Guppedantha Manasu 25th January Episode:శైలేంద్ర ప్లాన్ తిప్పి కొట్టిన వసు.. రిషి కాలేజీకి రావడం ఖాయం..!
రిషి వెల్ కమ్ బ్యాక్ ఫ్లెక్సీలు ఉంటాయి. అది చూసి వసు షాకౌతుంది. స్టూడెంట్స్ మాత్రం సంతోషిస్తారు. రిషి సర్ వస్తున్నారా అని ఒకరితో మరొకరు తమ సంతోషాన్ని పంచుకుంటారు. ఇవి ఆ శైలేంద్ర పెట్టించాడా అని వసు మనసులో అనుకుంటుంది.
Guppedantha Manasu
Guppedantha Manasu 25th January Episode: కాలేజీలో ఫెస్ట్ కోసం వసు.. ఇంటి దగ్గర బయలుదేరుతుంది. బయలుదేరే ముందు.. జగతి ఫోటోకి దండం పెట్టుకుంటుంది. తర్వాత బయలుదేరుతున్నాను అని మహేంద్రకు చెబుతుంది. అయితే... మీ అత్తయ్యకు ఏమని దండం పెట్టుకున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఫెస్ట్ జరగాలని కోరుకున్నాను అని వసు చెబుతుంది. అలా దేవుడికి కదా మొక్కుకునేది అని మహేంద్ర అంటే.. తనకు జగతి మేడమ్ ని మించిన దైవం ఎవరు ఉన్నారు మామయ్య అని అడుగుతుంది. జగతికి కూడా నువ్వు ప్రియమైన శిష్యురాలివి కదా.. తన ఆశీస్సులు నీకు ఎ్పుడూ ఉంటాయి లే అని మహేంద్ర కూడా అంటాడు. ఇక.. బయలు దేరుతుంది. వసు అలా బయటకు వెళ్లగానే.. జగతి ఫోటో కింద పడిపోతుంది. అది చూసి.. ఇలాంటి అపశకునం జరిగింది ఏంటి అని మహేంద్ర కంగారుపడతాడు.
Guppedantha Manasu
ఇక.. కాలేజీలో ఫెస్ట్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అది చూసిన శైలేంద్ర.. అందరూ చాలా సంతోషంగా ఉన్నారని.. కాలేజీలో ఫెస్ట్ అంటే ఆ మాత్రం ఆనందం ఉంటుంది లే అనుకుంటాడు. ఇంకా.. ఎండీ వసుధార రాలేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వసు కాలేజీకి చేరుకుంటుంది. మంత్రి గారితో ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ ఉంటుంది. వసు దగ్గరకు కొందరు స్టూడెంట్స్ వస్తారు. ప్రోగ్రాం ఏర్పాట్ల గురించి వసు వాళ్లను కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాళ్లు సమాధానం చెబుతూ ఉంటారు. వాల్లు కాలేజీలోకి అడుగుపెట్టే సరికి... రిషి వెల్ కమ్ బ్యాక్ ఫ్లెక్సీలు ఉంటాయి. అది చూసి వసు షాకౌతుంది. స్టూడెంట్స్ మాత్రం సంతోషిస్తారు. రిషి సర్ వస్తున్నారా అని ఒకరితో మరొకరు తమ సంతోషాన్ని పంచుకుంటారు. ఇవి ఆ శైలేంద్ర పెట్టించాడా అని వసు మనసులో అనుకుంటుంది.
Guppedantha Manasu
అప్పుడే.. శైలేంద్ర అక్కడకు వచ్చి వసుధారకు గుడ్ మార్నింగ్ చెబుతాడు. స్టూడెంట్స్ ని వెళ్లిపోమ్మని చెబుతాడు. వాళ్లు వెళ్లగానే.. రిషి వస్తున్నాడంట కదా అని అడుగుతాడు. ఈ ఫ్లెక్సీలు నువ్వే పెట్టించావా అని వసు కోపంగా అడుగుతుంది. నువ్వు చాలా తెలివైనదానివి వసుధార.. అందుకే వెంటనే కనిపెట్టేశావ్.. ఇంత ఇంటెలిజెంట్ కాబట్టే.. స్టూడెంట్ నుంచి ఎండీ అయ్యావ్ అని అంటాడు.. ఎవరైనా జీవితంలో ఎదగాలి అనుకుంటారు.. నీలా దిగజారాలి అని అనుకోరు అని వసు కోపంగా అంటుంది. ఎందుకు పెట్టించావ్ ఈ ఫ్లెక్సీలు అని అడుగుతుంది. దానికి.. నాకు ఎండీ సీటు ఇవ్వమంటే రిషి రావాలి అన్నావ్ కదా.. మరి... కాలేజీలో ఇంత పెద్ద ఫెస్ట్ జరుగుతుంటే రిషి రాకపోతే ఎలా అని అంటాడు. రిషి సర్ ఇప్పుడు రాలేరు అని వసు చెబుతుంది. నువ్వు సీక్రెట్ గా ఉంచి చికిత్స చేయిస్తున్నావ్ కదా.. ఇప్పుడు తీసుకురాక తప్పదు అని అంటాడు. సర్ ఇప్పుడు రారు, రాలేరు, రాకూడదు కూడా... ఫ్లెక్సీలు తీయించి.. సర్ రారు అనే విషయాన్ని అందరికీ చెప్పమని వసు అంటుంది.
Guppedantha Manasu
దానికి శైలేంద్ర..పిచ్చివసుధార..ఇప్పుడు ఈ విషయాన్ని అందరికీ చెబితే.. స్టూడెంట్స్ అంగీకరిస్తారా, నీకు వేరే ఆప్షన్ లేదు.,. కచ్చితంగా రిషిని తీసుకురావాల్సిందే అని అంటాడు. దానికి వసుకి ఏం చేయాలో అర్థం కాక లోపలికి వెళ్లిపోతుంది. లోపలికి వెళ్లగానే.. స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ కూడా.. రిషి సర్ వస్తున్నారంట కదా.. సంతోషంగా అడుగుతారు. వారి ప్రశ్నలకు కూడా వసు దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటుంది. ప్రోగ్రాం మొదలుపెడదామా అంటే.. ఇప్పుడే వద్దని.. కాసేపు ఆగి మొదలుపెడదాం అని చెబుతుంది.
Guppedantha Manasu
ఇక.. ఈ లోగా.. మహేంద్ర, అనుపమ కాలేజీకి వస్తారు.. వసుధార ఎండీగా అయిన తర్వాత మొదటిసారి జరుగుతున్న కార్యక్రమం కాబట్టి. సక్సెస్ చేయాలని మహేంద్ర అనుపమతో చెబుతూ ఉంటాడు. శైలేంద్ర ఈ పాటికే ఏదో ప్లాన్ చేసి ఉంటాడని.. మనం వసుకి సహాయం చేయాలని అనుపమ కూడా అంటుంది. ఇద్దరూ లోపలికి వచ్చే సరికి రిషి ప్లెక్సీలు చూసి షాకౌతారు. ఎవరు పెట్టించారు అని మహేంద్ర ఓ స్టూడెంట్ ని అడిగితే.. వసుధార మేడమ్ అని చెబుతాడు. వెంటనే వసు దగ్గరకు మహేంద్ర, అనుపమ వెళతారు.
Guppedantha Manasu
లోపల వసు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే, మహేంద్ర, అనుపమ వెళ్లి.. ఇలా ఎందుకు చేశావ్ అని అడుగుతారు. వసు తాను చేయలేదని, శైలేంద్ర చేశాడు అని చెబుతుంది. అది విని వీళ్లిద్దరూ కూడా షాకౌతారు. ఇన్ని రోజులు రిషిని జాగ్రత్తగా కాపాడుకున్నాం అని.. ఇప్పుడు రిషిని ఎలాగైనా బయటకు తీసుకురావాలి అని.. ఇలా కుట్ర చేశాడని.. ఏం చేయాలా అని మహేంద్ర అనుకుంటాడు. ఈ విషయం రిషికి చెప్పావా అని మహేంద్ర అడిగితే.. లేదని వసు అంటుంది. రిషి రాకపోతే స్టూడెంట్స్ ఊరుకోరని, రిషి వస్తే.. శైలేంద్రకు తెలిసిపతుందని మహేంద్ర భయపడుతూ ఉంటాడు. వీళ్లు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఫణీంద్ర వస్తాడు.
రావడం రావడమే... ఫణీంద్ర చాలా సంతోషిస్తాడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నామని, రిషి లేకుండా ఫెస్ట్ జరుగుతుందని బాధపడ్డానని.. ఇప్పుడు రిషి వస్తున్నందుకు సంతోషంగా ఉందని ఫణీంద్ర అంటాడు. కానీ.. ఫణీంద్ర కూడా ఇలా రియాక్ట్ అవ్వడంతో ఏం చెప్పాలో వారికి అర్థం కాదు. ఒకరి మొహలు మరొకరు చూసుకుంటూ ఉంటారు.
Guppedantha Manasu
తర్వాత వసు టెన్షన్ గా చేతులు పిసుక్కుంటూ ఉంటే.. శైలేంద్ర వస్తాడు.. ఏంటి వసుధార.. నన్ను చూస్తే.. చంపేయాలనే కోపం వస్తుంది కదా అని అడుగుతాడు. మిమ్మల్ని ఊహించని దెబ్బ కొట్టాను కదా.. నా మీద చెయ్యి చేసుకుంటావా..? ఇప్పుడు నీకు నన్ను చూస్తేనే భయం పుడుతోందని నాకు తెలుసు. ఈ భయం ముందే ఉంటే.. కథ ఇప్పటి వరకు వచ్చేది కాదు కదా అంటాడు. ఏం చేయాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ కదా? రిషిని తీసుకురావాలా వద్దా.. తీసుకొస్తే నేనేం చేస్తాను..? తీసుకురాకపోతే.. స్టూడెంట్స్ ఏం చేస్తారా అని ఆలోచిస్తున్నావ్ కదా అని అంటాడు.
Guppedantha Manasu
నిజానికి..,నువ్వు రిషిని తీసుకురావు అని నాకు కూడా తెలుసు. కానీ... ఈ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల రిషి వస్తున్నాడని కాలేజీలో అందరికీ తెలిసిపోతుందని, మినిస్టర్ గారికి కూడా తెలిసిపోయిందని.. ఇప్పుడు రిషి రాకపోతే.. ఫెస్ట్ ఆగిపోతుందని.. కాలేజీ అంతా అల్లకల్లోలం అవుతుందని బెదిరిస్తున్నాడు. తానే స్వయంగా స్టూడెంట్స్, లెక్చరర్స్ ని రెచ్చగొడతాను అని అంటాడు. దీంతో.. కాలేజీ పరువు పోవడంతో పాటు...నీ ఎండీ సీటు కూడా పోవడం ఖాయం అని అంటాడు.
ఎందుకు శైలేంద్ర అలా మాట్లాడతావ్..? నీకు నువ్వే అన్నీ ఊహించుకుంటున్నావ్.. నేనేం ఆలోచిస్తున్నానో నీకు తెలీదు కదా.. నువ్వు ముచ్చటపడినట్లుగానే రిషి సర్ ని తీసుకువస్తున్నాను అని చెప్పి షాకిస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని శైలేంద్ర అడిగితే.. ఏంటి షాకయ్యావ్ కదా.. నువ్వు ఇంత ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టించావ్ కదా.. నీ కష్టం వృథా చేయడం ఎందుకు రిషి సర్ ని తీసుకువస్తాను. ఈ రోజుతో గేమ్ ముగించేద్దాం.. నువ్వు భయపెట్టింది చాలు.. రిషి సర్ రావడం ఖాయం.. ఫెస్ట్ సక్సెస్ అవ్వడం ఖాయం.. నీ నిజస్వరూపం అందరి ముందు బయటపడటం ఖాయం.. నువ్వు జైలుకి వెళ్లడం ఖాయం..అని మాస్ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు తీసుకున్న గోతిలోనువ్వు పడ్డావ్ శైలేంద్ర అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.