MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 18th march Episode:ఫ్రెండ్స్ ముందు అనామిక పరువు తీసేసిన కవి, వారం రోజులు డెడ్ లైన్..!

BrahmaMudi 18th march Episode:ఫ్రెండ్స్ ముందు అనామిక పరువు తీసేసిన కవి, వారం రోజులు డెడ్ లైన్..!

జస్ట్ తన భర్తకు సపోర్ట్ చేస్తారు అని చెబుతుంది. ఆ మాట విని ఇంట్లోవారందరూ షాకౌతారు. రుద్రాణి మాత్రం.. ఈ మాట రాజ్ వింటే.. నిన్ను చంపేస్తాడు అని అనుకుంటుంది.

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 18 2024, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Brahmamudi

Brahmamudi


BrahmaMudi 18th march Episode:అనామి కోసం వాళ్ల ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. ఇక.. ఫ్రెండ్స్ ఇంటికి రావడంతో అనామిక ఆనందానికి హద్దులు ఉండవు. వాళ్లకు ఇంటి గురించి, తమ ఆస్తి గురించి గొప్పగా చెబుతుంది. వాళ్లు ధాన్యలక్ష్మిని చూసి ఎవరు అని అడిగితే.. మా ఆంటీ అని చెబుతుంది. సీరియల్స్ లో చూపించే అత్తలా ఇబ్బంది పెడుతుందా అని ఫ్రెండ్స్ అడిగితే.. కాదని... కోడలిని కూడా కూతురులా చూసుకుంటాను అని చెబుతుంది. వెంటనే అపర్ణని  చూపించి ఎవరు అని అడుగుతారు. కావ్య.. వాళ్ల అత్త గురించి గొప్పగా చెబుతుంది.ఈ ఇంటి పెద్ద అని, అందరూ ఆమె చెప్పినట్లే ఇంట్లో అందరూ వింటారు అని చెబుతుంది. మా అత్తయ్యగారు అని.. తాను పెద్ద కోడలు అని పరిచయం చేసుకుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Brahmamudi

Brahmamudi

ఈ కావ్య తన పరువు తీస్తోందని అక్కడి నుంచి పంపేయమని అనామిక వాళ్ల అత్తకు చెబుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి.. వెళ్లి కాఫీలు తెమ్మని కావ్యకు పురమాయిస్తుంది. సరే అని కావ్య వెళ్తుంది. అప్పుడు ఇక కళ్యాన్ గురించి వాళ్లు అడుగుతారు. అనామిక లేనిపోని డాబులు చెబుతుంది. బిజినెస్ మొత్తం తన భర్త కళ్యాణ్ ఛూసుకుంటాడని , మొత్తం 23 బ్రాంచులు తనే చూసుకుంటాడు అని గొప్పగా చెబుతుంది. మరి కావ్యగారి భర్త బిజినెస్ చేయరా అంటే... జస్ట్ తన భర్తకు సపోర్ట్ చేస్తారు అని చెబుతుంది. ఆ మాట విని ఇంట్లోవారందరూ షాకౌతారు. రుద్రాణి మాత్రం.. ఈ మాట రాజ్ వింటే.. నిన్ను చంపేస్తాడు అని అనుకుంటుంది.

37
Brahmamudi

Brahmamudi

అనామిక చెప్పిందంతా నిజమని వాళ్ల ఫ్రెండ్స్ నమ్ముతారు. అప్పుడే కళ్యాణ్ కిందకు వస్తాడు. వాళ్లు.. కళ్యాణ్ ని మీరు చాలా గ్రేట్ అని, బిజినెస్ చూసుకుంటూ.. భార్యతో సమయం గడుపుతున్నారు అని తెగ పొగిడేస్తారు. అయితే.. కళ్యాణ్ మాత్రం నిజం చెప్పేస్తాడు. 

47
Brahmamudi

Brahmamudi

తాను అసలు బిజినెస్ చేయనని.. మొత్తం తన అన్నయ్య రాజ్ చూసుకుంటాడు అని చెబుతాడు. మరి మీరేం చేస్తారు అంటే.. తాను కవితలు రాస్తానని.. జీవితంలో చెప్పుకోదగినది ఏమీ సాధించలేలేదని... అందుకే అనామిక మీ దగ్గర అబద్ధాలు చెప్పింది అని అసలు విషయం బయటపెడతాడు. ఫ్రెండ్స్ కదా అర్థం చేసుకోండి అని  చెప్పేసి వెళ్లిపోతాడు.

ఇక.. వాళ్లు అనామికు క్లాస్ పీకుతారు. నువ్వు ఇంకా మారలేదు.. మారిపోయావు అనుకున్నాం అంటారు. నీకు నిజాయితీ ఉన్న వ్యక్తి భర్తగా దొరికాడు అని, మంచి ఫ్యామిలీ ఉందని.. బుద్ధి మార్చుకోమని క్లాస్ పీకి అక్కడి నుంచి వెళ్లిపోతారు. పరువు పోయినట్లు.. తల కొట్టేసినట్లుగా అనామిక ఫీలౌతుంది.

ఇక.. అపర్ణ కూడా అనామికకు క్లాస్ పీకుతుంది. చూసిన ఒక్క నిమిషయంలోనే వాళ్లు.. కళ్యాణ్ ని అర్థం చేసుకున్నారు.. నువ్వు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావ్ అని తిడుతుంది. దానికి అనామిక మీ కొడుకులాగా మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఉంటే.. నేను కూడా వాళ్లకు గొప్పగా నిజం చెప్పుకునేదాన్ని అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

57
Brahmamudi

Brahmamudi

కళ్యాణ్ ఫోన్ చూసుకుంటూ ఉంటే వచ్చి... ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా అని అడుగుతుంది. నాకు కాదు... ఇప్పటి నుంచి నీకు మనశ్శాంతిగా ఉంటుంది. నీ ఫ్రెండ్స్ కి నిజం తెలిసింది కాబట్టి.. నువ్వు ఇక నుంచి వాళ్లకు అబద్దం చెప్పాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని కళ్యాన్ అంటాడు. వెంటనే ధాన్యలక్ష్మి వచ్చి... కొడుకును తిడుతుంది. 

67
Brahmamudi

Brahmamudi

ఫ్రెండ్స్ ముందు అనామిక పరువు తీసి ఇప్పుడు కవితలు చెబుతావా అని అంటుంది. కవితల్లోనే నిజాలు ఉంటాయి అని కళ్యాణ్ అంటే.. ఆ నిజాలు తనకు వద్దు అని.. నా భర్త కూడా అందరి ముందు గొప్పవాడు అని చెప్పుకోవాలని తనకు ఉండదా అని అనామిక అంటుంది.

77
Brahmamudi

Brahmamudi


ఇప్పుడు నీ సంతోషానికి ఏమైంది అని కళ్యాణ్ ప్రశ్నిస్తే... ఎవరో సంపాదిస్తే నాకు సంతోషంగా ఉండదని.. నా భర్త సంపాదనే నాకు సంతోషాన్ని ఇస్తుందని చెబుతుంది.దానికోసమే తాను కష్టపడుతున్నాను అని కళ్యాణ్ అంటే.. ఆ కవితల మీద నాకు నమ్మకం లేదు అని చెబుతుంది. కేవలం వారం రోజులు డెడ్ లైన్ పెట్టి.. ఆలోగా చిన్న అవకాశం అయినా తెచ్చుకోవాలని లేకపోతే.. తాను చెప్పినట్లు వినాలని కండిషన్ పెడుతుంది.  దానికి కళ్యాణ్ సరే అంటాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image2
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved