MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 18th January Episode:ఇంట్లో గొడవతో కావ్యకు దగ్గరైన రాజ్, పెద్ద స్కెచ్ తో వచ్చిన అనామిక..!

BrahmaMudi 18th January Episode:ఇంట్లో గొడవతో కావ్యకు దగ్గరైన రాజ్, పెద్ద స్కెచ్ తో వచ్చిన అనామిక..!

 ధాన్యలక్ష్మీ, అపర్ణ ఇద్దరూ.. కావ్యపై పగ తీర్చుకుంటున్నట్లు చేస్తున్నారని ఇందిరాదేవి.. తన భర్తకు చెప్పుకొని బాధపడుతుంది. 

5 Min read
Author : ramya Sridhar
Published : Jan 18 2024, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Brahmamudi

Brahmamudi


BrahmaMudi 18th January Episode: శోభనం రోజున అనామిక రచ్చ.. తిరిగి తిరిగి కావ్య కి చుట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధాన్యలక్ష్మి కావ్యను బ్లేమ్ చేస్తుంది. కావ్య, స్వప్న.. ఈ ఇంటికి ఎలా కోడళ్లు అయ్యారో అందరికీ తెలుసని, తన కోడలు మాత్రమే అందరికీ నచ్చేలా కోడలు అయ్యిందని ధాన్యం చెబుతూ ఉంటుంది. అవి విని.. రాజ్ కి విపరీతంగా కోపం వస్తుంది. కళ్యాణ్ అని గట్టిగా అరుస్తాడు. అందరూ షాకైపోతారు. ‘ కళ్యాణ్ ఏంటి  ఈ గొడవలు.. అసలు ఒకదానితో మరొకటి సంబంం ఉందా? అనామికను తీసుకెళ్లి సర్దిచెప్పు.. పెట్టిన పంచాయతీ చాలు’ అని కళ్యాణ్ ని ఉద్దేశించి అంటాడు. ఆ మాటకు అందరూ షాకౌతారు. కానీ వెంటనే అపర్ణ కొడుకుపై సీరియస్ అవుతుంది. ముందు నీ పెళ్లానికి చెప్పుకో.. పక్కనోళ్ల కాపురాల్లో తొంగి చూడొద్దు అని కావ్య పై అక్కసు వెల్లగక్కుతుంది. పాపం ఆ మాటకు కావ్య ఫీలై.. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ధాన్యలక్ష్మీ, అపర్ణ ఇద్దరూ.. కావ్యపై పగ తీర్చుకుంటున్నట్లు చేస్తున్నారని ఇందిరాదేవి.. తన భర్తకు చెప్పుకొని బాధపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Brahmamudi

Brahmamudi

ఇక..కావ్య బెడ్రూమ్ లో కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆమెను ఓదార్చడానికి రాజ్ వెళ్లి పక్కన కూర్చుంటాడు. ‘ నాకు నిన్ను బాధపెట్టడమే కానీ ఓదార్చడం తెలీదు. ఇప్పుడు నేను ఏం చేస్తే  నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.’ అని రాజ్ అడుగుతాడు. దానికి కావ్య.. భార్యను ఎలా ఓదార్చాలి అని భర్త అడగడం ఈ ఇంట్లోనే జరుగుతుంది అని కావ్య అంటుంది. ఆ విషయం నాకు ముందే తెలియదని చెప్పాను కదా అని రాజ్ అంటాడు. ఆ తర్వాత.. కావ్యను ఓదార్చేలా చాలా గొప్పగా చెబుతాడు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిదని సలహా ఇస్తాడు. దానికి కావ్య.. నేను కూడా అదే ఫార్ములా ఫాలో అవుతాను అని కావ్య చెబుతుంది. తర్వాత రాజ్.. తాను బావగారు స్థానంలో అనామికను ఏమీ అనలేమని, కళ్యాణ్ కి ఇవన్నీ చాలా కొత్త అని, మొదటిరోజే భార్యనుంచి షాక్ తిన్నాడని చెబుతాడు. అంతేకాకుండా.. తన ధాన్యలక్ష్మి పిన్ని ఇలా కూడా మాట్లాడగలదు అని ఇప్పుడే తెలిసింది అని రాజ్ అంటాడు. వీళ్లందరినీ కలుపుకుంటూ పోతేనే ఉమ్మడి కుటుంబం నిలుస్తుంది అని రాజ్ చెబుతాడు.  ఇక..కావ్య  భర్తను కృష్ణుడితో పోలుస్తూ.. తన బాధ మొత్తం చెబుతుంది. ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా.. మీరు నాకు సపోర్ట్ గా ఉంటే.. ఆ గోవర్థన పర్వతాన్ని ఎత్తిన అనుభూతి తనకు కలుగుతుందని  కావ్య చెబుతుంంది. రాజ్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటాడు. ఈ సీన్ కి ఫ్యాన్స్ కచ్చితంగా కనెక్ట్ అయ్యేలా ఉంది.  ఓదార్చడం తెలీదు అంటూనే ఓదార్చారు అని కావ్య సంబరపడుతుంది.

36
Brahmamudi

Brahmamudi

సీన్ కట్ చేస్తే.. అనామిక ఎవరూ చూడకుండా,, తన పేరెంట్స్ కి కాల్ చేస్తుంది. ప్లాన్ ప్రకారం ఫస్ట్ నైట్ చెడగొట్టుకున్నానని చెబుతుంది. అదంతా కావ్య వల్లే జరిగిందని నిరూపించావా అని వాళ్ల పేరెంట్స్ అడిగితే.. అలానే చేశానని.. తన అత్తగారు, పెద్ద అత్తగారు కావ్య వల్లే జరిగిందని తిట్టారని , కాకపోతే కొందరు మాత్రం కావ్యకు సపోర్ట్ చేశారని అనామిక చెబుతుంది. త్వరలోనే వాళ్లు కూడా నీకు సపోర్ట్ గా మారేలా చూసుకోమని వాళ్ల అమ్మ సలహా ఇస్తుంది. తన ప్లాన్ లో భాగంగా.. కావ్యకు సారీ చెబుతాను అని అంటుంది. అదేంటి అని సుబ్బు అడిగితే.. అలా చెబితేనే తాను అనుకున్నది జరుగుతుంది అని అనామిక అంటుంది. ఇప్పటి వరకు మీరు చెప్పింది చేశానని.. ఇక నుంచి తాను అనుకన్నది చేస్తానని.. ఇప్పుడు అందరి ముందు నేను కావ్య సారీ చెబితే.. అందరూ తనను మంచివారు అనుకుంటారు అని అనామిక చెబుతుంది. కానీ కావ్య మీద అందరికీ కోపం పోతుందేమో అని అంటే.. మళ్లీ తెప్పించగలను అని, అందరి ముందు కావ్య చెడ్డది అయ్యేలా చేస్తాను అని అనామిక అంటుంది. దానికి వాళ్ల పేరెంట్స్ గొప్పగా ఫీలై.. మెచ్చుకుంటారు.

46
Brahmamudi

Brahmamudi

అందరూ ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. కావ్య కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటుంది. పని పూర్తి చేసుకొని వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అనామిక అక్కడికి వస్తుంది. అందరూ ఉండగానే..కావ్యతో మాట్లాడాలని అనామిక అనుకుంటుంది. దాని కోసం కావాలని కావ్యకు ఎదురుపడుతుంది. ‘ కావ్య అక్క నన్ను క్షమించు. నువ్వు నన్ను క్షమిస్తే తప్ప.. కళ్యాణ్ నన్ను బార్యగా అంగీకరించేలా లేడు. అంటే.. నా ఉద్దేశం నేను ఇష్టపడే వాళ్లందరికీ నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు  ఇలా జరుగుతుందని తెలీదు. నీకు మాట వస్తుందని అనుకోలేదు. నా వల్ల నువ్వు మాట పడినందుకు సారీ అక్క. నేను కళ్యాణ్ ని ప్రేమిచి పెళ్లి చేశాను. ఇంత పెద్ద కుటుంబంలోకి అడుగుపెట్టాను. ఏధి చెప్పాలో ఏది దాచిపెట్టాలో తెలీదు.  చెప్పకూడనిది చెప్పేశాను. దాని వల్ల నువ్వు బాధపడ్డావు. సారీ అక్క’ అని చెబుతుంది. అది చూసి కళ్యాణ్ సంతోషిస్తాడు.

56
Brahmamudi

Brahmamudi

అక్కడ కూడా.. ధాన్యలక్ష్మి కావ్య పై సెటైర్ వేస్తుంది. నువ్వు క్షమాపణలు చెప్పినా అర్థం చేసుకోలేరు అంటుంది. కానీ, అనామిక ఓవర్ యాక్షన్ చేస్తుంది.  కావ్యను ఏదైనా అంటే కళ్యాణ్ బాధపడతాడని, అది మా ఇద్దరి మధ్య దూరం పెంచుతుందని అది తనకు ఇష్టం లేదని చెబుతుంది. అనామిక చేసిన పనికి ఇంట్లో చాలా మంది సంతోషిస్తారు. తర్వాత ఇంట్లో వాళ్లకు కూడా అనామిక క్షమాపణలు చెబుతుంది.  వెంటనే..  అపర్ణ.. అనామికను పొగుడుతుంది. దుగ్గిరాల ఇంటికి సరైన కోడలు వచ్చింది అని అపర్ణ అంటే.. వెంటనే స్వప్న అందుకుంటుంది. అంటే.. అంతక ముందు వచ్చిన వాళ్లు సరైన కోడళ్లు కాదా అని స్వప్న అడుగుతుంది. అవును అని అపర్ణ బదులిస్తుంది. దానికి స్వప్న.. మాకన్నా ముందు మీరు ఈ ఇంటి కోడళ్లు గా వచ్చారు.. మీరు కూడా సరైన కోడళ్లు కానట్లేనా అని సరైన టైమ్ లో సరైన సెటైర్ వేస్తుంది. ఆ మాటకు అపర్ణ రెచ్చిపోతుంది. స్వప్న మాత్రం ఎక్కడా తగ్గకుండా బదులిస్తుంది. అనామికను మెచ్చుకుంటే పర్లేదు కానీ.. నన్ను, కావ్యను ఏమైనా అంటే ఊరుకోను అని స్వప్న చెబుతుంది.

తర్వాత కావ్య.. అనామిక, కళ్యాణ్ లను ఉద్దేశించి మాట్లాడుతుంది. మీరు ఇద్దరూ తనను, అప్పూని ఏ విషయంలోనూ లాగొద్దని చెబుతుంది. మీరు కొత్తగా పెళ్లైన వారు.. మీ గురించి మీరు మాట్లాడుకోండి.. ఈ రోజు నుంచి అనామిక కు సంబంధించిన ఏ విషయంలోనూ నా జోక్యం ఉండదు అని చెప్పేసి కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక.. ఒక్క దెబ్బతో అందరి ముందు తాను మంచి దానిని అనిపించుకున్నాను అని మనసులోనే సంబరపడిపోతుంది.

66
Brahmamudi

Brahmamudi

మూర్తి బొమ్మలకు రంగులు వేస్తూ ఉంటాడు. కనకం ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పూ  కుంటుకుంటూ బెడ్ దిగి బయటకు వస్తుంది. అప్పూ నడుస్తుంటే.. ఇంట్లో వాళ్లు షాకౌతారు. పడిపోబోతోంటే పట్టుకోబోతారు. కానీ.. ఎవరూ పట్టుకోవద్దని.. నేను నడవగలను అని నడవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మళ్లీ పడవబోతుంటే కనకం పట్టుకుంటుంది.  చెయ్యి పట్టుకొని నడమని కనకం అంటే.. ఆ వయసు దాటిపోయానని.. పడిపోయినా లేచి నడుస్తాను అని చెబుతుంది. ఇక్కడ కూడా కనకం మళ్లీ పేరు ఎత్తకుండానే కళ్యాణ్ టాపిక్ తెస్తుంది. అది ఒక ప్రమాదం అని.. దాని నుంచి బయట పడి.. తన కాళ్ల మీద తాను బతకాలని అనుకుంటున్నానని.. ఆ విషయం గుర్తు చేయద్దు అని  అప్పూ అంటుంది.

ఈ విషయంలో అప్పూకి మూర్తి ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. ఇక, అప్పూ తన కుంటి కాలుతో నడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కమింగ్ అప్ లో.. రాజ్ మళ్లీ శ్వేతతో కలిసి మాట్లాడుతుంటాడు. దానిని ఎవరో వీడియో తీసి కావ్యకు పంపుతారు. అది చూసి కావ్య షాకౌతుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved