MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Guppedantha Manasu 6th February episode:రిషి చచ్చాడంటగా నీకు నేను తోడుంటా.. వసుకి మొదలైన కష్టాలు..!

Guppedantha Manasu 6th February episode:రిషి చచ్చాడంటగా నీకు నేను తోడుంటా.. వసుకి మొదలైన కష్టాలు..!

ఏమైంది మహేంద్ర అని పణీంద్ర అంటే.. రిషి మనకు లేడు అన్నయ్య అని ఏడుస్తాడు. ఆ మాట విని రిషి గాడు లేడా.. అని శైలేంద్ర చాలా సంతోషపడతాడు. దేవయాణి ముఖంలోనూ నవ్వు కనిపిస్తుంది.

4 Min read
Author : ramya Sridhar
Published : Feb 06 2024, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Guppedantha Manasu

Guppedantha Manasu

Guppedantha Manasu 6th February episode: మహేంద్ర హాస్పిటల్ కి వెళ్లాడు అనగానే ఫణీంద్ర చాలా కంగారుపడిపోతాడు. అయితే.. దేవయాణి కంగారుపడొద్దని.. రిషికి ఏమీ కాదు అని చెబుతుంది. ఫణీంద్ర మాత్రం తాను ఇప్పుడే మహేంద్ర ఇంటికి వెళ్లాలి అంటాడు. అయితే... హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాడు కదా.. అప్పుడు వెళ్లొచ్చు కదా అని దేవయాణి అంటుంది.  ఆ మాటకు ఫణీంద్ర తిడతాడు. నేను మాత్రం వెళ్తున్నాను అని బయలుదేరతాడు. ధరణి నేను కూడా వస్తాను మామయ్య అంటుంది. ఇక చేసేది లేక.. శలేంద్ర దేవయాణి కూడా మేము వస్తాం అంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇక ఇంట్లో వసుధార, అనుపమ కూర్చొని ఉంటారు.  అనుపమను చక్రపాణి ఒకసారి మహేంద్ర గారికి ఫోన్ చేయండమ్మ అంటాడు. అయితే.. ఫోన్ ఎందుకు నాన్న.. మామయ్య వచ్చేస్తారు.. అది రిషి సర్ ది కాదు అని చెబుతారు. అని అంటూ ఉంటుంది. అప్పుడే ముకుల్.. మహేంద్రను తీసుకొని వస్తాడు. వెంటనే.. వసుధార.. ఏమైంది మామయ్య అది రిషి సర్ ది కాదు కదా, ముకుల్ గారు పొరపాటు పడ్డారు కదా  అని అంటుంది. కానీ.. మహేంద్ర తన దుఖాన్ని అంతా ఆపుకొని.. అది పొరపాటు కాదమ్మా.. మన రిషి దే అంటూ ఏడ్చేస్తాడు.

310
Guppedantha Manasu

Guppedantha Manasu

కానీ వసుధార నమ్మదు.. మీరు అబద్దం చెబుతున్నారు అని అంటుంది. కానీ.. డీఎన్ఏ టెస్టు చేశారని.. అది రిషి డెడ్ బాడీనే అని మహేంద్ర చెబుతాడు. అప్పటికే.. ఫణీంద్ర వాళ్లు కూడా అక్కడికి చేరుకుంటారు. ఏమైంది మహేంద్ర అని పణీంద్ర అంటే.. రిషి మనకు లేడు అన్నయ్య అని ఏడుస్తాడు. ఆ మాట విని రిషి గాడు లేడా.. అని శైలేంద్ర చాలా సంతోషపడతాడు. దేవయాణి ముఖంలోనూ నవ్వు కనిపిస్తుంది.

410
Guppedantha Manasu

Guppedantha Manasu

కానీ వసుధార మాత్రం.. నేను ఒప్పుకోను అని అరుస్తూ ఉంటుంది. కొన్ని నిజాలు అలానే బాధగా ఉంటాయి మేడమ్.. మేము ఒకటికి రెండు సార్లు చెక్ చేయకుండా ఏది కన్ఫామ్ చేయము అని ముకుల్ అంటాడు. వసు మాత్రం.. మీరు ఎన్ని చెప్పినా.. ఎంత మంది చెప్పినా.. నేను మాత్రం నమ్మను అని అంటూ ఉంటుంది. నేను డైరెక్ట్ గా చూడాల్సిందే అని వసుధార అంటుంది. అయితే.. నువ్వు చూసినా ఏమీ తెలియదమ్మ అని మహేంద్ర ఏడుస్తాడు.. మీరు గుర్తుపట్టగా లేనిది నేను ఎందుకు గుర్తుపట్టలేను అని వసుధార అడిగితే... రిషి అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు అని మహేంద్ర అంటాడు.. అయితే.. మరి ఎలా గుర్తుపట్టారు అని వసు అడుగుతుంది. డీఎన్ఏ టెస్టు చేశారని మహేంద్ర అంటే.. మీరు ఫేస్ చూడలేదు కాబట్టి.. అది రిషి సర్ కాదు అని అంటుంది.. వసుని ఎలా నమ్మించాలో అర్థం కాక మహేంద్ర ఏడుస్తాడు.

 

510
Guppedantha Manasu

Guppedantha Manasu

అయితే.. శైలేంద్ర.. డీఎన్ఏ టెస్టులో తేలింది అని చెబుతున్నారు కదా అని ఏదో చెప్పబోతాడు. దానికి వసుధార.. నీలాంటివాడు ఎవరో రిపోర్టు మార్చి ఉంటారు అని అంటుంది. శైలేంద్ర కాలర్ పట్టుకొని.. చెప్పురా చెప్పు అంటూ బెదిరిస్తుంది. అందరూ.. వసుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే..దేవయాణి.. తన కొడుకును ఏదైనా అంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. అయితే.. నేరాలు చేసేది మీరే కదా అని వసు అంటుంది.

610
Guppedantha Manasu

Guppedantha Manasu

అయితే.. రిషి చనిపోయాడని తెలిసి.. వసుధార మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది అని దేవయాణి అంటుంది. ఆ మాటకు వసుకి మరింత కోపం వస్తుంది. సీరియస్ అవుతుంది. రిషి సర్ చనిపోయాడు అని అంటుందా అని కోపంగా మీదకు వెళ్తుంది. అయితే.. అనుపమ ఆపి.. ఆమె మాత్రమే కాదు అందరూ అదే చెబుతున్నారు. మహేంద్ర కూడా అదే చెబుతున్నాడు అని అంటుంది.

 

710
Guppedantha Manasu

Guppedantha Manasu

వసు మాత్రం.. లేదు.. మీరు ఏదేవో ఆలోచిస్తున్నారు అని అరుస్తుంది. అప్పుడే ముకుల్ వచ్చి వసుకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు.మీరు నమ్మినా నమ్మకున్నా.. రిషి సర్ చనిపోయాడు అనేది నిజం.. ఇదిగో ప్రూఫ్ అని చూపిస్తాడు. మీరు బాధపడినా.. రిషి సర్ లేడు అనేది నిజం అని ముకుల్ తేల్చి చెబుతాడు. ఇది మీ మనసుకు కష్టంగా ఉంటుందని తెలుసని.. జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుందని తెలుసు కానీ. అదే నిజం అని.. రిషి సర్ చనిపోయారు అని ముకుల్ అంటాడు..
కానీ వసు.. అబద్దం... రిషి సర్ బతికే ఉన్నారు. అందుకు నా ఊపిరే సాక్ష్యం. రిషి సర్ ఎక్కడ ఉన్నా.. నేను వెతికి పట్టుకొస్తాను అని బయటకు వెళ్తుంది.

810
Guppedantha Manasu

Guppedantha Manasu

ఈలోగా.. ఫణీంద్రకు అదంతా చూసి హార్ట్ ఎటాక్ వస్తుంది. అందరూ.. ఆయన దగ్గరకు పరుగులు తీస్తారు. వసు మాత్రం.. బయటకు వచ్చి.. మీరు ఎక్కడ ఉన్నారు రిషి సర్ అంటూ ఏడుస్తూ ఉంటుంది.  ఎవరు చెప్పినా నేను నమ్మను అని.. మీరు బతికే ఉన్నారని.. ఆ దేవుడే చెప్పినా, లోకమంతా చెప్పినా నేను నమ్మను అంటుంది.

అప్పుడే వసుకి వాళ్ల బావ రాజీవ్ వచ్చి వాటర్ బాటిల్ ఇస్తాడు. ముఖం చూడకుండా బాటిల్ అందుకుంటుంది. రాజీవ్ ని చూసి వాటర్ కూడా తాగకుండా ఆగిపోతుంది. ఆ బాటిల్ ని విసిరి కొడుతుంది. దాహంగా ఉన్నా కూడా బాటిల్ పడేశావేంటి మరదలు పిల్లా అని రాజీవ్ అంటాడు. తర్వాత.. ఎలా ఉన్నావ్?. చాలా కాలం తర్వాత నిన్ను చూసే దర్శన భాగ్యం దొరికింది అని ఏదేదో మాట్లాడుతూనే ఉంటాడు. వాడి మాటలకు వసుధారకు చిరాకు పడుతూ ఉంటుంది. అయినా కూడా రాజీవ్ ఆగడు.  అడుగుతూనే ఉంటాడు.
 

910
Guppedantha Manasu

Guppedantha Manasu

దానికి వసుధార.. అసలు నవ్వు ఎందుకు వచ్చావ్..? మళ్లీ నా వెంట ఎందుకు పడుతున్నావ్ అని అడుగుతుంది. అదేంటి వసు.. ప్రేమగా నీ దగ్గరకు వస్తే అలా అంటావ్.. నువ్వు కష్టాల్లోఉన్నావని పలకరిద్దాం అని వచ్చాను అని  అంటాడు. రిషి చనిపోయాడు అంట కదా.. అంటాడు. అయితే.. వసు మాత్రం రిషి సర్ చనిపోలేదు అంటుంది. కానీ.. రిషి చనిపోయాడని..ఈ విషయం అందరికీ తెలుసు అని , రిషి ని తలుచుకుంటే బాధగా ఉందని.. చక్కని హెయిర్ స్టైల్, ఐరన్ దుస్తులు హీరోలా ఉండేవాడని.. కానీ చనిపోయాడు అని అంటాడు.

కానీ.. రిషి సర్ చనిపోయారు అనే మాట ఇంకోసారి అంటే ఊరుకోను అని వసుధార వార్నింగ్ ఇస్తుంది. దానికి రాజీవ్.. అంత ఆవేశం వద్దు వసుధార.. అసలే ఇప్పుడు నువ్వు దిక్కు లేనిదానివి అంటాడు. వసు కోపంగా చూసినా పట్టించుకోడు. నీ చూపులకు నేను పడిపోతాను కానీ.. భయపడను అంటాడు. రిషి చనిపోయాడు కాబట్టి.. నీకు బాధ ఉంటుంది.. గుండెల్లో బాధ తీరేంత వరకు ఏడు.. ఒంటరిగా ఉండాలని మాత్రం అనుకోకు... నీకు తోడుగా నేను ఉంటాను అని ఓ తాళి బయటకు తీస్తాడు.
 

1010
Guppedantha Manasu

Guppedantha Manasu

అయితే.. వసుధార కోపం వచ్చి రాజీవ్ చెంప పగలకొడుతుంది. అయినా సిగ్గులేకుండా.. నువ్వు కొట్టావని నేను ఫీలవ్వను.. నీ స్పర్శ తాకినందుకు సంబరపడతాను అని బలవంతంగా వసుధారను లాక్కెళుతూ ఉంటాడు. అప్పుడే కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడు. ఫేస్ తప్ప మొత్తం చూపించారు. మరి ఆ కొత్త హీరో ఎవరు అనేది తెలియాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే. రిషి అయితే కాదు అని తెలుస్తోంది.. ఎందుకంటే.. గొంతు రిషిది కాదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image2
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image3
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved