నిఖిల్, పృథ్వీ, యష్మిలకు పెద్ద షాక్.. బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ అతడే? టాప్ 5 ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు 8 స్ట్రాంగ్ కంటెస్టెంట్లకి సంబంధించిన లెక్కలు మారిపోతున్నాయి. కొత్త కంటెస్టెంట్ టాప్‌లోకి వస్తే టాప్ అనుకున్నవాళ్లు లీస్ట్ కి పడిపోవడం గమనార్హం.
బిగ్ బాస్ తెలుగు 8 లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టైటిల్ విన్నర్, టాప్ 5 కంటెస్టెంట్లకి సంబంధించి రోజు రోజుకి లెక్కలు మారిపోతున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్లు డౌన్ అవుతున్నారు. లీస్ట్ లో ఉన్న వాళ్లు స్ట్రాంగ్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు టైటిల్ విన్నర్‌కి సంబంధించిన చర్చ ఆసక్తికరంగా మారింది.
మొన్నటి వరకు టైటిల్ రేసులో నిఖిల్ ఉంటాడని భావించారు. ఆయన చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గానూ కనిపించాడు. కానీ రాను రాను మరింతగా ఆయన గ్రాఫ్ పడిపోతుంది. పూర్తిగా డౌన్ అయిపోతున్నాడు. అలాగే పృథ్వీరాజ్ టైటిల్ రేసులో ఉంటాడని భావించారు. ప్రారంభంలో ఆయన ఎలిమినేట్ కావడం పక్కా అనేలా ఉండేది. కానీ నెమ్మదిగా పుంజుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్లీ డౌన్ అయ్యాడు. ఈ వారం ఆయన ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.
ఇంకోవైపు యష్మి, ప్రేరణ, విష్ణు ప్రియాలు స్ట్రాంగ్ కంటెస్టెంట్ల జాబితాలో కనిపించారు. కానీ గత వారం చూస్తే యష్మి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. యష్మితో పోల్చితే ప్రేరణ చాలా బెటర్ పొజీషియన్‌లో ఉంది. ఇక విష్ణు ప్రియా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె అటు స్ట్రాంగా? ఇటు వీకా అనేది తేల్చుకోలేకపోతుంది.
హడావుడి తప్ప ఆమెలో మ్యాటర్ లేదనే ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. అవినాష్, రోహిణి, టేస్టీ తేజలు ఎంటర్‌టైనర్‌గా నిలుస్తున్నారు. అయితే వీళ్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లిస్ట్ లో ఉంటారా అనేది డౌట్. టాప్ 5లో అవినాష్‌కి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో నబీల్ కూడా ఉన్నాడు. ప్రారంభంలో సైలెంట్‌గా ఉన్న నబీల్ నెమ్మదిగా పుంజుకుంటూ తన గ్రాఫ్‌ని పెంచుకుంటున్నాడు. ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నాడు. టైటిల్ రేసులోనూ కనిపిస్తున్నాడు. అయితే ఈ మధ్య నబీల్ కాస్త డల్‌గానే కనిపిస్తున్నాడు. తన రేంజ్‌ని చూపించడం లేదు.
అయితే నామినేషన్‌లో లేకపోవడం, ఎవిక్షన్ షీల్ట్ తన వద్ద ఉండటంతో రిలాక్స్ గా ఉన్నాడని అర్థమవుతుంది. కానీ ఆట తీరులో ఆయన మెరుగుపడాల్సి ఉంది. కంటెంట్‌ని ఇవ్వడంలో,ఎంటర్‌టైన్ చేయడంలో ఆయన మరోసారి జోష్ చూపించాల్సి ఉంది.
ఇక ఎలిమినేట్ అవుతాడనుకున్న గౌతమ్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మణికంఠ కారణంగా బతికిపోయిన గౌతమ్ ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు టాప్ కంటెస్టెంట్‌లో ఒకరిగా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు విన్నర్ ని తేల్చాల్సి వస్తే గౌతమ్ టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అంతటి క్రేజ్ ఇప్పుడు ఆయన సొంతం. ఫ్యాన్స్ భారీగా ఆయన్ని ప్రోమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోలింగ్ విషయంలో ఎక్కువగా గౌతమ్‌కే సపోర్ట్ కనిపిస్తుంది. టైటిల్ విన్నర్ రేసులో గౌతమ్ పేరే ప్రధానంగా వినిపిస్తుంది.
ఇలా ప్రస్తుతం టైటిల్ రేసులో గౌతమ్ ఉన్నాడని అర్థమవుతుంది. అలాగే నిఖిల్ చాలా డల్ అయిపోయాడు. ఆయన పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అయినా ఆయన టాప్ 5లో ఉంటాడని చెప్పొచ్చు. నబీల్, అవినాష్, ప్రేరణలు టాప్ 5 కంటెస్టెంట్లుగా కనిపిస్తుంది. అవినాష్, ప్రేరణల విషయంలో ఓటింగ్ తలక్రిందులైతే విష్ణు ప్రియా, యష్మిలు పుంజుకుంటే ఈ ఇద్దరు టాప్ 5లోకి వచ్చే అవకాశం ఉందని నెటిజన్ల అభిప్రాయపడుతున్నారు. ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ కాకపోతే టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. మరి వీరిలో ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనేది మరో ఐదు వారాలు వెయిట్ చూడాల్సిందే.
also read: సన్యాసిగా మారిపోతుందేమో అని అనుష్క పేరెంట్స్ లో టెన్షన్, యోగా టీచర్ స్వీటికి ముందే చెప్పాడా?