- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu Serial 27th December Episode:భద్రను గుడ్డిగా నమ్మేస్తున్న మహేంద్ర, శైలేంద్ర వలలో పడిపోయారు.
Guppedantha Manasu Serial 27th December Episode:భద్రను గుడ్డిగా నమ్మేస్తున్న మహేంద్ర, శైలేంద్ర వలలో పడిపోయారు.
జగతి విషయంలో, రిషి విషయంలో నీకు వీడి మీద ఎందుకు అనుమానం వచ్చింది? నిజంగా వీడే చేస్తే.. నేనే చంపేసేవాడిని, చెప్పు మహేంద్ర ఎందుకు అనుమానం వచ్చింది.?’ అని అడుగుతాడు.

Guppedantha Manasu
Guppedantha Manasu Serial 27th December Episode:గుప్పెండంత మనసు సీరియల్ లో తాజాగా భద్ర అనే క్యారెక్టర్ ని పరిచయం చేశారు. అతను కూడా శైలేంద్ర మనిషే కావడం గమనార్హం. అది కూడా వసు ని చంపడానికి అతనికి శైలేంద్ర పని ఇస్తాడు. వాళ్లతో మంచిగా ఉంటూ, సందర్భం వచ్చినప్పుడు చంపుతాను అని భద్ర.. శైలేంద్రను కలిసినప్పుడు చెబుతాడు. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం...
Guppedantha Manasu
శైలేంద్ర, ఫణీంద్ర ఇద్దరూ కలిసి మహేంద్ర ఇంటికి వస్తారు. వసుధార కాఫీ తెస్తాను అంటే ఫణీంద్ర వద్దు అంటాడు. తాను వద్దు వద్దూ అన్నా కూడా తన తండ్రి తీసుకువచ్చాడని, ఏం జరుగుతుందా అని శైలేంద్ర భయపడుతూ ఉంటాడు. ఫణీంద్ర మాత్రం.. రిషి కేసు ఎక్కడిదాకా వచ్చిందని? ముకుల్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడు. వాళ్లు కూడా అవునని చెబుతారు. త్వరలోనే అసలైన దోషులను పట్టుకుంటానని ముకుల్ చెప్పాడని శైలేంద్రను చూస్తూ మహేంద్ర అంటాడు. వెంటనే ఫణీంద్ర‘ దొరకాలి మహేంద్ర.. అసలైన దోషులు దొరకాలి. అసలు ఇన్ని రోజులు రిషి కనిపించకుండా పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో నువ్వు, వసుధార ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. నాకు కూడా అప్పటి నుంచి కంటి మీద కునుకులేకుండా పోయింది. అందుకే నేను శైలేంద్రను కూడా రిషి గురించి వెతకమని చెబుతున్నాను’ అని అంటాడు. అవును అన్నయ్య..మీరు చెబితేనే శైలేంద్ర.. రిషి కోసం వెతుకుతాడు అని మహేంద్ర కూడా అంటాడు. కచ్చితంగా శేలేంద్రే.. రిషిని తీసుకువస్తాడు. లేకపోతే తాను ఉండడు కదా అని, మళ్లీ కవర్ చేసి ఉండలేడు కదా అంటాడు.తర్వాత ఈ విషయంలో నువ్వు శైలేంద్రను ఏమైనా అనుమానిస్తున్నావా? అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు అని మహేంద్ర చెప్పగా, ‘మరి గన్ ఎందుకు తీసుకువచ్చావ్? మొన్న ధరణిని అడిగితే చెప్పింది. జగతి విషయంలో, రిషి విషయంలో నీకు వీడి మీద ఎందుకు అనుమానం వచ్చింది? నిజంగా వీడే చేస్తే.. నేనే చంపేసేవాడిని, చెప్పు మహేంద్ర ఎందుకు అనుమానం వచ్చింది.?’ అని అడుగుతాడు.
Guppedantha Manasu
అనుపమ మధ్యలో దూరి, వీళ్ల అనుమానం పక్కన పెడితే, నిజానిజాలు చట్టం తేలుస్తుంది కదా సర్ అంటుంది. తాను కూడా అదే కోరుకుంటున్నాను అని, త్వరలోనే నిజం బయటపడాలని కోరుకుంటున్నానని ఫణీంద్ర అంటాడు. తప్పు చేసిన వారికి శిక్షలు పడితే హ్యాపీ అని, తప్పు చేయనివారికి శిక్ష పడకూడదు అని, మన చట్టం కూడా అదే చెబుతుంది కదా అని అంటాడు. దానికి వసు.. జగతి అత్తయ్య కేసు విషయంలోనూ, రిషి సర్ విషయంలోనూ మేము కూడా చట్ట ప్రకారమే వెళ్లాలి అని అనుకుంటున్నాం అని చెబుతుంది. ముకుల్ కి ఇన్వెస్టిగేషన్ విషయంలో ఏవైనా పర్మిషన్లు కావాలంటే మనం ఇప్పిద్దాం అంటాడు.
తర్వాత ఫణీంద్ర.. ఎక్కడికి వెళ్లారు నిన్న అని అడుగుతాడు. బయటకు వెళ్లాం అని మహేంద్ర చెబుతాడు. రిషి కోసం వెళ్లి ఉంటారు కదా బాబాయ్ అని శైలేంద్ర అంటాడు. శైలేంద్రకు తెలుసేమో అనే అనుమానం మహేంద్రకు వస్తుంది. తర్వాత.. ఫణీంద్ర వాళ్లు వెళ్లిపోతారు.. తర్వాత వసు.. తాము డెడ్ బాడీ చూసిన విషయం ఫణీంద్రకు చెబితే బాధపడతాడు అంటుంది. అవును అని మహేంద్ర కూడా అంటాడు.
Guppedantha Manasu
మరోవైపు.. దేవయాణి తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఓవైపు వసుధార డెడ్ లైన్ మరోవైపు ఫణీంద్ర.. రిషి కోసం వెతకమని శైలేంద్రకు చెప్పడంతో దేవయాణి టెన్షన్ పడుతుంది. వెంటనే... శైలేంద్ర వచ్చి టెన్షన్ ఎందుకు మమ్మీ అని అడుగుతాడు. భయం వేయడం లేదా అని దేవయాణి అడిగితే..లేదని.. ప్రశాంతంగా ఉండమని చెబుతాడు. ఎందుకంటే, ఆల్రెడీ వసుని చంపడానికి భద్రను అపాయింట్ చేసుకున్నాడు కాబట్టి, ఆ విషయంలో టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉంటాడు. తనను ఎవరూ ఏం చేయలేరని, తనను ఇరికించాలని చూస్తే, వాళ్లే భూమీ మీద ఉండరు అంటాడు. అయితే.. తన భయం అంతా ఫణీంద్ర గురించే అని, మన నిజస్వరూపం తెలిస్తే, ఆయన ఉగ్రరూపం తట్టుకోలేం అని భయపడుతుంది. కానీ తన ప్లాన్స్ తనకు ఉన్నాయని, అన్నీ చేసి చూపిస్తానని, కూల్ గా ఉండమని చెబుతాడు. నువ్వు అనుకున్నట్లే నీ కొడుకు డీబీఎస్టీ కాలేజీ కి ఎండీ అవుతాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
మరోవైపు ఆ భద్ర క్యారెక్టర్.. మహేంద్రకు ఎదురౌతాడు. అతనిని గుర్తుపట్టిన మహేంద్ర..వెళ్లి పలకరిస్తాడు. టీ తాగడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నానని మంచివాడిలా నటిస్తాడు. దీంతో, మహేంద్ర అతనిని మంచివాడిలా నమ్మి, భద్రకు తమ దగ్గర ఉద్యోగం ఇస్తాడు. నీకు ఏం పని వచ్చు అని అడగుతాడు. ఎవరికై తమ జోలికి వస్తే, కొడతాను అంటాడు. డ్రైవింగ్ వచ్చా అంటే.. వచ్చు అంటాడు. అంతే, తమ దగ్గర డ్రైవర్ గా చేరమని చెబుతాడు. దానికి భద్ర సరే అంటాడు. అంతేకాకుండా. నమ్మకం లేకుండా తాను ఎవరి దగ్గరా పని చేయను అని అంటే, తాను నమ్ముతున్నాను అని మహేంద్ర అంటాడు. పని చేసినందుకు తనకు జీతం అవసరం లేదని కేవలం రోజుకు రూ.వంద ఇస్తే చాలు అంటాడు. బయట తినాల్సిన అవసరం లేదని, తమతోనే భోజనం చేయమని మహేంద్ర చెబుతాడు. అయితే.. భద్ర.. మహేంద్ర దగ్గర పనికి చేరడం శైలేంద్ర తన కళ్లతో తానే చేస్తాడు. తాను అనుకున్న పని జరుగుతుందని సంతోషపడతాడు.
Guppedantha Manasu
మరోవైపు వసు... రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అనుపమ ధైర్యం చెబుతుంది. శైలేంద్ర నిజ స్వరూపం బయటపడటం లేదని వసు ఫీలౌతే, ఏదో ఒక రోజు నిజం బయటపడుతుందని అనుపమ అంటుంది. అతి త్వరలోనే శైలేంద్ర నిజ స్వరూపం బయటపెడతాను అని వసు అంటూ ఉంటుంది. ఈలోగా మహేంద్ర.. భద్రను తీసుకొని వస్తాడు. డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చిన విషయం చెబుతాడు. వసు, అనుపమలకు డ్రైవర్ గా మాత్రమే కాకుండా, సెక్యూరిటీలా ఉండమని మహేంద్ర అడుగుతాడు. సరే అని అంటాడు.
Guppedantha Manasu
తర్వాత భద్ర బయటకు వచ్చి.. శైలేంద్రకు విషయం చేరవేస్తాడు. తొందరలోనే మీకు గుడ్ న్యూస్ చెబుతాను అంటాడు. అయితే, ఆ మాటలు మహేంద్ర వింటాడు. ఎవరితో మాట్లాడుతున్నావ్? అంటి అని అడుగుతాడు. ఫ్రెండ్ తో అని భద్ర కవర్ చేస్తాడు. అయితే, మహేంద్రను మీరు నన్ను నమ్మడం లేదు కదా.. నమ్మకం లేకపోతే నేను ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్లిపోతాను అంటాడు. అలా ఏమీ లేదు అని నమ్మకం ఉందని మహేంద్ర అంటాడు. తర్వాత.. భద్ర ఎకామిడేషన్ గురించి మాట్లాడుకుంటారు. భద్రను వేరే చోట కాకుండా, తమతో ఇక్కడే ఉండమని అడగమని అనుపమ అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.