MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi Serial Today:దుగ్గిరాల ఇంట్లో తిష్ట వేసిన కనకం, కళ్యాణ్ పెళ్లి ఆటంకాలు..!

BrahmaMudi Serial Today:దుగ్గిరాల ఇంట్లో తిష్ట వేసిన కనకం, కళ్యాణ్ పెళ్లి ఆటంకాలు..!

ఆ మాటకు కావ్యకు చిర్రెత్తుకువస్తుంది. చీర కొంగు దోపి, వాడిని కొట్టడానికి రెడీ అవుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి కొడతారు. అరుణ్ ఎక్కడికి వెళ్లాడో నిజం చెప్పమని నిలదీస్తారు. దీంతో భయపడిపోయిన చిడతల చిన్నారావు..ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ ఉందని, ఆరునెలలు రాను అని చెప్పి వెళ్లాడని అబద్ధం చెబుతాడు

5 Min read
Author : ramya Sridhar
| Updated : Dec 04 2023, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Brahmamudi

Brahmamudi

BrahmaMudi Serial Today: బ్రహ్మముడి నేటి ఎసిపోడ్ లో  కనకం.స్వప్న కోసం దుగ్గిరాల ఇంటికి వెళ్లాలని అనుకుంటూ ఉంటుంది. వద్దు అని మూర్తి చెప్పినా కనకం వినదు. స్వప్న కోసం అన్నీ సర్దేస్తుంది. ఇక, కనకం వినదు అని అర్థం చేసుకున్న మూర్తి, కావ్యను అడిగాను అని చెప్పు అని చెప్పేసి అక్కడి లేచి లోపలికి వెళ్లిపోతాడు.  కనకం సంతోషంగా వాటిని తీసుకువెళ్లడానికి రెడీ అవుతుంది. అప్పూని కూడా రమ్మని అడుగుతుంది. అయితే, కళ్యాణ్ కోసం అప్పూని తీసుకొని వెళ్లాలని అనుకుంటుంది.  కానీ, ఆ విషయం బయపెట్టకుండా, అక్క కడుపుతో ఉంది కదా రమ్మని అడుగుతుంది. దానికి అప్పూ.. పెద్ద ఘనకార్యం ఏమీ కాదు కదా అని రాను అని చెప్పేస్తుంది. కనకం ఏదో చెప్పాలని ప్రయత్నించినా అప్పూ వినిపించుకోదు. అంతేకాకుండా అక్కడ కళ్యాణ్ ఉంటాడని, వాడిని చూస్తూ నేను బాధపడలేను అని చెప్పి అప్పూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

వాళ్ల పెద్దమ్మ వెంటనే అప్పూ చెప్పింది కూడా నిజమే కదా అని అంటుంది. అయితే,  కనకం తాను అక్కడికి వెళ్లేదే కళ్యాణ్ తో అప్పూ పెళ్లి జరిపించడానికి అని చెబుతుంది. అయితే, వాళ్ల పెద్దమ్మ నువ్వు ఏం చేసినా ఆలోచించి చెయ్యమని, కావ్య, స్వప్నలకు ఇబ్బంది రాకుండా చూసుకోమని సలహా ఇచ్చి పంపుతుంది. వెళ్తూ వెళ్తూ.. అప్పూ జాగ్రత్త అని చెప్పి వెళ్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Brahmamudi

Brahmamudi

మరోవైపు అరుణ్ కోసం రాజ్, కావ్యలు బయలు దేరుతారు.  అరుణ్ ఇంటికి చేరుకుంటారు. లాగిపెట్టి ఒక్కటి పీకితే అరుణ్ నిజం చెప్పేస్తాడు అని కావ్య అంటుంది. వాళ్లు బయట ఉండగానే, అరుణ్ ఇంట్లో ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. తాను ఇంట్లోనే హౌస్ అరెస్టు అవుతానని, తన గురించి ఎవరికీ తెలియకుండా, తన అసవరాలన్నీ నువ్వే చూసుకోవాలని అతనితో అరుణ్ చెబుతూ ఉంటాడు. ఈలోగా కావ్య, అరుణ్ ఇంటి తలుపు తట్టబోతుంది. రాజ్ అలా కాదని, డోర్ ని లాగి ఒక తన్ను తన్నాలని  తంతాడు. ఆ డోర్ దగ్గర ఉన్న వ్యక్తి ఎగిరి వెళ్లి పడిపోతాడు. అతని పేరు చిడతల చిన్నారావు అని చెబుతాడు. వెంటనే అతన్ని పట్టుకొని అరుణ్ ఏడి అని అడుగుతారు. అరుణ్ ఎవరో తనకు తెలీదని, అరుణ్ ఎవరో తెలీదని చెబుతాడు. తర్వాత గట్టిగా అడగడంతో అతని పేరు తరుణ్ అని చెప్పాడని, మొత్తం అన్నీ సర్దేసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని చెబుతాడు.

36
Brahmamudi

Brahmamudi

ఆ మాటకు కావ్యకు చిర్రెత్తుకువస్తుంది. చీర కొంగు దోపి, వాడిని కొట్టడానికి రెడీ అవుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి కొడతారు. అరుణ్ ఎక్కడికి వెళ్లాడో నిజం చెప్పమని నిలదీస్తారు. దీంతో భయపడిపోయిన చిడతల చిన్నారావు..ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ ఉందని, ఆరునెలలు రాను అని చెప్పి వెళ్లాడని అబద్ధం చెబుతాడు. ఇంట్లో ఫర్నీచర్ అంతా ఇక్కడే ఉంది కదా అని రాజ్ అడిగితే, తాను ఫర్నీచర్ తో కలిపే ఇల్లు అద్దెకు ఇచ్చానని చెబుతాడు. వాడి పేరెంట్స్  ఎక్కడ ఉన్నారు? వాడి సొంత ఇల్లు ఎక్కడ? ఏ ఊరు వెళ్లాడు అని కావ్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. అన్ని ప్రశ్నలకు అతను తెలీదు అని సమాధానం చెబుతాడు.

అతను అన్నింటికీ తెలీదు అని చెబుతున్నాడని, కావ్య వాడిని చితకబాదుతుంది.  రాజ్ కావ్యను ఆపాలని చూసినా ఆగదు. కొడుతూనే ఉంటుంది. ఫ్లవర్ వేజ్ తో కొట్టి చంపబోతుంటే, రాజ్ ఆపేస్తాడు. ఇలాంటి భార్యను ఎలా భరిస్తున్నారు సర్ అని అతను రాజ్ అడిగితే, రాజ్ కూడా నాది సేమ్ ఫీలింగ్ అంటాడు. ఆ మాటకు కావ్యకు మరింత  కోపం వస్తుంది. ఏమన్నావ్ రా అంటూ మళ్లీ కొట్టబోతుంది. రాజ్, కావ్యను పక్కకు పట్టుకొని వెళ్లిపోతాడు.
 

46
Brahmamudi

Brahmamudi

మరోవైపు అరుణ్, రాహుల్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. అయితే, రాహుల్ ఎవరికీ కనిపించకుండా దాక్కోమని సలహా ఇస్తాడు. పక్కనే ఉన్న రుద్రాణి ఏమైంది  అని అడిగితే, రాజ్ కావ్యలు అరుణ్ ఇంటికి వెళ్లారు అని చెబుతాడు. అయితే, అరుణ్ దొరకక ఇంటికి వచ్చేస్తున్నారు అని చెబుతాడు. అప్పుడు రుద్రాణి కావ్య వళ్ల తమకు చిక్కులు వచ్చేలా ఉన్నాయని అనుకుంటుంది. అసలు కావ్య జీవితం ఇలా కావడానికి స్వప్నే కారణం అయినా, అక్క కోసం కావ్య ఇదంతా ఎందుకు చేస్తోంది అని రుద్రాణి రాహుల్ తో అంటుంది. తనకు అలాంటి అక్క ఉంటే, ఉరివేసేదాన్ని అంటుంది. ఏదో ఒక రోజు కావ్యకు అరుణ్ దొరికితే, మనం ఇరుక్కుపోతాం అని రుద్రాణి భయపడుతుంది. అయితే, రాహుల్ మాత్రం  అరుణ్ కావ్యకు దొరకడని, డీఎన్ఏ రిపోర్టు మార్చి చూపిస్తే చాలు స్వప్నను బయటకు గెంటేయవచ్చు అని చెబుతాడు. అది నేను చూసుకుంటాను అని రుద్రాణి అంటుంది.

సరిగ్గా అదే సమయానికి కనకం ఆటోలో దిగుతూ ఉంటుంది. పై నుంచి రాహుల్, రుద్రాణిలు చూసేస్తారు. ఇప్పుడు కనకం ముందు రచ్చ చేయాలని అనుకుంటుంది. వెంటనే కిందకు వెళతారు. ఇక కనకం తాను అప్పూ ప్రేమ కోసం ఈ ఇంట్లోకి వెళ్తున్నానని, ఎలాగైనా కాపాడమని దేవుడికి దండం పెట్టుకుంటుంది. తర్వాత లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లగానే ఎదురుగా స్వప్న కనపడుతుంది. ఆనందంగా వెళ్లి హగ్ చేసుకొని ముద్దులు పెడుతుంది. అదే సమయానికి రాజ్, కావ్యలు కూడా వచ్చేస్తారు.

56
Brahmamudi

Brahmamudi

‘అప్పుడు కడుపు గురించి  అబద్ధం చెప్పానని కొట్టావ్ కదమ్మా ’అని స్వప్న అంటే, ఈ రోజు ఆ అబద్ధమే అమ్మ అవుతోంది కదా, ఈ అమ్మ రాకుండా ఎలా ఉంటుంది అని కనకం ప్రేమగా మాట్లాడుతుంది. వెంటనే రుద్రాణి అందుకుంటుంది. నీ కూతురిని ఇంటికి తీసుకువెళ్లడానికే కదా వచ్చావ్ అని అడుగుతుంది. అప్పుడే పుట్టింటికి ఎందుకు అని కనకం ఆశ్చర్యపోతుంది. అప్పుడు మీ కూతురు తల్లికాబోతోంది కానీ, నా కొడుకు తండ్రి కావడం లేదు అని బాంబు పేలుస్తుంది. రుద్రాణి మాటలు కనకంకి అర్థం కావు. అప్పుడు, మీ కూతురు వేరే ఎవరి కారణంగానే తల్లికాబోతోంది అని చెబుతుంది.

తన కూతురిని అంత తప్పుగా మాట్లాడతారు ఏంటి కనకం బాధపడుతుంది. ఇంట్లో అందరూ రుద్రాణిని ఆపాలని ప్రయత్నించినా, రుద్రాణి మాత్రం ఆగదు. కనకంకి ఏమీ అర్థం కాక, అసలు ఏం జరిగిందని అడుగుతుంది. తన కూతురు అలాంటి తప్పులు చేయదని కనకం గట్టిగా చెబుతుంది. రాజ్, కావ్యలు వెంటనే రుద్రాణికి గడ్డిపెడతారు. మధ్యలో రాహుల్ జోక్యం చేసుకొని స్వప్న మీద నిందలు వేస్తాడు. స్వప్నను తప్పు చేస్తే, మమ్మల్ని అంటారేంటి అని రాహుల్ అంటాడు.
 

66
Brahmamudi

Brahmamudi

ఆ మాటలు విని కనకం చాలా అప్ సెట్ అవుతుంది. ఎందుకు స్వప్న మీద నిందలు వేస్తున్నారని కావ్యను అడుగుతుంది. అప్పుడు అసలు విషయం కనకం కి కావ్య  చెప్పేస్తుంది.  అది విని, కనకం బాగా ఏడుస్తుంది.  అరుణ్.. స్వప్న పై మనసు పడ్డాడు కానీ, స్వప్న ఏనాడు వాడిని ఆ దృష్టితో చూడలేదు అని  అంటుంది. రుద్రాణి మాత్రం మీ కూతురిని తీసుకువెళ్లండి అంటుంది. స్వప్న తాను ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టను అని తేల్చేస్తుంది.  కానీ కనకం, తన కూతురిని తన ఇంటికి తీసుకువెళ్లిపోతాను అని చెబుతుంది. కానీ, స్వప్న, కావ్యలు నింద పోకుండా ఇక్కడి నుంచి తీసుకువెళ్లడం మంచిది కాదు అని సర్ది  చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ, కనకం వినదు.. ఏవేవో డైలాగులు కొడుతుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ కనకం ని చిట్టి ఆపేస్తుంది. స్వప్న తనతో ఇంటికి రాకుండా, తాను కూడా ఇక్కడే ఉండేలా దేవుడు సహాయం చేస్తే బాగుండు అని మనసులో అనుకొని, బయటకు మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది. 

కమింగప్ లో.. కళ్యాణ్ పెళ్లికి ముహూర్తం పెడుతూ ఉంటారు. అయితే, అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉందని, ఇలాంటి అమ్మాయితో పెళ్లి చేస్తే, ఇంట్లో పెద్దవారికి నష్టం జరగుతుందని పంతులు చెబుతారు. అది విని ఇంట్లో అందరూ షాకౌతారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నన్ను ఎలిమినేట్ చేసేయండి.. ఆడియన్స్ కు సుధీర్ రిక్వెస్ట్.. ముకేష్, అమన్ లతో గొడవ..
Recommended image2
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image3
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved