BrahmaMudi 25th January Episode:ఆపరేషన్ శ్వేత... రాజ్ పై స్పైలుగా మారిన కావ్య, కవి..!
ఉత్తప్పుడు లొడా లొడా వాగడానికి నోరు తెరిచే ఉంచుతావ్ కదా అని.. అన్నం తినిపిస్తాడు. వెనక బ్రహ్మముడి పాట ప్లే అవుతుంది. అయితే.. రాజ్ శ్వేతతో, తనతో ఉన్న సీన్లను కావ్య తలుచుకుంటుంది.
Brahmamudi
BrahmaMudi 25th January Episode: రాజ్ తనకు అన్యాయం చేస్తున్నాడనే బాధ కావ్యలో రోజు రోజుకీ పెరిగిపోతుంది. హాస్పిటల్ లో సీన్ తర్వాత.. మరింత బాధ పెరుగుతుంది. ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. కనీసం భోజనం కూడా చెయ్యకుండా వెళ్లి పడుకుంటుంది. రాజ్.. భోజనం చేయమని అడిగితే.. తన కడుపు నిండా దుఖం ఉందని, ఇంక.. ఆకలికి చోటులేదని చెబుంది. హాస్సిటల్ కి రాలేదని అలుగుతావా అని రాజ్ చిరాకు పడతాడు. అయినా కూడా కావ్య నాకు వద్దు అని.. పడుకుంటుంది. రాజ్ కోపంగా భయటకు వెళ్లిపోతాడు. కాసేపటికి కావ్య నిద్రలోకి జారుకుంటుంది.
Brahmamudi
అయితే.. రాజ్.. కావ్యను అలా చూడలేక భోజనం ప్లేట్ తీసుకొని వస్తాడు. తినమని ప్లేట్ ఇస్తాడు. కానీ.. కావ్య తనకు వద్దని.. తనని ఎవరూ బుజ్జగించాలని అనుకోలేదు అని చెబుతుంది. దానికి రాజ్ తాను కూడా బుజ్జగించడం లేదు అని చెబుతాడు. మరి.. ప్లేట్ ఎందుకు తీసుకువచ్చారు.. తీసుకెళ్లి అక్కడ పెట్టండి అంటుంది. ఇక.. ఇలా అయితే.. మాట వినడం లేదని.. కావ్యను లేపి.. తన చీర కొంగుతో చేతులు కట్టేస్తాడు. కట్టేసి.. ఇప్పుడు తిను అంటాడు. ఆ.. అని కావ్య అంటే.. ఓ నేనే తినిపించాలి కదా అని కలిపి తినిపించబోతాడు. కావ్య నోరు తెరవదు. నోరు తెరువు.. ఉత్తప్పుడు లొడా లొడా వాగడానికి నోరు తెరిచే ఉంచుతావ్ కదా అని.. అన్నం తినిపిస్తాడు. వెనక బ్రహ్మముడి పాట ప్లే అవుతుంది. అయితే.. రాజ్ శ్వేతతో, తనతో ఉన్న సీన్లను కావ్య తలుచుకుంటుంది.
Brahmamudi
ఇంత ఆకలి పెట్టుకొని తినకుండా పడుకుంటావా అని.. రాజ్ తినిపిస్తూనే ఉంటాడు. మధ్యలో పొరమాలితే.. మంచినీళ్లు కూడా తాగిస్తాడు. తర్వాత.. మళ్లీ తినిపిస్తాడు. తర్వాత.. దగ్గరుండి ట్యాబ్లెట్స్ కూడా వేస్తాడు. ట్యాబ్లెట్స్ కూడా కావ్య వద్దు అంటే డిప్పమీద ఒక్కటి ఇచ్చానంటే అని.. ట్యాబ్లెట్ వేస్తాడు. ఆ తర్వాత.. కట్టేసిన చేతులు విప్పేసి.. ఇక తీరికగా అలుగు.. నేను ప్రశాంతంగా నిద్రపోతాను అంటాడు. అప్పుడే రాజ్ కి శ్వేత దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. పేరు కావ్య చూసి షాకౌతుంది.
రాజ్.. తనకు అర్జెంట్ కాల్ వచ్చిందని.. పక్కు వెళ్లి మాట్లాడతాడు. అది కావ్యకు మరింత బాధను కలిగిస్తుంది. దీంతో... వెంటనే తన ఇష్టదైవం కృష్ణుడి దగ్గరకు వెళ్లి తన బాధ అంతా చెప్పుకుంటుంది. రాజ్ తనకు భోజనం చేయించిన విషయాన్ని ఆనందంగా చెప్పుకుంటుంది. కానీ.. మళ్లీ శ్వేత నుంచి ఫోన్ రావడంతో.. ఆనందంగా మాట్లాడటం బాధ కలిగించిందని.. ఏది నిజమో, ఏది అబద్దమో తెలియడం లేదని బాధపడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చూపించాలి అని కన్నయ్యను వేడుకుంటుంది.
Brahmamudi
అయితే.. కావ్య దేవుడిని వేడుకోవడం ఇందిరాదేవి చూస్తుంది. ఈ టైమ్ లో ఇక్కడున్నావ్ ఏంటి అని అడిగితే.. ఓ ప్రశ్నకు సమాధానం కోసం వచ్చాను అని చెబుతుంది. ఏమైంది అని ఇందిరాదేవి అడిగితే... ‘ఒక భర్త భార్యను ఎందుకు దూరం పెడతాడు..? ఇష్టం లేని పెళ్లి వల్లా... లేక మరొకరిపై ఇష్టం వల్లా..?’ అని అడుగుతుంది. రాజ్ తప్పు చేస్తున్నాడా అని ఇందిరాదేవి అడిగితే.. అయితే.. ఇది తన సమస్య కాదని.. తన స్నేహితురాలికి వచ్చింది అని చెబుతుంది. తను ఉండగానే.. తన భర్త మరో అమ్మాయితో తిరుగుతున్నాడని.. వారి మధ్య ఏదో జరగుతోందని అనిపిస్తోందని అడుగుతుంది. దానికి.. ఆమె చాలా చక్కగా క్లారిటీ ఇస్తుంది. భార్యకు అడిగే హక్కు ఉంటుంది..కదా అని చెబుతుంది. తన స్నేహితురాలి పేరు అని చెప్పి.. తన భాదను చెప్పుకుంటుంది. ‘ భర్తతోనే ఉండాలా..? ఇంకొకరికి వదిలేయాలా?’ అని అడుగుతుంది. దానికి ఆమె.. భర్తను వదిలేసుకోవడానికి అతనేమీ బొమ్మ కాదని, ఒక్కసారి బ్రహ్మముడి పడిన తర్వాత ఎవరూ విడదీయలేరని, భర్తమీద భార్యకు హక్కు ఉంటుందని చెబుతుంది. భార్యకు ప్రశ్నించే హక్కు ఉంటుందని, అలా అడగకపోతే సమస్య వస్తుందని చెబుతుంది. భ్రమలో ఉండిపోతే కాపురాలు కూలిపోతాయని.. ముందు ఆమె భర్త.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడో లేదో క్లారిటీ తెచ్చుకోమని ఇందిరాదేవి చెబుతుంది. తర్వాత భార్యభర్తల బంధం గురించి చాలా గొప్పగా వివరిస్తుంది. ఆ కృష్ణుడే తనకు ఈ రూపంలో తన ప్రశ్నకు సమాధానం చెప్పాడని కావ్య ఆనందపడుతుంది. రాజ్, శ్వేతల మధ్య ఉన్నదేంటో తెలుసుకుంటాను అని నిర్ణయించుకుంటుంది.
Brahmamudi
మరుసటి రోజు ఉధయం.. కావ్య కళ్యాణ్ తో మాట్లాడుతుంది. ఇందిరాదేవి ఇచ్చిన సలహాను పాటించాలంటే.. ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు అని కావ్య చెబుతుంది. ఆవేశంగా అడగమని కళ్యాణ్ అంటాడు. కానీ.. ఆవేశంగా అడిగితే బాగోదు అని కావ్య అంటుంది. ఫోన్ నుంచి చెక్ చేద్దాం అని కళ్యాణ్ అంటాడు. అంటే.. చాటింగ్ చెక్ చేద్దామా అని కావ్య అడిగితే.. అవును అని... అప్పుడే చీటింగ్ గురించి తెలుస్తుందని కళ్యాన్ అంటాడు.
Brahmamudi
రాజ్.. ఇంట్లో బెడ్ మీద పడుకొని చాలా సిగ్గుపడుతూ.. నవ్వుతూ.. శ్వేతతో ఛాటింగ్ చేస్తూ ఉంటాడు. ఆఛాటింగ్ ని.. కవి, కళ్యాణ్ లు చాటుగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని కావ్య అంటే.. మనం స్పై చేస్తున్నామనే అనుమానం రాకుండా.. కూల్ గా ఉండాలని చెబుతాడు. రాజ్ స్నానానికి వెళ్లిన తర్వాత.. ఫోన్ తెస్తానని కళ్యాణ్ అంటాడు. ముందు కావ్య వద్దు అంటుంది.. తర్వాత.. కళ్యాణ్ ఏకంగా.. ఫోన్ కోసం కావ్యను పంపుతాడు. ఫోన్ పట్టుకోబోయి కూడా.. నా మనసు ఒప్పుకోవడం లేదని.. వెనక్కి వచ్చేస్తుంది. ఏమైందని కళ్యాణ్ అడిగితే.. సంస్కారం కాదు అని అంటుంది.
Brahmamudi
మీకు సంస్కారం కావాలా..? సంసారం నిలపడటం కావాలా అని అడుగుతాడు. సంసారమే ముఖ్యం అంటుంది.. మరి వెళ్లి ఫోన్ తీసుకురండి అంటాడు.. కానీ కావ్య నా వల్ల కాదు అంటుంది. కావ్య బాధ చూడలేక.. ఫోన్ నేను తెస్తాను అని కళ్యాణ్ వెళతాడు. వెళ్లి ఫోన్ తెచ్చి.. ఫోన్ ఓపెన్ చేస్తాడు.అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
Brahmamudi
కమింగప్ లో.. కళ్యాణ్ గీజర్ గురించి అపర్ణను అడుగుతాడు. ఏం అవసరం లేదు అని అపర్ణ అంటుంది. వెంటనే ధాన్యలక్ష్మి అందుకుంటుంది. అధికారం మొత్తం నీ కొడుకు చేతిలోనే ఉంది అనేస్తుంది. ఆ మాట రాజ్ చెవిన పడటంతో షాకౌతాడు.