వారిద్దరిలో టైటిల్ ఎవరిది? ఈ శనివారమే విన్నర్ ఎవరో తేల్చేయనున్న హోస్ట్ నాగార్జున?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిద్దరిలో విన్నర్ ఎవరో ఈ శనివారమే నాగార్జున తేల్చేయనున్నాడట. ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేమిటో చూద్దాం..
బిగ్ బాస్ షో ముగింపు దశలో ఉంది. మరో వారం రోజుల్లో ఎండ్ కార్డు పడనుంది. 14వ వారం పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్స్ ఓటు అప్పీల్ టాస్క్ లలో తలపడ్డారు. ప్రేక్షకులను తమకు ఓటు వేయాలని ప్రత్యేకంగా అభ్యర్థించుకునే అవకాశం పొందాలి అంటే టాస్క్ లలో చెమటోడ్చి గెలవాలని బిగ్ బాస్ చెప్పాడు.
అదే క్రమంలో ఒకింత ఎంటర్టైన్మెంట్ కూడా ప్లాన్ చేశాడు. బిగ్ బాస్ హౌస్లోకి శేఖర్ మాస్టర్, చెఫ్ సంజయ్ తుమ్మ, యాంకర్ ఓంకార్ వంటి సెలెబ్స్ ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ తో సరదా గేమ్స్ ఆడించారు. మరోవైపు ఫైనల్ కి వెళ్ళేది ఎవరు? ఇంటికి వెళ్ళేది ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. హౌస్లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అవినాష్ ఒక్కడే ఫైనల్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. మిగతా ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు.
Bigg boss telugu 8
ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. మిగతా కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్స్ గా టైటిల్ రేసులో ఉంటారు. కాగా బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ పోరు గౌతమ్, నిఖిల్ మధ్యే అంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే. ఇక ఓటింగ్ లో కూడా గౌతమ్, నిఖిల్.. మొదటి రెండు స్థానాల్లో ఉంటున్నారు. కాబట్టి ఈసారి టైటిల్ అందుకునేది వీరిద్దరిలో ఒకరు అని తేలిపోయింది.
డిసెంబర్ 7 శనివారం కాగా హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ వారం మొత్తం హౌస్లో జరిగిన విషయాలపై రివ్యూ నిర్వహిస్తారు. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అలాగే ఎవరు బెస్ట్? ఎవరు వరస్ట్? వంటి విషయాలపై మాట్లాడతారు. ఇక నాగార్జున కంటెస్టెంట్స్ ని తిట్టినా కొట్టినా ఈ ఒక్కరోజే. ఫైనల్ వీక్ లో హోస్ట్ రివ్యూలు ఉండవు. ప్రేక్షకులే తమ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. విన్నర్ ఎవరో నిర్ణయిస్తారు.
అయితే ఫైనల్ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ శనివారమే నాగార్జున విన్నర్ ఎవరో తేల్చేస్తాడని అంటున్నారు. అదెలా అంటే... గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ రేసు నడుస్తుంది. ఈ వారం వారు గొడవలు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి నాగార్జున ఖచ్చితంగా సదరు గొడవల్లో తప్పు ఎవరిదో తేల్చే ప్రయత్నం చేస్తాడు. తప్పు నీదే అని నాగార్జున ఎవరిని తిడతారో అతడే విన్నర్ అట.
నాగార్జున వెనకేసుకొచ్చిన కంటెస్టెంట్ రన్నర్ అట. దీని వెనకున్న లాజిక్ ఏమిటంటే.. నాగార్జున జడ్జిమెంట్ చాలా పక్షపాతంగా ఉంటుంది. ఆయన కనీసం ఎపిసోడ్స్ కూడా చూడకుండా తప్పొప్పులు నిర్ణయిస్తున్నాడు. బిగ్ బాస్ మేకర్స్ ఇచ్చే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న తప్పులకు కూడా కొందరిని టార్గెట్ చేసే నాగార్జున కొందరి తప్పులను ఎత్తి చూపడు.
జనాల అభిప్రాయానికి నాగార్జున జడ్జిమెంట్ కి పొంతలేకుండా పోతుంది. ఈ క్రమంలో నాగార్జున తిట్టిన కంటెస్టెంట్ కి సానుభూతి దక్కుతుంది. ఓట్లు పడతాయి. విన్నర్ అవుతాడనే ఒక వాదన తెరపైకి వచ్చింది. అదన్నమాట మేటర్...