MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 16th January Episode:రుద్రాణికి చుక్కలు చూపిస్తున్న స్వప్న, శోభనం విషయంలో వేలుపెట్టిన కావ్య..!

BrahmaMudi 16th January Episode:రుద్రాణికి చుక్కలు చూపిస్తున్న స్వప్న, శోభనం విషయంలో వేలుపెట్టిన కావ్య..!

ఇప్పటి వరకు అన్నీ తానే చేస్తాను అని చెప్పి.. ఇప్పుడు వేరే వాళ్లకు అప్పగించడం ఏంటి.. అసలు కావ్య ఎక్కడ ఉందా అని చూద్దాం అని రాజ్ వెళతాడు. 

4 Min read
Author : ramya Sridhar
Published : Jan 16 2024, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Brahmmamudi

Brahmmamudi


BrahmaMudi 16th January Episode: స్వప్న.. ట్యాబ్లెట్స్ కోసం రుద్రాణిని పిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత... పాయసం చెయ్యమని ఆర్డర్ వేస్తుంది. రుద్రాణి తాను చెయ్యను అంటే.. పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అని బెదిరిస్తుంది. దీంతో.. తప్పక తెస్తాను అని బయటకు వెళ్తుంది. కానీ చెయ్యడం ఇష్టంలేక తలబాదుకుంటూ ఉంటుంది. అప్పుడే రాహుల్ వచ్చి.. ఏమైంది మమ్మీ అని అడుగుతాడు. పాయసం తెమ్మని ఆర్డర్ వేస్తోందని.. పాయిజన్ కలిపి తెస్తాను అని రుద్రాణి అంటుంది. ఆ పనిమాత్రం చెయ్యద్దని.. జైలుకి వెళ్లాల్సి వస్తుందని రాహుల్ భయపడతాడు. దీంతో.. ఇంకా ఎంత కాలం దానికి నేను సేవలు చేయాలి అని రుద్రాణి అడిగితే.. డెలివరీ వరకు ఆగమని చెబుతాడు. డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డకు నన్ను ఆయా చేస్తుంది అని  అంటుంది. ఈలోగా.. లోపలి నుంచి స్వప్న.. ఏంటి బయట మీముచ్చట్లు అని అరవడంతో.. రాహుల్ అక్కడి నుంచి పారిపోతాడు. రుద్రాణి పాయిసం చేయడానికి వెళ్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Brahmamudi

Brahmamudi


సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్, అనామికల శోభనం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఓ వ్యక్తి గదిని డెకరేట్ చేస్తూ ఉంటాడు. రాజ్ అతనిని చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. కావ్య మేడమ్ పురమాయించింది అని చెబుతాడు. ఇప్పటి వరకు అన్నీ తానే చేస్తాను అని చెప్పి.. ఇప్పుడు వేరే వాళ్లకు అప్పగించడం ఏంటి.. అసలు కావ్య ఎక్కడ ఉందా అని చూద్దాం అని రాజ్ వెళతాడు.

ధాన్యలక్ష్మి అన్న మాటలు తలుచుకొని కావ్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ వస్తాడు. శోభనం గది ఎందుకు డెకరేట్ చేయడం లేదు అని అడుగుతాడు. ఎవరో ఒకరు చేస్తున్నారు కదా అని కావ్య అంటుంది. నువ్వు ఎందుకు చేయడం లేదు అని రాజ్ అడిగితే... నా చెయ్యి అందరికీ కలిసి రావాలని గ్యారెంటీ లేదని అంటుంది. అలా అని పని తప్పించుకుంటున్నావా అని రాజ్ అంటే.. అప్పుడే వచ్చిన అనామిక.. నాకు సంబంధించిన పని కదా.. అందుకే చెయ్యడం ఇష్టం లేదు అని అంటుంది. అలా ఏమీ లేదు అని కావ్య అంటుంది. కానీ అనామిక వదలదు. ‘నాది, కళ్యాణ్ కి సంబంధించిన విషయం అనగానే కావ్యకు ఎందుకు ఇంత అయిష్టం’ అని అంటుంది. అయిష్టం ఏమీ లేదు అని కావ్య వెళ్లిపోబోతుంటే రాజ్ ఆపేస్తాడు. అనామిక ఫీలౌతుంది కదా అని అన్నా.. కావ్య వినిపించుకోకుండా వెళ్లిపోతుంది.
 

37
Brahmmamudi

Brahmmamudi

‘ చూశారా.. మీరు చెప్పినా కూడా వినలేదు. నా మీద కావ్యకు కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏమో.’ అనే డైలాగ్ కొట్టి అనామిక కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదంతా కళ్యాణ్ కూడా చూస్తాడు. తర్వాత.. కావ్య కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ వస్తాడు... ఏమైనా కావాలా అని అడుగుతాడు. మీకోసమే వచ్చాను అని కళ్యాణ్ అంటాడు. నాకు ఇప్పుడు పని చాలా ఎక్కువగా ఉంది.. ఏదైనా ఉంటే మీ అన్నయ్యకి చెప్పండి అని అంటుంది.  కానీ.. అప్పుడు కావ్య ఏడుస్తూ ఉంటుంది. కావ్య కవర్ చేయాలని చూస్తుంది కానీ.. కళ్యాణ్ కి అర్థమైపోతుంది.  ఎవరో ఏధో అన్నారని.. ఆ కోపం నా మీద చూపిస్తారా అని అడుగుతాడు. దానికి కావ్య.. తనకు ఎవరి మీదా కోపం లేదని, వాళ్లు చెప్పింది కూడా నిజమేకదా అంటుంది. నేను దూరంగా ఉంటే..  మీరు సంతోషంగా ఉంటారు అని అంటుంది. కానీ.. కళ్యాణ్ మాత్రం.. మీరు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటేనే తాను సంతోషంగా  ఉంటాను అని చెబుతారు.తన పనులన్నీ మీరే చేయమని, ఇంట్లో వాళ్లు అందరూ తప్పు అని రుజువు చేయండి అని అంటాడు.

కళ్యాణ్ మాటలకు కావ్య బాగా ఎమోషనల్ అవుతుంది. ఈ ఇంట్లో ప్రతి విషయంలోనూ తనకు సపోర్ట్ గా ఉన్నారని, తాను ఒంటరి గా ఫీలైన ప్రతిసారి.. మీరునాకు తోడుగా ఉన్నారు అని చెబుతుంది. మరి.. మీరు కూడా నాకు.. అలానే ఉండాలి కదా అని కళ్యాణ్ అంటే...  ఎవరు ఏం చెప్పినా.. నేను మీకు తోడుగా ఉంటాను అని మాట ఇస్తుంది. తర్వాత.. రాజ్ తో కలిసి తాను శోభనం గది డెకరేట్ చేస్తాను అని చెబుతుంది.

47
Brahmmamudi

Brahmmamudi

లోపల రాజ్ పని చేసుకుంటూ ఉంటాడు. వెంటనే కావ్య వచ్చి.. అసలు విషయం చెప్పకుండా.. ఏదేదో మాట్లాడుతుంది. రాజ్ కంగారు పడతాడు. తర్వాత.. శోభనం  గది డెకరేట్ చేద్దాం రమ్మని అడుగుతుంది.  తర్వాత..  రాజ్ మాత్రం.. ఏమీ చేయలేడు అని సెటైర్లు వేస్తుంది.

57
Brahmmamudi

Brahmmamudi

మన్మథ బాణం వేసినా.. రాజ్ లో ఏ చలనం ఉండదు అని అంటుంది.  తర్వాత గది డెకరేట్ చేద్దాం రమ్మని అడుగుతుంది. రాజ్ వస్తాడు. ఈ లోగా  ఆ వ్యక్తి డెకరేట్ చేస్తూ ఉంటాడు. అది బాలేదని అతనిని పంపించి.. కావ్య రంగంలోకి దిగుతుంది. మధ్యలో రాజ్ ని కంగారు పెడుతూ..తమ శోభనం స్టోర్ రూమ్ లో జరిగిందని అంటుంది. ఆ మాటకు రాజ్ కంగారుపడతాడు.  కాసేపు వీరిద్దరి సోది తర్వాత.. గది డెకరేట్ చేస్తారు. 

67
Brahmmamudi

Brahmmamudi

రుద్రాణి.. పడుకోవడానికి రెడీ అవుతుంది. స్వప్న ఆగడాలు తట్టుకోలేకపోతున్నా అని పడుకునేలోగా.. స్వప్న మళ్లీ ఫోన్ చేస్తుంది. ఏంటి అంటే.. ఒంట్లో బాలేదు అని చెబుతుంది. అవునా.. అనామికను శోభనం గదిలోకి పంపాలి అని చెప్పగానే  5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను అని రుద్రాణి అంటుంది. వచ్చేటప్పుడు తనకు అవి తెమ్మని.. ఇవి తెమ్మని.. పెద్ద లిస్ట్ చెబుతుంది. అది విని రుద్రాణికి ఆయాసం వస్తుంది. తర్వాత రాహుల్ గురించి అడుగుతుంది. రాహుల్ స్వప్న మాటలు విని అక్కడి నుంచి పారిపోతాడు.

77
Brahmmamudi

Brahmmamudi

ఇక.. కళ్యాణ్.. శోభనం గదిలోకి వెళ్లి.. అనామిక కోసం ఎధురుచూస్తూ ఉంటాడు. అందరూ కలిసి.. అనామికను గది వరకు తీసుకువస్తారు. సిగ్గుపడకుండా, భయపడకుండా లోపలికి వెళ్లమని అనామికను లోపలికి పంపుతారు.  కానీ.. తనను అలా వాళ్లు అందరూ వచ్చి లోపలికి పంపినందుకు.. అనామిక చిరాకు పడుతుంది. కళ్యాణ్ ని డోర్ గడియపెట్టమని చెబుతుంది. తర్వాత.. తనకు పాలు ఇష్టం లేదని.. సగం తాగలేను అని.. నువ్వు తాగుతావా అని అడుగుతుంది.  కళ్యాణ్.. ఇద్దరూ కొంచెం కొంచెం తాగుదాం అంటే.. తనకు పాల వాసన అంటే చిరాకు అని.. కళ్యాణ్ కి ఇచ్చేస్తుంది.  కళ్యాణ్ తాగేస్తాడు. 

తర్వత.. కళ్యాణ్ చాలా గొప్పగా.. కవిత్వం చెబుతాడు. కానీ.. ఇప్పుడు ఈ కవిత్వం అవసరమా, ఇంకేదైనా మాట్లాడమని అడుగుతుంది. ఈ గదిని మా కావ్య వదిన అందంగా అలంకరించింది అని.. చెబుతాడు అంతే.. అనామికకు విపరీతమైన కోపం వస్తుంది. కమింగ్ అప్ లోనూ.. అనామిక తన రచ్చ చేయడం మొదలుపెడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image3
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌తో లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved