- Home
- Entertainment
- TV
- BrahmaMudi Serial 27th December Episode :పెళ్లిలో షాకిచ్చిన రౌడీ బేబి, కనకంపై అన్నదమ్ముల ప్రేమ, ఇరకాటంలో అనామి
BrahmaMudi Serial 27th December Episode :పెళ్లిలో షాకిచ్చిన రౌడీ బేబి, కనకంపై అన్నదమ్ముల ప్రేమ, ఇరకాటంలో అనామి
ఇడ్లీకే కరిగిపోయి.., స్వప్న గురించి మంచిగా మాట్లాడేలా ఉన్నాడని కనకం మురిసిపోతుంది. దీంతో, మరింత ప్రేమ కురిపిస్తుంది. కొరపోతే మంచినీళ్లు తాగిస్తుంది.

Brahmamudi
BrahmaMudi Serial 27th December Episode :తాగిన మైకంలో రాజ్ కొద్దిగా కావ్యకు దగ్గరౌతాడు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని నిద్రపోతారు. ఉదయం లేచి చూసేసరికి కావ్య తన గుండెలమీద వాలి పడుకోవడం చూసి రాజ్ షాకౌతాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. నువ్వు నా పక్కన ఎందుకు పడుకున్నావ్ అని అడుగుతాడు. తెలీకుండానే మీ గుండెల మీద పడుకోపెట్టుకున్నారా అని కావ్య అడిగితే.. తెలీకేకదా అడుగుతున్నాను అంటాడు. అంతే.. రాజ్ తనకు గుర్తులేదు అనగానే కావ్య రెచ్చిపోతుంది. ఏం జరగకపోయినా జరిగినట్లు.. చెబుతుంది. మీలోని రొమాంటిక్ ఫెలో బయటకు వచ్చాడని సిగ్గుపడుతుంది. రాత్రి ఏమైనా జరిగిందా అని రాజ్ అడిగితే... జరగాల్సిందే జరిగింది అంటూ సిగ్గుపడుతుంది. కావ్య మాటలకు రాజ్ భయపడిపోతూ ఉంటాడు. ఏం జరిగింది అని రాజ్ నొక్కి నొక్కి అడిగితే.. మూడు నెలలు ఆగితే తాను నెలతప్పుతాను కదా అప్పుడు ఏం జరిగిందో తెలుస్తుంది అనుకుంటూ వెళ్లిపోతుంది. రాజ్ దేవుడా అంటూ తలకొట్టుకుంటాడు.
Brahmamudi
ఇక.. కిడ్నాప్ కి గురైన అరుణ్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. రాడం రావడమే తనకు తెలిసిన తిట్లన్నీ తిడుతుంది. తర్వాత ఇడ్లీ ఇచ్చి తినమని చెబుతుంది. విషం కలిపారా అని అరుణ్ అడిగితే... నిన్ను చంపడానికి కర్రచాలు.. విషం అవసరం లేదు అంటుంది. దీంతో.. తాను ఇంత చేసినా తన కోసం ఆలోచించి ఇడ్లీ తెచ్చినందుకు అరుణ్ కాస్త మారిపోయినట్లుగా మాట్లాడతాడు. ఇడ్లీకే కరిగిపోయి.., స్వప్న గురించి మంచిగా మాట్లాడేలా ఉన్నాడని కనకం మురిసిపోతుంది. దీంతో, మరింత ప్రేమ కురిపిస్తుంది. కొరపోతే మంచినీళ్లు తాగిస్తుంది.
తర్వాత నువ్వు స్వప్న ఒకప్పుడు మంచి స్నేహితులు కదా, తనపై ఇలాంటి నింద ఎందుకు వేశావ్ అని కనకం అడుగుతుంది. దానికి అరుణ్ మరోసారి తన బుద్ధి చూపిస్తాడు. ప్లేట్ ఇడ్లీకి కరిగిపోయి అందరి ముందు తల వంచుకొని నిజం అంగీకరిస్తాను అని అనుకున్నారా అని చెప్పి షాకిస్తాడు. ‘నీ కూతురి గురించి, దాని స్నేహం గురించి నువ్వు నాకు చెబుతున్నావా? ఫ్రెండ్ షిప్ పేరుతో నన్ను సర్వం నాకించేసింది’ అంటాడు. అదే సమయానికి స్వప్న ఎంట్రీ ఇస్తుంది. రావడం రావడమే ఆ మాటకు చెంప పగలకొడుతుంది.
‘ఏం వాగావ్ రా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పానా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చానా? నీ మనసులో ఏదో చెడు బుద్ధి పెట్టుకొని నాది తప్పంటావేంటి రా? నా మొగుడే నన్ను అనుమానించేలా సాక్ష్యాలు పుట్టిస్తావా? నిన్ను చంపేస్తాను రా’ అంటూ గొంతు పిసుకుతుంది. కానీ కనకం ఆపేస్తుంది. నిజం చెప్పేవరకు అయినా బతకనివ్వు అని చెప్పి, మళ్లీ అరుణ్ ని కట్టేస్తుంది. పెళ్లి జరిగిన తర్వాత.. వీడిని ఏం చేయాలి అనే విషయం దుగ్గిరాల కుటుంబమే నిర్ణయిస్తుంది అని చెప్పి కనకం అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Brahmamudi
తర్వాతి సీన్ లో ఇందిరాదేవి వీరయ్యను గాజులు తెమ్మని చెప్పాను అంటుంది. ఇక్కడికే వీరయ్యను రమ్మని చెప్పమని అపర్ణకు చెబుతుంది. అందరి దగ్గరా గాజులు ఉన్నాయి కదా మళ్లీ గాజులు ఎందుకు అని స్వప్న అడుగుతుంది. మట్టిగాజులు సంప్రదాయానికి సంకేతమని పెళ్లిలో అన్నయ్యగానీ, తమ్ముడు కానీ తోబుట్టువుకు గాజులు తొడిగి, వారికి జీవితాంతం తోడు ఉంటానని మాట ఇస్తారని అసలు విషయాన్ని ఇందిరాదేవి చెబుతుంది.
Brahmamudi
మరోవైపు అనామిక, తన పేరెంట్స్ తో కలిసి మరో కుట్ర చేస్తుంది. ముగ్గురు కలిసి కళ్యాణ్ రూమ్ దగ్గరకు వస్తారు. ఇప్పుడే వెళ్లి కళ్యాణ్ ని రెండు కోట్లు అడగమని అనామిక పేరెంట్స్ చెబుతూ ఉంటారు. ఇప్పుడు అడగకపోతే ఆ మార్వాడీ వచ్చి పెళ్లి ఆపేస్తాడని, అప్పుడు అందరం రోడ్డున పడతాం అని ఆమె తండ్రి చెబుతాడు. డబ్బు కోసమే నన్ను ప్రేమించావా అని కళ్యాణ్ అడిగితే ఏం చెప్పాలి అని అనామిక టెన్షన్ పడుతుంది. కళ్యాణ్ అలా అనడని, నిన్ను ప్రేమించాడు అని ధైర్యం చెబుతుంది. దీంతో.. అనామిక లోపలికి వెళ్తుంది. ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చానని చెబుతుంది.
ఏంటి అని కళ్యాణ్ అడగగా అనామిక చెప్పడం మొదలుపెడుతుంది, అదే సమయానికి కళ్యాణ్ తండ్రి ప్రకాశం వస్తాడు. ఫోన్ ఛార్జర్ కావాలి అంటూ వచ్చి అడగడంతో.. అనామితో తర్వాత మాట్లాడుకుందాం అని వెళ్లిపోతాడు. దీంతో.. అనామిక చెప్పలేకపోతుంది. తర్వాత టైమ్ చూసుకొని అడుగుతాను అని తండ్రికి అనామిక భరోసా ఇస్తుంది.
Brahmamudi
మరోవైపు కళ్యాణ్ కి అప్పూ ప్రేమ విషయం చెప్పడానికి అప్పూ ఫ్రెండ్ వస్తాడు. కానీ, అతనిని వాచ్ మెన్ లోపలికి రానివ్వడు. దీంతో, సీక్రెట్ గా అతను చూడకుండా లోపలికి వచ్చేస్తాడు. అప్పూకి కనిపించకుండా కళ్యాణ్ తో మాట్లాడాలి అనుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. ఆ తర్వాత కావ్య రాజ్ కి పెసరట్టు ఉప్మా తెచ్చి ఇస్తుంది. పెసరట్టు వద్దు.. ఇంకేదైనా కావాలి అని రాజ్ అంటాడు. అప్పుడే విక్కీ వచ్చి... తనకు పెసరట్టు అంటే ఇష్టమని అంటాడు. తనకి రోజూ పెసరట్టే పెడుతున్నారని రాజ్ విసుక్కుంటే.. చాలా బాగుంది అని పెసరట్టు అని విక్కీ తింటాడు. అప్పుడే అదే సమయానికి పద్దూ మిర్చీ బజ్జీ తెస్తుంది. తనకు వద్దు అని విక్కీ అంటే.. రాజ్ కుమ్మేస్తూ ఉంటాడు.
తర్వాతి సీన్ లోకి మార్వాడీ ఎంట్రీ ఇస్తాడు. తన డబ్బులు ఇస్తేనే పెళ్లి జరుగుతుందని లేకపోతే పెళ్లి ఆపేయాలని అనుకుంటాడు. అనామిక తండ్రి రూమ్ ఎక్కడ అని కనకం అని అడుగుతాడు. కనకం స్వయంగా అతనిని అనామిక తండ్రి గదికి తీసుకువస్తుంది. అది చూసి, అనామిక పేరెంట్స్ కి దిమ్మతిరిగిపోతుంది. తర్వాత మార్వాడీని ఎందుకు వచ్చావ్ అని బతిమిలాడుతూ ఉంటారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదని, డబ్బులు ఇస్తే వెళ్లిపోతాను అని అందుకే ఖాళీ సూట్ కేసుతో వచ్చాను అని చెబుతాడు.
Brahmamudi
తర్వాత అందరూ గాజులు సెలక్ట్ చేసుకుంటూ ఉంటారు. అన్నదమ్ములు వరసయ్యే వారంతా చెల్లెళ్లకు గాజులు తొడిగే కార్యక్రమం మొదలుపెడతారు. రాహుల్ తో అనామికకు గాజులు తొడిగిస్తారు. నీ పెళ్లి ఆపాలని నేను ప్లాన్ చేస్తుంటే, నా చేతులతోనే గాజులు తొడిగించేలా చేశారు అని రాహుల్ మనసులో అనుకుంటాడు. అలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు గాజులు తొడుగుతూ ఉంటారు. మురళి చేత అనామికకు గాజులు వేయిస్తారు. అది చూసి కనకం సంతోషపడుతుంది.నాకు కూడా అన్నదమ్ములు ఉంటే బాగుండేది అని బాధపడితే.. మేం ఉన్నామ్ కదా అని సుభాష్, ప్రకాష్ ముందుకువస్తారు.చాలా ప్రేమగా కనకం చేతులకు గాజులు తొడుగుతారు. అది చూసి అపర్ణ, రుద్రాణి తప్ప అందరూ సంతోషిస్తారు.అయితే, తనకు వెయ్యలేదని రుద్రాణి ఫీలౌతుంది. తర్వాత సెటైర్లు కూడా వేస్తుంది. కమింగప్ లో అందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అది చూసి అప్పూ వాళ్లని ఆపమని అంటుంది. తర్వాత వెళ్లి కళ్యాణ్ ని హత్తుకుంటుంది. అది చూసి అందరూ షాకౌతారు. మరి అది నిజమో, కలో చూడాలి.