MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 10th January Episode: అప్పూకి పెళ్లి చేయాలనుకున్న కనకం, కావ్య పై రగిలిపోతున్న అనామిక..!

BrahmaMudi 10th January Episode: అప్పూకి పెళ్లి చేయాలనుకున్న కనకం, కావ్య పై రగిలిపోతున్న అనామిక..!

 అసలే బాధలో ఉన్న తనని మరింత బాధపెట్టకూడదు అని చెప్పేసి మూర్తి వెళ్లిపోతాడు. మరోవైపు... అప్పూ అలా బాధ పడుతుంటే తాను చూడలేనని, దాని మనసు మార్చాలని కనకం అనుకుంటుంది.

5 Min read
ramya Sridhar
Published : Jan 10 2024, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Brahmamudi

Brahmamudi


BrahmaMudi  10th January Episode: అప్పూకి పెళ్లి చేద్దాం అని వాళ్ల పెద్దమ్మ రాజ్యం సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. కనకం, మూర్తి దంపతులు దానిని అమలు చేస్తారు. ఓ పెళ్లిళ్ల పేరయ్య.. కొన్ని సంబంధాలు కూడా తీసుకువస్తాడు. మీరు ఒకే చేస్తే.. పెళ్లి చూపులు  ఏర్పాటు చేస్తాం అని పంతులు అంటాడు. తమ అప్పూకి కాబోయేవాడు ఆస్తులు లేపోయినా.. ప్రేమగా చూసుకునేవాడు కావాలి అని కనకం అంటుంది. అలాంటి సంబంధమే ఒకటి పంతులు చూపిస్తాడు. వాళ్లు ఫోటోలు చూస్తున్న సమయంలో.. అప్పూ ఎంట్రీ ఇస్తుంది. ఏం జరుగుతోంది అని అడుగుతుంది.అందరూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ, పేరయ్య మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తాడు. తాను ఒప్పిస్తాను అంటూ.. పెళ్లి సంబంధం గురించి చెప్పి, ఫోటోలు చూపిస్తాడు. కానీ అప్పూ మాత్రం.. అతనిని పరుగులుపెట్టిస్తుంది. అతను దెబ్బకు పారిపోతాడు.  ఇంకోసారి సంబంధాలు తెస్తే.. చంపేస్తాను అని అప్పూ వార్నింగ్ ఇస్తుంది.

210
Brahmamudi

Brahmamudi

అతనిని వెళ్ల గొట్టిన తర్వాత మళ్లీ అప్పూ ఇంటికి వస్తుంది. అప్పూ చేసిన పనికి కనకం సీరియస్ అవుతుంది. కానీ.. అప్పూ రివర్స్ లో మాట్లాడుతుంది. ఒకరిని ప్రేమించి.. వాడిని పెళ్లి అయిపోయిందని.. వెంటనే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అడుగుతుంది. అయితే.. అసలు పెళ్లి చేసుకోవా అని కనకం అంటే... చేసుకోను అని తేల్చి  చెప్పేస్తుంది. మీకు నన్ను చూసుకోవడం కష్టంగా ఉంటే.. వేరే దారి చూసుకుంటాను అని చెప్పేసి వెళ్లిపోతుంది.  అప్పూ ప్రవర్తనకు కనకం షాకైపోతుంది. మనసులో ఉన్న బాధతో అలా అన్నదని,  ఆ బాధను మనమే పోగొట్టాలని రాజ్యం అంటుంది. కొంత సమయం ఇస్తే మంచిదని తనకు అనిపిస్తోందని మూర్తి అంటాడు. అసలే బాధలో ఉన్న తనని మరింత బాధపెట్టకూడదు అని చెప్పేసి మూర్తి వెళ్లిపోతాడు. మరోవైపు... అప్పూ అలా బాధ పడుతుంటే తాను చూడలేనని, దాని మనసు మార్చాలని కనకం అనుకుంటుంది.

310
Brahmamudi

Brahmamudi

ఇక, దుగ్గిరాల ఇంట్లో కొత్త దంపతులతో సత్య నారాయణ వ్రతం చేయించాలని అనుకుంటారు. దానికి కావ్య ఏర్పాట్లు చేస్తూ ఉంటుది. అదే సమయానికి రుద్రాణి వచ్చి.. కావాలని దీపారాధన కుందులు పడేస్తుంది. తను పడేసి.. ఆ నేరం కావ్య పై నెట్టేస్తుంది. అది కాస్త తనపై పడుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి వచ్చి.. కావ్యపై నోరు పారేసుకుంటుంది. ‘ ఈ మహా తల్లి పూజ దగ్గరకు అడుగుపెడుతుంది అంటేనే.. ఇలాంటి అశుభాలు, అపశకునాలు జరుగుతాయని ముందే అనుకున్నాను. అనుకున్నట్లే జరిగింది’ అని అంటుంది.

410
Brahmamudi

Brahmamudi

వెంటనే స్వప్న.. మిమ్మల్నే అంటున్నారు అని రుద్రాణితో అంటుంది. నన్ను ఎందుకు అంటుంది అని రుద్రాణి అడిగితే.. మీరు అడుగుపెట్టడం వల్లే, అశుభాలు జరిగాయంట అని మళ్లీ రుద్రాణితో స్వప్న అంటుంది. అయితే.. నేను అనేది రుద్రాణిని కాదు కావ్యని అంటుంది ధాన్యలక్ష్మి.. ‘ అక్క చూశావా, పూజ మొదలుకాకముందే కుంది పడేసింది. మళ్లీ ఏమీ తెలియని అమాయకురాలిలాగా ఎలా చూస్తుందో చూడు’ అని కావ్యను ధాన్యం అంటుంది. ఏమైంది అత్తయ్య అని కావ్య అడిగితే.. ‘ ఏం అయ్యిందని అమాయకంగా అడగకు. నా కొడుకు, కోడలు సంతోషంగా సత్య నారాయణ వ్రతం చేసుకుంటుంటే, ఓర్వలేక దీపపు కుందిని పడేశావ్’ అని ఆరోపిస్తుంది. దానికి కావ్య.. అసలు తనకు తగలలేదని.. అది తన వల్ల పడలేదని సర్ది చెబుతుంది,

510
Brahmamudi

Brahmamudi

కానీ ధాన్యలక్ష్మి.. ‘ నూనె నేలమీద వలికితే ఎంత అరిష్టమో తెలుసా? నా కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే  చూడలేవా, చెడగొడితే తప్ప నీకు మనశ్శాంతి ఉండదా? పూజ అయ్యేదాకా నువ్వు ఈ చుట్టు పక్కలే కనిపించకు. దూరంగా ఉండు.’ అంటుంది. ఆ మాటలకు కావ్య చాలా బాధపడుతుంది. రుద్రాణి మాత్రం తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషిస్తుంది. తన చెల్లిని అన్ని మాటలు అంటుంటే తట్టుకోలేక స్వప్న... కావ్యను పక్కకు రమ్మని పిలుస్తుంది.‘ ఆ పనులు.. మా అత్త తో చేయించండి. మంచి ముత్తైదువు. ఇలాంటి పుణ్యస్త్రీ.. ప్రపంచంలోనే లేదు. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని, మేకప్ వేసుకొని, సింగారించుకొని చాలా పవిత్రంగా పూజలు చేస్తుంది. వెళ్లు అత్త.. అందరికీ అంతా శుభం జరగాలంటే.. నీ ఐరన్ హ్యాండ్ పడాల్సిందే’ అని స్వప్న సెటైర్లు వేస్తుంది.

610
Brahmamudi

Brahmamudi


వెంటనే అపర్ణ అందుకుంటుంది. ‘ ఏమ్మా.. ధాన్యలక్ష్మికి ఇష్టం లేనప్పుడు  కాస్త ఎడంగా ఉండొచ్చు కదా, పెద్ద ఆరిందలాగా అన్నింట్లోనూ తలదూరుస్తావ్’ అని కావ్యను తిడుతుంది. ఆ మాటలకు సుభాష్ కి కోపం వస్తుంది. ‘ ఏంటి అందరూ కావ్యను తప్పుపడుతున్నారు. చీకటితో లేచి.. ఇన్ని ఏర్పాట్లు చేసింది. మీరంతా పట్టుచీరలు, నగలమీద దృష్టి పెట్టి.. ఇప్పుడు వచ్చారు. ఏదో చిన్న పొరపాటు జరిగితే..దేవుడు అందరినీ శపిస్తాడా? ఇష్టం లేదని చెప్పండి.. అరిష్టం అని అడ్డం పెట్టడం ఎందుకు ’ అని గట్టిగా వాయిస్తాడు. వెంటనే  కళ్యాన్ కూడా.. చిన్న విషయానికి.. అందరి ముందు వదినను అవమానించడం అవసరమా అని వాళ్ల అమ్మను అడుగుతాడు.

710
Brahmamudi

Brahmamudi

‘అవసరమేరా, లేకపోతే మీ అమ్మ కడుపు మంట ఎలా చల్లారుతుంది. మీ పెద్దమ్మ పెద్దరికం ఏమైపోతుంది. ఎక్కడ దొరుకుతుందా అని బూతద్దం వేసుకొని చూస్తుంటారు. దీపపు కుంది పడినంత మాత్రాన ఆ స్వామి ఆగ్రహం చూపిస్తారా? నూనె నేలమీద పడినంత మాత్రానా అశుభం జరుగుతుందా? ఇన్ని ఏళ్లు వచ్చాయ్.. నాకు ఏ మూఢ నమ్మకాలు లేవు. మీకేంటి? పూజ అన్నాక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.. అంత మాత్రానా పూజ చేసిన ఫలితం లేకుండా పోతుందా? నిర్మలమైన మనస్సతో, పవిత్రమైన భక్తి శ్రద్ధలతో  పూజ చేస్తే చాలు’ అని ఇందిరాదేవి క్లాస్ పీకుతుంది.

వెంటనే కావ్య కావాలనే చేస్తోంది అని ధాన్యలక్ష్మి అంటుంది. ‘ ధాన్యలక్ష్మి.. అన్నీ సిద్ధం చేశాక వచ్చి నిందలు వేయడం కాదు. నీకు నగల మీద ఉన్న శ్రద్ధ పూజ మీద ఎక్కడ ఏడ్చింది. ఇంకో విషయం.. ఈ ఇంట్లో ఉన్నది నీ కొడుకు, కోడలు మాత్రమే కాదు. నాకు ఇంకో ఇద్దరు మనవళ్లు ఉన్నారు. రాహుల్ , రాజ్, కళ్యాణ్ ముగ్గురు ఉన్నారు. మూడు జంటలు పూజలో కూర్చోవాల్సిందే. వాళ్ల పెళ్లి అయినప్పుడు సత్యనారాయణ వ్రతం చేయించలేదు. ఇప్పుడు జరిపించాల్సిందే. స్వప్న, కావ్య మీరు కూడా పూజకు సిద్ధంగా ఉండండి’ అని ఇందిరాదేవి చెబుతుంది ఆ మాటలకు అనామిక ముఖం మాడిపోతుంది. ధాన్యం, అపర్ణలకు కూడా నచ్చదు.

810
Brahmamudi

Brahmamudi

అప్పూ పని కోసం  వెళ్తుంది.  కానీ.. ఉద్యోగం లేదని, పోయింది అని చెబుతాడు. నేనేం తప్పు చేశాను అని అప్పూ అంటే.. అతను ఊరుకోడు. నువ్వు నీ రిచ్ ఫ్రెండ్ తో తిరుగుతూ.. పని చేయలేదని.. ఇవ్వనంటే.. ఇవ్వను అంటాడు. నీ ఫ్రెండ్ కళ్యాణ్.. తలుచుకుంటే.. ఇలాంటి 100 షాపులు పెట్టించగలడు. అతనిని అడిగి ఓ షాప్ పెట్టించుకో.. అందుకే కదా ఫ్రెండ్ షిప్ చేశావ్ అని వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాటలకు అప్పూకి మండిపోతుంది. తాను అందరిలా కాదు అని అప్పూ చెబుతుంది. అతను మాత్రం పని లేదని ఖరాఖండిగా చెప్పేస్తాడు. దీంతో.. అప్పూ వెనక్కి వెళ్లిపోతుంది.

910
Brahmamudi

Brahmamudi

ధాన్యలక్ష్మి పూజ సంగతులు చూసుకుంటుంటే.. అనామిక వెళ్లి.. అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు అని అడుగుతుంది. పెళ్లైన కొత్తలో దంపతులు చేసుకుంటారు అని చెబుతుంది. మరి.. మాకు మాత్రమే జరగాలి కదా.. కావ్య, స్వప్నలకు ఎందుకు అని అడుగుతుంది. నీకు ఏమైనా  ఇబ్బందా అని  ధాన్యలక్ష్మి అడిగితే.. ‘ ఉండదా.. ఆ కావ్య మా పెళ్లిలో ఏం చేసిందో మీకు కూడా తెలుసు. తన మీద మీకు కూడా కోపం ఉంది, అలాంటి మనిషితో వ్రతంలో ఎలా కుర్చుంటాం ఆంటీ,  వ్రతం అంటేనే మనుసుతో చేయాలి. ఆమె మనసులో అంత కల్మషం ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి’ అనామిక అడుగుతుంది.

నువ్వు చెప్పింది నిజమే అనామిక కానీ,.. ఇంట్లో పెద్దవాళ్లు నిర్ణయం తీసుకున్నారు కదా అని ధాన్యలక్ష్మి సర్ది చెప్పాలని చూస్తుంది. కానీ.. ధాన్యలక్ష్మి.. మీరు కూడా నిర్ణయాలు తీసుకోండి అంటుంది. మా అత్తయ్యని అడిగి చెబుతాను అని ధాన్యలక్ష్మి అంటుంది. మీరు చెబితే పూజలో కూర్చుంటాను. కానీ.. నాకు మాత్రం ఇష్టం లేదు అని అనామిక వెళ్లిపోతుంది.
 

1010
Brahmamudi

Brahmamudi

కోడలు అడిగింది కదా అని.. ధాన్యలక్ష్మి వెళ్లి..  ఇందిరాదేవిని పూజ గురించి అడగాలని అనుకుంటుంది. తర్వాత.. అదే విషయం నసిగి నసిగి.. కావ్య వాళ్లతో పూజలో కూర్చోను అని అనామిక చెబుతోందని చెబుతోంది. అపర్ణ కూడా..  అనామికకు మద్దతుగా మాట్లాడుతుంది. కానీ.. ఇందిరాదేవి ఊరుకోదు. అలా సపోర్ట్ చేయకూడదని, నచ్చ చెప్పాలని అంటుంది. గతంలో మీకు కూడా ఒకరంటే మరొకరికి పడేది కాదని.. నేను అలా ఊరుకోలేదు కదా .. ఇప్పుడు మీరు కలిసి ఉండేవారు కాదు కదా అని కోడళ్లకు బ్రెయిన్ వాష్ చేస్తుంది. ద్వేషం దూరం చేయమని,  ఇద్దరినీ కలపమని సలహా ఇస్తుంది. ఈ మాటలను అనామిక దూరంగా వింటూనే ఉంటుంది.  ఏం చేయాలో ధాన్యలక్ష్మికి ఏమీ అర్థం కాదు.

మరోవైపు పూజ కోసం స్వప్న చాలా చక్కగా తయారౌతుంది. అయితే.. చీరలో ప్రాబ్లం వస్తే.. రుద్రాణిని పిలుస్తుంది. చీర కుచ్చీళ్లు పట్టుకోమని చెబుతుంది. దానికి రుద్రాణి షాకౌతుంది. కమింగ్ అప్ లో.. అప్పూకి యాక్సిడెంట్ అవుతుంది. కావ్య.. తన పుట్టింటికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది. రాజ్ ని కవర్ చేయమని అడుగుతుంది. ఇందిరిదేవి మాత్రం.. రాజ్, కావ్యలు వ్రతంలో ఉండాల్సిందే అని పట్టుపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved