MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 10th February Episode:సూట్ లో కళ్యాణ్, కావ్యపై దొంగతనం ముద్ర, అనామిక మామూలుది కాదు

BrahmaMudi 10th February Episode:సూట్ లో కళ్యాణ్, కావ్యపై దొంగతనం ముద్ర, అనామిక మామూలుది కాదు

తాను, తన భార్య  తప్ప ఎవరూ ఆఫీసుకు రాకూడదని ఎవరు చెప్పలేదని.. కావాలంటే నువ్వు కూడా ఆఫీసుకు రా పిన్ని అని రాజ్ పిలుస్తాడు.

4 Min read
Author : ramya Sridhar
Published : Feb 10 2024, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Brahmamudi

Brahmamudi


BrahmaMudi 10th February Episode:రాజ్ ఆఫీసుకు బయలు దేరుతూ ఉంటాడు. ఒక ఫైల్ పై వాళ్ల నాన్న సంతకం పెట్టలేదని గుర్తు చేశాడు. సుభాష్ వెంటనే చేస్తాను అంటాడు. కావ్య కూడా ఆఫీసుకు వెళ్లడానికి కిందకు దిగుతుంది. అప్పుడే.. అనామిక కూడా వస్తుంటే.. కళ్యాణ్ గురించి ధాన్యలక్ష్మి ఆరా తీస్తుంది. అప్పుడే కళ్యాణ్ సూట్ వేసుకొని కిందకు దిగుతాడు. ఇంట్లో అందరూ కళ్యాణ్ ని అలా చూసి సంతోషిస్తారు.

తన కొడుకు ఎండీలా ఉన్నాడని ధాన్యలక్ష్మి సంబరపడుతుంది. పెన్నును గన్ లా మార్చినట్లు ఉంది అని రుద్రాణి అంటుంది. అనామిక సంబరంగా.. కళ్యాణ్ ని  కూడా బావగారితో పాటు ఆఫీసుకు వెళ్లడానికి ఒప్పించాను అని చెబుతుంది. రాజ్ షాకౌతాడు. నువ్వు ఆఫీసుకు రావడం ఏంటిరా నమ్మలేకపోతున్నాను అంటాడు. దానికి కళ్యాణ్.. పెళ్లి తర్వాత మగాడి జీవితంలో అన్నీ నమ్మసక్యం కానివే జరుగుతూ ఉంటాయి అని చెబుతాడు. నువ్వు మనస్ఫూర్తిగానే వస్తున్నావా అని రాజ్ అడుగుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Brahmamudi

Brahmamudi

దానికి ధాన్యలక్ష్మి.. ఏ నా కొడుకు రాకూడదా..? నువ్వు, నీ పెళ్లాం వెళితే చాలా అని కోపంగా అడుగుతుంది. ఆ మాటకు రాజ్ బాధపడతాడు. వంటనే కావ్య హక్కుల గురించి కాదని.. కళ్యాణ్ కి కవితల మీద ఉన్న ఆసక్తి బిజినెస్ మీద లేదని ఇంట్లో అందరికీ తెలుసు అని అందుకే వాళ్ల ఆశ్చర్యపడ్డాడు అని చెబుతుంది. తాను, తన భార్య  తప్ప ఎవరూ ఆఫీసుకు రాకూడదని ఎవరు చెప్పలేదని.. కావాలంటే నువ్వు కూడా ఆఫీసుకు రా పిన్ని అని రాజ్ పిలుస్తాడు.

వెంటనే ఇందిరాదేవి వచ్చి.. ఈమె ఆఫీసుకు వచ్చి ఏం వెలగపెడుతుంది.? ఆఫీసు ముందు కళ్లాపు చల్లి ముగ్గుపెడుతుందా అని సెటైర్ వేస్తుంది. ఆ ముగ్గు వేయడానికి నడుము అయినా వంచాలి కదా అని వెంటనే ప్రకాశం కౌంటర్ వేస్తాడు. దానికి ధాన్యలక్ష్మి.. కళ్యాణ్ ఈ ఇంటి వారసుడు అని, వాడు కూడా ఆఫీసుకు వచ్చి బాధ్యతలు నిర్వహించే తెలివి తేటలు ఉన్నాయని గొప్పగా చెబుతుంది. వెంటనే కావ్య.. మంచి నిర్ణయం తీసుకున్నారు కవి గారు అని మెచ్చుకుంటుంది.

311
Brahmamudi

Brahmamudi

అయితే.. అనామిక తనకు పెట్టిన కండిషన్ ని అర్థంకాని భాషలో సెటైర్ వేస్తాడు. అనామిక ఏదో కవర్ చేయాలని ప్రయత్నిస్తుంది. తర్వాత.. సుభాష్.. ఎప్పటికైనా కళ్యాణ్ కూడా ఇవన్నీ తెలుసుకోవాల్సిందే కదా.. వాడు కూడా వస్తే.. అందరం కలిసి పని చేసుకోవచ్చు అని చాలా మంచిగా చెబుతాడు.

ఇక కళ్యాణ్ మొదటిసారి ఆఫీసుకు వెళ్తున్నానని వాళ్ల పెద్దమ్మ కాళ్లకు నమస్కారం చేస్తాడు. ఆమె కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. అన్నయ్యకు తోడుగా ఉండు అని చివరలో చెప్పిన మాటకు ధాన్యలక్ష్మికి కాలుతుంది. అంటే.. రాజ్ కి అసిస్టెంట్ లా నా కొడుకు ఉండాలా అని రచ్చ మొదలుపెడుతుంది. అయితే.. అలా నెగిటివ్ గా మాట్లాడటంతో.. ప్రకాశం కోపడ్డాడతాడు. ఇందిరాదేవి కూడా ధాన్యలక్ష్మి పై సీరియస్ అవుతుంది.  ఆ గొడవకు రాజ్ పులిస్టాప్ పెట్టేస్తాడు. తాను చిన్న పని మీద బయటకు వెళ్తున్నానని.. కళ్యాణ్ ని ఆఫీసుకు వెళ్లమని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు.

411
Brahmamudi

Brahmamudi

అయితే.. కళ్యాణ్..కావ్యతో కలిసి వస్తాను అంటే.. తాను రాజ్ ని ఫాలో అవ్వడానికి వెళ్తున్నాను అని చెబుతుంది. దీంతో.. కళ్యాణ్ తాను వేరే కారులో వెళతాను అంటాడు. అయితే.. తన కొడుకుని తీసుకొని వెళ్లలేదని కావ్యపై ధాన్యలక్ష్మి అక్కసు వెళ్లగక్కుతుంది. ప్రకాశం కారు కీస్ లాక్కొని కళ్యాణ్ చేతిలో పెడుతుంది. అర్హత లేనివారికే అందలం కడుతున్నారని.. నీకు కారు లేకపోవడం ఏంటి అని కారు కీస్ ఇస్తుంది. దానికి అపర్ణ.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే.. ఆ వాతలు మానడానికి వాళ్ల తాతలు దిగివచ్చారు అని సెటైర్ వేసి వెళ్లిపోతుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మికి కాలిపోతుంది.

511
Brahmamudi

Brahmamudi

ఇక.. రాజ్ కారును కావ్య ఫాలో అవుతూ ఉంటుంది. దానిని రాజ్ గమనిస్తాడు. కావ్య మనసు ఇరిగిపోయి.. తానే విడిపోదాం అని  అడిగేలా చేయాలని రాజ్ ఫిక్స్ అవుతాడు. ఇక.. రాజ్ కారు శ్వేత ఇంటి దగ్గర ఆగుతుంది. కావ్య తన కారు ను కాస్త దూరంగా ఆపి..  రాజ్ వెనకే వెళ్తుంది. రాజ్ రావడంతో శ్వేత సంతోషంగా బయటకు వచ్చి.. తన భర్త విడాకుల పేపర్ మీద సంతకం చేశాడు అని చెబుతుంది. కావ్య రావడం చూసి రాజ్ కావాలని.. శ్వేతను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు. అంతేకాదు.. ఇంక మనకు ఏ అడ్డంకీ లేదని.. నీకు విడాకులు వచ్చాయి కాబట్టి.. మన పెళ్లికి అడ్డు లేదు అంటాడు.  కావ్య వినాలని..ఆమెను బాధపెట్టేలా కావ్యకు కూడా విడాకులు ఇచ్చేస్తాను అని చెబుతూ ఉంటాడు. పాపం శ్వేత అలా ఎందుకు మాట్లాడుతున్నావ్  అంటే.. కావ్య అక్కడే ఉంది అని చూపిస్తాడు. కావ్య తనను వదేలిసి వెళ్లిపోతుందని అంటాడు.

611
Brahmamudi

Brahmamudi

ఆ మాట విని కావ్య గుండె పగిలిపోతుంది. ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. కావ్య తన మాటలు పూర్తిగా నమ్మేసి ఉంటుందని రాజ్ సంబరపడతాడు. అయితే.. రాజ్ చేసిన పనికి శ్వేతకు చాలా కోపం వస్తుంది. నీకు అసలు హార్ట్ లేదు అని సీరియస్ అవుతుంది. లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత రాజ్.. కావ్యను బాధపెట్టడం కరెక్ట్ కాదని శ్వేత నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది.

711
Brahmamudi

Brahmamudi

అయితే... కావ్య పరిస్థితిలో ఉండి ఆలోచించమని.. రాజ్ బ్రెయిన్ వాష్ చేయడానికి శ్వేత ప్రయత్నిస్తుంది. కావ్య లాంటి అమ్మాయి దొరకడం అదృష్టం అని చెబుతుంది. ఈ రోజుల్లో కావ్య లాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారని.. చాలా గొప్పగా చెబుతుంది. కానీ రాజ్ బుర్రకు ఎక్కదు. తనతో విడిపోయి తాను కళావతికి నచ్చేలా  బతికే స్వేచ్ఛను ఇస్తున్నాను అని అంటాడు. తర్వాత పార్టీ అడిగితే.. ఇస్తాను అని శ్వేత రాజ్ ని బయటకు తీసుకువెళ్తుంది.

811
Brahmamudi

Brahmamudi

ఇక..రుద్రాణి.. లాకర్ కీస్ తీసుకువచ్చి.. అనామికకు ఇస్తుంది. డబ్బంతా అక్కడ తీసేసి ఆ నేరం కావ్య మీద వేద్దాం అనుకుంటారు.  కానీ.. అపర్ణ ఒప్పుకోదు అని అనామిక అంటుంది.. అయితే ధాన్యలక్ష్మిని రెచ్చ గొడదాం అని రుద్రాణి అంటుంది. అంతేకాకుండా.. లాకర్ మొత్తం డబ్బు తీస్తే కావ్య పై అనుమానం రాదని.. కొంత మాత్రమే తీయమని , కావ్య అలా చేయదు అని అందరూ నమ్మకంగా చెబుతారు.. కాబట్టి.. కొంత డబ్బు తీస్తే.. అవసరం కోసం తీసిందని తప్పు పడతారు అని చెబుతుంది. అనామిక తెలివి చూసి.. రుద్రాణి షాకౌతుంది. నువ్వు మోడ్రన్ అమ్మాయి అనుకున్నానని.. పెద్ద ముదురు అని అంటుంది.

911
Brahmamudi

Brahmamudi

ఇక.. రుద్రాణి సీక్రెట్ గా లాకర్ ఓపెన్ చేసి.. కావ్యను దొంగ అని నిరూపించడానికి డబ్బులు తీస్తుంది. డబ్బు తీసుకొచ్చి అనామికకు ఇస్తుంది. అయితే.. డబ్బు మీ దగ్గర ఉంచమని.. కీస్ తనకు ఇవ్వమని అనామిక చెబుతుంది. ఎందుకు అని రుద్రాణి అంటే.. మిమ్మల్ని ఎవరూ నమ్మరని.. నన్నుఅయితే నమ్ముతారని అంటుంది. అయితే.. అనామిక ను చూసి రుద్రాణి కి డౌట్ వస్తుంది. ఈ ఇంటికి ఎందుకు వచ్చావ్ అంటే.. కాస్త భయపడినట్లే భయపడి.. తర్వాత కళ్యాణ్ ని కింగ్ చేయడమే తన లక్ష్యం అని చెబుతుంది. అయితే.. దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటానని రుద్రాణి అనుకుంటుంది.

1011
Brahmamudi

Brahmamudi

రాజ్ ఆఫీసుకు రాలేదని సుభాష్ సీరియస్ అవుతాడు. మీటింగ్ కి రాలేదని సీరీయస్ అవుతాడు. అప్పుడే వచ్చిన కావ్యను సుబాష్ అడిగితే.. ఆయన అడ్డదారిలో వెళ్లాడు అని చెబుతుంది. అయితే రాజ్ కి ఫోన్ చేయమని ప్రకాశం అంటాడు. కానీ.. రాజ్ కావ్య మన ఆనందాన్ని చెడగొట్టాలని ఫోన్ చేస్తోందని లిఫ్ట్ చేయడు.

1111
Brahmamudi

Brahmamudi

కమింగప్ లో కావ్యతో రాజ్ మరోసారి తాను శ్వేతను పెళ్లి చేసుకుంటున్నాను అని చెబుతాడు. శ్వేత రాజ్ ని నిలదీయడంతో.. ఆమెకు అసలు నిజం చెబుతుంటాడు. అయితే.. నిజం తెలిసినా కూడా.. తన భర్త తనను వదిలేయాలి అనుకుంటున్నాడని కావ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image2
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image3
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved