MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TV
  • దాదాపు ముగిసిన ఓటింగ్, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

దాదాపు ముగిసిన ఓటింగ్, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

మరికొన్ని గంటల్లో ఆరవ వారానికి గాను ఎలిమినేషన్ ఓటింగ్ ముగియనుంది. ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూద్దాం.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 11 2024, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఆరవ వారానికి గాను యష్మి, విష్ణుప్రియ, పృథ్విరాజ్, సీత నామినేట్ అయ్యారు. ఓజీ క్లాన్ సభ్యులైన వీరిని రాయల్ క్లాన్ సభ్యులు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే రాయల్ క్లాన్ లో ఉన్న 8 మంది సభ్యులలో ఇద్దరిని ఓజీ క్లాన్ నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఓజీ క్లాన్ సభ్యులు చర్చించుకుని ఏకాభిప్రాయం మేరకు... మెహబూబ్, గంగవ్వను నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ కి తెలియజేశారు. ఆ విధంగా మొత్తం 6గురు సభ్యులు నామినేషన్స్ లోకి వచ్చారు. గత నాలుగు రోజులుగా ఓటింగ్ జరుగుతుంది. ఆడియన్స్ తమ అభిమాన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తున్నారు. 

 

శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓట్లు వేయవచ్చు. అనంతరం ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అప్పటికి తక్కువ ఓట్లు పోలైన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రక్రియ ముగియనున్న క్రమంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ మొదలైంది. దీనిపై ఆసక్తికర సమాచారం అందుతుంది. 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఓటింగ్ లో గంగవ్వ టాప్ లో ఉందట. గంగవ్వ మాజీ కంటెస్టెంట్. ఆమె సీజన్ 4లో పాల్గొన్నారు. ఈ సీజన్లో ఆమె చురుగ్గా ఉన్నారు. మనసులో ఉన్నది మాట్లాడుతున్నారు. ఇతర కంటెస్టెంట్స్ మీద కోపం ప్రదర్శిస్తుంది. గంగవ్వ... అవినాష్ తో కలిసి ఓ టాస్క్ ఆడి గెలవడం విశేషం. దానికి తోడు గంగవ్వకు సింపతీ యాడ్ అవుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఓట్లు గుద్దుతున్నారు. 

 

గంగవ్వ తర్వాత రెండో స్థానంలో మెహబూబ్ ఉన్నాడట. మెహబూబ్ సైతం సీజన్ 4 కంటెస్టెంట్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మెహబూబ్ పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. సోషల్ మీడియా స్టార్ గా మెహబూబ్ కి ఫాలోయింగ్ ఉంది. బీబీ జోడీలో సత్తా చాటాడు. 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

అనూహ్యంగా విష్ణుప్రియ మూడో స్థానానికి పడిపోయిందట. ఆమె టాప్ సెలబ్రిటీ అయినప్పటికీ... గేమ్ పరంగా మెప్పించడం లేదు. గత రెండు వారాల్లో విష్ణుప్రియ ఆట మరింత దిగజారింది. ఆమె పృథ్విరాజ్ మాయలో పడిపోయింది. సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యాక.. పృథ్విరాజ్ తో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఆమెకు దక్కుతుంది. హోటల్ టాస్క్ లో విష్ణుప్రియ కనీసం ఆకట్టుకోలేదు. 

 

టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన విష్ణుప్రియ... ఆ హోదా చేజార్చుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఇమేజ్ మెరుగయ్యే అవకాశం తక్కువగా ఉంది. నామినేషన్స్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యష్మి తన ఆటను మార్చుకున్నట్లు కనిపిస్తుంది. హోటల్ టాస్క్ లో 100 పర్సెంట్ ఇచ్చింది. రాయల్ క్లాన్ సభ్యులు ఆమె సేవలకు మెచ్చి స్టార్ సైతం ఇచ్చారు. 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

కాగా యష్మి 4వ స్థానంలో ఉందట. ఇక ఐదవ స్థానంలో పృథ్విరాజ్ ఉన్నాడట. హౌస్లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న పృథ్విరాజ్... మొన్నటి వరకు సోనియా మాటలకు ప్రభావితం అయ్యాడు. ఇప్పుడేమో విష్ణుప్రియ మడతెట్టేస్తుంది. పృథ్విరాజ్ డేంజర్ జోన్లో ఉన్నాడట. ఇక చివరి స్థానంలో సీత ఉందట. అత్యల్పంగా ఓట్లు తెచ్చుకున్న సీత ఎలిమినేషన్ కి చేరువైందట. 

 

దాదాపు సీత ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు. అయితే ఇవ్వన్నీ అనధికారిక పోల్స్ ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. అధికారిక ఓటింగ్ స్టార్ మా బయటపెట్టదు. కాబట్టి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతుందా లేదా? అనేది తెలియదు. దాదాపు పోల్ రిజల్ట్స్ కి దగ్గరగా ఎలిమినేషన్ ఉంటుంది. 
 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

కాగా గత ఐదు వారాల్లో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. నైనిక వారాంతం ఇంటిని వీడింది. ప్రస్తుతం హౌస్లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved