MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi Serial 3rd December Episode:కావ్యకు బద్ధ శత్రువులా మారిన ధాన్యం..అనుకూలంగా మార్చుకున్న రుద్రాణి

BrahmaMudi Serial 3rd December Episode:కావ్యకు బద్ధ శత్రువులా మారిన ధాన్యం..అనుకూలంగా మార్చుకున్న రుద్రాణి

అది తన కొడుకు అంటే, దుగ్గురాల పరువు నిలపెట్టే మాట మాట్లాడాడు అని అంటాడు. అందరూ నవ్వుకుంటారు. ఇక, అనామిక పేరెంట్స్ వెళ్తూ వెళ్తూ.. రాజ్ తో మాట్లాడాలి అని పక్కకు పిలుస్తారు.

7 Min read
Author : ramya Sridhar
Published : Jan 03 2024, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Brahmamudi

Brahmamudi


BrahmaMudi Serial: దుగ్గిరాల కుటుంబసభ్యులంతా.. వధూవరుల కార్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తమ ఆచారం ప్రకారం.. పుట్టింట్లో చేయాలని అనామిక తల్లి శైలజ అంటే, మా ఆచారం ప్రకారం అత్తారింట్లోనే జరగాలి అని అపర్ణ అంటుంది. ఆ మాటకు అనామిక పేరెంట్స్ ఫేసులు మారిపోతాయి. అది గమనించిన ఇందిరాదేవి..  అలాంటి ఆచారం పెట్టడానికి వెనక ఉన్న కారణం చెబుతుంది. అత్తారింట్లో అందరూ కొత్తవాళ్లు ఉంటారు కాబట్టి, వధువు బయపడుతుందని, భర్తతో ఏకాంతంగా కూడా మాట్లాడుకోలేరు అనే కారణంతోనే అలా పుట్టింట్లో కార్యం పెట్టేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కదా, ఇక్కడే జరిపిద్దాం అని ఇందిరాదేవి అంటుంది. సత్యనారాయణ వత్రం కూడా ఇక్కడే జరిపిద్దాం అని ఇందిరాదేవి అంటుంది. ఇక కాదనలేక అనామిక పేరెంట్స్ సరే అంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Brahmamudi

Brahmamudi

తర్వాత.. తాము వెళతాం అని చెప్పి, కళ్యాణ్ చేతిలో అనామిక చెయ్యి పెడతారు. అనామికతో పాటు.. కళ్యాణ్ కి కూడా తోడుగా ఉంటామని.. మీరిద్దరూ సంతోషంగా ఉండమని శైలజ చెబుతుంది

310
Brahmamudi

Brahmamudi

వెంటనే కళ్యాణ్.. తన ప్రాణం పోయేంత వరకు అనామిక చెయ్యి విడవను అంటాడు. కళ్యాణ్ మాటకు అందరూ మురిసిపోతారు. వెంటనే ప్రకాశం.. అది తన కొడుకు అంటే, దుగ్గురాల పరువు నిలపెట్టే మాట మాట్లాడాడు అని అంటాడు. అందరూ నవ్వుకుంటారు. ఇక, అనామిక పేరెంట్స్ వెళ్తూ వెళ్తూ.. రాజ్ తో మాట్లాడాలి అని పక్కకు పిలుస్తారు.

410
Brahmamudi

Brahmamudi

ఈ పెళ్లి జరగడానికి కారణం మీరు. మీరే లేకుంటే ఈ పెళ్లి జరిగేది కాదు అని సుబ్బూ రాజ్ తో అంటాడు. ఆ విషయం మర్చిపోమ్మని రాజ్ అంటాడు. అయితే, మర్చిపోమ్మని చెప్పడం మీ గొప్ప మనసుకు నిదర్శనం అని, గుర్తుపెట్టుకోవడం మా బాధ్యత అని శైలజ అంటుంది.తర్వాత పెళ్లిలో జరిగిన గొడవ గురించి తమకు భయంగా ఉందని సుబ్బూ అంటాడు. మీరు అవనసరంగా భయపడుతున్నారని, మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని రాజ్ భరోసా ఇస్తాడు. కానీ, కావ్య తన చెల్లిని ఇంటి కోడలిగా తీసుకురావాలి అనుకుంటే, మా అమ్మాయి తోటికోడలు అయ్యింది కదా అని సుబ్బూ నసుగుతూ ఉంటాడు. ఆ మాట రాజ్ కి నచ్చదు. కానీ, కళావతి వల్ల.. అనామిక ఇబ్బంది పడదని, తాను మాట ఇస్తున్నాను అంటాడు. ఆ మాట చాలు మాకు అని అనామిక పేరెంట్స్ వెళ్లిపోతారు.

510
Brahmamudi

Brahmamudi

మరుసటి రోజు కనకం, మూర్తి ఇంట్లో బాధగా కూర్చుంటారు. ముఖ్యంగా ధాన్యలక్ష్మి మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. రాజ్యలక్ష్మి వాళ్లకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. తర్వాత.. ముందు నుంచి తాము చెప్పింది నువ్వు వినలేదని, ఇప్పుడు అనవసరంగా అప్పూ అందరి ముందు దోషిగా నిలపడిందని, కళ్యాణ్ కి దూరంగా ఉంటాను అని వినకుండా.. అప్పూని పెళ్లికి తీసుకువెళ్లావని,  అక్కడ కావ్య కూడా ఇబ్బందుల్లో పడింది అని రాజ్యలక్ష్మి కనకం ని తిడుతుంది. వెంటనే మూర్తి.. వాళ్లు నింద మొత్తం అప్పూ మీద వేసేశారని, అటు కావ్యకు మాట వచ్చిందని, ఇటు మాకు మాట వచ్చిందని, ఎటొచ్చి బతికిపోయింది స్వప్న మాత్రమేనని అంటాడు.  ఇప్పుడు అప్పూ ఈ బాధ నుంచి ఎప్పుడు కోలుకుంటుందో అని మూర్తి బాధపడతాడు.

అంతా తానే చేశానని, కాకపోతే ఆస్తి కోసం అప్పూ ప్రేమ కోసం చేశానని కనకం ఒప్పుకుంటుంది. కళ్యాన్ ని ప్రేమించిందని తెలిశాక, వాళ్లిద్దరినీ ఒకటి చేయాలి అనుకున్నానని అంటుంది. తనను అన్నా పర్లేదని కానీ, అప్పూని, కావ్యని కూడా అన్నారని కనకం కూడా బాధపడుతుంది. ఒకవైపు అప్పూ ఆశలు ఆవిరైనందుకు బాధపడాలో, అటు కావ్య మాటలు పడినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అంటుంది. కావ్యకు ఓర్పు, నేర్పు దేవుడు ఇచ్చాడని, తన సమస్యలను తాను పరిష్కరించుకోగలదని, కానీ, అప్పూ ఈ బాధ నుంచి ఎలా బయటపడుతుందా అనే తాను భయపడుతున్నాను అని మూర్తి అంటాడు.

610
Brahmamudi

Brahmamudi

కానీ, అప్పూ.. అప్పుడే షూ వేసుకొని బయటకు వెళ్లడానికి రెడీ అవుతుంది. ఎక్కడికి అని రాజ్యలక్ష్మి అడుగుతుంది. దానికి సమాధానం చెప్పకుండా, తన సైకిల్ తాళం అడుగుతుంది. కనకం ఆ కీ ఇవ్వగానే.. బయటకు బయలుదేరుతుంది. చికెన్ తినాలని ఉందని, షాప్ కి వెళ్లి చికెన్ తెస్తాను అని చెప్పి వెళుతుంది. అప్పూ దగ్గరి నుంచి ఈ రియాక్షన్ చూసి, వీళ్లంతా షాకౌతారు.

710
Brahmamudi

Brahmamudi

దుగ్గిరాల ఇంట్లో జరిగిన అవమానం తలుచుకొని కావ్య బాధపడుతూ ఉంటుంది. అది చూసి రాజ్ దగ్గరకు వెళతాడు.  ఇంట్లో జరిగిన గొడవ గురించి బాధపడుతున్నావా అని అడుగుతాడు. కావ్య సమాధానం చెప్పకుండా వెళ్తుంటే, పిలిచి.. హారతి గురించే ఆలోచిస్తున్నావా అంటాడు. అవును అంటుంది. చివరికి నీతోనే హారతి ఇప్పించారు కదా అని రాజ్ అంటాడు. ‘ ఎవరు హారతి  ఇచ్చారు అనేది ముఖ్యం కాదు, ఎందుకు ఇవ్వకూడదు అనే మాట వచ్చినందుకే నాకు ముల్లుగా గుచ్చుకుంటోంది.’ అని కావ్య అంటుంది. ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పారు.. నా అభిప్రాయం కూడా నేను చెప్పాను కదా అని రాజ్ అంటాడు. ‘కానీ, నా మీద పడిన నింద మాత్రం చెరిగిపోలేదు కదా, నేను తప్పు చేసినట్లు ఎందుకు అనుకుంటన్నారు? ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఉన్నాను. నేనేంటో తెలిసిన వాళ్లు కూడా అంత సులువుగా ఎలా నమ్ముతున్నారు?’ అని కావ్య అడుగుతుంది.

‘ ఇంట్లో కానీ, బయట కానీ, సానుభూతి పరులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. పరిస్థితిని బట్టి మారుతూ ఉంటారు’ అని రాజ్ ఓదారుస్తాడు. ‘ కానీ నేను మాత్రం ఒకేలా ఉన్నాను.అదేం ఖర్మో అప్పూ ప్రేమ విషయం పెళ్లి జరగడానికి ముందే తెలిసింది. అయినా, నేను అప్పూని ఓదార్చాను కానీ, ఆ పెళ్లి ఆపాలని చూడలేదు, కోరుకోలేదు. ఒకవేళ నాకు ముందే తెలిసి ఉంటే, అప్పూని కవిగారు ఎంత బతిమాలినా సరే, పెళ్లి రావద్దని ఆపి ఉండేదాన్ని. ఇటు కవి గారిని, అటు అప్పూకి అవమానం జరుగుతుంటే, ఏమీ చేయలేక నా అత్తారింట్లో వాళ్లే నన్ను అనుమానిస్తుంటే, నిజం నిరూపించుకోలేక.. ఇవన్నీ జరిగేవే కావు. ఇన్నాళ్లు లేనిది మొదటిసారి చిన్నత్తయ్య కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. అనామిక అయితే నన్ను ఒక శత్రువులా చూస్తోంది.  ఒకే ఇంట్లో ఉంటూ.. ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ ఎలా మలుసుకోవాలో అర్థం కావడం లేదు’ అని కావ్య బాధపడుతుంది.

‘ ఒకరికి మన మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది మనకు అవనసరం. మనకు సంబంధించి మన దగ్గర ఎలాంటి తప్పు లేకపోతే చాలు. అది మన మనస్సాక్షికి తెలిస్తే చాలు. ఇలాంటి అభిప్రాయ బేధాలు ఎన్ని ఉన్నా, కాలమే సమాధానం చెబుతుంది’ అని రాజ్ అంటాడు. ‘ మీరు పొద్దున వెళితే రాత్రికి వస్తారు. కానీ, ఆడవాళ్లు పొద్దున లేస్తే, రాత్రి వరకు కలిసే ఉండాలి. ఇప్పుడే ఇన్ని ఆరోపణలు మొదలయ్యాయి.  ప్రతిరోజూ నేను ఒక యుద్ధమే చేయాలి. నా సహనంతో నా వ్యక్తిత్వంతో, నా ఆత్మ గౌరవంతో’ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ కళావతి మా పెళ్లి విషయంలో తప్పు చేసినా, కళ్యాణ్ పెళ్లి విషయంలో  ఏ తప్పు చేయలేదు. అది ఆమెను ద్వేషించేవారు ఎప్పుడు తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి, ఇక నుంచి ఇల్లు ఎలా ఉండబోతుందో అని రాజ్ అనుకుంటాడు.

810
Brahmamudi

Brahmamudi

రాత్రిపూట అందరూ భోజనాలకు కూర్చుంటారు. కావ్య వడ్డిస్తూ ఉంటుంది. కావ్యతో వడ్డించుకోవడం ఇష్టం లేక అపర్ణ తన ఆహారం తానే పెట్టుకుంటుంది. కావ్యకు బాధగా అనిపించినా, తట్టుకుంటుంది. ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి కూర వడ్డించాలని చూస్తుంది. ఆమె కూడా కావ్యపై చిరాకు మొత్తం ప్రదర్శిస్తుంది. అది చూసి అపర్ణ సంతోషిస్తుంది.  టైమ్ దొరికింది కదా అని రుద్రాణి దూరిపోతుంది. 

910
Brahmamudi

Brahmamudi

‘ ఏంటి ధాన్యలక్ష్మి కొత్త కోడలు రాగానే, పాత కోడలిని పక్కన పెట్టావ్. ఇన్నాళ్లు కావ్యను ఎవరైనా ఏదైనా అనగానే, మెరుపు తీగలాగా సర్రున దూసుకొచ్చేదానివి కదా’ అని రుద్రాణి అడుగుతుంది. ‘ నాకు ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది  ఆలస్యంగా అర్థమైందిలే’ అని ధాన్యలక్ష్మి అనగానే.. తనకు ముందే అర్థమైందని అపర్ణ అంటుంది. ఎవరికి ఏం అర్థమైనా ఏం పీకారులే అనబోయి రుద్రాణి కవర్ చేస్తుంది. తాము లేనిపోని నిందలు వేయమని, ఉన్నది మాత్రమే అంటామని అపర్ణ అంటుంది. ఆ మాటలకు సుభాష్ కి నచ్చవు. నిందో, నిజమో.. కాలానికి వదిలేసి భోజనం చేయమని అంటాడు. ప్రకాశం కూడా ధాన్యలక్ష్మికి ఏదో చెప్పాలని చూసినా.. ఆమె కావ్య పై చిర్రుబుర్రులాడుతుంది.

అది చూసి బాధేసిన రాజ్... కావ్యను పిలిచి కూర వడ్డించమని అడుగుతాడు. కావ్య పెట్టగానే.. బాగుందని తింటాడు. ఆ మాటలకు అపర్ణ, ధాన్యలక్ష్మి ముఖాలు మాడిపోతాయి. కళ్యాన్ కూడా కర్రీ వేయించుకుంటాడు. అనామికను కూడా పెట్టించుకోమని.. తనకు ఆ కూర ఇష్టం లేదు అంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం... మా వదిన చేస్తే బాగుంటుందని అంటాడు. వెంటనే ధాన్యలక్ష్మి.. ఇష్టం లేనివారు చేస్తే కష్టంగానే ఉంటుంది అని అంటుంది. ఆ మాటలకు కావ్యకు చాలా బాధేస్తుంది.  నిన్నటి వరకు ఇష్టంగానే తిన్నావ్ గా అని ప్రకాశం అంటే.. మా అక్కకి ఉన్న ముందు చూపు తనకు కూడా ఉంటే.. తప్పక తినేదాన్ని అంటుంది.‘ చిన్నఅత్తయ్య.. మీరు భోజనం ప్రశాంతంగా చేయండి’ అని కావ్య అంటుంది. అంటే.. ఏంటి నీ అర్థం అని అడుగుతుంది.
 

1010
Brahmamudi

Brahmamudi

 

వెంటనే ఇందిరాదేవి అందుకుంటుంది. ‘ అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానిని కళ్లకు అద్దుకొని తినాలి. లేదంటే.. ఎన్ని కోట్లు ఉన్నా, గంజి, జావ తాగి బతకాల్సి వస్తుంది. ఇన్నాళ్లు కావ్య వండిన  ప్రతి వంట మెచ్చుకునేదానివి. ఇప్పుడు నొచ్చుకునేలా మాట్లాడుతున్నావ్ అంటే  ఎలా ఉంటుంది ధాన్యలక్ష్మి. మనకు ఏ చెయ్యి అయితే అన్నం పెడుతుందో ఆ చెయ్యిని కళ్లకు అద్దుకోవాలి. అన్నపూర్ణదేవి చెయ్యే.. ఆ చెయ్యి. నువ్వు కళ్లకు అద్దుకోకపోయినా పర్లేదు, మెచ్చుకోకపోయినా పర్లేదు. కానీ ముద్దుముద్దకీ వడ్డించేవారి మనసు నొప్పించకూడదు’ అని సలహా ఇస్తుంది.

వెంటనే అపర్ణ ‘ ధాన్యలక్ష్మి కడుపు ఎంత రగలిపోతుందో అర్థం కావడం లేదా అత్తయ్య, ఎలాంటి వాళ్లను తీసుకొచ్చి ఎక్కడ ఉంచితే, ఎంతదాకా వెళ్లారో మర్చిపోయారా’ అని అడుగుతుంది. ‘ ఎంతదాకా వచ్చిందో తెలుసు అపర్ణ. మీరు ఎంత దాకా  మోసుకొచ్చారో కూడా తెలుసు. కొత్త కోడలు వచ్చి పక్కనే కూర్చొంది కదా, ఇంకా ఏం మునిగిపోయిందని, బయట జరిగిన గొడవంతా కట్టల మోపులాగా మోసుకొచ్చారు’ అని ప్రశ్నిస్తుంది.

సుభాష్ కూడా ‘ రుద్రాణి.. నీ కోడలు మాటకు మాట బదులిస్తుంది కదా, అప్పుడు ఏం చేశావ్’ అని అడుగుతాడు. ఏం చేస్తాను అన్నయ్య.. నాలో నేను నోరుమూసుకొని  ఉన్నాను అంటుంది. అది ఇంకా అవమానం కదా అని సుబాష్ అడిగితే.. చచ్చేంత అవమానం అంటుంది. ఇక ప్రశాంతంగా తిను అపర్ణ. కళ్యాణ్ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా ఉన్నాడు.. ఆ సంతోషాన్ని అలానే ఉండనిద్దాం.. తిండి తినే దగ్గర మీ వంటింటి రాజకీయాలు చర్చించుకుంటే వినేవారికి , తినేవారికి పంటికింద రాయిలా తగులుతూ ఉంటుంది. అని కోపంగా అంటాడు. వెంటనే సుభాష్ ని వాళ్ల అమ్మ మెచ్చుకుంటుంది. పెళ్లి చేసుకొని కొత్త కోడలు వస్తే.. ఇల్లు చక్కదిద్దుకోవడం ఎలాగో చెప్పాలి.. ఇల్లాలి భద్రతలు చెప్పాలి, అత్తామామలను ఎలా చూసుకోవాలో చెప్పాలి, భర్తతో ఎంత అన్యోన్యంగా ఉండాలో నేర్పాలి. తోడికోడళ్లను అక్కా చెల్లెళ్లు లా అనుకోవాలని చెప్పాలి. వంట నేర్పాలి, వడ్డించడం నేర్పాలి, అతిథులు వస్తే మర్యాద నేర్పాలి. అవన్నీ వదిలేసి మనలో మనమే కించపరుచుకుంటూ ఏం నేర్పాలి అనుకుంటారు అని ప్రశ్నిస్తుంది. ఉమ్మడి కుటుంబం గొప్పదనం చెప్పి, అందరికీ క్లాస్ పీకుతుంది. తర్వాత.. కావ్యను మెచ్చుకుంటుంది. వంట బాగుందని, నీ చేతిలో అమృతం ఉందని ప్రశంసిస్తుంది. తర్వాత అందరూ భోజనం చేసి వస్తారు.

కమింగ్ అప్ లో అనామిక అందరికీ కాఫీలు ఇస్తుంది. అది తాగి అందరి మొహాలు మాడిపోతాయి.  చాలా దారుణంగా ఉందనే విషయం అర్థమౌతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image3
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved