MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi 16th December Episode:కావ్యను వదిలించుకునే పనిలో రాజ్, కనకం చేసిన పెంటలో ఇరుక్కున్న కావ్య, అప్పూ.

Brahmamudi 16th December Episode:కావ్యను వదిలించుకునే పనిలో రాజ్, కనకం చేసిన పెంటలో ఇరుక్కున్న కావ్య, అప్పూ.

‘నా గురించి నీకు తెలీదా శ్వేత, నీ గురించి నేను ఎందుకు అలా అనుకుంటాను’ అని రాజ్ అనేసరికి శ్వేత కరిగింది. ‘నన్ను నువ్వు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరు’ అంటుంది. సరే ఎందుకు రమ్మన్నావ్ అని రాజ్ అడగగానే... శ్వేత ఏదో చెబుతూ ఉంటుంది. వాళ్లు ఏం మాట్లాడుకున్నారో మనకు చూపించరు.

7 Min read
ramya Sridhar
Published : Dec 16 2023, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Brahmamudi

Brahmamudi

Brahmamudi 16th December Episode:నేటి ఎపిసోడ్ లో అందరూ కోనేటి వద్ద దీపాలు వెలిగించడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అక్కడ కళ్యాణ్.. అప్పూతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన అనామిక తల్లి.. వెంటనే అక్కడికి అనామికను పంపిస్తుంది. దీంతో, అనామిక వచ్చి.. కళ్యాణ్ ని పక్కకు తీసుకువెళతుంది. అది చూసి కనకం తిట్టుకుంటుంది. తర్వాత అప్పూని తన దగ్గరకు పిలుస్తుంది. సరిగ్గా ఆ సమయానికే రాజ్ కి శ్వేత ఫోన్ చేస్తూ ఉంటుంది.

210
Brahmamudi

Brahmamudi

కొంచెం దూరంగా జరిగి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చాలా సేపటి నుంచి ఎదురుచూస్తున్నానని, వచ్చి కలవమని పిలుస్తుంది. తప్పక.. రాజ్ శ్వేత దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. చిన్నపని ఉందని, ఇప్పుడే వస్తాను అని చెబుతాడు. కావ్య, దీపాలు వెలిగించాలి అని పిలిస్తే.. తానేమీ గుడి వదిలి వెళ్లడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళతాడు.

310
Brahmamudi

Brahmamudi

ఇక, కళ్యాణ్ దూరంగా వెళ్లడం చూసి అప్పూ బాధపడుతుంది. మరోవైపు శ్వేతను కలవడానికి రాజ్ వెళతాడు. ఎక్కడ ఉందా అని వెతుకుతుంటే, శ్వేత వచ్చి.. రాజ్ ని పక్కకు లాగుతుంది. ‘మీ వాళ్లు ఎవరూ చూడకూడదని ఇక్కడికి వచ్చాను’ అని శ్వేత చెబుతుంది. ‘ఎక్కడకు వచ్చినా అందరం ఉంది ఒక్క గుడిలోనే కదా’ అంటాడు రాజ్. ‘అయితే వెళ్లిపోమ్మంటావా?’ అని అడుగుతుంది. ‘ఇదిగో ఇదే వద్దు అనేది, ఏదైనా అంటే ఫీలైపోతావ్’అని రాజ్ అంటే.. ‘నేను నీకు మోయలేని భారంగా మారిపోయానా’ అని బాధగా అడుగుతుంది. ‘నా గురించి నీకు తెలీదా శ్వేత, నీ గురించి నేను ఎందుకు అలా అనుకుంటాను’ అని రాజ్ అనేసరికి శ్వేత కరిగింది. ‘నన్ను నువ్వు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరు’ అంటుంది. సరే ఎందుకు రమ్మన్నావ్ అని రాజ్ అడగగానే... శ్వేత ఏదో చెబుతూ ఉంటుంది. వాళ్లు ఏం మాట్లాడుకున్నారో మనకు చూపించరు.

410
Brahmamudi

Brahmamudi

మరోవైపు వీళ్లంతా దీపాలు వెలిగించడానికి చూస్తే, అగ్గిపెట్ట కనపడదు. దీంతో, రుద్రాణి, కనకం మీద అపర్ణ, ధాన్యలక్ష్మి సెటైర్లు వేసుకుంటారు. తర్వాత అపర్ణ వెళ్లి.. తాను అగ్గిపెట్టెతెస్తాను అని చెప్పి వెళుతుంది. ఈలోగా స్వప్న.. మీ అమ్మని అడిగి అగ్గిపెట్ట తీసుకురా రాహుల్ అంటుంది. మా అమ్మ దగ్గర ఎందుకు ఉంటుంది అని రాహుల్ కోపంగా అడిగితే, పచ్చని సంసారంలో  అగ్గిపెట్టేరకం కదా మీ అమ్మఅంటుంది. నీకు బాగా కొవ్వు ఎక్కిందే అని రాహుల్ తిడతాడు. నీకు, మీ అమ్మకు కూడా తక్కువేమీ లేదు కదా అని స్వప్న మాటకు మాట బదులిస్తుంది. దీంతో, రాహుల్ మనసులో ఇది ఆ త్రిశూలం మీద పడి చస్తే బాగుండేది. అనవసరంగా పెద్ద అత్త కాపాడేసింది అనుకుంటూ ఉంటాడు.

510
Brahmamudi

Brahmamudi

మరోవైపు అపర్ణ.. అగ్గిపెట్టె కోసం వెళ్తూ ఉంటుంది. కావ్య.. రాజ్ ఇంకా రాలేదేంటని చూస్తూ ఉంటుంది. రాజ్ కోసం వెతకడానికి బయలుదేరుతుంది. శ్వేత ... రాజ్ కి ఏదో తన బాధంతా చెప్పుకొని, రాజ్ ని కౌగిలించుకుంటుంది. సరిగ్గా ఆ సీన్ అపర్ణ కంట పడుతుంది. అది చూసి షాకౌతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే సమయానికి రాజ్ కి వాళ్ల నాన్న ఎక్కడున్నావ్ అని ఫోన్ చేస్తాడు. దీంతో, శ్వేతకు తాను ఉన్నాను అని ధైర్యం చెప్పి, అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత.. అందరూ దీపాలు వెలిగించడం మొదలుపెడతారు.

610
Brahmamudi

Brahmamudi

ఆడవాళ్లు అందరూ కలిసి ఒకేసారి.. ఆ దీపాలకు దండం పెట్టుకొని కోనేటిలో వదులుతారు. బ్యాగ్రౌండ్ కార్తీక దీపం సాంగ్ వస్తుంది.అందరూ మనస్పూర్తిగా దండం పెట్టుకుంటుంటే, కనకం కావాలని అనామిక దీపం మునిగిపోయేలా నీళ్లు పోస్తుంది. దానికి ఎవరూ చూడరు. తర్వాత అనామిక చూసి బాధపడుతుంటే కావ్య మునిగిపోకుండా ప్రయత్నిస్తుంది. అది చూసి, అనామిక తల్లి ఇష్యూ చేయడం మొదలుపెడుతుంది.

710
Brahmamudi

Brahmamudi

‘అక్కా చెల్లెళ్లు ఇద్దరూ నా కూతురి పక్కన చేరి, కావాలనే నా కూతురి దీపం మునిగిపోయేలా చేశారు’అని నింద వేస్తుంది. ఆమె ఎవరిని అంటోందో అర్థం కాదు కావ్యకు అదే విషయం అడుగుతుంది. ‘నిన్నే అంటున్నాను. నువ్వు కావాలనే నా కూతురి పక్కన చేరి, నా కూతురు వెలిగించిన దీపం ఆరిపోయేలా చేశావ్. కావాలనే నీళ్లు పోశావ్. నేను చూస్తూనే ఉన్నాను. మొదటి నుంచి అన్నీ చూస్తున్నే ఉన్నాను. శుభలేఖ కాల్చావ్. ఇప్పుడు దీపం ఆర్పేశావ్. ఇవన్నీ చూస్తుంటే నువ్వు అన్నీ కావాలనే చేస్తున్నావ్ ’ అని సీరియస్ అవుతుంది.

వెంటనే ధాన్యలక్ష్మి..‘ మా కావ్య ఎందుకు ఇవన్నీ కావాలని చేస్తుంది..?’ అని అడుగుతుంది. దానికి అనామిక తల్లి ‘ఇంకా అర్థం కాలేదా ఎందుకు చేస్తుందో..? కళ్యాణ్ కి తన చెల్లెలిని ఇచ్చి చేయాలనే కదా, ఇన్నాళ్లు తన వెంట తిప్పుకుంది.’అనేస్తుంది. ఆ మాట విని అక్కడ ఉన్న కుటుంబం మొత్తం షాకౌతుంది. వెంటనే అప్పూ.. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది. దానికి అనామిక తల్లి.. ‘ ఇంతకాలం నువ్వు కళ్యాణ్ తో తిరగలేదా? ఆ సంగతి ఇక్కడున్న ఎవరికీ తెలియదా ఏంటి?’అంటుంది. కావ్య.. తన చెల్లెలి గురించి తప్పుగా మాట్లాడొద్దు అంటే, తాను ఉన్నదే మాట్లాడుతున్నాను అని అనామిక తల్లి అంటుంది. ‘ ముందు మీ అక్కని తీసుకొచ్చి ఈ ఇంటికి కోడలిని చేశావ్. ఇప్పుడు నీ చెల్లిని ఈ ఇంటి కోడలిని చేయాలని అనుకుంటున్నావ్. మా అనామిక నీకు అడ్డుగా ఉంది కాబట్టి, ఈ అపశకునాలన్నీ జరిగేలా చేస్తున్నావ్ ’ అంటూ నిందలు వేస్తుంది. 

810
Brahmamudi

Brahmamudi


వెంటనే మూర్తి  కలగజేసుకొని.. కళ్యాణ్, అప్పూలు మంచి స్నేహితులు మాత్రమే అని చెబుతాడు. రాజ్ కూడా ఆ మాటలు సమర్ధిస్తాడు. ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడకుంటే తప్పేంటని? స్నేహితులుగా ఉండకూడదా అని అడుగుతాడు. గొడవ జరిగినందుకు కనకం హ్యాపీగా ఫీలౌతూ ఉంటుంది. అనామిక తల్లి మాత్రం తప్పంతా కావ్యదే అంటూ నిందలు వేస్తుంది. అప్పూ తన ఫ్రెండ్ అని, ఈ విషయం అనామికకు కూడా తెలుసు అని, అయినా తన విషయంలో వదినను ఎందుకు తప్పు పడుతున్నారు అని, తన వదిన ఎలాంటితో తనకు బాగా తెలుసు అని  కళ్యాణ్ సీరియస్ అవుతాడు. వెంటనే అనామిక తండ్రి తగులుకుంటాడు. ‘ ఏంతెలుసు కళ్యాణ్ మీకు. మీ ఆంటీ చెబుతున్నదే నిజం. మీ వదిన నీతో వాళ్ల చెల్లి పెళ్లి చేయాలనే, ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది’ అంటాడు. ఆ మాటలకు రాజ్ కి విపరీతంగా కోపం వస్తుంది.

‘అనామిక, కళ్యాణ్ ల పెళ్లి జరగాలని అందరికంటే ఈ కళావతే ఎక్కువగా కోరుకుంది’ అని రాజ్ చెబుతాడు. వెంటనే కళ్యాన్.. అనామిక మీద సీరియస్ అవుతాడు. నువ్వు మొదటి నుంచి అప్పూని చూస్తున్నావ్ కదా , మీ అమ్మ అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి అని అడుగుతాడు. ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అనామిక.. ‘ నువ్వు నాకంటే ఎక్కువ ప్రయారిటీ అప్పూకే ఇస్తున్నావని, నేను ఎంత ఫీలౌతున్నానో నీకు తెలుసా?’ అని అడుగుతుంది. దానికి కళ్యాన్.. నువ్వు ఇంత న్యారోగా ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. ఆ గొడవంతా విని అలసిపోయిన అప్పూ.. ‘ఇక నిన్ను ఎప్పటికీ కలవను కళ్యాణ్ , నా వల్ల మీరు గొడవ పడొద్దు. సారీ అనామిక నీకు అలా అనిపించి ఉంటే. కళ్యాణ్ నేను ఎప్పుడూ మంచి స్నేహితుల్లానే ఉన్నాం. నీ మనసులో ఉన్నది తెలీక కళ్యాణ్ నాతో చనువుగా ఉన్నాడు. ఇక నేను వెళతాను’ అనేస్తుంది. మూర్తి అప్పూని తీసుకొని వెళుతూ.. ‘అమ్మా అనామిక.. దీంట్లో మా కావ్య తప్పు చేసిందని మాత్రం అనుకోవద్దు’ అని చెబుతాడు. కానీ, అనామిక తల్లి మాత్రం.. ‘ నా కాబోయే అల్లుడితో ఇంకోసారి మీ కూతురు కనపడకుండా చూస్కోండి.’అని వార్నింగ్ ఇస్తుంది.

910
Brahmamudi

Brahmamudi

ఈ గొడవంతా చూసి  ఇందిరాదేవీ కలగజేసుకుంటుంది. ‘ ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు చదువుకున్నదానివే కదా? ఈ కాలం పిల్లలను చూస్తున్నావ్ కదా ? ఎలా ఒక ఆడపిల్ల మీద నింద వేస్తావ్ ?’ అని అడుగుతుంది. ధాన్యలక్ష్మి కూడా.. ‘ అసలు అప్పూ వల్లే కళ్యాణ్, అనామిక కలుసుకున్నారు.తన గురించి అలా మాట్లాడకండి. పైగా కావ్య మా కోడలు, తన గురించి అలా మాట్లాడకండి’ అంటుంది. ఇంత రాద్దాంతం జరుగుతున్నా, అందరూ సున్నితంగా మాట్లాడుతున్నారని, గొడవ పెద్దదిగా అవ్వడం లేదని కనకం ఫీలౌతూ ఉంటుంది. మూర్తి మాత్రం.. వాళ్లకు క్షమాపణలు చెబతాడు. మా అప్పూ మీకు కనిపించదు అని చెబుతాడు. అప్పూ కూడా సారీ చెబుతుంది.తర్వాత వాళ్లు వెళ్లిపోతుంటారు. అప్పూని ఆపడానికి కళ్యాణ్ ప్రయత్నిస్తాడు.

అప్పూని పట్టుకొని అక్కడికి తీసుకువచ్చి.. ‘ ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే వాళ్లు అనుకున్నదే నిజమౌతుంది. వాళ్ల అనుమానం నిజం అనుకుంటారు. నువ్వు, నేను ఎలాంటి ఫ్రెండ్సో మనకు తెలుసు. ఎవరో ఏదో అన్నారని, నువ్వు మన ఫ్రెండ్ షిప్ ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు’ అని కళ్యాణ్ అంటాడు. వెంటనే రుద్రాణి కలగజేసుకొని..‘ అప్పూ వెళితేనే సమస్య పరిష్కారమౌతుంది. అప్పూని నువ్వు ఉండమని అంటే, వాళ్లు అన్నదే నిజమౌతౌంది. అయినా తప్పు అనామిక ఫ్యామిలీది కాదు. కూతురిని మగ స్నేహితులతో తిప్పిన  ఆ కన్నవాళ్లకు ఉండాలి బుద్ధి. ఎవరిని సరిగా పెంచారు..?’అని అంటుంది. 

ఆ మాటకు రాజ్ తండ్రి సుభాష్ స్పందిస్తాడు. ‘ రుద్రాణి... నువ్వు నీ కొడుకుని సరిగా పెంచావా? వాళ్ల తప్పులు వెతుకుతున్నావ్? ఒక ఆడపిల్ల , మగ పిల్లాడితో స్నేహం  వాళ్లు అర్థం చేసుకోనట్లే,  నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు. సమయం దొరికింది కదా అని అన్నీ కలిపి ఇక్కడ మాట్లాడకు’ అని వార్నింగ్ ఇస్తాడు. అనామిక తల్లి మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని అపశకునాలు చూస్తుంటే. కావ్యే కావాలని ఇదంతా చేసిందని అనిపిస్తోందంటుంది. ఆ మాటకు కళ్యాణ్ సీరియస్ అవుతాడు.

1010
Brahmamudi

Brahmamudi

‘ మా వదిన  గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. అసలు మా వదిన గురించి మీకు ఏం తెలుసు. అసలు తనే లేకపోతే , మా పెళ్లి నిన్నే ఆగిపోయేది’ అని మొక్క గురించిచెప్పబోతాడు. కావ్యవెంటనే ఆపేస్తుంది. ‘దాంట్లో నేను చేసింది ఏమీ లేదు. భగవంతుడి దయ వల్ల జాతకంలో దోషం అంతా పోయింది. అనామిక.. మీ అమ్మనాన్న అపార్థంలో ఉన్నారు. నేను మీ శ్రేయోభిలాషిని అని గుర్తిస్తే చాలు. జరిగింది ఇక్కడితో వదిలేయ్ అనామిక. నువ్వు, కళ్యాణ్ ఒకరినొకరు కావాలని అనుకున్నారు. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు అర్థం చేసుకో’ అని కావ్య సున్నితంగా చెప్పడంతో అనామిక కాస్త తగ్గుతుంది..

వెంటనే ‘ మమ్మీ, డాడీ కావ్యగారు నేను వెలిగించిన దీపం  మునిగిపోకుండా చూశారు. ఈ విషయం వదిలేయండి. నాకే ఇబ్బందిగా ఉంది’అంటుంది. సమస్య సమసిపోయినందుకు అందరూ ఇంటికి పయనమౌతారు. కనకం మాత్రం.. విడిపోతారు అనుకుంటే.. ఇలా అయ్యిందేంటని, నా ఆశలన్నీ అడియాశలు అయ్యాయే అని ఫీలౌతుంది.

తర్వాతి రోజు ఉదయాన్నే ఎవరూలేని సమయం చూసుకొని రాజ్.. శ్వేతకు ఫోన్ చేస్తాడు. వెంటనే శ్వేత.. నీ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నాను అని చెబుతుంది. రాజ్ కూడా.. నిన్న నువ్వు మాట్లాడటానికి వస్తే సరిగా మాట్లాడలేదని సారీ చెబుతాడు. కొంచెం టైమ్ అయినా ఇచ్చావ్ చాలు అని శ్వేత అంటుంది. అదంతా మళ్లీ అపర్ణ కంట పడుతుంది. నిన్ను ఇలా దొంగతనం కలవడం, ఎవరూ చూడకుండా మాట్లాడటం నాకు నచ్చడం లేదు అని రాజ్ అంటూ ఉంటాడు. అపర్ణ.. రాజ్ తో గుడిలో కలిసిన అమ్మాయి ఎవరు..? ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఉంటుంది. రాజ్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా? అదే నిజమైతే కావ్యతో ఎందుకు క్లోజ్ గా ఉంటున్నాడు..? కావ్య ఏది అడిగినా  ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగప్ లో..అపర్ణ రాజ్ ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్.. తనకు కళావతిపై ఎలాంటి ప్రేమ లేదని, తాతయ్య ఆరోగ్యం బాగయ్యాక కళావతి తన జీవితంలో నుంచి వెళ్లిపోతుందని, వెళ్లిపోయేలా చేస్తాను అని చెబుతాడు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Recommended image2
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?
Recommended image3
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved