MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ హౌస్లో టిల్లు రాధిక, ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి ట్రాప్! ఏం జరగనుంది?

బిగ్ బాస్ హౌస్లో టిల్లు రాధిక, ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి ట్రాప్! ఏం జరగనుంది?

బిగ్ బాస్ హౌస్లో టిల్లు రాధికలా తయారైంది ఓ లేడీ కంటెస్టెంట్స్. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి ప్రేమ వల విసిరింది. మరో కంటెస్టెంట్ ని మాటలతో టార్గెట్ చేసింది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 11 2024, 09:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ షోలో రాణించేందుకు కంటెస్టెంట్స్ చాలా ప్రణాళికలు వేస్తారు. వ్యూహాలు పన్నుతారు. మాటలతో,చేష్టలతో గారడీ చేస్తారు. మిగతా కంటెస్టెంట్స్ ని బోల్తా కొట్టిస్తారు. ఒకరిపై మరొకరు చూపించే ప్రేమ, అభిమానం నిజం అనుకుంటే పొరపాటే. అయితే కన్నింగ్ ప్లేయర్స్ హౌస్లో రాణించినా... ఆడియన్స్ లో మాత్రం నెగిటివిటీ మూటగట్టుకుంటారు.  

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

గతంలో పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ షోలో తమ ప్రవర్తన కారణంగా ఉన్న ఇమేజ్ పోగొట్టుకున్నారు. శ్రీసత్య, శోభా శెట్టి, రతికా రోజ్... ఈ కోవలోకి వస్తారు. వీరు అత్యంత నెగిటివిటీ ఎదుర్కొన్నారు. సీజన్ 7లో కంటెస్టెంట్ చేసిన శోభా శెట్టి బయటకు వచ్చాక క్షమాపణలు చెప్పింది. ఏం చేసిన గేమ్ లో భాగమే. తప్పు చేస్తే క్షమించండి, అంటూ వీడియో బైట్ విడుదల చేసింది. 
 

35

బిగ్ బాస్ సీజన్ 8కి గాను సోనియా ఆకుల సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఈమె గేమ్ పట్ల ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్స్ వేళ కంటెస్టెంట్ విష్ణుప్రియను ఆమె పర్సనల్ గా అటాక్ చేయడం విమర్శల పాలైంది. విష్ణుప్రియ అడల్ట్ జోక్స్ వేస్తుంది. ఆమె డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంటుంది. ఫ్యామిలీ లేదంటూ... ఘాటైన ఆరోపణలు చేసింది. 

సోనియా ఆకుల వయసు ఎంతో తెలుసా

వ్యక్తిగత విమర్శలు చేసిన సోనియా నష్టపోయింది. అదే సమయంలో విష్ణుప్రియకు మైలేజ్ వచ్చింది. సోనియా వ్యక్తిగత విమర్శలతో అటాక్ చేసినా విష్ణుప్రియ వివరణాత్మకంగా మాట్లాడింది. కాగా విష్ణుప్రియను అలా అటాక్ చేయడం వెనుక కారణం లేకపోలేదు. ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ టాప్ సెలెబ్. టైటిల్ ఫేవరేట్. అందుకే విష్ణుప్రియ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయాలని చూసింది సోనియా. 
 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

45
Bigg boss telugu 8

Bigg boss telugu 8


అలాగే మరో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తన ట్రాప్ లోకి లాగుతుంది. నిఖిల్ తో సోనియా మొదటి నుండి సన్నిహితంగా ఉంటుంది. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో పృథ్విరాజ్ తో కూడా ఆమె స్ట్రాంగ్ బాండింగ్ మైంటైన్ చేస్తుంది. నువ్వు సిగరెట్ మానేస్తే, ఏదడిగినా ఇస్తా అని నిఖిల్ తో అనడంతో ఖంగు తిన్నాడు. 

సీరియల్ నటుడిగా నిఖిల్ కి కొంత ఫేమ్ ఉంది. టైటిల్ ఫేవరేట్స్ లో ఒకడు అనడంలో సందేహం లేదు. ఈ విషయం ముందుగానే పసిగట్టిన సోనియా అతనితో సన్నిహితంగా ఉంటుంది. మరో సీరియల్ నటుడు పృథ్విరాజ్ చేతులు పట్టుకుని మాట్లాడుతుంది. అతని పక్కనే కూర్చుంటుంది. 

55
Nikhil Bigg Boss8

Nikhil Bigg Boss8


ఈ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని సోనియా ట్రాప్ చేసే వ్యూహం పన్నారన్న వాదన మొదలైంది. కాగా పృథ్వీరాజ్, నిఖిల్ లలో ఒకరితో ఆమె ప్రేమాయణం నడిపే ఆలోచనలో ఉన్నారనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ప్రేమ జంటలకు మైలేజ్ ఎక్కువ. గతంలో పలువురు కంటెస్టెంట్స్ విషయంలో ఇది రుజువైంది. టైటిల్ కొట్టినా, కొట్టకున్నా ఎక్కువ వారాలు హౌస్లో ఉండటం ద్వారా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆర్జించవచ్చు. 

ఇక రానున్న రోజుల్లో సోనియా గేమ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఆడియన్స్ మాత్రం సోనియా వరస్ట్ కంటెస్టెంట్, ఆమెను ఎలిమినేట్ చేయండంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ ఉంటుందనేది బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్పే మాట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Recommended image2
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved