Guppedantha Manasu 15th february Episode:రిషి ప్లేస్ లో మను, అనుపమ కి ఏమౌతాడు ..? శైలేంద్ర ఫ్రస్టేషన్..!
పాపం వసుధార.. కనీసం తల కూడా వంచుకోలేకపోతోందని, ఇక ఈ రోజుతో తనకూ కాలేజీకి ఎలాంటి సంబంధం ఉండదు అని మురిసిపోతూ ఉంటాడు. చివరికి అందరూ సంతకాలు చేసేస్తూ ఉంటారు. మహేంద్ర కూడా చేసి వసుధార చేతికి ఇస్తాడు.
Guppedantha Manasu
Guppedantha Manasu 15th february Episode: కాలేజీలో వసుధారకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏకంగా కాలేజీని చేజార్చుకునే ప్రమాదం వచ్చింది. రిషి తమ వద్ద రూ.40కోట్లు అప్పు తీసుకున్నాడని.. ఆ డబ్బు ఇవ్వకుంటే కాలేజీ రాసివ్వమని ఫైనాన్సర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. కనీసం వసు దగ్గర కాలేజీని కాపాడటానికి కనీసం ఒక్క బ్యాకప్ ప్లాన్ కూడా లేదు. కానీ... కాలేజీని మాత్రం కాపాడేస్తాను అని బిల్డప్స్ ఇస్తూ, శైలేంద్రతో ఛాలెంజ్ లు చేస్తుంది. కానీ చివరికి మినిస్టర్ వచ్చినా వాళ్ల నుంచి కాలేజీని కాపాడలేకపోతాడు. దీంతో చేసేది లేక.. బోర్డు మెంబర్స్ మొత్తం ఒకరి తర్వాత మరికొరు కాలేజీని రాసిస్తున్నట్లు సంతకాలు పెడుతూ ఉంటారు.
Guppedantha Manasu
వసుని చూసి శైలేంద్ర సంతోషపడుతూ ఉంటాడు. పాపం వసుధార.. కనీసం తల కూడా వంచుకోలేకపోతోందని, ఇక ఈ రోజుతో తనకూ కాలేజీకి ఎలాంటి సంబంధం ఉండదు అని మురిసిపోతూ ఉంటాడు. చివరికి అందరూ సంతకాలు చేసేస్తూ ఉంటారు. మహేంద్ర కూడా చేసి వసుధార చేతికి ఇస్తాడు.
Guppedantha Manasu
ఇక శైలేంద్ర తన ఓవర్ యాక్షన్ మొదలుపెడతాడు. ‘అయ్యయ్యో కాలేజీ వదులుకోవాల్సి వస్తుందే. ఇది మా తాతగారు స్థాపించిన కాలేజీ. ఇది మా తమ్ముడు రిషి విస్తరించిన కాలేజీ. ఇన్నాళ్లకు ఈ కాలేజీ వేరేవాళ్ల పరం అయిపోతోందే.అసల సంతకం పెట్టడానికి మనసు కూడా రావడం లేదు. చెయ్యికూడా వణుకుతోంది. తప్పకుండా కాలేజీని వదులుకోవాల్సిందేనా సర్’ అని అంటాడు. అయితే... అంతకు మించి మరో మార్గం లేదని, డబ్బులు అయినా ఎడ్జస్ట్ చేయాల్సింది.. ఇప్పుడు స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కాబట్టి.. కనీసం కాలేజీ వాళ్లకు అయినా ఇస్తే.. వాళ్లు అయినా నడుపుకుంటారు అని మినిస్టర్ గారు చెబుతారు.
ఇక మీరు కూడా అలా చెప్పిన తర్వాత నేనేం చేయగలను.. నా మనసు చంపుకొని సంతకం పెడతాను అని అంటాడు. మరోవైపు బయట రాజీవ్ నిలపడి.. తొందదరగా పని పూర్తి అయితే బాగు నాకు ఎందుకో తేడా కొడుతోంది అనుకుంటూ ఉంటాడు. అదే సమయానికి సంకతం చేయడానికి ఫైల్ వసు ముందుకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి.. న్యూ హీరో మనో.. ఎంట్రీ ఇస్తాడు.
Guppedantha Manasu
ఆ కొత్త హీరోని రాజీవ్ చూస్తాడు. వీడు ఎందుకు కాలేజీకి వచ్చాడు అని అనుకుంటాడు. అదే విషయం చెబుదాం అని రాజీవ్.. శైలేంద్రకు ఫోన్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తాడు. మళ్లీ చేయడంతో.. రాజీవ్ చెప్పేది వినిపించుకోకుండా.. పని అయిపోయిందని, వసుధార సంతకం పెడితే సరిపోతుందని అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కొత్త వ్యక్తి గురించి రాజీవ్ చెప్సేది శైలేంద్ర వినకుండా ఫోన్ పెట్టేస్తాడు.మరోసారి చేస్తే లిఫ్ట్ చేయడు. దీంతో.. రాజీవ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వీడేమో ఫోన్ లిఫ్ట్ చేయడు.. వీడేమో వచ్చేశాడు... ఇక ఇది జరగదు.. ఆపేస్తాడు ఎలా అయినా ఆపేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు.
Guppedantha Manasu
మరోవైపు వసు ముందు ఫైల్ ఉంటుంది. వసు ఒక్కతి సంతకం చేస్తే.. కాలేజీ ఫైనాన్సర్స్ చేతికి వెళ్లినట్లే.అయితే.. వసు గతంలో తనకు ఈ కాలేజీకి ఉన్న సంబంధం గురించి, రిషితో గడిపిన స్మృతులను తలుచుకుంటూ ఉంటుంది. వసుని మహేంద్ర సంతకం పెట్టమని చెబుతూ ఉంటాడు. అయితే.. సంతకం పెట్టకుండా రిషిని వసు తలుచుకుంటుంది. ఇప్పటికీ తనకు నమ్మకం ఉందని, ఈ కాలేజీ మనకు దూరం కాదు అని అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటుంది.
Guppedantha Manasu
సరిగ్గా అప్పుడే కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసి ఎవరు ఇతను అన్నట్లుగా అందరూ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తారు. వసుని గతంలో కాపాడాడు కాబట్టి... ఆ సీన్స్ తలుచుకుంటుంది. అయితే.. అనుపమ మాత్రం షాకై నిలపడి చూస్తూ ఉంటుంది. అతనికీ, అనుపమకి ఏదో సంబంధం ఉన్నట్లు ఉందని.. ఈ సీన్ తో అర్థమౌతుంది.
అతను రావడం రావడమే.. డబ్బులు ఎంత ఇవ్వాలి అని అడుగుతాడు. ఆ మాటకు అక్కడ ఉన్నవారంతా షాకై నిలపడి చూస్తారు. డబ్బు ఎంత ఇవ్వాలి అని అడుగుతాడు. మీరు ఎవరు అని ఫైనాన్సర్స్ అడుగుతారు. అయితే నేను ఎవరు అయితే మీకేంటి..? డబ్బులు ఎంత ఇవ్వాలో చెప్పండి అని అతను అంటాడు. అయితే.. ఫైనాన్సర్స్ మాత్రం ఆలస్యం అయ్యిందని.. కాలేజీ అమ్మేశారు అని చెబుతారు. దానికి అతను.. కాలేజీ అమ్మేశారా? అప్పు తీసుకున్నారా అని అడుగుతాడు. అప్పు మాత్రమే తీసుకున్నారు అని చెప్పడంతో.. మరి.. అమ్మేశారు అని చెబుతారేంటి ? అబద్ధం చెప్పకూడదు కదా అని అంటాడు.
Guppedantha Manasu
‘అసలు ఎవరు సర్ మీరు..? ప్రతిసారీ చిరవలో ఎవరో ఒకరు వస్తారు.. ఏదో ఒకటి చేస్తారు. ఇది కాలేజీ అనుకుంటున్నారా? లేక చేపల మార్కెట్ అనుకుంటున్నారా?లాస్ట్ టైమ్ కూడా మురగన్ వచ్చాడు.’ అని ఫ్రస్టేట్ అవుతాడు. అందరూ తననే గమనిస్తున్నారు అని అర్థం చేసుకొని మళ్లీ మామూలు అయిపోయి.. ఎవరో వచ్చి మాకు ఎందుకు సహాయం చేయడం.. మాకు అవసరం లేదు కదా అంటాడు.
Guppedantha Manasu
దానికి హీరో.. సహాయం చేస్తుంటే వద్దు అంటున్నారు.. మీ కాలేజీ పోవాలని మీరే కోరుకుంటున్నారా? అని మనో అడుగుతాడు. దానికి శైలేంద్ర అలా ఏమీ లేదు అంటాడు. అయితే.. మరి.. ఎందుకు అంత చిరాకు పడుతున్నారు, సాయం చేస్తే తీసుకోవాలి కానీ అని అంటాడు. కానీ.. శైలేంద్ర ఇలాంటి వాళ్లను నమ్మకూడదని.. ఇప్పుడు సహాయం చేస్తానని వచ్చి తర్వాత ఏదో ఒకటి చేస్తారని, మన కాలేజీ పరువు తీస్తారని, మనల్ని అగాధంలోకి నెట్టేస్తారని, మాకు ఎవరి సహాయం అక్కర్లేదని అంటాడు.
దానికి అతను.. మీరు కాసేపు సైలెంట్ గా ఉంటారా అని శైలేంద్ర నోరు మూయిస్తాడు. తర్వాత ఫైనాన్సర్స్ ని.. ఎంత ఇవ్వాలి అని మరోసారి అడుగుతాడు. అయితే.. వాళ్లు కూడా శైలేంద్ర మనుషులు కావడంతో .. మీ దగ్గర తీసుకోవాలో వద్దో అర్థం కావడం లేదు, అసలు మీరు ఎవరు అని అంటాడు. దానికి మనో.. మీకు మీ సమస్య సాల్వ్ కావాలని ఉందా లేదా? అని అడుగుతాడు. దానికి వాళ్లు.. సమస్య సాల్వ్ కావాలనే అంటాడు. అయితే.. తాను డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా అని అంటాడు.
Guppedantha Manasu
దానికి శైలేంద్ర..డబ్బులు అంటే రూ5, 10 లక్షలు కాదు.. రూ.40కోట్లు ఇవ్వాలి అంటాడు.. దానికి హీరో రూ.50కోట్లు ఇస్తాను మీకు ఏమైనా ప్రాబ్లమా అని చెక్ రాసి ఇచ్చేస్తాడు. ఎవరు ఇతను.. ఇంత డబ్బు ఇస్తున్నాడు అని మహేంద్ర, మరో వైపు శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటారు. ఇక డబ్బులు ఇచ్చిన తర్వాత... ఎలా వచ్చారో అలా వెళ్లిపోవాలని.. ఇంకోసారి కాలేజీని హ్యాండవర్ చేసుకోవాలనే ఆలోచనే మీకు రావద్దు అని ఆ ఫైనాన్సర్స్ కి హీరో వార్నింగ్ ఇస్తాడు. ఇక తప్పక వాళ్లు వెళ్లిపోతారు.
ఇప్పుడు మీరందరూ హ్యాపీ నా అని మనో అడుగుతాడు. అయితే.. అసలు మీ దగ్గర మేం ఎందుకు డబ్బులు తీసుకోవాలి అని వసు అడగుుతుంది. మీకు ఇంకో ఆప్షన్ లేదు కదా అని అతను బదులిస్తాడు. దానికి వసు.. మీకు వాళ్లకు తేడా ఏంటి? రేపు పరీక్షల సమయంలో వచ్చి మీరు కూడా వాళ్లలాగా గొడవ చేయరు అని గ్యారెంటీ ఏంటి అని అడుగుతుంది. అయితే.. తనకు ఆ అవసరం లేదని, తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. మీ కాలేజీని మీరు హ్యాపీగా నడుపుకోవచ్చు అని చెబుతాడు.
Guppedantha Manasu
దానికి వసు.. అసలు మీరు ఎందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారు..? మీకు మాకు ఎంటి సంబంధం అని వసు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే.. మీరు ఎండీనే కదా.. మీ క్యాబిన్ లో మాట్లాడుకుందాం అని అతను చెబుతాడు. వసు ఆలోచిస్తూ ఉంటే.. మినిస్టర్ మధ్యలో దూరి.. సమస్య సాల్వ్ అయ్యింది కదా అని చెప్పి థ్యాంక్స్ చెబుతాడు. మంచి వాళ్లకు ఎప్పుడైనా మంచి జరుగుతుందని.. కాలేజీని బాగా చూసుకోమని చెప్పి వెళ్లిపోతాడు.
సీన్ కట్ చేస్తే.. ఎండీ క్యాబిన్ లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. శైలేంద్ర ఏం మాట్లాడుకుంటున్నారు అని తొంగి చూస్తూ ఉంటాడు. అనుపమ టెన్షన్ పడటం మహేంద్ర చూసేస్తాడు. తర్వాత.. వసు అతన్ని ఎవరు మీరు అని అడుగుతుంది. సాటి మనిషిని అంటాడు. ఈ రోజు ఇంత పెద్ద సమస్యను సాల్వ్ చేశారు అని వసు అంటే.. సాటి మనిషిని అని, మీరు కష్టాల్లో ఉన్నారని.. సమయానికి తాను వచ్చి ఆదుకున్నాను అని చెబుతాడు. ఆ డబ్బు నేను అప్పుగా ఇస్తున్నాను అనుకొని.. మీకు వీలైనప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని.. అప్పటి వరకు డబ్బు కానీ, కాలేజీ కానీ అడగను అని మాట ఇస్తాడు. వసు బాండ్ పేపర్ చూసి భయపడుతూ ఉంటుంది. అయితే.. దానిని అతను గమనించి.. తాను సమస్య సాల్వ్ చేస్తాను కానీ.. తన వల్ల సమస్య రాదు అని చెబుతాడు
Guppedantha Manasu
అసలు మేం సమస్యల్లో ఉన్నాం అని మీకు ఎలా తెలుసు అని వసు అడుగుతుంది. మహేంద్ర కూడా అదే అడుగుతాడు. దానికి అతను.. మీ సమస్య సాల్వ్ చేస్తే.. మీరెందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు అని అంటాడు. మంచి చేయడానికి కారణాలు అవసరం లేదని.. ఇది కూడాఅంతే అని.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటాడు. మీరు అనుకున్నట్లుగా కాలేజీని నడపండి అది నాకు చాలు అంటాడు.
సమయానికి వచ్చి కాలేజీని కాపాడినందుకు వసుధార థ్యాంక్స్ చెబుతుంది. మీ డబ్బులు తొందరల్లోనే తిరిగి ఇచ్చేస్తాను అని చెబుతుంది. అయితే.. వెళ్లే ముందు.. వసు చేతికి ఉన్న బ్రేస్ లెట్ ని మనో చూస్తాడు. అదేంటి అని అడుగుతాడు. అయితే.. అది రిషి సర్ బ్రెస్ లెట్ అని చెబుతుంది. రిషి సర్ ఎవరు అంటే.. నా భర్త అని.. తాను ఏ ప్రమాదంలో ఉన్నా ఆయనే కాపాడతాడు అని చెబుతుంది. అయితే.. నన్ను కూడా మీ రిషి సరే పంపించారు అనుకోండి అని అంటాడు. ఆ మాట విని శైలేంద్ర షాకౌతాడు. వెళ్లిపోతున్న అతనిని పిలిచి పేరు అడుగుతుంది. మను అని చెబుతాడు. ఆ పేరు చెప్పేటప్పుడు అనుపమను చూస్తాడు. అనుపమ ఇబ్బంది పడుతూ ఉంటుంది.
అయితే.. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని మహేంద్ర అడిగితే.. తానే కాంటాక్ట్ అవుతానని.. తన దగ్గర మీ అందరి కాంటాక్ట్స్ ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత అనుపమ... వాళ్ల పెద్దమ్మకు ఫోన్ చేస్తుంది. మను ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది. వాడిని అడగకపోయావా అని వాళ్ల పెద్దమ్మ అంటుంది. ఇక్కడి సమస్య గురించి నీకు చెప్పి తప్పు చేశాను అని, అసలు సమస్య ఇప్పుడే మొదలైందని మళ్లీ ఫ్రస్టేట్ అయ్యి ఫోన్ పెట్టేస్తుంది.