MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi Serial 22nd December:కళ్యాణ్ పెళ్లిలో రొమాంటిక్ గా రాజ్, కావ్య.. టెన్షన్ లో స్వప్న..!

BrahmaMudi Serial 22nd December:కళ్యాణ్ పెళ్లిలో రొమాంటిక్ గా రాజ్, కావ్య.. టెన్షన్ లో స్వప్న..!

బయట అప్పూ నిలపడి ఉంటుంది. ధాన్యలక్ష్మి వస్తుంది. కళ్యాణ్ దగ్గరకు వెళ్తుంటే, అప్పూ ఆపుతుంది. వీళ్లు వినకుండా డోర్ తెరుస్తారు. తీరా లోపల కళ్యాణ్, అనామిక హగ్ చేసుకొని కనపడతారు.

4 Min read
Author : ramya Sridhar
Published : Dec 22 2023, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Brahmamudi

Brahmamudi


BrahmaMudi Serial: అనామిక కళ్యాణ్ తో మాట్లాడదామని వచ్చేసరికి గదిలో అప్పూ ఉంటుంది. అప్పూ మీద అనామిక కౌంటర్ వేస్తుంది. దీంతో, అప్పూ బయటకు వెళ్లిపోతుంటే, అనామిక పిలిచి, బయట డోర్ వద్ద కాపలా ఉండమని చెబుతుంది. కళ్యాణ్ అలా అన్నావేంటి అని అనామికను వారించబోతే,  మనలాంటి కపుల్స్ కి ప్రైవసీ కావాలని అప్పూకి తెలుసు లే అని అంటుంది. దీంతో, అప్పూ బయటకు వెళ్లిపోతుంది. ఇక, అప్పూ వెళ్లిన తర్వాత కళ్యాణ్ రొమాంటిక్ గా మాట్లాడబోతాడు. అసలు విషయం అది కాదు అని పెళ్లికి ముందే నీతో ఓ విషయం చెప్పాలని, పెళ్లి తర్వాత మన మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు కాబట్టి అని  మొదలుపెడుతుంది. అసలు విషయం ఏంటి అని కళ్యాణ్ అడిగితే, పెళ్లి తర్వాత కూడా నేను కూతురిగా వారికి అండగా ఉంటానని, నువ్వు కూడా అండగా ఉండాలని, ఎంత పెద్ద కష్టం వచ్చినా తీరుస్తానని ప్రామిస్ చెయ్యమని అడుగుతుంది.  కళ్యాణ్ కూడా మాట ఇచ్చేస్తాడు. థ్యాంక్స్ అని చెప్పి కౌగిలించుకుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Brahmamudi

Brahmamudi

బయట అప్పూ నిలపడి ఉంటుంది. ధాన్యలక్ష్మి వస్తుంది. కళ్యాణ్ దగ్గరకు వెళ్తుంటే, అప్పూ ఆపుతుంది. వీళ్లు వినకుండా డోర్ తెరుస్తారు. తీరా లోపల కళ్యాణ్, అనామిక హగ్ చేసుకొని కనపడతారు. కాస్త తొందర తగ్గించుకోమని సలహా ఇచ్చి, వాళ్ల లగేజ్ తీసుకొని వెళ్లిపోతారు.

38
Brahmamudi

Brahmamudi

మరోవైపు స్వప్న కావ్యను పక్కకు పిలిచి, అరుణ్ బెదిరిస్తున్నాడు అని చెబుతుంది.  అరుణ్ ఏమని బెదిరించాడో మొత్తం విషయం చెప్పేస్తాడు. తప్పించుకొని పారిపోయి.. మళ్లీ వాడే ఎందుకు బెదిరిస్తున్నాడు అనే అనుమానం కావ్యకు వస్తుంది. స్వప్న మాత్రం.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటుంది. ఇంటికి వెళ్లిపోనా లేదంటే,, కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లనా అని అడుగుతుంది. అది వర్కౌట్ అవ్వదని కావ్య అంటుంది. అరుణ్ వచ్చి గొడవ చేస్తే, రుద్రాణి, రాహుల్ తనను ఇంట్లో నుంచి గెంటేస్తారని స్వప్న బయపడుతుంది.  అయితే, కావ్య అరుణ్ ఇక్కడికి వచ్చేలా చేసి, నిజం బయటపెడదామని అంటుంది.  అరుణ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడమని, వాడు రాగానే ప్టటుకొని, అందరి ముందు వాడి బాగోతం బయటపెడదాం అని, నీ లైఫ్ లో ఉన్న సమస్యలన్నీ పోతాయి అని కావ్య ధైర్యం చెబుతుంది.

48
Brahmamudi

Brahmamudi

మరోవైపు కళ్యాణ్, అనామికలకు హల్దీ ఏర్పాట్లు చేస్తారు. అప్పటికే అరుణ్ అక్కడికి వస్తాడు. రాహుల్ ఫోన్ అరుణ్ కి ఫోన్ చేస్తాడు. ఎవరికీ కనిపించకుండా లోపలికి రమ్మని, తాను చెప్పినప్పుడు మాత్రమే స్వప్నకు కనపడాలని సలహా ఇస్తాడు.  తర్వాత దుగ్గిరాల కుటుంబీకులంతా మంచిగా హల్దీ డ్రెస్ లో ముస్తాబౌతారు. అందరిముందు కావ్యను తిట్టించాలని రాజ్ అనుకుంటాడు. అనుకున్నట్లుగానే అపర్ణ  కావ్యను తిడుతుంది. వెంటనే రుద్రాణి కూడా కావ్య పై సెటైర్లు వేస్తుంది. కానీ, నువ్వు, నేను ప్రేమ సీరియల్ టీమ్ వాళ్లంతా రాజ్ కి సెటైర్లు వేస్తారు.  అటు తిరిగి, ఇటు తిరిగి అదంతా రాజ్ కి చుట్టుకుంటుంది.  అందరి ముందు వాళ్ల అమ్మతో తిట్టించినందుకు కావ్య.. రాజ్ కాలు తొక్కుతుంది. తర్వాత ఏమీ తెలియనట్లు.. ఏమైంది అని అడుగుతుంది. రాజ్.. ఆ విషయం అందరికీ చెప్పలేక తిప్పలు పడుతుంటాడు. ఆ సీన్ ఫన్నీగా ఉంటుంది.

58
Brahmamudi

Brahmamudi

తర్వాత రాజ్ కావ్యలు వెళ్లి.. కాబోయే వధూవరులను తీసుకొస్తాం అంటారు. తర్వాత తీసుకొచ్చి కూర్చోపెడతారు. ఇందిరాదేవి తో కార్యక్రమం మొదలుపెట్టమని అడుగుతారు. ఆమె వచ్చి, కళ్యాణ్, అనామికలకు పసుపు రాస్తుంది. తర్వాత ఒకొక్కరుగా వారికి పసుపు రాస్తారు. అయితే, అదంతా చూసి అప్పూ బాడధపడుతూ ఉంటుంది. అప్పూ బాధను నువ్వునేను ప్రేమ హీరోయిన్ పద్మావతి కనిపెట్టేస్తుంది.

68
Brahmamudi

Brahmamudi

తన ప్రేమను కళ్యాణ్ అర్థం చేసుకోలేదని, మగరాయిడిలా కాకుండా, అమ్మాయిలా ఉంటే నా ప్రేమ అర్థమై ఉండేదని, కనీసం నవ్వు కోరుకున్న అమ్మాయితో అయినా సంతోషంగా ఉండు అని మనసులో అనుకుంటుంది. అప్పూ బాధను గుర్తించిన పద్మావతి.. ఏమైందని అడుగుతుంది. ఎందుకు ఆ కంట్లో నీరు అని అడగుతుంది.  అయితే, అదే టైమ్ కి కనకం, మూర్తి వచ్చి ఏదో కవర్ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ పద్దూ నమ్మదు. పద్దూ ఎంత అడిగినా, అప్పూ బయటపడదు. ఆలోగా, కళ్యాన్.. అప్పూని పిలుస్తాడు. మిగిలిన వాళ్లు కూడా అందరూ అప్పూని పిలవడంతో, అప్పూ అక్కడికి వెళ్తుంది. అప్పూ ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కుదరడం లేదని, కనకం, మూర్తి కూడా బాధపడతారు.

78
Brahmamudi

Brahmamudi

హల్దీ వేడుక జరుగుగతుండగా అరుణ్ వచ్చి, స్వప్నకు కనపడేలా చేయమని రుద్రాణి సలహా ఇస్తుంది. అరుణ్ కనపడగానే స్వప్న తప్పులు చేస్తుందని, అది మనకు అనుకూలంగా మార్చుకుందాం అని రుద్రాణి చెప్పగానే, రాహుల్ అరుణ్ కి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెబుతాడు. మరోవైపు కావ్య, రాజ్ లు గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఉంటారు. అయితే, వాళ్ల కాపురం సరిగా లేదు అని వెళ్లి ఇందిరాదేవి కి రుద్రాణి చెబుతుంి. అది విని స్వప్న వచ్చి.. మా అత్త ఇలా అంటోందని కావ్యకు చెబుతుంది. అయితే, ఇదిరాదేవితో రుద్రాణిని తిట్టేలా చేస్తాను అని కావ్య.. కావాలని రాజ్ కి పసుపు రాస్తుంది. ఇక, రాజ్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి కావ్యకు పసుపు పూస్తాడు. అది చూసి ఇందిరాదేవి, రుద్రాణిని తిడుతుంది. వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు అని అంటుంది. ఇక అందరూ ఒకరికి మరొకరు పసుపు రాసుకోవడం మొదలుపెడతారు. కళ్యాణ్.. అనామిక కు పసుపు రాయలని చూస్తుంటే, అది కాస్త అప్పూకి అంటుకుంటుంది.

88
Brahmamudi

Brahmamudi

వెంటనే అప్పూని అనామిక వాళ్ల అమ్మ పక్కు లాక్కొని వెళ్తుంది. అందరూ ఆనందంగా పసుపు  రాసుకుంటూ ఉంటే, రాహుల్.. ఈ ఆటలో భాగంగానే స్వప్నను పక్కకు వెళ్లేలా చేస్తాడు. అదే టైమ్ కి అరుణ్ ఎంట్రీ ఇస్తాడు. స్వప్న కంట పడతాడు. స్వప్న వెళ్లి కావ్యను తీసుకువస్తుంది. అది చూసి అరుణ్ దాక్కుంటాడు.

మరోవైపు అనామిక తల్లిదండ్రులు.. అప్పూని పక్కకు తీసుకొచ్చి, మా అల్లుడితో ఎందుకు తిరుగుతున్నావ్ అని తిడతారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.  అదంతా కనకం, మూర్తి వినేస్తారు. కనకం వచ్చి వాళ్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్లు వినరు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved