Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 19th January Episode:అనామిక బుద్ది కనిపెట్టేసిన స్వప్న, శ్వేతను బయపెడుతున్నది ఎవరు?

BrahmaMudi 19th January Episode:అనామిక బుద్ది కనిపెట్టేసిన స్వప్న, శ్వేతను బయపెడుతున్నది ఎవరు?

కానీ.. కావ్య మాత్రం.. ఈ ఇల్లు మన లోకం.. ఈ ఇంటి పేరు, గోత్రం మనం మోస్తున్నామని.. ఒక్కరోజు గొడవ పెట్టుకొని వెళ్లిపోయే బంధం కాదని .. జీవితాంతం ఈ ఇంట్లో వాళ్లతో  కలిసి ఉండాల్సిన వాళ్లం అని.. ఏవేవో డైలాగులు కొడుతుంది

telugu news team | Published : Jan 19 2024, 10:36 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 19th January Episode: కావ్య ఇంట్లో  కిచెన్ లో పని చేస్తూ ఉంటుంది. అక్కడికి స్వప్న వచ్చి.. ఈ పనులు నువ్వు ఎందుకు చేస్తున్నావ్..? పనివాళ్లు లేరా అని అడుగుతుంది. పనివాళ్లు ఇప్పటిదాకా ఎందుకు ఉంటారు అక్క ఎప్పుడో వెళ్లిపోయారు అని చెబుతుంది. మరి.. నువ్వు ఎందుకు ఈ ఇంటి చాకిరి మొత్తం  చేస్తున్నావ్..? నువ్వు ఇంత చేసినా వాళ్లు ఎవరూ నిన్ను గుర్తించరు.. పైగా నోరేసుకొని మీద పడిపోతూ ఉంటారు.. అని స్వప్న కావ్యకు హితభోధ చేసే ప్రయత్నం చేస్తుంది. మీ అత్తయ్య, చిన్న అత్తయ్య ఇద్దరూ నిన్ను అన్నన్ని మాటలు అంటున్నారని.. ఇప్పుడు చిన్న కోడలు అనామిక మరీ చిత్రాంగి అని స్వప్న అంటుంది. తను ఎలాగైతే తన అత్తను బెదిరించి.. చేపను బండకేసి రుద్దినట్లు రుద్దుతున్నానో.. అలాగే నువ్వు కూడా మీ అత్తను రుద్దు అని దెబ్బకు మాట వింటారు అని, ఇంట్లో అమ్మమ్మ తప్ప.. ఈ ఇంట్లోని ఏ ఆడసంత.. నిన్ను సపోర్ట్ చేయరు అని.. తెగించి అందరికీ ఈ పనులు చెయ్యను అని చెప్పమని అంటుంది. కావాలంటే.. వంట మాత్రం వండి పడేస్తాను అని చెప్పుుఅంటుంది. 

కానీ.. కావ్య మాత్రం.. ఈ ఇల్లు మన లోకం.. ఈ ఇంటి పేరు, గోత్రం మనం మోస్తున్నామని.. ఒక్కరోజు గొడవ పెట్టుకొని వెళ్లిపోయే బంధం కాదని .. జీవితాంతం ఈ ఇంట్లో వాళ్లతో  కలిసి ఉండాల్సిన వాళ్లం అని.. ఏవేవో డైలాగులు కొడుతుంది దానికి విసిపోయిన స్వప్న.. నీకు చెప్పడం కూడా వేస్ట్ అనేసి వెళ్లిపోతుంది.
 

25
Brahmamudi

Brahmamudi

సీన్ కట్ చేస్తే.. అప్పూ ఇంట్లో గదిలో కూర్చొని ఉంటుంది. ఈలోగా కనకం ఇంటికి ఓ మహిళ వస్తుంది. ఆమె తన కూతురికి పెళ్లి కుదిరింది అని.. కార్డు ఇవ్వడానికి వచ్చాను అని చెబుతుంది. ఆ మాటకు కనకం, రాజ్యం సంతోషించి.. కచ్చితంగా పెళ్లికి వస్తాం అని చెబుతారు. అబ్బాయి ఏం చేస్తాడు అని అడిగితే... సాఫ్ట్ వేర్  అని డల్ గా చెబుతుంది. సాఫ్ట్ వేర్ అని అంత డల్ గా చెబుతావేంటి అంటే.. కనకం అక్కలాగా గొప్ప సంబంధాలు తేలేకపోయాను కదా అంటుంది. ఆ తర్వాత.. స్వప్న పెళ్లి, కావ్య పెళ్లి గురించి మాట్లాడుతుంది. అక్కడితో ఆగకుండా.. అప్పూని కూడా ఆ ఇంటికే కోడలిని చేయాలని చూశావ్ అంట కదా.. అని నానా మాటలు అంటుంది. ఆ మాటలకు కనకంకి బాధేసి.. లోపలికి వెళ్లిపోతుంది. కనకం బాధపడిందనే విషయం రాజ్యంకి అర్థమై.. పెళ్లి పిలుపులకు వచ్చిన ఆమెను తిడుతుంది. కూతురికి పెళ్లి చేస్తున్నదానివి మరో ఆడ పిల్ల గురంచి అలా మాట్లాడటానికి నోరు ఎలా వచ్చిందని.. అరవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

35
Brahmamudi

Brahmamudi

సీన్ కట్ చేస్తే.. కిచెన్ లో పని పూర్తి చేసుకొని కావ్య.. బెడ్రూమ్ కి వెళ్తుంది. వెళ్లేసరికి.. రాజ్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే పడుకున్నారు ఏంటి అనుకొని కావ్య కూడా వెళ్లి పడుకుంటుంది. మరోవైపు అప్పూ ఇంట్లో భోజనం చేయకుండా బాధపడుతూ ఉంటుంది. రాజ్యలక్ష్మి... అప్పూ కోసం భోజనం తీసుకొని వెళ్తుంది. కానీ.. అప్పూ తనకు ఆకలిగా లేదని, భోజనం వద్దు అని అంటుంది. కానీ.. రాజ్యలక్ష్మి.. అప్పూని ఓదారుస్తుంది.

ఎవరు ఏదో మాట్లాడితే.. నువ్వు ఎందుకు బాధపడతున్నావ్ అని ఓదారుస్తుంది. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే... వాళ్లు అన్నదే నిజమౌతుందని అంటుంది.  పేదవారి ప్రేమను అందరూ ఆశగానే చూస్తారని.. అందుకే..  నీ ప్రేమను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతుంది. కనకం తన కూతుళ్లు బాగుండాలని కోరుకుంది.. దాని కోసం ఎక్కువ అబద్ధాలు చెప్పింది. అందుకే.. ఇప్పుడు ఎవరూ మీ అమ్మను నమ్మడం లేదు అని చెబుతుంది. తర్వాత.. అప్పూ అంటే  ఇలా ఉండదని.. అప్పూ అప్పూలానే ఉండాలని చెప్పడంతో.. అప్పూ భోజనం చేస్తుంది.

45
Brahmamudi

Brahmamudi

ఇక.. కావ్య నిద్రపోతుంటే.. రాజ్ ఫోన్ అలారం మోగుతుంది.అది ఫోన్ అనుకొని కావ్య లేస్తుంది. అప్పుడు రాజ్ ఫోన్ కాదని, అలా రం అని చెబుతాడు. తనకు ఆఫీసులో అర్జంట్ వర్క్ ఉందని.. అందుకే.. ఇప్పుడు ఆఫీసుకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. 

55
Brahmamudi

Brahmamudi

మరోవైపు ఇంట్లో శ్వేత నిద్రపోతూ ఉంటుంది.  ఇంతలో ఎవరో ఇంట్లోకి అడుగుపెట్టినట్లు అనిపించి.. చూస్తూ ఉంటుంది. ఈలోగా రాజ్ ఫోన్ చేస్తాడు. సాయంత్రం మెసేజ్ చేశావ్ కదా.. ఏంటో చెప్పు అంటాడు. ఏమీ లేదు అంటుంది. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని రాజ్ అడిగితే.. ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తోందని చెబుతుంది. అయితే.. రాజ్ నేనురానా అని అడుగుతాడు. వద్దులే అని చెబుతుంది. సరే అని రాజ్ ఆఫీసుకు వెళ్తుంటాడు. మరోవైపు.. శ్వేత ఇంట్లోకి ఎవరో వ్యక్తి అడుగుపెట్టి.. శ్వేతను భయపెడుతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. అది శ్వేత మొగుడు అయ్యి ఉండొచ్చనే అనుమానం కలుగుతోంది.

కమింగ్ అప్ లో.. కావ్యకు రాజ్ ఆఫీస్ డిజైనర్ ఫోన్ చేసి.. రాజ్ ఆఫీసుకు రాలేదని చెబుతుంది. డిజైన్స్ తాను పూర్తి చేస్తానని కావ్య చెబుతుంది. ఈ లోగా..  కావ్యకు.. ఎవరో ఓ వీడియో పంపుతారు. ఆ వీడియోలో రాజ్ తో శ్వేత కూడా ఉంటుంది. మరి.. వారిని చూసి కావ్య ఎలా అర్థం చేసుకుంటుందో చూడాలి.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories