MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 6th March Episode:కావ్య కోసం చేతులు కాల్చుకున్న రాజ్, బయటపడిన ప్రేమ..!

BrahmaMudi 6th March Episode:కావ్య కోసం చేతులు కాల్చుకున్న రాజ్, బయటపడిన ప్రేమ..!

దూరమైన కావ్యప్రేమను మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా..? నిజంగా నీకు కావ్య కావాలి అనుకుంటే.. ఈ విషయం తెలుసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. 

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2024, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 6th March Episode: కనకం ఇంట్లో రాత్రిపూట రాజ్ రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా శ్వేత ఫోన్ చేస్తుంది. మీ అత్తారింటికి వెళ్లిన తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోయావ్ అని అంటుంది. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నావా అని అడుగుతుంది. అయితే... తనకు మాత్రం నరకంలా ఉందని అంటాడు. ఏమైంది అని అడిగితే.. మళ్లీ రాజ్ కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. వాళ్లు రమ్మని అంటే వచ్చానని.. మర్యాద చేయాలని వదలడం లేదు అని బిల్డప్ ఇస్తాడు. కానీ.. శ్వేత కనిపెట్టేస్తుంది. నువ్వు మారిపోయావని, రాజ్, వాళ్ల బావ పుట్టింటికి వెళ్తున్నారని తెలిసి.. పిలవకపోయినా నువ్వు వెళ్లావని అర్థమౌతుందని.. నీ ఇగోతో కావ్యను వదిలేయాలని అనుకుంటన్నావని, కానీ.. మనసులో మాత్రం కావ్యపై ప్రేమ ఉందని అది నువ్వు ఒప్పుకోవడం లేదు అంటుంది. కానీ రాజ్ ఒప్పుకోడు. నాకు కళావతిపై ప్రేమ లేదు అంటాడు. అయితే.. శ్వేత మాత్రం.. ఇంత సడెన్ గా కావ్య వాళ్ల బావ ఎందుకు వచ్చాడు..? కావ్య పిలిస్తే వచ్చాడా..? దూరమైన కావ్యప్రేమను మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా..? నిజంగా నీకు కావ్య కావాలి అనుకుంటే.. ఈ విషయం తెలుసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Brahmamudi

Brahmamudi

ఇక..కనకం ఫ్యామిలీ ఇంటి ముందు క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. అప్పుడు అల్లుడు ఏం చేస్తున్నాడమ్మా అని కావ్యను అడుగుతారు. కావాలనే ఆ శ్వేతతో ఫోన్ మాట్లాడుతున్నాడు అని కావ్య చెబుతుంది. అయితే... మీరు కూడా కావాలనే చెయ్యండి అని అప్పూ అంటుంది. కానీ.. మరీ తెగేదాక లాగకూడదని కృష్ణమూర్తి అంటాడు. కావ్య కూడా.. తాను ఏం చేసినా తన వ్యక్తిత్వం దెబ్బతినకూడదు అని అంటుంది. మా కోసం నువ్వు  చాలా చేస్తున్నావ్?. నీకు కూడా ఇబ్బందిగా ఉందా బాబు అని మేనల్లుడిని అడుగుతాడు. భాస్కర్ మాత్రం లేదని.. మీ కుటుంబం కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా ? అది కూడా కావ్య కాపురం బాగుపడుతుందంటే ఆ మాత్రం చేయనా అని అంటాడు. మీ ఫ్యామిలీ కోసం ఎంత చేసినా తప్పులేదు అంటాడు.

36
Brahmamudi

Brahmamudi


సీన్ కట్ చేస్తే.. చాలా ప్రయత్నాలు చేసి విసిగి సాయంత్రానికి కళ్యాణ్ ఇంటికి చేరుకుంటాడు. ఎలా జరిగింది మొదటి రోజు అని వాళ్ల నాన్న ప్రకాశం అడుగుతాడు. అందరూ .. కవితలు వద్దూ కథలురాయమంటున్నారు అని చెబుతాడు. మరి రాయకపోయావా అంటే.. రాయలేను అని చెబుతాడు. అప్పుడే  అనామిక వచ్చి.. అది నీ వల్ల కాదు అని ఇప్పటికైనా తెలిసిందా అని అంటుంది. ఈరోజే కదమ్మా ప్రయత్నించాడు.. ఏదో సాధించాలని అనుకుంటున్నాడు.. నువ్వు సపోర్ట్ చేయాలి కదా అంటే.. బావ గారిలా ఆలోచించమని, అప్పుడు జీవితంలో గౌరవం పెరుగుతుంది అని అంటుంది. అన్నయ్యలా ఆలోచించడానికి అన్నయ్య ఉన్నాడని.. నేను నాలానే ఆలోచిస్తాను అని కళ్యాణ్ చెబుతాడు. నీ కర్మ అనేసి అనామిక వెళ్లిపోతుంది. తర్వాత కళ్యాణ్ కూడా వెళతాడు. ప్రకాశం మాత్రం కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలుస్తాడు.

46
Brahmamudi

Brahmamudi

ఇక సీన్ మళ్లీ కనకం ఇంట్లో మొదలౌతుంది. రాజ్ ని ఉడికించాలని.. కావ్య, భాస్కర్ లతో అప్పూ డ్యాన్స్ చేయిస్తుంది. అది చూసి రాజ్ కుళ్లుకుంటాడు. కానీ.. అంతలోనే ఓ నిప్పుకర్ర అక్కడ పడటంతో.. కావ్య ఎక్కడ తొక్కుతుందో అని రాజ్ కంగారుపడతాడు. వెంటనే దానిని చెయ్యితో నెడతాడు. దానిని భాస్కర్ తొక్కుతాడు. అటు.. రాజ్ చేతికి, ఇటు... భాస్కర్ కాలికి గాయం అవుతుంది. రాజ్ కి గాయం కావడంతో కావ్య అల్లాడిపోతుంది. వాళ్ల ప్రేమ చూసి భాస్కర్ మురిసిపోతాడు. నోటితో చెప్పకపోయినా.. చేతల్లో కావ్యపై ప్రేమ చూపించాడని కనకంతో అంటాడు.

56
Brahmamudi

Brahmamudi


సీన్ కట్ చేస్తే... ఇంట్లో స్వప్నకు అర్జెంట్ గా డబ్బులు కావాల్సి వస్తుంది. దీంతో.. వెళ్లి రుద్రాణిని అడుగుతుంది. అప్పటికే రాహుల్.. డబ్బుల కోసం రుద్రాణిని అడుగుతూ ఉంటాడు. లేవు అని చెబుతుంది. స్వప్న కూడా తనకు రూ.50వేలు కావాలి అంటుంది. వెళ్లి మీ పుట్టింటి వాళ్లను అడుక్కోమని చెబుతుంది. అవసరం లేదని.. డబ్బులు ఎలా సంపాదించాలో తనకు తెలుసు అనేసి కోపంగా స్వప్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాహుల్ ఇంకా అడుగుతూనే ఉంటాడు. నీ పెళ్లాం ఒక్కసారి లేవు అంటే వెళ్లిపోయింది. నీకు ఆ సిగ్గుకూడా లేదారా అని తిడుతుంది.

66
Brahmamudi

Brahmamudi

ఇక.. మళ్లీ కనకం ఇంట్లో రాజ్  కి కావ్య కాఫీ ఇస్తుంది. వాళ్ల బావ కావాలనే.. కాలికి గాయంతో నడవలేకపోతున్నాను అని తిప్పలుపడుతూ పడిపోతాడు. అది చూసి కనకం ఓవర్ యాక్షన్ చేస్తుంది. మన అల్లుడు పడిపోయాడండీ అని అంటుంది. వెంటనే .. రాజ్.. కనకం కి మన అల్లుడు,మేనల్లుడు టాపిక్ మీద క్లాస్ పీకినట్లు ఊహించుకుంటాడు. ఆ సీన్ సరదాగా ఉంటుంది. తర్వాత.. భాస్కర్ కి కాలినందుకు మాత్రం.. రాజ్ హ్యాపీగా ఫీలౌతాడు. అసలు గాయంతో బయటకు ఎందుకు వచ్చావ్ బావ అని అప్పూ అడిగితే స్నానానికి అంటాడు. నేను చేపిస్తాను అని కావ్య అంటే.. వద్దు.. నేను తీసుకువెళతాను అని రాజ్ తీసుకొని వెళతాడు. 

ఇక కమింగప్ లో.. డబ్బుల కోసం స్వప్న మళ్లీ మోడలింగ్ మొదలుపెడుతుంది. పొట్టి డ్రెస్సులు వేసుకొని ఇంట్లోనే రచ్చ చేస్తుంది. అప్పుడే కావ్య, రాజ్ కూడా వస్తారు. వాళ్ల ముందు  కావ్య పుట్టింటిని ధాన్యలక్ష్మి, అనామిక తక్కువ చేస్తారు. దీంతో... అనామికపై రాజ్ సీరియస్ అవుతాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
Recommended image2
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image3
Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved