MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 12th December Episode:రుద్రాణి కుట్ర.. నేరం మాత్రం కావ్యపై తోసేసిందిగా..!

BrahmaMudi 12th December Episode:రుద్రాణి కుట్ర.. నేరం మాత్రం కావ్యపై తోసేసిందిగా..!

శుభ లేఖ ఇవ్వడానికి అనామిక వాళ్లు వస్తున్నారని, వాళ్లు వెళ్లిన తర్వాత మనం వెళ్లి, కార్డ్ లు పంచిపెట్టాలి అని చెప్పి, అప్పూని తీసుకొని వెళ్లిపోతాడు. వాళ్లిద్దరూ వెళ్లిన తర్వాత,తాను అనుకున్న కళను నిజం చేయాలని కనకం డిసైడ్ అవుతుంది. 

4 Min read
Author : ramya Sridhar
Published : Dec 12 2023, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 12th December Episode: మొక్క ఎలా బతికిందో కనకం కి అస్సలు అర్థం కాదు. ఏ విధంగా ఆ పెళ్లి ఆపాలా అని.. గార్డెన్ లోకూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేస్తే, పెళ్లి ఆగిపోతుందా అని ఆలోచిస్తూఉంటుంది. అప్పుడే ఆమెకు ఓ ఐడియా వస్తుంది. దాని గురించే ఆలోచిస్తూఉంటుంది. అచ్చం ఆ సీన్ తన కళ్ల ముందు జరిగినట్లు ఊహించుకుంటుంది. తన చేతిలో నుంచి కుంకుమ భరణి పడిపోయినట్లు ఊహించుకుంటుంది. అలా పడిపోవడంతో.. అశుభం లా ఫీలౌతారు. ఈ పెళ్లి జరగదు అని ధాన్యలక్ష్మి అన్నట్లు, దానికి కళ్యాణ్, కావ్య, రాజ్ కూడా సపోర్ట్ చేసినట్లుగా ఊహించుకుంటుంది. పెళ్లి ఆగిపోయినట్లే అని అందరూ చెప్పినట్లు, అనామిక, తన పేరెంట్స్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఊహించుకుంటుంది. అంతే, ఇక పెళ్లి ఆగిపోయింది, ఆగిపోయింది.. అని సంబరంగా  ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ గా అప్పూ వస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Brahmamudi

Brahmamudi

అప్పూ వచ్చి.. ఊహల్లో మునిగి తేలుతున్న కనకంని తట్టిలేపుతుంది. అప్పూ వచ్చి లేపేసరికి, పెళ్లి ఆగిపోలేదని, అదంతా తన ఊహ అని అర్థమౌతుంది. ఈలోగా కళ్యాణ్ అక్కడికి వచ్చి, శుభ లేఖ ఇవ్వడానికి అనామిక వాళ్లు వస్తున్నారని, వాళ్లు వెళ్లిన తర్వాత మనం వెళ్లి, కార్డ్ లు పంచిపెట్టాలి అని చెప్పి, అప్పూని తీసుకొని వెళ్లిపోతాడు. వాళ్లిద్దరూ వెళ్లిన తర్వాత,తాను అనుకున్న కళను నిజం చేయాలని కనకం డిసైడ్ అవుతుంది.

37
Brahmamudi

Brahmamudi

మరోవైపు రుద్రాణి సీరియస్ గా నిల్చొని ఉంటుంది. రాహుల్ వచ్చి ఏమైంది అని అడుగుతుంది.  మనకు మాత్రం ఆ దిక్కుమాలిన స్వప్నను అంటగట్టి, వీళ్లు మాత్రం మంచి అనామికను కోడలిగా తెచ్చుకుంటున్నారని,  అది చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అంటుంది. తనకు దక్కని ఆనందం, మరొకరికి దక్కడానికి వీళ్లేందు అంటుంది. అయితే, ఈ పెళ్లి ఆపేస్తావా? వాళ్లు ఊరుకుంటారా అని రాహుల్ అడుగుతాడు. మనం ఆపితే వాళ్లు ఊరుకోరని, కాబట్టి, కావ్య చేతుల మీదుగా పెళ్లి ఆగిపోయేలా చేద్దాం అంటుంది. వాళ్ల జాతకంలో ఎలాగూ దోషం ఉంది అని అంటున్నారు కాబట్టి, దానిని అవకాశంగా తీసుకుందాం అని కొడుక్కి ఓ సలహా ఇస్తుంది.  అయితే, ఆ తప్పు కావ్య చేతుల మీదుగా జరిగేలా చేద్దాం అని రాహుల్ తో చెబుతుంది.

47
Brahmamudi

Brahmamudi

ఈలోగా, అనామిక తన కుటుంబంతో కలిసి వస్తుంది. అందరూ కలిసి వారికి స్వాగతం పలుకుతారు. కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటారు. కనకం ఫేస్ మాత్రం మాడిపోయి ఉంటుంది.  ధాన్యలక్ష్మి.. కాబోయే కోడలి మీద సెటైర్లు వేస్తుంది. రాజ్ కూడా వంత పాడుతాడు. అప్పూ పాపం చాలా డల్ గా, బాధగా చూస్తూ ఉంటుంది. అప్పూ కళ్లెదుటే, అనామిక తల్లిదండ్రులు.. మొదటి శుభలేఖను ఇవ్వడానికి వచ్చాం అని చెబుతారు.

అయితే, రుద్రాణి టైమ్ దొరికింది కదా అని సెటైర్లు  వేస్తుంది. మీ తొందర చూస్తుంటే, ఎప్పుడెప్పుడు కూతురిని వదిలించుకోవాలా అని చూస్తున్నట్లున్నారు అని అంటుంది. వెంటనే మన హీరోయిన్ కావ్య అందుకొని, ఆడపిల్ల.. ఏరోజూ పుట్టింటికి బరువు కాదు అని, అది ఒక బాధ్యత అని, పెళ్లీడు రాగానే, మంచివాడి చేతిలో పెట్టాలనే తాపత్రం అని, మీకు అర్థం కాదులే అని కావ్య రుద్రాణి పై సీరియస్ అవుతుంది. వెంటనే రుద్రాణి, తాను సరదాగా అన్నాను అని, అనామిక ఈ ఇంటి కోడలిగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని  చెబుతుంది.
 

57
Brahmamudi

Brahmamudi

ఇక, వీళ్లు కూడా ఇవ్వాలని అనుకున్న మొదటి శుభ లేఖను తీసుకురమ్మని ఇందిరాదేవి కావ్యకు చెబుతుంది. కావ్య తేవడానికి వెళ్తుంది. కావ్య, తాంబూళం తీసుకొని వస్తుంది. ఆ తర్వాత తాంబూళాలు మార్చుకోవడానికి కాసేపు డిస్కర్షన్ జరుగుతుంది. తర్వాత కళ్యాణ్ తల్లిదండ్రులు, అనామిక పేరెంట్స్ కి తాంబూళం ఇస్తారు. అది చూసి అప్పూ కంట నీళ్లు తిరుగుతాయి. ఈలోగా కుంకుమ భరణి కనకం పట్టుకుంది. సరిగ్గా బొట్టు పెట్టే సమయానికి కుంకుమ భరణిని కనకం పడేయబోతుంది. కానీ, ధాన్యలక్ష్మి పట్టేసుకుంటుంది. కనకం అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇక, కార్డు చూసిన తర్వాత.. మా హోదాకి తగినట్లే కార్డు చేయించారు అని రుద్రాణి అంటుంది. అనామిక పేరెంట్స్ కూడా మరి, మీ హోదా చూసుకోవాలి కదా అంటుంది. అయితే, ధాన్యలక్ష్మి హోదా అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు అంటుంది.

ఇక, కావ్యకు కార్డు ఇచ్చి పసుపు పెట్టి, హారతి ఇవ్వమని చెబుతారు. పెళ్లి అయ్యేంత వరకు అది దేవుడి మందిరంలోనే ఉండాలని,  తర్వాత కళ్యాణ్ దానిని ఫ్రేమ్ చేయించుకొని, తన పిల్లలకు చూపించుకుంటాడు అని అందరూ అనుకుంటారు. అది విన్న తర్వాత కళ్యాణ్ సిగ్గుపడతాడు. వెంటనే రాజ్ సెటైర్ వేస్తాడు. ఆ తర్వాత అందరూ దేవుడి దగ్గరకు వెళతారు. కావ్య.. పసుపుతో ఓం అని రాసి, హారతి ఇస్తుంది.

 

67
Brahmamudi

Brahmamudi

ఓవైపు రాహుల్.. పెళ్లి ఆపడానికి ఏం చేస్తావ్ అని అడుగుతాడు. అప్పటికే రుద్రాణి పసుపులో ఏదో కలుపుతుంది.అది నిప్పుకు తగిలితే మండిపోతంది. అది తెలియని కావ్య హారతి ఇస్తుండగా... పెళ్లి పత్రికకు నిప్పు అంటుకుంటుంది. అది చూసి ఇంట్లో అందరూ షాకైపోతారు. రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. వెంటనే కావ్య, ఆ మంట ఆర్పడానికి ప్రయత్నిస్తుంది.

77
Brahmamudi

Brahmamudi

తర్వాత రుద్రాణి సీన్ లోకి వచ్చి, కావ్యను బ్లేమ్ చేస్తుంది. కావ్య కారణంగానే ప్రతికకు నిప్పు అంటుకుందని అంటుంది. కావ్య తాను ఏం చేయలేదు అని చెప్పినా వినదు. కావ్య అజాగ్రత్త కారణంగానే ఇలా జరిగిందని  చాలా రాద్దాంతం చేస్తుంది. జాతకంలో దోషం విషయాన్ని గుర్తు చేసి, నానా హంగామా చేస్తుంది.  రాజ్..కావ్యకు సపోర్ట్ చేయబోతాడు. కానీ, అనామిక పేరెంట్స్ సీరియస్ అవుతారు. కావ్య అజాగ్రత్త కారణంగానే ఇలా జరిగిందని అంటాడు. అనామిక తల్లి కూడా కావ్యను బ్లేమ్ చేస్తుంది. ఎందుకు ఇలా చేశావ్ అని నిలదీస్తుంది. అనామిక తల్లి చాలా సీరియస్ గా ఎమోషనల్ డైలాగులు కొడుతుంది. అసలు కావ్యకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతుంది. ఆమె మాటలకు కళ్యాణ్ కి కోపం వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో మళ్లీ ఆ శ్వేత క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఓవైపు రాజ్ గురించి కావ్య చాలా గొప్పగా ఫీలౌతూ ఉంటే, మరోవైపు రాజ్.. ఆ శ్వేతతో క్లోజ్ గా ఉంటాడు. మరి, చివరకు ఆమెను ఫ్రెండ్ చేస్తారో.. ఇంకేమని పరిచయం చేస్తారో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved