్వహిస్తుంది. నేను సీక్రెట్ ఆపరేషన్ లో ఉన్నాను. నామీద వచ్చిన పుకార్లు నమ్మద్దు. నేను క్షేమంగానే ఉన్నాను’ అని రిషి మాట్లాడిన వాయిస్ మెసేజ్ అందరూ వింటారు.

మీరు అడిగిన ఆధారం సరిపోతుంది కదా.. అని వసుధార అంటే.. ఇది చాలని, స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారు అని మినిస్టర్ అంటాడు. కానీ.. శైలేంద్ర.. అది ఫేక్ అని, టెక్నాలజీతో ఇాలాంటి వాయిస్ లు వంద తయారు చేయవచ్చని, స్టూడెంట్స్ నమ్మరు అని శైలేంద్ర అంటాడు. ఒక్క వాయిస్ తో  రిషి క్షేమంగా ఉన్నాడని చెప్పలేం అని అంటాడు. వెంటనే.. మినిస్టర్ కి రిషి నుంచి కాల్ వస్తుంది. మినిస్టర్ తో రిషి.. మీరు ఇచ్చిన పనిమీదే ఉన్నాను అని చెబుతాడు. నువ్వు కనపడటం లేదని.. ఇక్కడ గందరగోళంగా ఉందని మినిస్టర్ అంటే.. అందుకే మీకు కాల్ చేశానని, మీరు సిట్యూవేషన్ హ్యాండిల్ చేయగలరని మీకు చెబుతున్నాను అని రిషి అనడంతో.. సరే అని మినిస్టర్ ఫోన్ పెట్టేస్తాడు.తర్వాత.. అందరూ కాల్ విన్నారు కదా.. రిషి క్షేమంగానే ఉన్నాడు.. స్టూడెంట్స్ తో నేను మాట్లాడతాను అంటాడు. 

99
Guppedantha Manasu

Guppedantha Manasu


తర్వాత.. శైలేంద్ర..వసుధార వెళ్తుంటే అడ్డుగా నిలపడతాడు. రిషి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. కానీ.. వసుధార సమాధానం చెప్పదు. సీక్రెట్ ఆపరేషన్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మహేంద్ర వచ్చి... నీకు ఎందుకు అని అడుగుతాడు. అసలు.. నీకు ఈ కాలేజీతో సంబంధం లేదు.. నీకు రిషి ఎక్కడుంటే నీకు ఎందుకు అని మహేంద్ర సీరియస్ గా అడుగుతాడు.  అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image3
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌తో లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved