MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • Guppedantha Manasu December9 Episode:కారు దొరికింది కానీ.. రిషి ఎక్కడ? శైలేంద్రకు చెమటలు పట్టించిన ముకుల్..!

Guppedantha Manasu December9 Episode:కారు దొరికింది కానీ.. రిషి ఎక్కడ? శైలేంద్రకు చెమటలు పట్టించిన ముకుల్..!

‘ ఇప్పుడు ఆలోచించడం ఏంటి శైలేంద్ర.. డిశ్చార్జ్ తర్వాత వాడు వస్తాడని నీకు తెలుసుకదా. ఆలోచించడానికి టైమ్ కావాలనే కదా, రౌడీలతో పొడిపించుకున్నావ్ , ఏదో ఒకటి ముందే ఆలోచించుకోవాలి కదా. ఈ మాత్రం దానికి ఆస్పత్రి పాలవ్వడం ఎందుకు? ఈ ఆలోచించేది ఏదో అప్పుడే ఆలోచించి ఉంటే సరిపోయేది కదా’ అని అంటుంది.

6 Min read
Author : ramya Sridhar
Published : Dec 09 2023, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Guppedantha Manasu

Guppedantha Manasu

Guppedantha Manasu serial December9 Episode:దేవయాణికి స్టాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వసు వెళ్లిపోతుంది. ఆ తర్వాతి సీన్ లో ఓకానిస్టేబుల్ రోడ్డుపై వెళ్తుంటే ఓ కారు కనపడుతుంది. అది రిషి సర్ కారు అని అర్థమౌతుంది.నడిరోడ్డు మీద ఎవరూ లేని ప్రదేశంలో కారు ఎందుకు పార్క్ చేసి ఉందా అని ఆ కానిస్టేబుల్ రాహుల్ ఆలోచించి, తర్వాత ముకుల్ కి ఫోన్ చేసి విషయం చెబుతాడు. అయితే, ఏమైనా అనుమానాస్పదంగా ఉందా? కిడ్నాప్ జరిగినట్లు ఏమైనా కనపడిందా అని ముకుల్ అడిగితే,తెలియడం లేదు అంటాడు. దీంతో ముకుల్  ఆ కారు ఫోటోలు, ప్లేస్ అడిగి తెలుసుకుంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Guppedantha Manasu

Guppedantha Manasu

తర్వాత సీన్ లో శైలేంద్ర తన గదిలో మంచినీళ్లు తాగుతూ ఉంటే, దేవయాణి వస్తుంది. వచ్చిరాగానే ఆ ముకుల్ వస్తున్నాడంట అంటుంది. దానికి శైలేంద్ర అప్పుడే వస్తున్నాడా అని ఆశ్చర్యపోతాడు. ‘ అప్పుడే ఏంటి..? వీళ్లు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారంట. వచ్చాడంటే మళ్లీ నీ ఆడియో ప్లే చేసి, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతావు? ఎలా ఎస్కేప్ అవుతావ్?’ అని దేవయాణి టెన్షన్ పడుతుంది. దానికి శైలేంద్ర.. అదే ఆలోచిస్తున్నాన్ మామ్ అంటాడు. ‘ ఇప్పుడు ఆలోచించడం ఏంటి శైలేంద్ర.. డిశ్చార్జ్ తర్వాత వాడు వస్తాడని నీకు తెలుసుకదా. ఆలోచించడానికి టైమ్ కావాలనే కదా, రౌడీలతో పొడిపించుకున్నావ్ , ఏదో ఒకటి ముందే ఆలోచించుకోవాలి కదా. ఈ మాత్రం దానికి ఆస్పత్రి పాలవ్వడం ఎందుకు? ఈ ఆలోచించేది ఏదో అప్పుడే ఆలోచించి ఉంటే సరిపోయేది కదా’ అని అంటుంది.

37
Guppedantha Manasu

Guppedantha Manasu

శైలేంద్ర మాత్రం కూల్ గా మామ్ నువ్వు టెన్షన్ పడకు. ఇంకా రాలేదు కదా, వచ్చిన్పుడు ఏదో ఒకటి చేద్దాం లే అంటాడు. ‘ ఏదో ఒకటి చేద్దాం అంటావేంటి నాన్న,  నాకు అయితే కాళ్లు, చేతులు ఆడటం లేదు. ఆ ముకుల్ నిన్ను ఊరికే వదిలిపెట్టడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడతాడు’ అని దేవయాణి అంటే, ‘ ఎన్ని ప్రశ్నలు అయినా అడగనివ్వు, మేనేజ్ చేస్తాను’ అంటాడు శైలేంద్ర. ‘మేనేజ్ చేయడం ఏంటి? అక్కడ ఓ పక్కన వసుధార తోక తొక్కిన పాములా , నిన్ను, నన్ను ఎప్పుడు దొరుకుతామా అని ఎదురుచూస్తోంది. మరోవైపు మహేంద్ర కూడా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. వీరిద్దరికి తోడు అనుపమ కూడా ఉంది. వీళ్లంతా కలిసి నిన్ను దోషిలా నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు నాన్న. మళ్లీ అవకాశం రాదని ఇప్పుడే ఇరికించేద్దాం అనుకుంటున్నారు నాన్న’దేవయాణి కంగారుపడూనే చెబుతుంది. ఆమె అంత టెన్షన్ పడుతున్నా శైలేంద్ర మాత్రం ‘ మామ్ నువ్వు ఎక్కువగా  టెన్షన్ పడి, నన్ను టెన్షన్ పెట్టకు, నన్ను ఆలోచించుకోనివ్వు’ అంటాడు. ఏమి ఆలోచించుకోవడమో ఏమో.. ఈ టెన్షన్ తోనే నేను పోయేలా ఉన్నాను అని దేవయాణని కంగారపడుతుంది. ఆలోగా ఏదో కారు వచ్చిన శబ్ధం వినపడుతుంది. ఆ ముకుల్ వచ్చే ఉంటాడు అని దేవయాణి అంటుంది.

ఆలోగా,  ధరణి లోపలికి వస్తుంది. వచ్చీ రాగానే, ముకుల్ గారు వచ్చారు అని చెబుతుంది. ముకుల్ గారు ఆయనతో ఏదో మాట్లాడాలని, రమ్మంటున్నారు అని చెబుతుంది. ఇక దేవయాణి.. ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చింది.. అప్పుడే ఎలా మాట్లాడతాడు అని ముకుల్ కలవకుండా ఉండేందుకు ఏదో అడ్డువేసే ప్రయత్నం చేయబోతుంది. ధరణి నాకేం తెలుసు అత్తయ్య అని అమాయకంగా అనడంతో, నేను తీసుకొస్తాలే నువ్వు వెళ్లు అంటుంది.

47
Guppedantha Manasu

Guppedantha Manasu

ధరణి వెళ్లగానే, ‘ఇప్పుడు ఏం చేస్తావ్, గోడదూకి పారిపోవడానికి కూడా నువ్వు నడిచే పరిస్థితిలో లేవు. నువ్వు ఇక్కడే ఉండు. నేనుఏదో ఒకటి చేసి ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తాను. జాగ్రత్త’ అని చెప్పి హాల్ లోకి వెళ్తుంది. అప్పటికే అందరూ హాల్ లో శైలేంద్ర కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అంతలో దేవయాణి వచ్చి.. ‘ ఏంటండి మీరు, నా కొడుకు మనిషి అనుకుంటున్నారా? పశువు అనుకుంటున్నారా? ఎప్పుడుపడితె అప్పుడు వచ్చి ఇంటిరాగేషన్ చేస్తానంటారేంటి?’ అని సీరియస్ అవుతుంది. ‘ ఏంటి మేడమ్.. హాస్పిటల్ లో  చేస్తాం అంటే వద్దు అన్నారు.. ఇప్పుడు మళ్లీ ఇలా మాట్లాడుతున్నారు.’ అని ముకుల్ అంటాడు. దేవయాణి మాత్రం తన కొడుకును రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నారని సీరియస్ అవుతుంది. ముకుల్ కూల్ గా రెస్ట్ కావాలంటే తీసుకోమని, తాను ఓ గంట అయినా ఎదురుచూస్తానని అంటాడు. దానికి ఆమె.. మీకు కాఫీలు, టీలు ఇస్తూ కూర్చోవాలా? రెండు, మూడు రోజులు ఆగి రావచ్చు కదా అంటుంది. టీ, కాఫీ మాటకు ఇంట్లో అందరూ షాకౌతారు. ముకుల్ మాత్రం తాను అన్ని రోజులు ఆగనని, తమకంటూ డ్యూటీ రూల్స్ ఉంటాయని, ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇచ్చామని చెబుతాడు. ఫణీంద్ర ముకుల్ కి సపోర్ట్ గా నిలుస్తాడు.

ముకుల్ ని ఇంటిరాగేట్ చేయడానికి దేవయాణి అంగీకరించను అంటుంది.ముకుల్ వదలడు.. ఎందుకు అంటాడు. వాడికి గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని, హాల్ లోకి రాలేడు అని అంటుంది. వెంటనే అనుపమ.. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినవాడు.. బెడ్రూమ్ నుంచి హాల్ లోకి రాలేడా అనిఅడుగుతుంది. వీల్ చైర్ లోనే కదా వచ్చేది అంటుంది. పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా.. గాయలకు ఏమైనా అవుతుంది అనడానికి అని అంటుంది. దేవయాణి మదర్ సెంటిమెంట్  డైలాగులు కొడితే , అనుపమ చట్టం గురించి క్లాస్ పీకుతుంది.
 

57
Guppedantha Manasu

Guppedantha Manasu

తర్వాత వసుధార.. శైలేంద్ర బయటకు రాలేకపోతే, ముకుల్ గారే ఆ గదిలోకి వెళ్లి ఇంటిరాగేట్ చేస్తారేమో.? ఏమంటారు సర్ అంటుంది. ముకుల్.. తనకు అలా అయినా ఒకే అంటాడు. ఫణీంద్ర... వద్దులే.. శైలేంద్రే ఇక్కడికి వస్తాడు అని చెప్పి, దేవయాణికి తీసుకురమ్మని చెబుతాడు. వెంటనే మహేంద్ర... దేవయాణి నక్క బుద్ది చూపించి, ఏదైనా ప్లాన్ చేసి శైలేంద్రను తప్పిస్తుందే మో అనుకొని, తానే తీసుకొని వస్తాను అని  చెప్పి వెళతాడు. అది విని దేవయాణి టెన్షన్ మరింత పెరుగుతుంది.

ఇంతలో మహేంద్ర శైలేంద్ర గదికి వెళతాడు. అక్కడ ‘బాబు శైలేంద్ర... ముకుల్ పిలుస్తున్నాడు పదా, పోలీస్ ఆఫీసర్ ముకుల్ వచ్చినిలుచున్నాడు యముడిలాగా, ఆలోచించి టైమ్ వేస్ట్. వెళ్లక తప్పదు. నిన్ను నేను వీల్ చైర్ లో తీసుకొని వెళతాను’ అని హాల్ లోకి తీసుకొని వస్తాడు. రాగానే ముకుల్.. కాసేపు యోగక్షేమాలు అడుగుతాడు. శైలేంద్ర కాస్త ఓవర్ చేసి, మీకు సహకరిస్తాను అని చెబుతాడు. అయితే, శైలేంద్రను ఏ ప్రశ్న అడిగినా, దేవయాణి సమాధానం చెప్పడానికి ముందుకు వస్తూ ఉంటుంది. ఏం జాబ్ చేస్తున్నారు అని ముకుల్ అడిగే, నా కొడుక్కి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? మా కాలేజ్ ఉంటే అంటుంది. దానికి శైలేంద్ర వాళ్ల అమ్మను కాస్త ఆగమని చెబుతాడు.
 

67
Guppedantha Manasu

Guppedantha Manasu

తర్వాత శైలేంద్ర.. తాను తమ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటానని చెబుతాడు. ‘లైఫ్ లాంగ్ ఇదే పని చేస్తారా? లేక ఏవైనా గోల్స్ ఉన్నాయా? ఐమీన్.. కాలేజీలో నే పై స్థాయి ఏమైనా కోరుకుంటున్నారా ’ అని ముకుల్ అడుగుతాడు. మనసులో మాత్రం శైలేంద్ర తాను ఏకంగా ఎండీ సీటు కోరుకుంటున్నానని అనుకుంటాడు. పైకి మాత్రం ‘నాకంటూ ప్రత్యేకించి కోరికలు ఏమీ లేవు. మా అమ్మనాన్న ఏ పని చేయమంటే అది చేస్తాను’ అని సమాధానం ఇస్తాడు. వెంటనే వసుధార.. ‘కానీ ఒకసారి మీరు ఎండీ పదవి తీసుకుంటాను అనిఅన్నారు కదా. సర్.. మీకు కూడా చెప్పారు కదా అని ఫణీంద్రకు గుర్తు చేస్తుంది.వెంటనే ఫణీంద్రకు కూడా గుర్తుకు వస్తుంది. జగతి చనిపోయిన తర్వాత ఓ డిస్కర్షన్ లో అన్నాడని కానీ, నేనే వద్దు అన్నాను అని ఫణీంద్ర చెబుతాడు. తర్వాత ముకుల్... సారధి మీ ఫ్రెండే కదా అని అడుగుతాడు. అవును అంటాడు.  తర్వాత ‘మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో రిషి ఫ్రాడ్ చేశాడని ఇష్యూ చేసింది అతనే కదా? కానీ, వసుధార చెప్పినట్లు, జగతి మేడమ్ ని ఎవరో బ్లాక్ మెయిల్ చేయడం వల్లే, రిషి మీద నింద వేశారు. ఆ బ్లాక్ మెయిల్ చేసింది సారధి అని మీరు నమ్ముతారా?’ అంటాడు. దానికి శైలేంద్ర తనకు తెలీదంటాడు, వెంటనే వసు‘ సారధి కాకుంటే, వెనక ఇంకెవరో ఉండి ఉండొచ్చు కదా ’ అంటుంది. అయితే, ముకుల్ మాత్రం సారధి పరారీలో ఉన్నాడని, మీకు అతని ఇన్ఫర్మేషన్ తెలుసా అని శైలేంద్ర అడుగుతాడు. ఎంఎస్ఆర్ కూడా మీ ఫ్రెండే కదా.. తను కూడా కాలేజీ ఫ్రెండేనా అనిఅడుగుతాడు. కాదని, ఫ్రెండ్ ద్వారా జస్ట్ పరిచయం అని శైలేంద్ర చెబుతాడు. ‘అతను కూడా మీ కాలేజీ పై కన్నేశాడని, అలాంటి వ్యక్తి దగ్గర మీరు అప్పు ఎందుకు తీసుకున్నారు?’ అని ప్రశ్నించగా, దానికి శైలేంద్ర దగ్గర సమాధానం లేదు.తర్వాత కాలేజీ కోసం చేశాను అని చెబుతాడు. దేవయాణి దానికి.. వీళ్ల ఎవరి వళ్లా కానిది తన కొడుకు చేశాడు అని గర్వంగా చెబుతుంది.

77
Guppedantha Manasu

Guppedantha Manasu


దానికి ముకుల్.. అప్పు తేవడం తప్పు కాదని, కాకపోతే, అప్పూ తీర్చకపోతే కాలేజీ ఇస్తానని చెప్పడం తప్పు అని చెప్పి, శైలేంద్ర కుట్ర బయటపెడతాడు. ముకుల్ ప్రశ్నలకు మహేంద్ర చాలా సంతోషిస్తాడు. ‘డబ్బు తీసుకురావలనే కంగారులో అగ్రిమెంట్ చూడలేదు’ అని చెబుతాడు శైలేంద్ర... వెంటనే అనుపమ అందుకుంటుంది. ‘ ఇంత బుర్ర తక్కువగా ఎలా ఉన్నావ్? అగ్రిమెంట్ చూడాలి కదా?’ అని సీరియస్ అవుతుంది. ‘కాలేజీ అనేది లేకపోతే, మీరు ఏ పని చేయగలరు శైలేంద్ర’ అని ముకుల్ అడిగితే... ‘అడుక్కు తింటాడు.. పది నిమిషాలు అని చెప్పి.. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు?’ అని దేవయాణి సీరియస్ అవుతుంది. అయితే, తాను వాయిస్ పోల్చుకుంటున్నానని ముకుల్ చెప్పగానే, ఆమె ఫ్యూజులు ఎగిరిపోతాయ్. తర్వాత వెంటనే.. శైలేంద్ర వాయిస్ వినిపిస్తాడు. అది విని అనుపమ, ధరణి షాకౌతారు. వెంటనే ధరణి కి గతంలో శైలేంద్ర ఎవరో రౌడీతో మాట్లాడిన విజువల్స్ గుర్తుకు వస్తాయి.

తర్వాత వాయిస్ విని... ఇది అచ్చం తన గొంతులాగానే ఉందని అంటాడు.ముకుల్ కూడా ఆ వాయిస్ మీదే అనుకుంటున్నాం అంటాడు. ధరణి కూడా మనసులో అది శైలేంద్ర వాయిస్ అని అనుకుంటుంది. తర్వాత ముకుల్... ఆ వాయిస్ మీదా కాదా అని గట్టిగా ప్రశ్నిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved