MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Guppedantha Manasu Serial Today: ప్లాన్ ని తల్లి కి చెప్పేసిన శైలేంద్ర, ముకుల్ ప్రశ్నలు,జాడలేని రిషి

Guppedantha Manasu Serial Today: ప్లాన్ ని తల్లి కి చెప్పేసిన శైలేంద్ర, ముకుల్ ప్రశ్నలు,జాడలేని రిషి

అంతే, దెబ్బకు శైలేంద్ర షాకౌతాడు. ముకుల్ నుంచి తప్పించుకోవడానికే అసలు శైలేంద్ర ఈ ప్లాన్ వేస్తాడు. మళ్లీ అక్కడికి కూడా ముకుల్ వచ్చేసరికి భయపడిపోతాడు. ఎలాగైనా, ఇంటరాగేషన్ ఇప్పుడు జరగకుండా ఆపమని తల్లికి చెబుతాడు

4 Min read
Author : ramya Sridhar
| Updated : Dec 04 2023, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Guppedantha Manasu

Guppedantha Manasu


Guppedantha Manasu Serial Today: రౌడీలు పొడవడంతో శైలేంద్ర హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, హాస్పిటల్ లో ఉన్న ముకుల్ ని  ఇంటిరాగేట్ చేయడానికి ముకుల్ అక్కడికి వస్తాడు. అయితే, శైలేంద్ర ప్రస్తుతం ఇంకా కోలుకోలేదని, కోలుకున్న తర్వాత ఇంటిరాగేట్ చేయమని ఫణీంద్ర కోరతాడు. కానీ ముకుల్ ఒప్పుకోడు. ‘ మీ కొడుకు అని ఇలా మాట్లాడుతున్నారా సర్, మా పోలీసులకు బంధం, బంధాలు లాంటివి తెలియవు సర్, నిజం సాక్ష్యం మాత్రమే మాకు కావాలి’ అని ముకుల్ అంటాడు. దానికి ఫణీంద్ర ‘ నా కొడుకు అని అలా మాట్లాడటం లేదు. నేను ఇంటి దగ్గరే చెప్పాను కదా. నా కొడుకు తప్పు చేశాడని తెలిస్తే,నేనే శిక్షిస్తానని. కాకపోతే ఇప్పుడు వాడి పరిస్థితి బాగోలేదు కాబట్టి, అలా మాట్లాడుతున్నాను. ఆ ప్లేస్ లో నా కొడుకే కాదు, ఎవరు ఉన్నా నేను అలానే మాట్లాడతాను’ అని ఫణీంద్ర చెబుతాడు.

25
Guppedantha Manasu

Guppedantha Manasu

ఈ లోగా దేవయాణి ఐసీయూ రూమ్ లోపలికి వెళ్తుంది. బెడ్ మీద అచేతనంగా పడుకున్న తన కొడుకును చూసి దేవయాణి బాధపడుతూ ఉంటుంది. ఫణీంద్ర లే నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. అయితే, దేవయాణి మాటలు వినపడిన శైలేంద్ర కళ్లు తెరుస్తాడు. ఇలా కళ్లు తెరవగానే దేవయాణి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ‘ఎలా ఉంది నాన్న, నీకు ఏమైంది? అసలు నిన్ను పొడిచింది ఎవరు? నువ్వు ఎప్పుడైనా వాళ్లను చూశావా? వాళ్లతో మనకు శత్రుత్వం ఏమైనా ఉందా?’ అంటూ అడుగుతూనే ఉంటుంది. ఆ ప్రశ్నలకు శైలేంద్ర కాస్త ఇరిటేట్ అవుతాడు. ‘ నువ్వు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకు మామ్’ అంటాడు. ‘ అయ్యో ఎలా ఉంది నాన్న,  నిజం చెప్పు నీకు బాగానే ఉందా? నిజం చెప్పు. నువ్వు జగతిని చంపమని ఆ షూటర్ తో మాట్లాడిన ఆడియో ముకుల్ అందరికీ వినిపించాడు’ అని దేవయాణి చెబుతుంది. దానికి శైలేంద్ర కడుపులో మంటగా ఉంది అంటాడు. దానికి, దేవయాణి కొబ్బరి నీళ్లు తాగుతావా అంటుంది. ‘ ఈ మంట కొబ్బరి నీళ్లకు తగ్గింది కాదులే. కత్తి పోట్లు పొడవడం వల్ల వచ్చింది. పొడిచినవాడు చాలా ఎక్స్ పర్ట్ అనుకుంట. ట్రైనింగ్ తీసుకున్నవాడిలాగా, కత్తిపోటు దిగింది కానీ, ప్రాణం పోలేదు’ అంటాడు. దేవయాణికి అర్థం కాదు. శైలేంద్ర వివరంగా చెప్పోలోగా బయట నుంచి ఫోన్ మాట్లాడుతూ ముకుల్ కనపడతాడు.

35
Guppedantha Manasu

Guppedantha Manasu

అంతే, దెబ్బకు శైలేంద్ర షాకౌతాడు. ముకుల్ నుంచి తప్పించుకోవడానికే అసలు శైలేంద్ర ఈ ప్లాన్ వేస్తాడు. మళ్లీ అక్కడికి కూడా ముకుల్ వచ్చేసరికి భయపడిపోతాడు. ఎలాగైనా, ఇంటరాగేషన్ ఇప్పుడు జరగకుండా ఆపమని తల్లికి చెబుతాడు. దీంతో, దేవయాణి నువ్వు కళ్లు మూసుకొని పడుకో, నేను ముకుల్ ని లోపలికి రానివ్వను అని చెప్పి బయటకు వెళ్తుంది. 

దేవయాణి బయటకు వెళ్లగానే ముకుల్ లోపలికి వెళ్తాను అంటూ ఉంటాడు. అది విని దేవయాణి రెచ్చిపోతుంది. తన కొడుకు పరిస్థితి ఇప్పుడు బాలేదని, లోపలికి వెళ్లడానికి వీలులేదని చెబుతుంది. దానికి ముకుల్ చాలా కూల్ గా, తాను జస్ట్ లోపలికి వెళ్లి చాలా తక్కువ మాత్రమే మాట్లాడతానని, ఎక్కువగా ఇబ్బంది పెట్టను అంటాడు. అయినా దేవయాణి ఒప్పుకోదు. దీంతో, వసుధార కలగజేసుకొని ముకుల్ గారు.. శైలేంద్రగారి వాయిస్ అవునో కాదు కన్ఫామ్ చేసుకుంటాను అంటున్నారు కానీ, నింద వేయడం లేదు కదా మేడమ్ అంటుంది. దేవయాణి మాత్రం తాను తన కొడుకుతో మాట్లాడమని చాలా సార్లు లేపడానికి ప్రయత్నించానని, కానీ కళ్లు కూడా తెరవలేదని, నొప్పితో నిద్రలోనే మూలుగుతున్నాడు అని చెబుతుంది. దానికి ముకుల్ తాను లోపలికి వెళ్లి, అసలు కండిషన్ ఎలా ఉందో చూసి వచ్చేస్తాను అని చెబుతాడు. 

45
Guppedantha Manasu

Guppedantha Manasu

ఈలోగా దేవయాణి రిషి ఏడి అని అడుగుతుంది. ఏదో పని ఉండి బయటకు వెళ్లాడటం అని ఫణీంద్ర చెబుతాడు. దానికి దేవయాణికి కోపం వస్తుంది. ఏం పని ఉందని వెళ్లాడు? రిషి ఇక్కడ ఉంటే, అసలు వీళ్లందరినీ లోపలికి రానిచ్చేవాడా అని ముకుల్ ని ఉద్దేశించి అంటుంది. ముకుల్ మాత్రం ఎవరు ఉన్నా, తన డ్యూటీ తాను చేసుకుంటూ వెళతాను అని సమాధానం ఇస్తాడు. కానీ, దేవయాణి ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్లడానికి ఒప్పుకోను అని అంటుంది. ముకుల్ మాత్రం శైలేంద్రను కలవాల్సిందే అంటాడు. కావాలంటే డాక్టర్ పర్యవేక్షణలోనే చూస్తాను అంటాడు. మహేంద్ర జోక్యం  చేసుకొని.. శైలేంద్ర కండిషన్ ని చూసే మాట్లాడతాను అని  అంటున్నాడు కదా అని ఒప్పిస్తాడు. వసు కూడా అదే కరెక్ట్ అనడంతో ఫణీంద్ర అంగీకరిస్తాడు.

55
Guppedantha Manasu

Guppedantha Manasu

Guppedantha Manasu

ముకుల్ లోపలికి వెళతాడు. అప్పుడు మాత్రం శైలేంద్ర కళ్లుమూసుకొని ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఉంటాడు. ముకుల్ లోపలికి వెళ్లి, ఫణీంద్ర కడుపులో గాయాన్ని పరిశీలిస్తాడు. ఆ తర్వాత రిపోర్ట్స్ కూడా చెక్ చేస్తాడు. ‘వీడు పోలిస్ అవ్వడమే కాకుండా మెడిసిన్ కూడా చదివాడా’ అని మనసులో శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత శైలేంద్రను లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.  కానీ, శైలేంద్ర ఏమీ వినపడనట్లుగా నటిస్తాడు. అయితే, స్పృహలోకి వస్తేనే మాట్లాడతానని లేదంటే లేదు అని ముకుల్ లేపుతూనే ఉంటాడు. అయితే, శైలేంద్ర నువ్వు ఎంత పిలిచినా తాను పలకను అని మనసులో అనుకుంటూ ఉంటాడు.

వెంటనే మహేంద్ర‘ నిద్రపోయేవాడిని లేపచ్చు కానీ, నిద్రపోయినట్లు నటించేవారిని లేపలేం కదా సర్, మీరు ఎంత పిలిచినా శైలేంద్ర లేవడు’ అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా, శైలేంద్ర మూలుగుతూ ఉంటాడు. లేవలేకుండా ఉన్నట్లుగా చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా నటిస్తాడు. ముకుల్.. మిమ్మల్ని ఎవరు ఎటాక్ చేశారు అని అడుగుతాడు. దానికి కూడా శైలేంద్ర మగతగా ఉన్నట్లు తనకు తెలీదని చెప్పలేక చెప్పలేక చెబుతూ ఉంటాడు. దేవయాణి మరోవైపు నుంచి ప్రశ్నలు ఎందుకు అడిగి ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది. అయినా ముకుల్ వినకుండా, ఆ గొంతు మీదే అని వాయిస్ గురించి అడగడం మొదలుపెట్టగానే, ఇది ఇక్కడితో ఆపేయాలి అని మనసులో అనుకొని, ఇక, తనకు ఏదో ఊపిరాడనట్లుగా నటించడం మొదలుపెడతాడు. అయితే అది నటనే అనే అనుమానం ముకుల్ లో కలుగుతుంది. అంతలో డాక్టర్ వచ్చి, ఇంతమంది ఎందుకు లోపలికి వచ్చారు అని తిట్టి, అందరినీ బయటకు పంపించేస్తాడు. డాక్టర్ వచ్చి శైలేంద్రకు ఇంజక్షన్ చేస్తాడు. తర్వాత మత్తులోకి జారుకుంటాడు.

బయటకు రాగానే దేవయాణి రచ్చ చేయడం మొదలుపెడుతుంది. ఇంతలో డాక్టర్ కూడా వచ్చి ఇప్పుడు ఇంటరాగేషన్ చేయవద్దని , కోలుకున్న తర్వాత చేయమని చెప్పి వెళిపోతాడు. మహేంద్ర కూడా ఇప్పుడు వద్దులే అని  అని చెప్పడంతో ముకుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ముకుల్ వెళ్లడంతో దేవయాణి ఊపిరి పీల్చుకుంటుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Netflix Telugu Movies : నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాలు ఏవో తెలుసా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: వామ్మో రోహిణీ మామూలు ఆడది కాదు, నిమిషంలో ప్లేట్ తిప్పేసింది, మరోసారి బకరా అయిన మనోజ్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శివన్నారాయణ ఇంటికి దాసు-మరోసారి తప్పించిన జ్యో-CC కెమెరాలో రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved