MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 15th December Episode:స్వప్నను కాపాడేసిన అపర్ణ, రాజ్ మాత్రం దొరికిపోయాడు..!

BrahmaMudi 15th December Episode:స్వప్నను కాపాడేసిన అపర్ణ, రాజ్ మాత్రం దొరికిపోయాడు..!

కనకం అప్పూ కోసం మొక్కుకున్న కాయిన్ పడిపోతే, అనామిక కాయిన్ మాత్రం నిలపడుతుంది. దీతో, అనామిక సంతోషిస్తూ ఉంటే, కనకం కావాలనే ఆ కాయిన్ ని కిందపడేస్తుంది. పడిపోయింది అని  చెబుతుంది. అది చూసి అనామిక నిరాశపడుతుంది.

3 Min read
Author : ramya Sridhar
Published : Dec 15 2023, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 15th December Episode:దుగ్గిరాల కుటుంబం మొత్తం కార్తీక దీపాలు వెలిగించేందుకు గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికే అరుణ్ ని కూడా రప్పించాలని రాహుల్ ప్లాన్ వేస్తాడు. మరోవైపు రాజ్ ని కలిసేందుకు శ్వేత కూడా అక్కడికే వస్తుంది. మరి, ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Brahmamudi

Brahmamudi

అరుణ్ కి రాహుల్ ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగితే, గుడి ముందే ఉన్నానని చెబుతాడు. స్వప్నకు మాత్రమే కనిపించమని రాహుల్ అరుణ్ కి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత తాము అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, కావ్య లాగే తాను కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను అని రాహుల్ అంటాడు. దానికి రుద్రాణి, పాపాత్ములను దేవుడు కూడా కరుణించడు అని నిజం ఒప్పుకుంటుంది. పాపులకు పాపులే సహాయం చేస్తారు అని చెబుతుంది.

39
Brahmamudi

Brahmamudi

మరోవైపు కావ్యతో రాజ్ దగ్గరుండి మరీ ప్రదక్షిణాలు చేపిస్తూ ఉంటాడు. కావ్య నీరసంగా ప్రదక్షిణాలు చేస్తుంటే,  రాజ్ కావాలని లెక్క మర్చిపోయానని అంటాడు. అయితే, మీరు ఇలాంటివి చేస్తారని తెలిసే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని కావ్య చెబుతుంది. ఆ తర్వాత రాజ్.. నాతో ఉపవాసం చేయించావని,  ప్రదక్షిణలు అన్నాను, ఇంక చాలులే అంటాడు. కానీ , కావ్య మాత్రం చేయాల్సిందేనని, తగ్గేదేలె అంటుంది.  ఇదెక్కడ మొండి రాక్షసి దొరికింది నాకు, చెప్పేది అస్సలు వినదు అని రాజ్ తిట్టుకుంటాడు.

49
Brahmamudi

Brahmamudi

మరోవైపు అనామిక, స్వప్నలు కాయిన్ నిలపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆలోపే అక్కడికి అరుణ్ వచ్చేస్తాడు. సరిగ్గా స్వప్నకు మాత్రమే కనిపిస్తాడు. వెంటనే వాడిని పట్టుకోవాలని స్వప్న నిశ్చయించుకుంటుంది. అలా వెళ్తూవెళ్తూ కనకం పెట్టుకున్న కాయిన్ ని కందపడేస్తుంది. కనకం పిలుస్తున్నా ఇప్పుడే వస్తా అని వెళ్లిపోతుంది. కనకం అప్పూ కోసం మొక్కుకున్న కాయిన్ పడిపోతే, అనామిక కాయిన్ మాత్రం నిలపడుతుంది. దీతో, అనామిక సంతోషిస్తూ ఉంటే, కనకం కావాలనే ఆ కాయిన్ ని కిందపడేస్తుంది. పడిపోయింది అని  చెబుతుంది. అది చూసి అనామిక నిరాశపడుతుంది.

59
Brahmamudi

Brahmamudi

ఇక, స్వప్న అరుణ్ ని పట్టుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటుంది. కావ్య ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. చేస్తూ చేస్తూ నీరసంతో కళ్లు తిరిగి పడిపోతోబోతుంది. రాజ్ చూసి పట్టుకుంటాడు. తర్వాత పంతులు వచ్చి, స్వామివారికి అభిషేకం చేసిన నీళ్లు తాగించమని చెబుతాడు. రాజ్ అదే చేస్తాడు. ఏమైందని కొందరు ఆడవాళ్లు అడుగుతారు. ఉపవాసం చేసిందని చెబుతాడు. కావ్య మాత్రం  తాను ప్రదక్షిణలు చేయాల్సిందే అంటుంది. రాజ్ వద్దు అన్నా కళావతి వినదు. ఇక చేసేది లేక.. అందరి సలహా మేరకు, కావ్యను ఎత్తుకొని రాజ్ ప్రదక్షిణలు చేయడం మొదలుపెడతాడు. 

69
Brahmamudi

Brahmamudi

కావ్యను మోయలేక.. దేవుడు తనకు శిక్ష వేశాడని ఫీలౌతారు. రాజ్ అలా తనను తీసుకువెళుతుంటే కావ్య చాలా మురిసిపోతుంది. బ్యాగ్రౌండ్ లో లవ్ సాంగ్ కూడా ప్లే అవుతుంది. ఇక,రాజ్ అలా ప్రదక్షిణలు  చేయడం ఇంట్లోవాళ్లందరూ చూసేస్తారు. కొందరు సంతోషిస్తే, అపర్ణ ముఖం మాత్రం మాడిపోతుంది. ఏంటి అని అడిగితే, జరిగింది చెబుతాడు. అయితే, తన కొడుకును ఇబ్బంది పెట్టిందని అపర్ణ కావ్య పై సీరియస్ అవుతుంది. మిగిలినవాళ్లు మాత్రం కావ్యను సపోర్ట్ చేస్తారు.

79
Brahmamudi

Brahmamudi

తర్వాత స్వప్న కనపడలేదు అని కనకం అడుగుతుంది. చాలా సేపటి నుంచి కనపడటం లేదని, వెతకడానికి అందరూ వెళతారు.  స్వప్న రన్నింగ్ రేసులో పరిగెత్తినట్లు పరిగెడుతూనే ఉంటుంది అరుణ్ ని పట్టుకోవడానికి. అదుపుతప్పి త్రిశూలం మీద పడబోతుంటే, అపర్ణ కాపాడేస్తుంది. అందరూ స్వప్న దగ్గరకు కంగారుగా పరిగెడతారు. జస్ట్ ఒక్క నిమిషంలో స్వప్న ప్రమాదం నుంచి బయటపడుతుంది. ఇక, ప్రతి ఒక్కరూ క్లాస్ పీకడం మొదలుపెడతారు. రుద్రాణి, రాహుల్ కూడా సెటైర్ల వేస్తారు. 

89
Brahmamudi

Brahmamudi

తర్వాత కావ్య ఏమైందని అడిగితే, ఆ అరుణ్ గాడు కనిపించాడని చెబుతుంది. తన కళ్లారా చూశానని కూడా చెబుతుంది. వాడు దొరికితే, పట్టుకొని నిజం చెప్పించాలని అనుకునన్నాను అని స్వప్న చెబుతుంది. వాడు ఇక్కడ లేడు అని రాజ్ చెప్పినా లేదు, తాను చూశాను అని స్వప్న చెబుతుంది.  కానీ, తప్పించుకున్నాడు అంటుంది. కానీ, ఇంత రిస్క్  ఎందుకు తీసుకున్నావ్ అని తిడతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మూర్తికి ఏమీ అర్థం కాదు. తర్వాత అందరూ పూజ కు వెళ్లారు.

ఇక, వాళ్ల ప్లాన్ మొత్తం ప్లాప్ అయినందుకు రాహుల్, రుద్రాణి తెగ ఫీలౌతారు.  తర్వాత అయ్యగారు గుడిలో పూజ చేస్తూ ఉంటారు. అందరూ కళ్లుమూసుకొని ఉంటారు. సరిగ్గా అప్పుడే అక్కడికి శ్వేత వస్తుంది.  ఎవరూ చూడకుండా రాజ్ ని పిలుస్తుంది. అందరూ ఉన్నారని కంగారుపడతారు.  అక్కడి నుంచి వెళ్లిపోమ్మని బతిమిలాడుతాడు. దీంతో, వెళ్లిపోతుంది. కావ్యకు వెంటనే డౌట్ వస్తుంది. ఏంటి అని అడిగితే, ఏదో ఒకటి కవర్ చేస్తాడు. తర్వాత పూజ అయిపోతుంది. కోనేటిలో దీపాలు వెలిగించమని పంతులుగారు చెబుతారు.

99
Brahmamudi

Brahmamudi

అందరూ కోనేటి దగ్గర దీపాలు వెలిగించడానికి చూస్తూ ఉంటారు. దానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కళ్యాన్, అప్పూతో మాట్లాడుతూ ఉంటే అనామిక కు ఆమె తల్లి వాళ్లిద్దరినీ చూపిస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్ లో రాజ్.. శ్వేతను కలవడానికి వెళ్తాడు. రాజ్ ని శ్వేత కౌగిలించుకోవడం అపర్ణ చూసి షాకౌతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved