MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • TV
  • Guppedantha Manasu 8th February Episode:వసుధారకు పిచ్చి పట్టింది, ఎండీ సీటుకు పనికి రాదు.. శైలేంద్ర మరో ప్లాన

Guppedantha Manasu 8th February Episode:వసుధారకు పిచ్చి పట్టింది, ఎండీ సీటుకు పనికి రాదు.. శైలేంద్ర మరో ప్లాన

గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. రిషి చనిపోయాడని మహేంద్ర తాగుడుకు బానిసగా మారిపోయాడు. వసుధార మాత్రం.. ఆ నిజాన్ని నమ్మడం లేదు. రిషి సర్ తిరిగి వస్తారని నమ్ముతోంది. శైలేంద్ర మాత్రం ఎండీ సీటు ని వసుధార నుంచి లాక్కునేందుకు మరో ప్లాన్ వేస్తున్నాడు.

4 Min read
Author : ramya Sridhar
Published : Feb 08 2024, 08:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Guppedantha Manasu

Guppedantha Manasu


Guppedantha Manasu 8th February Episode:వసుధార పరిస్థితి గురించి ముకుల్, అనుపమ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే.. రిషిని శైలేంద్రే చంపేశాడు అని ఆ అవసరం అతనికి మాత్రమే ఉంది అని అనుపమ అంటుంది. అయితే... నిజంగా శైలేంద్రకు ఆ అవసరం ఉన్నప్పటికీ చంపింది మాత్రం అతను కాదు అని ముకుల్ అంటాడు. మరి మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అంటే.. భద్ర మీద అంటాడు. అనుపమ షాకౌతుంది. ఏంటి ముకుల్ నువ్వు అనేది అంటే... వసుధార మేడమ్.. భద్రను తనకు అప్పగించినప్పుడు వార్నింగ్ ఇచ్చాడని.. అతనే చేసి ఉండొచ్చు అంటాడు. తమ పోలీసు ఫోర్స్ మొత్తం అతని కోసం గాలిస్తోందని.. వాడు దొరకకుండా తప్పించుకుంటున్నాడని ముకుల్ అంటాడు. తాను పట్టుకుంటున్నానని..కానీ... ఆలోగా మీరు వసుధార మేడమ్ ని జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Guppedantha Manasu

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. రిషిగాడు చనిపోయాడు అని.. శైలేంద్ర, దేవయాణి సంబరపడుతూ ఉంటారు.ఎండీ సీటు విషయంలో మన కళ కళగానే ఉండిపోతుందేమో అని అనుకున్నాను అని.. కానీ.. ఎట్టకేలకు రిషి అడ్డుపోయింది అని అని దేవయాణి అంటుంది. అయితే... శైలేంద్ర ఆ ఎండీ సీటు మాత్రం మనదే అని.. నీ కళ ప్రకారం నీ కొడుకు ఎండీ అయ్యి తీరతాడు మమ్మీ అని అంటాడు. 

39
Guppedantha Manasu

Guppedantha Manasu

ఎండీ సీటు కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేశాం.. ఎన్ని ఎత్తుగడలు వేశాం.. కానీ.. అయినా మనం ఆ ఎండీ సీటు దక్కించుకోలేకపోయాం అని దేవయాణి గుర్తు చేసుకుంటుంది. జగతి పిన్ని ఉన్నప్పుడు తన కొడుక్కే ఎండీ సీటు ఇస్తాను అని అంది.. వసుధార కూడా.. ఎండీ సీటు తనకు ఇవ్వనని రిషి కి మాత్రమే ఇస్తాను అంది.. ఇఫ్పుడు ఆ రిషి నే లేడు. అందుకే చెప్పా.. తనను రెచ్చగొట్టొద్దు అని.. బాబాయ్ కూడా నా మీద చెయ్యి చేసుకున్నాడు.. ఇఫ్పుడు ఏం అయ్యింది. ఆ రిషినే లేడు.. ఇప్పుడు ఏడుస్తున్నారు అని అంటాడు.

49
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇంతలో దేవయాణి చాలా డల్ అయిపోతుంది. ఏమైంది మమ్మీ.. రిషి గాడు చనిపోయాడని ఫీలౌతున్నావా అని అంటాడు. లేదని.. రిషి చనిపోయాడని తెలిసి.. మీ నాన్న కి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. ఆయన కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్పారని అంటుంది. అయితే.. ఇప్పుడు నాన్న అలా ఉండటమే మనకు మంచిది అని శైలేంద్ర అంటాడు. మీ నాన్న కోలుకోవద్దని అంటావా అని దేవయాణి సీరియస్ అవుతుంది. కానీ శైలేంద్ర అర్థమయ్యేలా చెబుతాడు. నాన్న కోలుకునేలోగా నేను ఆ ఎండీ సీటులో కూర్చోవాలి.. లేదంటే.. అది వద్దు..ఇది వద్దు అని అంటారు అంటాడు.

మరి, ఆ వసుధార సంగతి ఏంటి అని దేవయాణి అడుగుతుంది. ఇప్పుడు వసుధార.. రిషి సర్ కి ఏమీ కాలేదని.. బాగానే ఉన్నారు అని చెబుతుంది కదా..ఆ పిచ్చి కూడా మనకు కలిసొస్తుంది లే.. మన చేతికి మట్టి అంటకుండా.. ఆ వసుధార పని క్లోజ్ చేస్తాను అని శైలేంద్ర అనుకుంటాడు.
 

59
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇక.. వసుధార కాలేజీకి వెళ్తుంది. అందరూ.. వసుధారను పరామర్శించడానికి వస్తారు. అందరూ.. సారీ మేడమ్ రిషి సర్  చనిపోయారు కదా  అని ఏవేవో మాట్లాడతారు. అయితే.. వసుధార సీరియస్ అవుతుంది. సర్ చనిపోయారు అని ఇంకోసారి అంటే ఊరుకోను అని అంటుంది. సర్ క్షేమంగా ఉన్నారు అని చెబుతుంది. అయితే.. ఒక లెక్చరర్ రిషి సర్ చనిపోయారని అందరూ అంటుంటే మీరు మాత్రమే బతికి ఉన్నారు అని చెబుతున్నారని.. ఉంటే ఎక్కడ ఉన్నారో చెప్పండి అంటుంది. దానికి వసు.. సర్ తో ఇప్పుడు మీకు పనేంటి అని సీరియస్ అవుతుంది.

69
Guppedantha Manasu

Guppedantha Manasu

మధ్యలో శైలేంద్ర కలగజేసుకుంటాడు. వాళ్లంతా సానుభూతి చూపించడానికి వచ్చారని.. నువ్వు ఒప్పుకుంటే.. సంతాప సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని చెబుతాడు. ఆ మాటకు వసుకి కోపం నషాలానికి అంటుంది. వీడికి చేయండి సంతాప సభ. వీడి ఫోటోకి దండ వేసి.. దీపం పెట్టండి అని అంటుంది. ఇంకోసారి బతికున్న రిషి సర్ కి సంతాప సభ అదీ ఇదీ అన్నారంటే ఊరుకోనని.. రిషి సర్ త్వరలోనే మీ ముందుకు వస్తారు అని చెబుతుంది. అయితే... వసుధార.. రిషి చనిపోవడంతో మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది అని.. అబద్దం లో నుంచి బయటకు రాలేకపోతోందని శైలేంద్ర అంటాడు. దానికి వసుధార మళ్లీ సీరియస్ అయ్యి.. శైలేంద్ర పై అరుస్తుంది. 

దాంతో.. శైలేంద్ర.. ఈ కాలేజీ ఎలాంటి ఎండీ చేతిలో పడింది అని అంటాడు.. కావాలనే..వసుధారకు పిచ్చి పట్టిందని.. ఎండీగా సూట్ అవ్వదు అని అందరూ అనుకోవాలని మాట్లాడేసి వెళ్లిపోతాడు. తర్వాత వసు క్యాబిన్ లోకి వెళ్తుంది. కానీ.. వసు ప్రవర్తన అందరిలోనూ అనుమానాలు కలిగిస్తాయి.
 

79
Guppedantha Manasu

Guppedantha Manasu

ఈలోగా వసు లోపలికి వచ్చి కూర్చొని..  అందరి మాటలు తలుచుకొని రగిలిపోతుంది. ఫైల్స్ అన్నీ చింపి విసిరేస్తూ ఉంటుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి.. నీ మైండ్ చాలా డిస్టర్బ్ అయ్యిందని.. నువ్వు సైకియాట్రిక్ట్ దగ్గరకు వెళ్లాలి అంటాడు. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని వసుధార వార్నింగ్ ఇస్తుంది. కానీ.. శైలేంద్ర మాత్రం నేను మాట్లాడాల్సింది మాట్లాడి వెళ్లిపోతాను అంటాడు.

ఇంకా ఎందుకు గబ్బిలంలా ఎండీ సీటు పట్టుకొని వెళతాడవ్..? ఈ ఎండీ సీటు వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి..? అంతక ముందు ఒక్క తప్పు లేకుండా పని చేసేదానివి ఇప్పుడు.. నువ్వు ఏది చేసినా తప్పే అని అందరూ నిన్నే వేలు ఎత్తి చూపిస్తున్నారు.. అంతేకాదు.. మీ జగతి మేడమ్ ని కోల్పోయావ్... రిషిని కోల్పోయావ్.. ఇంకా ఏం కోల్పోతావో అని అంటాడు. 

89
Guppedantha Manasu

Guppedantha Manasu

అందరికీ పదవి అలంకరణలా కనపడుతుంది. కానీ ఆ పదవిలో కూర్చున్నవాళ్లకే దాని తాలూకు బాధలు తెలుస్తాయి. నీకు ఎండీ పదవి అనే ముళ్ల కురీటం ఎందుకు చెప్పు.. ఆకీరటం నాకు ఇచ్చేయ్ అంటాడు  అంతే.. వసుధార శైలేంద్ర చెంప పగలకొడుతుంది. ఎండీ సీటు కాదు కదా.. కాలేజీ గేటు కూడా దాటనివ్వను అని వార్నింగ్ ఇచ్చి.. తన క్యాబిన్ నుంచి వెళ్లిపొమ్మని వార్నింగ్ ఇస్తుంది. కోపంతో శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు.బయటకు వచ్చిన తర్వాత.. తనని కొట్టినందుకు రగిలిపోతాడు. నన్ను కాలేజీ గేటు దాటనివ్వవా.. నిన్నే ఈ కాలేజీ నుంచి బయటకు తరిమికొట్టేలా చేస్తాను అని ఒక ప్లాన్ వేస్తాడు.

99
Guppedantha Manasu

Guppedantha Manasu

మరోవైపు మహేంద్ర.. తన కొడుకును తలుచుకొని ఎమోషనల్ అవుతాడు.ఓ చెట్టు కింద కూర్చొని మందు తాగుగతూ... రిషితో గడిపిన సందర్భాలు తలుచుకుంటూ ఉంటాడు.  నువ్వు లేకపోవడం ఏంటి రిషి.. ఇది నిజం కాకపోతే బాగుండు అని, జగతి దగ్గరకే తన కొడుకు వెళ్లిపోయాడని.. ఇద్దరూ తనను ఒంటరి వాడిని చేశాడు అంటూ ఏడుస్తాడు. తాను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదని.. కానీ తనకు ఎందుకు ఇంత ద్రోహం తలపెట్టావ్ దేవుడా అంటూ ఏడుస్తూ ఉంటాడు. తన వల్ల కావడం లేదు అంటూ మందు సీసా ఓపెన్ చేసి తాగబోతుంటాడు. అనుపమ వచ్చి ఆపేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved