MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • 4వ వారం నామినేషన్స్ లో రచ్చ, లిస్ట్ లో టాప్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే? 

4వ వారం నామినేషన్స్ లో రచ్చ, లిస్ట్ లో టాప్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే? 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఇక నామినేషన్స్ లిస్ట్ లో టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 23 2024, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు 8లో మరో వీకెండ్ ముగిసింది. హోస్ట్ నాగార్జున శనివారం కంటెస్టెంట్స్ ని దులిపి పారేశారు. ఒక్కొక్కరి తప్పులు ఎత్తి చూపుతూ క్లాస్ పీకాడు.ముఖ్యంగా అభయ్ నవీన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అభయ్ నవీన్... బిగ్ బాస్ ని తప్పుబట్టాడు. ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని, రూల్స్ సరిగా లేవంటూ అసహనం వ్యక్తం చేశాడు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

అభయ్ కి రెడ్ కార్డు ఇచ్చి హౌస్ నుండి బయటకు వెళ్లిపోవాలని నాగార్జున ఆదేశించాడు. అభయ్ రిక్వెస్ట్ చేయడంతో  హౌస్లో ఉంచాడు. అయితే ప్రేక్షకులను అభయ్ ని సొంత ఇంటికి సాగనంపారు. అతడికి తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో మూడవ వారం ఎలిమినేట్ అయ్యారు. మొదటి రెండు వారాల్లో బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేటైన సంగతి తెలిసిందే. 

సోమవారం నాలుగో వారానికి నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలాగే కంటెస్టెంట్ మధ్య వాడివేడి చర్చలు, వాదోపవాదాలు నడిచాయి. తగు కారణాలు చూపుతూ, ప్రతి కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ముఖాన ఫోర్మ్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. 

36
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8


మీరు ఒకరిని గట్టిగా అవమానిస్తారు. కానీ అదే స్థాయిలో క్షమాపణలు కోరరు... అనే కారణం చూపుతూ పృథ్విరాజ్ ని ఆదిత్య ఓం నామినేట్ చేశాడు. నేను ఎవరినీ ఇన్సల్ట్ చేయలేదని పృథ్విరాజ్ డిపెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం నబీల్, సోనియా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

సోనియాను నబీల్ నామినేట్ చేశాడు. అలాగే పృథ్విరాజ్ ని కూడా నామినేట్ చేశారు. వీరిద్దరితో నబీల్ కి గొడవైంది. గట్టిగా వాదించుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం... ఈ వారం 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. నిఖిల్, సీత, విష్ణుప్రియ, యష్మి నామినేషన్స్ లో లేరట. 
 

46
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

మిగిలిన కంటెస్టెంట్స్ నాగ మణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, నైనిక, నబీల్, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారట. వీరందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. ఒకరు ఈ వారం ఇంటిని వీడనున్నారు. వీరిలో ఆదిత్య ఓం వీక్ కంటెస్టెంట్. ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
 

56
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

ఐదవ వారం మినీ లాంచ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. మరో ఐదుగురు సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా ఇంట్లో అడుగుపెట్టనున్నారు. అనూహ్యంగా ఈసారి మాజీ కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. 

సీజన్ వన్ ఫైనలిస్ట్ హరితేజ ఎంపికయ్యారనే మాట గట్టిగా వినిపిస్తోంది. 2017లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో హరితేజ సత్తా చాటింది. ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. హరితేజ 3వ స్థానంలో నిలవడం విశేషం. శివ బాలాజీ ఆ సీజన్ విన్నర్ అయ్యాడు. 
 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న మరొక మాజీ కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్ అట. సీజన్ 4లో అవినాష్ కంటెస్ట్ చేశాడు. ఆయన గొప్ప ఎంటర్టైనర్ గా అవతరించాడు. అప్పుడు కూడా అవినాష్ వైల్డ్ కార్డు ద్వారానే హౌస్లోకి ప్రవేశించాడు. పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. 

శోభ శెట్టి, రోహిణి, టేస్టీ తేజ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. వీరిలో హౌస్లోకి వెళ్ళేది ఎవరో తెలియాల్సి ఉంది. మరో రెండు వారాల్లో పూర్తి క్లారిటీ రానుంది.  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: నిజం బయటపెట్టిన కల్పన, ప్రభావతి విశ్వరూపం...రోహిణీని చావబాదేసింది..!
Recommended image3
Wedding Traditions: మ్యారేజ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సెలబ్రిటీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved