MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 15th January Episode:శోభనం ఆపేసిన అనామిక.., ముందు నుయ్యి, వెనక గొయ్యిలా కావ్య పరిస్థితి..!

BrahmaMudi 15th January Episode:శోభనం ఆపేసిన అనామిక.., ముందు నుయ్యి, వెనక గొయ్యిలా కావ్య పరిస్థితి..!

రాజ్ డబ్బులు కట్టినందుకు, అన్ని విషయాల్లో తనకు సపోర్ట్ గా నిలుస్తున్నందుకు కావ్య సంతోషిస్తుంది. కానీ,  శ్వేత విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడని ఆలోచిస్తుంది. 

4 Min read
Author : ramya Sridhar
Published : Jan 15 2024, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 15th January Episode: తన రక్తం ఇచ్చి.. కళ్యాణ్ అప్పూని కాపాడతాడు. తిరిగి వచ్చిన తర్వాత.. ఇంట్లో ధాన్యలక్ష్మి రచ్చ చేయాలని చూస్తుంది. కానీ, ఇందిరాదేవి ఆపేసి.. కళ్యాణ్, అనామిక లకు శోభనం ఏర్పాట్లు చేయమని చెబుతుంది. మరోవైపు కనకం వాళ్లు.. హాస్పిటల్ బిల్ కోసం ఇబ్బంది పడుతుంటే.. ఆ బిల్ రాజ్ కట్టాడనే విషయం నర్స్ ద్వారా తెలుస్తుంది. దీంతో.. కనకం, మూర్తిలు సంతోషిస్తారు. ఇదే విషయంలో థ్యాంక్స్ చెప్పడానికి కనకం ఫోన్ చేస్తుంది. అప్పూ ఎలా ఉంది రాజ్ అడుగుతాడు. ఒక దేవుడు రక్తం ఇచ్చి కాపాడితే.. మరో దేవుడు బిల్ కట్టాడు అని కనకం అంటుంది. దానికి రాజ్.. నన్ను దేవుడిని చేయవద్దని తన చేతిలో ఉన్నది మాత్రమే చేశాను అని చెబుతాడు. మీరు ఉన్న పరిస్థితిలో.. అంత బిల్లు కట్టలేరని తనకు తెలుసు అని రాజ్ అంటాడు. నిజానికి.. తానే స్వయంగా వచ్చి ఆ డబ్బులు ఇవ్వాల్సిందని, కానీ.. మీరు తీసుకోరేమో అనే సందేహంతో.. మేనేజర్ ని ఇచ్చి.. బిల్లు కట్టమని చెప్పానని అంటాడు. అప్పూ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడింది.. అది చాలని రాజ్ అంటాడు. ఆ మాటలను సీక్రెట్ గా కావ్య దూరం నుంచి వింటూ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Brahmamudi

Brahmamudi

అంతేకాదు..  ఇప్పటి నుంచి మీకు ఏ అవసరం వచ్చినా.. మీ అమ్మాయికి కాదు నాకు చెప్పండి.. మీ అమ్మాయి ఆత్మ గౌరవం అంటూ.. నాకు చెప్పదు. అందుకే.. మీరే చెప్పండి నాకు అని అంటాడు. ఆ మాటలకు కనకం మరింత సంతోసిస్తుంది. సరే బాబు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.  దూరం నుంచి కావ్య  వింటుంటే.. రాజ్ చూస్తాడు. ఇక్కడ కూడా నేను మాట్లాడుకోవద్దా అని రాజ్ అడిగితే.. బిల్ మీరు కట్టారా అని కావ్య అడుగుతుంది. వినేశావా..? నీ ఆత్మ గౌరవం అడ్డు వచ్చిందా అని అడుగుతాడు. లేదు అని కావ్య అనగానే..  అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే.. రాజ్ డబ్బులు కట్టినందుకు, అన్ని విషయాల్లో తనకు సపోర్ట్ గా నిలుస్తున్నందుకు కావ్య సంతోషిస్తుంది. కానీ,  శ్వేత విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడని ఆలోచిస్తుంది.

39
Brahmamudi

Brahmamudi

మరోవైపు హాస్పిటల్ నుంచి అప్పూ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. అప్పూని అలా చూసి రాజ్యలక్ష్మి ఏడుస్తుంది.  ఆమె అలా ఏడుస్తుంటే.. అప్పూ మరింత కఠినంగా మాట్లాడుతుంది. అసలు బయటకు ఎందుకు వెళ్లావ్ అని రాజ్యం అంటే.. ఇలా యాక్సిడెంట్ అవుతుందని తెలీక అంటుంది. ఇలా తెలీక ఎన్ని తప్పులు చేస్తావ్ అని రాజ్యం అంటే.. మీరు ఇంట్లో నన్ను చూస్తూ ఏడుస్తుంటే ఉండలేకపోతున్నానని, ఇంట్లో కూడా ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని చెబుతుంది. తర్వాత.. రాజ్యం పెళ్లి టాపిక్ తెస్తే.. తనను వదిలించుకోవాలని చూస్తున్నారని అప్పూ అంటుంది. కనకం ధైర్యం చెబుతుంది. జీవితాంతం నువ్వు మాతో ఉన్నా.. మేము చూసుకుంటాం అని చెబుతుంది. అప్పూ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రమాదంలోపడ్డాను అని అప్పూ అంటుంది. సరిగ్గా అదే సమాయానికి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. రాజ్యం చాలా సీరియస్ గా  కళ్యాణ్ తో మాట్లాడుతుంది. వెంటనే ఫోన్ లాక్కొని.. కళ్యాణ్ తో మంచిగా మాట్లాడుతుంది.

49
Brahmamudi

Brahmamudi


అప్పూకి బాగానే ఉందని, భోజనం చేసి పడుకుందని చెబుతుంది. మరి, మీ అక్కయ్య ఎందుకు అలా మాట్లాడారు అని కళ్యాణ్ అడిగితే.. మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారేమో అని  అలా అన్నది అంటుంది.. సరే.. అప్పూ లేచిన తర్వాత నాకు ఫోన్ చేయమని కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు. కళ్యాణ్ అలా మాట్లాడుతుంటే అనామిక విని రగిలిపోతుంది. కళ్యాణ్ తనను చూస్తున్నాడనగానే ఫేస్ మార్చేసి.. అప్పూకి ఎలా ఉంది అని అడుగుతుంది. బాగానే ఉందట అని చెబుతాడు. పోనీలే తనకు ఏమైనా అయ్యిందని.. నువ్వు కంగారుపడతావేమో అనుకున్నా.. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ లేదు కాబట్టి.. హ్యాపీగా ఉండొచ్చు అని.. కళ్యాణ్ ని అనామిక తీసుకువెళ్తుంది.

అయితే.. రాజ్యం.. హాస్పిటల్ కి కళ్యాణ్ వచ్చాడా అని అడుగుతుంది. అసలు రక్తం ఇచ్చింది కూడా కళ్యాణ్ అని మూర్తి చెబుతాడు. దేవుడు.. ఆ బాబుకి ఎంత దూరంగా ఉండాలని అనుకున్నా.. దూరం కానివ్వడం లేదు అని రాజ్యం  కూడా బాధపడుతుంది.

59
Brahmamudi

Brahmamudi


కావ్య.. రాజ్ బిల్ పే చేసినందుకు సంతోషిస్తుంది. శ్వేతతో క్లోజ్ గా ఉన్నందుకు బాధపడుతుంది. ఆ రెండు విషయాలను కలిపి ఆలోచిస్తూ ఉంటుంది. తనకు ఇష్టమైన దేవుడు కృష్ణుడు ఫోటో చూసి.. మా ఆయన కూడా నీలాంటివాడేనా అని మాట్లాడుకుంటుంది. అలా మాట్లాడుతూ ఉంటే రాజ్ వస్తాడు.  ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటే.. తన మగ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని, తనకు చిన్పప్పటి నుంచే తెలుసు అని కృష్ణుడిని కరుణాకర్ అని  చెప్పి.. రాజ్ ని ఉడికిస్తుంది.  బలవంతంగా రాజ్ ఫోన్ లాక్కొని చూస్తే.. కృష్ణుడి బొమ్మ కనపడుతుంది.  వెంటనే.. రాజ్ ని శ్వేత టాపిక్ ని ఇన్ డైరెక్ట్ గా  సెటైర్లు వేస్తుంది.

69
Brahmamudi

Brahmamudi

ఇక. కావ్య.. శోభనం ఏర్పాట్లు చేయాలని  వెళ్తుంది. పూలు తెచ్చేవాడితో డీటైల్స్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి... శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నావా అని అడుగుతుంది. అవును అని కావ్య చెబితే.. తనకు ఓ మాట ఇవ్వమని అడుగుతుంది. ఈ శోభనం విషయంలో.. నువ్వు జోక్యం చేసుకోవద్దు.. ఏం పట్టించుకోను అని మాట ఇవ్వమంటుంది. నీ చెయ్యి పడితే.. వాళ్ల కాపురం ఏమౌతుందో అనే భయం వేస్తోందని.. దూరంగా ఉండమని చెబుతుంది. ఆ మాటలకు కావ్య బాధపడుతుంది. ఒకప్పుడు నా చేతితో  చేస్తే.. అదృష్టం అనేవారు.. ఇప్పుడు అరిష్టంగా మారిందా అని కావ్య అడుగుతుంది.

79
Brahmamudi

Brahmamudi

ధాన్యలక్ష్మి అవునని.. నువ్వు.. నీ చెల్లెలిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూశావ్.. ఆ స్థానంలో అనామిక ఉంటే నువ్వు ఓర్చుకోలేవు అందుకే వద్దు అంటున్నాను అంటుంది. కావ్య.. భయపడకండి.. వాళ్లు సంతోషంగా ఉంటే చాలు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. మధ్యలో కళ్యాణ్ వచ్చి..వదిన మీ కోసమే వస్తున్నాను అంటాడు. సిగ్గుపడుతూ... అనామిక కోసం తాను గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానని.. స్పెషల్ గా నగలు డిజైన్ చేయించానని.. దానిలో ఏది ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు అని, సెలక్ట్ చేయమని కావ్య ని అడుగుతాడు. మీ చేతితో సెలక్ట్ చేస్తే శుభం జరుగుతుందని  కావ్యను అడుగుతాడు. కానీ.. ధాన్యం మాటలు గుర్తుకొచ్చి.. నా చెయ్యి అందరికీ నచ్చదని.. చిన్న అత్తయ్యను అడగమని చెబుతుంది. కానీ కళ్యాణ్ ఒప్పుకోడు. కావ్యకు బంగారం గురించి తెలీదని, వెటకారంగా మాట్లాడుతుంది.

89
Brahmamudi

Brahmamudi

దానికి కళ్యాణ్.. మా అమ్మకు రుద్రాని అత్త్య దెయ్యంలా పూనిందని.. నువ్వు చెప్పక తప్పదని కళ్యాణ్్ బలవంతపెడతాడు. దీంతో.. కావ్య ఒకటి సెలక్ట్ చేస్తుంది. కానీ, కావ్య సెలక్షన్ ని  ధాన్యలక్ష్మి బాలేదని చెబుతుంది. అయితే కళ్యాణ్ మాత్రం కావ్య సెలక్ట్ చేసింది తీసుకొని, రెండోది వాళ్ల అమ్మ చేతిలో పెట్టేసి వెళ్లిపోతాడు.

99
Brahmamudi

Brahmamudi


మరోవైపు స్వప్న.. రుద్రాణికి చుక్కలు చూపించడం మొదలుపెడుతుంది. అత్త అని పిలుస్తుంది..  ఏమైంది అని రుద్రాణి అడిగితే... ట్యాబ్లెట్స్ వేసుకునే టైమ్ అయ్యిందని.. చసుకొని ఇవ్వాలి కదా అని అరుస్తుంది. రుద్రాణి చేతితే ఇస్తే అప్పుడు స్వప్న మింగుతుంది. వెళ్లిపోతుంటే.. మళ్లీ పిలిచి తనకు పాయిసం కావాలని అడుగుతుంది. తన వల్ల కాదు అని రుద్రాణి అంటే... పోలీసులకు ఫోన్ చేస్తానని స్వప్న బెదిరిస్తుంది. వెంటనే తెస్తాను అని రుద్రాని వెళుతుంది.

కమింగప్ లో.. శోభనం కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తూ..  కావ్యతో సెలక్ట్ చేయించిన విషయం చెబుతాడు. అంతే అనామిక నానా రచ్చ చేస్తుంది. శోభనం ఆపేస్తుంది. అక్కడితో కాకుండా.. ఇంట్లో అందరినీ పిలిచి  నానా రభస చేస్తుంది. ప్రతి విషయంలోనూ అప్పూ, కావ్య ప్రస్తావన తెస్తున్నాడు అని అంటుంది. ఇంట్లో అందరూ షాకౌతారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved