BrahmaMudi 24th January Episode:శ్వేత రాజ్ ని ప్రేమించింది.. మరి రాజ్..? కావ్య ముందు నిజం కక్కిన కవి..!
కళ్యాన్ కి పెళ్లి అయ్యింది కాబట్టి.. భార్య ముందు అలా చెబితే.. ఫీలౌతుుందని ధాన్యలక్ష్మి చెప్పిందని.. అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ.. ఆ మాటలు అపర్ణ వినిపించుకోదు.
Brahmamudi
BrahmaMudi 24th January Episode: కావ్య ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. రాజ్ తన దగ్గర నిజం దాచాడని, తనను వదిలేస్తున్నాడని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అయితే.. కావ్యకు ఆరోగ్యం బాలేదని తెలిసిన తర్వాత.. కనీసం భోజనం కూడా చేయకుండా వెంటనే అక్కడికి పరుగులు తీస్తాడు. కానీ.. కావ్య మాత్రం.. శ్వేతతో రాజ్ చనువుగా ఉన్న సన్నివేశాలనే తలుచుకుంటుంది. రాజ్.. కావ్యకు బాలేదని ప్రేమగా మాట్లాడాలని చూస్తాడు. కానీ.. దేనికీ కావ్య సరిగా సమాధానం చెప్పదు. బాలేని సమయంలో.. మంచులో ఎందుకు కూర్చున్నావ్ అంటే.. వెంటనే అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్లిపోతుంది. నువ్వు ఫోన్ చేసినప్పుడు అని రాజ్ ఏదో చెప్పబోతున్నా.. మీరు బిజీగా ఉన్నారు.. నేను అర్థం చేసుకున్నాను అనేసి వెళ్లిపోతుంది. కావ్య అలా ఎందుకు ప్రవర్తించిందో రాజ్ కి అర్థం కాదు.
Brahmamudi
ఇక.. భోజనాలు దగ్గర ధాన్యలక్ష్మి మాటలకు.. అపర్ణ అహం దెబ్బ తింటుంది. బెడ్ మీద కూర్చొని రుసరుసలు ఆడుతూ ఉంటుంది. అది ఆమె భర్త సుభాష్ చూస్తాడు. ఆమెను చూడగానే.. ఏదో జరిగిందని సుబాష్ అర్థమైపోతుంది. ఏం జరిగింది అంటే.. ధాన్యలక్ష్మి... తాను కళ్యాణ్ కి పనులు చెబుతున్నానని తప్పు పడుతోందని బాధపడుతుంది. తాను కళ్యాణ్ ని చిన్న కొడుకులా చూసుకున్నానని, రాజ్ కన్నా ఎక్కువ గారాభం చేశానని, అలాంటిది ధాన్యలక్ష్మి ఇలా అంటుందని చెబుతుంది. అప్పుడు.. సుభాష్ చాలా ప్రేమగా విషయాన్ని కన్విన్స్ చేయాలని చూస్తాడు. కళ్యాన్ కి పెళ్లి అయ్యింది కాబట్టి.. భార్య ముందు అలా చెబితే.. ఫీలౌతుుందని ధాన్యలక్ష్మి చెప్పిందని.. అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ.. ఆ మాటలు అపర్ణ వినిపించుకోదు.
Brahmamudi
తన పరిస్థితే ఇలా ఉందంటే..తన తమ్ముడి పరిస్థితి ఎలా ఉందో అని సుభాష్ అనుకుంటాడు. అనుకున్నదే తడువు సీన్ అక్కడికి షిప్ట్ అవుతుంది. ప్రకాశం ల్యాప్ టాప్ పాస్ వర్డ్ కోసం కుస్తీపడుతుంటే.. ధాన్యలక్ష్మి వచ్చి.. తన కోపాన్ని వెల్లగక్కుతుంది. తన కొడుకు కళ్యాణ్ ని మీ వదిన తక్కువ చేసి చూస్తోందని.. అందరూ రాజ్ ని రాజులా చూస్తున్నారని.. తన కొడుక్కి మాత్రం పనులు చెబుతుున్నారని ఫీలౌతుంది. సుభాష్ కూడా ఇంట్లో ఎవరూ రాజ్, కళ్యాణ్ లను వేరుగా చూడరని చెప్పినా.. ధాన్యలక్ష్మి ఒప్పుకోదు. వీళ్ల బాధ తట్టుకోలేక.. ప్రకాశం సైతం బయటకు వెళ్లిపోతాడు.
Brahmamudi
అన్నదమ్ములు.. సుభాష్, ప్రకాశం లు ఒకచోట కూర్చొని తమ భార్యల ప్రవర్తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తనకు అయితే.. మతి మరుపు ఉందని.. ప్రకాశం సంబరపడిపోతాడు. తనకు ఆ అదృష్టం కూడా లేదని సుభాష్ బాధపడతాడు. ఇద్దరూ కలిసి.. మందు తాగుదాం అని వెళ్లిపోతారు.
Brahmamudi
ఇక.. కావ్య బాల్కనీలో ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి.. మీకు బాలేదని నాకు చెబితే.. నేను హాస్పిటల్ కి తీసుకువెళ్లేవాడిని కదా అని అంటాడు. మీరు రాకపోవడమే మంచిదైంది అని కావ్య అంటుంది. ఎందుకు అని కళ్యాన్ అంటే.. ఇంట్లో జరిగిన గొడవ గురించి స్వప్న అక్క తనకు చెప్పిందని అంటుంది. అప్పుడు.. తమ కుటుంబాన్ని రామాయణంతో పోల్చిచాలా బాగా చెబుతాడు. రామాయణంలో భరతుడికి పట్టాభిషేకం చేయాలని కైకేయి కి చివరికి ఎలాంటి గతి పడిందో తెలిసి కూడా.. మా అమ్మ కూడా అలానే ప్రవర్తిస్తుందని అంటాడు.
తర్వాత.. మీరు ఎందుకు కొద్దిరోజులుగా ఒంటరిగా బాధపడుతున్నారు కారణం అన్నయ్యేనా అని అడుగుతాడు. కావ్య సమాధానం దాట వేయాలని చూస్తుంది. కానీ.. కళ్యాణ్ వినకుండా.. తన మీద ఒట్టు వేయించుకుంటాడు. దీంతో.. తప్పక.. శ్వేత విషయం చెప్పాల్సి వస్తుంది. తన దగ్గర ఉన్న శ్వేత , రాజ్ ల ఫోటోలను చూపిస్తుంది. తన పేరు శ్వేత అని.. కాలేజీలో తన సీనియర్ అని, అన్నయ్యకి క్లాస్ మేట్ అని చెబుతాడు. వాళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా అని కావ్య అడుగుతుంది. అయితే.. శ్వేత రాజ్ ని ప్రేమించిదని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందని చెబుతాడు. మరి మీ అన్నయ్య అని కావ్య అడిగితే.. నిజంగా అన్నయ్య ఇష్టపడి ఉంటే.. ఇంట్లో కాదు అనే వారు ఎవరూ లేరు కదా అని అంటాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగా.. అనామిక అక్కడకు వస్తుంది.
Brahmamudi
అనామికను చూసి..కళ్యాణ్ ఏదో చెప్పబోయి కూడా ఆగిపోతాడు. నన్ను చూసి మాట్లాడుకోవడం ఆపేసారేంటి అనామిక అడుగుతుంది. అలాంటిదేమీ లేదని కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ అనామిక ఊరుకోదు. తన గురించే మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. నీ గురించి మాట్లాడుకోవడానికి ఏం ఉంటుంది అని కళ్యాణ్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ.. వీళ్లు ఏదో దాచి పెడుతున్నారని అది తెలుసుకోవాలని అనుకుంటుంది.
Brahmamudi
ఇక.. అనామిక తన గదిలోకి వెళ్తుంటే.. రుద్రాణి వస్తుంది. అనామిక బుర్ర పాడు చేయాలని చూస్తుంది. నిజంగానే కళ్యాణ్, కావ్య.. నీ గురించే మాట్లాడుకున్నారని ఎక్కిస్తుంది. అనామిక అలా ఏమీ కాదని, కళ్యాణ్ తనను ప్రేమిస్తున్నాడని, తాను చెప్పినట్లే వింటాడని అంటుంది. కానీ.. రుద్రాణి ఆగదు. కావ్య ప్లాన్స్ అన్నీ చివరి వరకు ఎవరికీ తెలియదని.. నీపై కళ్యాణ్ కి కోపం వచ్చేలా చేసి, మీ ఇద్దరి మధ్య గొడవలు పెంచేలా చేస్తుందని అంటుంది. చివరకు.. కళ్యాన్ వెళ్లి.. అప్పూని పెళ్లి చేసుకోమని అడిగేలా చేస్తుందని ఇదంతా.. కావ్య ప్లాన్ అని బాగా ఎక్కిస్తుంది. ఇదంతా నిజమని అనామిక కూడా ఆలోచనలో పడిపోతుంది.
Brahmamudi
మరోవైపు కావ్య పడుకొని ఉంటుంది. బ్యాగ్రౌండ్ లో సాడ్ సాంగ్ ప్లే అవుతుంది. అప్పుడే రాజ్ అక్కడికి వస్తాడు. పడుకున్నావా అంటే.. తాను నిద్ర నటించడం లేదు అంటుంది. తర్వాత.. శ్వేత టాపిక్ ని ఇన్ డైరెక్ట్ గా తీసుకువస్తుంది. కానీ.. రాజ్ కి అర్థం కాదు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో.. కావ్య చేతులు కట్టేసి మరీ.. రాజ్ కావ్యకు అన్నం తినిపిస్తాడు.